కాన్వాయ్ విడిచి.. నడిచి వెళ్లిన మంత్రి | AP minister Raghunath Reddy's convoy obstructed by striking RTC workers | Sakshi
Sakshi News home page

కాన్వాయ్ విడిచి.. నడిచి వెళ్లిన మంత్రి

Published Thu, May 7 2015 5:40 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

కాన్వాయ్ విడిచి.. నడిచి వెళ్లిన మంత్రి - Sakshi

కాన్వాయ్ విడిచి.. నడిచి వెళ్లిన మంత్రి

అనంతపురం : ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో కాలినడకన ర్యాలీ చేస్తుండగా.. ఎదురుగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాన్వాయిని అడ్డుకున్నారు. గురువారం అనంతపురం రూరల్ పరిధిలోని శ్రీకంఠం సర్కిల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో గురువారం నగరంలో కాలినడకన ర్యాలీ చేపట్టారు.

 

వారికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాన్వాయ్ అడ్డురావడంతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి కారు దిగి అరగంట సేపు మంతనాలు జరిపినా వారు వినకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఏమీ చేయలేని పరిస్థితిలో.. మంత్రి అరమైలు దూరం కాలినడకన వెళ్లి అక్కడి నుంచి వేరే వాహనంలో వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement