
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌పై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పలు జిల్లాల్లో మోహరించిన పోలీసులు.. వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేశారు. అర్థరాత్రి నుంచే ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్, యాక్ట్ 30ను అమలు చేశారు. అనంతపురంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేశారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి బస్ స్టాండ్ వద్ద ఆందోళనలు చేపట్టారు. పలు జిల్లాల్లో పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు.