ఆర్టీసీ కార్మికులపై అదనపు వడ్డీ భారం
1 శాతం అదనపు వడ్డీ వసూలుకు సర్క్యులర్ 289 జారీ
కదిరి: ఆర్టీసీ కార్మికులు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) ద్వారా తీసుకున్న రుణాలపై ఒక శాతం అదనపు వడ్డీ వసూలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు గతనెల 23న సర్క్యులర్ నంబర్ 289ను విడుదల చేసింది. ఇప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సీసీఎస్ ద్వారా పొదుపు చేసుకున్న మొత్తానికి పది శాతం వడ్డీ ఇచ్చేవారు.
అదేవిధంగా సీసీఎస్ ద్వారా పొందిన స్వల్పకాలిక, విద్యా, గృహ రుణాలపై 11 శాతం వడ్డీ వసూలు చేసేవారు. తాజా సర్క్యులర్ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 1 శాతం అంటే ఇకపై 12 శాతం వడ్డీ వసూలు చేయనున్నారు. సుమారు రూ.32 లక్షలకుపైగా అదనపు భారం కార్మికులపై పడనుంది.