RTC workers
-
‘కోడ్’ ముగిశాక ఆర్టీసీలో సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సంస్థ యాజమాన్యంపై పోరుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఒక కార్మిక జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వాలని మరో జేఏసీ తాజాగా నిర్ణయించింది. మొదటి జేఏసీ నిరవధిక సమ్మెకు మొగ్గు చూపుతుండగా, రెండో జేఏసీ మాత్రం ఐదారు రోజులపాటు సమ్మె చేయాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసేలోపు తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో సమ్మె అనివార్యమని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. అయితే, కార్మికుల్లో సమ్మెపై ఒకింత భయం కనిపిస్తుండగా, సంఘాల నాయకులు మాత్రం సమ్మెకు సిద్ధమని ప్రకటిస్తున్నారు. ప్రైవేటు సంస్థల పెత్తనంతో..ఇటీవల ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. అవన్నీ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు సంస్థ నుంచి అద్దెకు తీసుకుంటోంది. ఆ బస్సుల నిర్వహణ కోసం కొన్ని డిపోలను సదరు సంస్థకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేయటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది ఆర్టీసీలో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయటమేనని మండిపడుతున్నారు. దీంతో అధికారులు వెనక్కు తగ్గి డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతోపాటు సాధారణ సొంత బస్సులు కూడా కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. అయినా ఉద్యోగుల్లో అనుమానాలు తొలగిపోలేదు. ఈ అంశంతోపాటు చాలా కాలంగా పెండింగులో ఉన్న ఇతర సమస్యలను తెరపైకి తెచ్చి కార్మిక సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి. విలీనం, పీఆర్సీనే ప్రధాన ఎజెండాగా..గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించింది. అంతలోనే ప్రభుత్వం మారటంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెండింగులో పెట్టింది. 2017 వేతన సవరణ బకాయిలు కూడా చెల్లించలేదు. 2021 వేతన సవరణపై ప్రభుత్వం స్పందించటంలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసిన గుర్తింపు యూనియన్ల పునరుద్ధరణ జరగలేదు. సీసీఎస్, పీఎఫ్‌లకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. వీటి సాధనే లక్ష్యంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఎవరికి వారే..ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ చీలికవర్గం, బీడబ్ల్యూయూ, బీకేయూ, ఎన్ఎంయూ చీలిక వర్గం, కేపీ సంఘాలతో కూడిన తొలి జేఏసీ గత నెల 27న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి 3న ఆ యూనియన్ల ప్రతినిధులను కార్మిక శాఖ చర్చలకు పిలిచి, తర్వాత ఎన్నికల కోడ్ కారణం చూపి సమావేశం రద్దు చేసింది. దీంతో, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఆర్టీసీ సమ్మెకు మినహాయింపు ఇవ్వాలని ఆయా సంఘాల నేతలు ఎన్నికల కమిషనర్‌కు విన్నవించారు. టీఎంయూ, ఎన్ఎంయూ వర్గాలు, బీఎంఎస్, ఎస్టీ ఎంయూలతో కూడిన మరో జేఏసీ తదుపరి సమావేశం ఏర్పాటు చేసుకుని, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రభు త్వానికి గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మార్చి 7 వరకు కోడ్ అమలులో ఉంటుంది. ఐదారు రోజులపాటు సమ్మె చేసి, కొద్ది రోజుల గడువు ఇచ్చి మళ్లీ సమ్మె చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఆర్టీసీ కార్మికుల్లో 10 వేల మంది మాత్రమే సమ్మెకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్టీసీలో సమ్మె నోటీసు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయంలో ఆర్టీసీ(RTC) యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీలోని కొన్ని సంఘాలు, మరికొన్ని సంఘాల్లోని చీలిక వర్గాలు సోమవారం సాయంత్రం సమ్మె నోటీసు జారీ చేశాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులో ఉండటంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్‌ను కలిసి నోటీసు, డిమాండ్ల జాబితాను అందజేశాయి. ఆర్టీసీ యాజమాన్యం స్పందించని పక్షంలో ఫిబ్రవరి 9 నుంచి లేదా, ఆ తర్వాత ప్రకటించే తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించాయి. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ థామస్‌రెడ్డి వర్గం, ఎన్ఎంయూ మౌలానా వర్గం, బీకేయూ, బీడబ్ల్యూయూ, కార్మిక పరిషత్‌లు సమ్మె నోటీసు జారీ చేశాయి. 21 డిమాండ్లతో.. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ జరగక ఉన్న సిబ్బందిపై అదనపు భారం, ఆర్టీసీలో అద్దె బస్సులు పెరిగి పోస్టుల సంఖ్య తగ్గిపోతుండటం, అద్దె ప్రాతిపదికన తీసుకునే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వాహకులకు డిపోలు అప్పగించే యోచన, ఆర్టీసీ సొంతానికి వాడుకున్న సహకార పరపతి సంఘం, పీఎఫ్ ట్రస్టు నిధులను తిరిగి చెల్లించకపోవటం... ఇలా మొత్తం 21 డిమాండ్లను సంఘాలు ఆర్టీసీ అధికారుల ముందుంచాయి. కార్మికుల్లో అయోమయం.. సమ్మె విషయంలో ఆర్టీసీలోని సంఘాలు ఐక్యంగా లేకపోవటం ఇప్పుడు కార్మికుల్లో అయోమయానికి కారణమైంది. ⇒ గతంలో ప్రధాన సంఘాలుగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ముఖ్యనేత రాజిరెడ్డి వైదొలిగి కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ఎస్డబ్ల్యూయూలో ఉన్నారు. ఇప్పుడు ఆ సంఘం సమ్మెకు దూరంగా ఉంది. ⇒ మరో ప్రధాన సంఘం టీఎంయూలో అశ్వత్థామరెడ్డి, తిరుపతి వర్గం సమ్మెకు దూరంగా ఉంది. ⇒ ఎన్‌ఎంయూలో నరేందర్ వర్గం సమ్మెను వ్యతిరేకిస్తోంది. మిగతా సంఘాలు కూడా సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ⇒ ఇప్పుడు సమ్మెకు దూరంగా ఉన్న ఎస్‌డబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌లు ఈనెల 24, 25 తేదీల్లో డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ⇒ ప్రస్తుతం సమ్మెకు దూరంగా ఉన్న సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యలను కలుస్తూ డిమాండ్ల పరిష్కారానికి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇలా రెండు వర్గాలుగా విడిపోయిన సంఘాలు, వాటి చీలిక వర్గాల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో కార్మికుల్లో కూడా చీలిక ఏర్పడుతోంది. వచ్చే నెల 9 తర్వాత ఎప్పుడైనా సమ్మె మొదలు ‘చాలాకాలంగా ఉన్న సమస్యల విషయంలో యాజమాన్యం తీరుతో విసిగిపోయి సమ్మె నోటీసు ఇచ్చాం. వచ్చే నెల 9 తర్వాత ఎప్పుడైనా సమ్మె ప్రారంభిస్తాం. ఇప్పటికే సగం డిపోల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. మిగతా డిపోల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తాం’అని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు. -
కాంగ్రెస్‌తో చీకటి రోజులే!
కాంగ్రెస్‌తో 58 ఏళ్లు గోసపడ్డం.. ఆ రాజ్యం మళ్లీ కావాలా? వాళ్లది ‘భూమేత’.. మళ్లీ దళారులు, లంచాల రాజ్యం ఎన్నికలు కాగానే ఆర్టీసీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పూర్తి ఆటోరిక్షాలపై ఫిట్నెస్, పర్మిట్ ట్యాక్స్ రద్దు డబుల్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తాం.. మానకొండూరులో హుజూరాబాద్ తరహాలో దళితబంధు అమలు చేస్తామని హామీ ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఇల్లు కట్టిస్తాం రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కొందరికి అందలేదు. ఇకపై అలా ఉండదు. ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. రాబోయే రోజుల్లో ఓ ప్రాజెక్టు తరహా టాస్‌్కగా తీసుకుని ఇల్లులేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టిస్తాం. రాష్ట్రంలో ఇల్లు లేని మనిషి ఉండొద్దు. సొంత జాగా ఉన్న వారికి గృహలక్ష్మి అమలు చేస్తాం. ఆటోలపై ఫిట్నెస్, పర్మిట్ ట్యాక్స్ రద్దు దేశవ్యాప్తంగా ఆటోరిక్షాలకు ట్యాక్స్ ఉంటే.. తెలంగాణలో మినహాయింపు ఇచ్చాం. అయితే ఆటో ఫిట్నెస్ కోసం పోతే ఏడాదికి రూ.1,200 కట్టాలి. దీనిని కూడా ఎన్నికలు ముగియగానే రద్దు చేస్తాం. ప్రభుత్వానికి రూ.100 కోట్ల వరకు నష్టం వచ్చినా భరించి.. ఫిట్నెస్ ట్యాక్స్, పర్మిట్ ట్యాక్స్ రద్దు చేస్తాం. సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పాలన అంటే చీకటి రోజులేనని, ఇందిరమ్మ రాజ్యమంటే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకుంటుంటే.. కాంగ్రెస్ వాళ్లు తెస్తమంటున్న ఆ దిక్కుమాలిన ఇందిరమ్మ రాజ్యం మనకు కావాలా అని ప్రశ్నించారు. అభ్యర్థులతోపాటు వారి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూడాలని.. బాగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, నల్లగొండ జిల్లా నకిరేకల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ నేతలు మళ్లీ మోసం చేయాలని చూస్తున్నరు. ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఏం జరిగింది ఇందిరమ్మ పాలనలో మనకు తెలియ దా? కరువు కాటకాలు, ఆకలి చావులు, ఎమర్జెన్సీ, నక్సల్స్ ఉద్యమం, యువత అటవీబాట, ఎన్కౌంటర్లు.. ఇవే కదా అప్పుడు జరిగింది. అది దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం. ఆ దిక్కుమాలిన రాజ్యంలో బలిసినోడు బలిసిండు. తిండికిలేనోడు లేనిలెక్కనే బతికిండు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీఆర్ టీడీపీ పుట్టకపోయేది. రూ.2కు కిలోబియ్యం ఇచ్చే పరిస్థితి వచ్చేది కాదు. ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించాలి. ఆచరణ సాధ్యంకాని హామీలు, మోసపూరిత మాటలు చెప్తున్న పారీ్టలకు బుద్ధి చెప్పాలి. రైతాంగ సాయుధ పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణను నాడు ఆంధ్రలో కలిపి తీరని నష్టం కలిగించింది కాంగ్రెస్. వాళ్లకు తిరిగి అధికారమిస్తే కరువు కాటకాలు పునరావృతమవుతాయి. వెంటనే రెగ్యులరైజ్ చేస్తాం ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు ఉద్యోగం పోతదో తెలియని అభద్రతాభావంలో ఉంటే బిల్లు పాస్ చేశాం. గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల ఆగింది. ఎన్నికలు అయిపోయిన తెల్లారే ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తాం. మూడోసారి అధికారంలోకి వస్తే.. ఆహార రంగానికి పెద్దపీట వేస్తాం. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతున్న నేపథ్యంలో ఎక్కడిక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. నల్లగొండను పట్టుబట్టి అభివృద్ధి చేస్తున్నం నల్లగొండ జిల్లా వట్టికోట ఆళ్వార్‌స్వామి పుట్టిన జిల్లా. చైతన్యవంతమైన ఉద్యమాల గడ్డ. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఇక్కడ మంచినీళ్లు వచ్చే వి కావు. కరెంట్ ఉండేది కాదు. పోచంపల్లి చేనేత కార్మికుల ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు జరిగేవి. నేను నల్లగొండను దత్తత తీసుకున్న. పట్టుబట్టి అభివృద్ధి చేస్తున్నాం. రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులు కళ్ల ముందు జరుగుతున్నాయి. రెండు దశాబ్దాలు పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాలంలో మంచినీటి సమస్య, కరెంట్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక 3 మెడికల్ కాలేజీలు కట్టుకున్నాం. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. నల్లగొండ ఇంకా నా దత్తతలోనే ఉంది. మరింత అభివృద్ధి చేస్తా.. మానకొండూరులో అందరికీ దళితబంధు స్వాతంత్య్రం వచ్చాక దళితుల స్థితిగతులు మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. హుజూరాబాద్ తరహాలో మానకొండూరు నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందిస్తాం. నాది హామీ, నేను స్వయంగా వచ్చి ప్రారంభిస్తా. రసమయి బాలకిషన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి..’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్పూర్ సభలో ఎంపీ పసునూరి దయాకర్, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి.రాజయ్య.. మానకొండూరు సభలో మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. ధరణి తీసేసి దళారులను తెస్తరట కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో కలిపి మళ్లీ దళారులను తెస్తమంటున్నరు. వారు తెచ్చే పథకం భూమాత కాదు భూమేత! మళ్లీ వీఆర్వోలు, అగ్రికల్చర్ ఆఫీసర్ల సంతకాలు, సర్టీఫికెట్ల పేరిట లంచాలు, దళారుల రాజ్యం వస్తుంది. పహాణీ కావాలన్నా రూ.లక్షకు రూ.40 వేలు వసూలు చేస్తరు. ఆలోచించాలి. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. రైతులు బాగుపడాలి. అందుకే నీటి తీరువా రద్దు చేశాం. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. రైతుబంధు సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతాం. కమ్యూనిస్టు సోదరులను కోరుతున్నా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. -
రోడ్డెక్కని సిటీ బస్సు
హైదరాబాద్: సిటీ బస్సు స్తంభించింది. ఆర్టీసీ కార్మికులు చలో రాజ్‌భవన్ ప్రదర్శనకు తరలివెళ్లడంతో శనివారం ఉదయం నుంచే బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయాన్నే విధులకు హాజరు కావాల్సి ఉద్యోగులు, స్కూళ్లు, కళాశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ తదితర ప్రధాన రైల్వేస్టేషన్లకు వెళ్లాల్సిన ప్రయాణికులు, రైళ్లు దిగి ఇళ్లకు వెళ్లాల్సిన వారు సైతం బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వచ్చింది. ఉదయం 10 గంటల తర్వాత సర్వీసులను పునరుద్ధరించినట్లు అధికారులు చెప్పినప్పటికీ మధ్యాహ్నం వరకు బస్సులు రోడ్డెక్కలేదు. రెండో షిఫ్ట్‌లో మాత్రమే వివిధ డిపోలకు చెందిన బస్సులు రోడ్లపై కనిపించాయి. ఎలాంటి ముందస్తు ప్రణాళికలకు అవకాశం లేకుండా ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా చేపట్టిన చలో రాజ్‌భవన్ కారణంగా తెల్లవారు జామున విధులకు హాజరు కావాల్సిన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు తదితర సిబ్బంది విధులను బహిష్కరించి ప్రదర్శనకు తరలివెళ్లారు. దీంతో డిపోల్లోంచి బస్సులు బయటకు తీసేవాళ్లు లేకుండాపోయారు. సుమారు మూడువేల మందికి పైగా కార్మికులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్లు అంచనా. విద్యార్థుల ఇక్కట్లు.. ► నగర శివార్లలోని ఇంజినీరింగ్ తదితర వృత్తివిద్యా కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఘట్కేసర్, హయత్‌నగర్, కీసర, ఇబ్రహీంపట్నం, బాచుపల్లి, మేడ్చల్, గండిమైసమ్మ, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లోని కాలేజీలకు ప్రతిరోజు లక్షలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తారు. ఉదయం, సాయంత్రం నగరశివార్లకు రాకపోకలు సాగించే సిటీ బస్సులు విద్యార్థులతో కిక్కిరిసిపోతాయి. కానీ శనివారం ఉదయమే ఎక్కడి బస్సులు అక్కడ ఆగిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సెవెన్ సీటర్ ఆటోలు, ప్రైవేట్ వాహనాలు, బైక్‌లపై ఆధారపడాల్సి వచ్చింది. ► నగరంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు కూడా సకాలంలో వెళ్లలేకపోయారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. రూట్‌పాస్‌లు, సాధారణ నెలవారీపాస్లపై రాకపోకలు సాగిస్తారు. ఉదయాన్నే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లాల్సినవారు కూడా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి ఉదయం పూట దూరప్రాంతాలకు బయలుదేరాల్సిన బస్సులు కూడా ఆగిపోవడంతో మహాత్మా గాంధీ, జూబ్లీ బస్స్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఠారెత్తించిన ఆటోవాలాలు.. గ్రేటర్ హైదరాబాద్‌లోని 28 డిపోల్లో వందలాది బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు అనివార్యంగా ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో ఆటోవాలాలు అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. సాధారణంగానే ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తారు. శనివారం బస్సులు ఆగిపోవడంతో మరింత దారుణంగా వసూళ్లకు దిగారు. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు తదితర ప్రాంతాలకు వెళ్లేవారు పెద్ద మొత్తంలో సమర్పించుకోవాల్సివచ్చింది. ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే సమయంలోనే బస్సులు అందుబాటులో లేకపోవడంతో రెట్టింపు వసూళ్లకు పాల్పడ్డారు. ఇక నగర శివార్లలో తిరిగే సెవెన్ సీటరుల, షేరింగ్ ఆటోలు కూడా సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ చార్జీలు తీసుకున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు. -
కార్మికులకు అండగా ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును హడావుడిగా ప్రవేశపెట్టడం సరికాదని, అందులోని అంశాలపై విస్తృత చర్చ కోసం భాగస్వామ్య పక్షాలకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఆపడం వెనక తనకు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవని.. ప్రజలు, ఆర్టీసీ ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలను రక్షించడమే తన ఉద్దేశమని చెప్పారు. తాను ఎల్లçప్పుడూ ఆర్టీసీ కార్మికుల పక్షాన ఉంటానని, గత సమ్మె సమయంలో కూడా కార్మికులకు అండగా నిలబడి అర్ధరాత్రి వారి సమస్యలను విన్నానని గుర్తు చేశారు. శనివారం ఆమె పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడారు. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు పట్ల ఆందోళన, సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన వివరణలు అందాక.. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. పీఆర్సీ, గ్రాట్యుటీ చెల్లింపు ఎప్పుడు? ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణలు (పీఆర్సీలు), ఈపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల చెల్లింపు వంటివి పెండింగ్‌లో ఉండటంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ సహకార సొసైటీకి చెందిన రూ.3 వేల కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం తీసుకుని ఇప్పటివరకు చెల్లించలేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధ అధిపతిగా రాజ్యాంగ నియమాల పరిరక్షణతోపాటు ప్రజలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. ధర్నాకు మంత్రుల వ్యూహరచన: ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎలాంటి సమ్మెకు పిలుపు ఇవ్వలేదని వీడియో కాన్ఫరెన్స్‌లో జేఏసీ ప్రతినిధులు గవర్నర్‌కు చెప్పారు. ప్రభుత్వ ప్రోద్బలంతో బలవంతంగా సమ్మె చేయించారని, మహిళా ఉద్యోగులను సైతం వదిలిపెట్టలేదని ఆరోపించారు. రాజ్‌భవన్ ముట్టడి జరపాలని తమపై ఒత్తిడి తెచ్చారని.. ధర్నాకు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యూహరచన చేశారని పేర్కొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల ‘చలో రాజ్‌భవన్’
సాక్షి, హైదరాబాద్/ పంజగుట్ట: ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా శనివారం ఉదయం భారీ ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపైన ఆమోదం తెలపాలని, గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ‘చలో రాజ్‌భవన్’పేరిట భారీ ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతృత్వంలో చేపట్టిన ఈ భారీ ప్రదర్శనకు నగరంలోని అన్ని డిపోలకు చెందిన కార్మికులు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు కార్మికుల భారీ ప్రదర్శనతో ఖైరతాబాద్ చౌరస్తా, రాజ్‌భవన్ తదితర మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్ వచ్చే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. దాంతో నాలుగు వైపులా విపరీతంగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు గంటలతరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాజ్‌భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకొని ఆందోళనకారులు ముందుకు వెళ్లారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘గవర్నర్ డౌన్ డౌన్’అంటూ నినదించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రదర్శనగా వెళ్లిన కార్మికులంతా రాజ్‌భవన్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అధ్యక్షతన ఐదుగురు ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లోకి వెళ్లి గవర్నర్‌తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నిరసనను విరమించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారు ఆ తర్వాత «థామస్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ తనకు ఎంతో ముఖ్యమని గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. బిల్లులో కొన్ని సందేహాలు నివృత్తి కాగానే బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారని వివరించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కమలాకర్, ఉపాధ్యక్షులు జీపీఆర్ రెడ్డి, కోశాధికారి రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.ఆర్.రెడ్డి, మహిళా నాయకురాలు నిర్మలా రెడ్డి, బీఆర్టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి పి.నారాయణ నిరసనకు నాయకత్వం వహించారు. కాగా, గవర్నర్‌తో సమావేశం అయిపోయాక అక్కడకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులను పోలీసులు రాజ్‌భవన్‌లోనికి అనుమతించకుండా వారిని తీసుకొని ఖైరతాబాద్‌లో వదిలేశారు. -
ఆర్టీసీ బిల్లుపై లొల్లి!.. గవర్నర్ వర్సెస్ సర్కార్‌గా సాగుతున్న వివాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023’ అంశం మలుపుల మీద మలుపులు తీసుకుంటోంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న ఉత్తర, ప్రత్యుత్తరాలు, ప్రశ్నలు, సమాధానాలు, వివరణలు.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. శుక్రవారం గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుపై ఐదు ప్రధాన సందేహాలను లేవనెత్తుతూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు కోరారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా అంశాలపై వివరణలు ఇస్తూ గవర్నర్ కార్యదర్శికి శనివారం లేఖ పంపారు. కానీ ఈ వివరణలతో గవర్నర్ సంతృప్తి చెందకపోవడం, పలు అంశాలపై పూర్తిస్థాయి స్పష్టత కోరడం, ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి.. వారి ప్రయోజనం కోసమే తాను ప్రయత్నిస్తున్నట్టు చెప్పడం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తే.. రెండు గంటల్లోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తానని గవర్నర్ పేర్కొన్నట్టు తెలిసింది. గవర్నర్ ఆదివారం ఉదయానికల్లా ఆర్టీసీ బిల్లుకు అనుమతిస్తే.. అసెంబ్లీ సమావేశాల చివరిరోజున సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజుకుంటున్న రాజకీయాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత నెల 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో.. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే ఆర్టీసీ బిల్లు ఆర్థిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉండటంతో, అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి కోసం ఈనెల 2న రాజ్‌భవన్‌కు పంపించింది. గవర్నర్ ఆ బిల్లును పరిశీలించి.. పలు సందేహాలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వంలో అలజడి మొదలైంది. గవర్నర్ కావాలనే బిల్లును ఆపారంటూ బీఆర్ఎస్ నుంచి రాజకీయ విమర్శలు వచ్చాయి. దీంతో కనీసం బిల్లును చదవనీయకుండా గవర్నర్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ బీజేపీ నేతలు ప్రతివిమర్శలకు దిగారు. మరోవైపు బిల్లుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడించగా.. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నుంచి వివరణలు కోరానని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. శనివారం రాత్రి తర్వాత కూడా ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. తొలుత గవర్నర్ కోరిన వివరణలు, ప్రభుత్వమిచ్చిన సమాధానాలు ఇవీ.. 1. గవర్నర్: 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాలు, ఇతర సాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు. ప్రభుత్వం: సమైక్య రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి వాటాలు రూ.61.07 కోట్లు, రూ.140.20 కోట్లుగా ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకే ఈ బిల్లు పరిమితం. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఇతర అన్ని విషయాల్లో ఆర్టీసీ సంస్థ ప్రస్తుత స్వరూపం, రీతిలో యథాతథంగా పనిచేస్తుంది. వాటాలు, రుణాలు, గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయాలు, ఇతర అంశాల నిర్వహణ విషయంలో, ఆర్టీసీ చట్టం–1950 కింద అపెక్స్ బాడీగా ఆర్టీసీ బోర్డు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అంశాలను బిల్లులో పొందుపర్చాల్సిన అవసరం లేదు. 2: రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ ఐగీ ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు. ప్రభుత్వం: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా.. సంస్థ ప్రస్తుత స్వరూపంలోనే కొనసాగుతుంది. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారమయ్యే వరకు సంస్థ స్వరూపం మారదు. విభజన అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. పూర్తయ్యే వరకు ఇదే విధానం కొనసాగుతుంది. 3: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని ప్రభుత్వం చెప్తోంది. మరి వారి సమస్యలకు పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా? వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి? ప్రభుత్వం: ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యాక.. వారికి పారిశ్రామిక వివాదాల చట్టం వర్తింపు అంశం అందులోని నిబంధనలకు లోబడి ఉంటుంది. ఈ విషయంలో బిల్లులో ఎలాంటి నిబంధనలు పొందుపర్చాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తేనే వారికి అత్యుత్తమ ప్రయోజనాలు లభిస్తాయి. 4: ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వండి. ప్రభుత్వం: ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిబంధనలు, ఇతర ప్రయోజనాల నిబంధనలను ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేసే విషయంలో బిల్లులో ఎలాంటి అస్పష్టత లేదు. ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా.. అలాంటి నిబంధనలను రూపొందించి, ప్రకటించే అధికారాలను బిల్లులోని 4, 5 సెక్షన్లు రాష్ట్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం అన్ని భాగస్వామ్యపక్షాలతో విస్తృత చర్చలు జరిపి ఓ అభిప్రాయానికి వస్తుంది. అప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుత ఆర్టీసీ నియమ, నిబంధనలే వర్తిస్తాయి. 5: ప్రభుత్వ ఉద్యోగుల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి పోస్టులు లేవు. మరి ప్రమోషన్లు, కేడర్ నార్మలైజేషన్ అంశాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు జరిగే న్యాయం, ఇతర ప్రయోజనాలపై స్పష్టమైన వివరాలు ఇవ్వండి. ప్రభుత్వం: ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన నిబంధనలు బిల్లులోని సెక్షన్ 4, 5లలో పొందుపరిచాం. జీతాలు, అలవెన్సుల విషయంలో ఏ ఉద్యోగినీ ఇబ్బందిపెట్టం. విలీనం తర్వాత ఆర్టీసీలోని ప్రస్తుత కేటగిరీలు, కేడర్ల కొనసాగింపునకు ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని నిషేధించే.. ‘తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ ఇన్‌టూ పబ్లిక్ సర్వీస్ యాక్ట్ 1997’ నుంచి మినహాయింపు కల్పించడం కోసమే ఈ బిల్లును తెచ్చాం. మరిన్ని వివరణలు కావాలన్న గవర్నర్ గవర్నర్ తమిళిసై లేవనెత్తిన సందేహాలపై రాష్ట్ర ప్రభుత్వం తొలుత సమాధానం ఇచ్చినా.. ఆయా అంశాల్లో మరింత స్పష్టత, అదనపు వివరణలు కావాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారని రాజ్‌భవన్ ప్రకటించింది. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌కు అడ్డంకులు సృష్టించడం తమ ఉద్దేశం కాదని.. వారి సర్వహక్కులను పరిరక్షించడానికే వివరాలు కోరాల్సి వస్తోందని స్పష్టం చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనల విషయంలో భవిష్యత్తులో నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చిన ఇచ్చిన నేపథ్యంలో.. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపర చిక్కులు రాకుండా, ఉద్యోగుల విలీన ప్రక్రియ సజావుగా జరిగేలా గవర్నర్ ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి అంశాలను ప్రతిపాదిత బిల్లు పరిష్కరించగలదా? అన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో కింది వివరణలను ప్రభుత్వం నుంచి కోరినట్టు తెలిపింది. ► కేంద్రం నుంచి సమ్మతి పొందారా? కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీలో 30శాతం వాటా కలిగి ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరణలో పేర్కొంది. ఈ మేరకు కేంద్రం నుంచి సమ్మతి తీసుకున్నారా? ఒకవేళ సమ్మతి పొంది ఉంటే అందుకు సంబంధించిన ప్రతిని అందజేయాలి. లేనిపక్షంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా తీసుకున్న జాగ్రత్తలను తెలపాలి. ► డిపోల వారీగా అన్ని కేటగిరీల శాశ్వత ఉద్యోగుల సంఖ్య ఎంత? డిపోల వారీగా అన్ని కేటగిరీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, క్యాజువల్, ఇతర తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య ఎంత? తాత్కాలిక ఉద్యోగుల విషయంలో అవలభించనున్న విధానం ఏమిటి? ► ఇకపైనా ఆర్టీసీ సంస్థ ప్రస్తుత స్వరూపంలోనే కొనసాగుతుందని ప్రభుత్వం వివరణ ఇచ్చిన నేపథ్యంలో.. సంస్థ చర, స్థిరాస్తులు సంస్థతోనే కొనసాగుతాయా? రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? ముఖ్యంగా భవనాలు, భూములు ఎవరి వద్ద ఉంటాయి? ► బస్సు సర్వీసుల నిర్వహణ విషయంలో అజమాయిషీ, బాధ్యత ఎవరిది? ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అవుతున్నందున వారి విధులను నియంత్రించే బాధ్యత ఎవరిది? ఉద్యోగులు, ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో కార్పొరేషన్ బాధ్యత ఏమిటి? ► ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆర్టీసీలో డిప్యూటేషన్‌పై కొనసాగుతారా? అలాంటి ఇతర ఏర్పాట్లు ఏమైనా చేస్తారా? రెండో దఫాలో గవర్నర్ కోరిన వివరణలు ► ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉంది. అలాంటప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవడంపై కేంద్రం నుంచి సమ్మతి పొందారా? ► ఆర్టీసీ చర, స్థిర ఆస్తులను ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటుందా? ► ఆర్టీసీలో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం ఎంత మంది ఉన్నారు? ► ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే.. వారిపై, బస్సు సర్వీసులపై అజమాయిషీ ఎవరికి ఉంటుంది? కార్పొరేషన్ ఏం చేస్తుంది? ఉద్యోగులను ఆర్టీసీలో డిప్యుటేషన్‌పై నియమిస్తారా? లేక ఏదైనా ఏర్పాటు చేస్తారా? -
రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత.. గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు
►ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్.. ఆ సంస్థ ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించారు. ఆర్టీసీ యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ సభ్యుల బృందం గవర్నర్‌తో గంటపాటు చర్చించారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని ఆ సంఘం నేత థామస్‌రెడ్డి తెలిపారు. ►గవర్నర్ లేవనెత్తిన ఐదు అభ్యంతరాలపై తెలంగాణ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. ►రాజ్‌భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాజ్‌భవన్ ముట్టడికి ర్యాలీగా ఆర్టీసీ ఉద్యోగులు బయలుదేరారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ యూనియన్ నేతలను చర్చలకు గవర్నర్ ఆహ్వానించారు. ►ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. గవర్నర్ తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. రెండు గంటలపాటు బస్సులను బంద్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే బిల్లును వెంటనే గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో బస్సులన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బంద్ పాటించారు. రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల అందోళనతో బస్సులు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ,ఉట్నూరు, బైంసా, నిర్మల్, అసిపాబాద్, మంచిర్యాల డిపోల ముందు ఆందోళన కొనసాగుతుంది. రెండు గంటల బంద్‌లో భాగంగా నల్లగొండ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు డిపో వద్ద గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. పరీక్ష కోసం వెళ్లేందుకు బస్సులు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులు నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
నేడు ఆర్టీసీ ఉద్యోగుల రాజ్‌భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు’ను గవర్నర్ తమిళిసై పరిశీలన కోసం ఆపడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్విసులను నిలిపివేయాలని ఉద్యోగులు, కార్మికులకు పిలుపునిచ్చాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. -
ఇక అప్పు పుట్టడం కష్టమే! సీసీఎస్ దివాలా.. ఆర్టీసీ కార్మికులకు కష్టాలు
‘ఆర్టీసీ ఉద్యోగులు రుణం కోసం అందించే దరఖాస్తులను మీరు బ్యాంకులకు, రుణాలు అందించే ఆర్థిక సంస్థలకు ఫార్వర్డ్ చేయొద్దు.. ఉద్యోగుల వేతన బిల్లుల నుంచి రుణ రికవరీలకు వీలు కల్పించవద్దు’ – ఇటీవల యూనిట్ అధికారులకు ఆర్టీసీ జారీ చేసిన ఆదేశం ఇది. ఆర్టీసీ కార్మికులకు రుణం పుట్టడం కష్టంగా ఉన్న సమయంలో ఈ ఆదేశం ఉద్యోగులకు అశనిపాతంగా మారింది. వాస్తవానికి ఇది కొత్త సర్క్యులర్ కాదు. 2003లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు పెద్దగా అమలు కాలేదు. పాత సర్క్యులర్‌ను కోట్ చేస్తూ దాన్ని ఇప్పుడు కచ్చితంగా అమలు చేసేలా తాజాగా మరో సర్క్యులర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులు జారీ చేశారు. కాగా, ఇప్పుడు నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఈ ఆదేశాలు తమపై తీవ్ర ప్రభావం చూపుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకీ ఆదేశం.. ఏమిటా విపత్కర పరిస్థితి.. ఆర్టీసీ ఉద్యోగులు గతంలో స్వేచ్ఛగా బ్యాంకుల నుంచి రుణం పొందేవారు. కొంతకాలం క్రితం వరకు వేతనాల ఖాతాలున్న బ్యాంకు వారికి రుణాలు ఇచ్చే విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించేది. ఇటీవలే వేతనాల ఖాతాలు మరో బ్యాంకుకు మార్చారు. రుణాలిచ్చే విషయంలో కొత్త బ్యాంకు రకరకాల కొర్రీలు, కఠిన నిబంధనలు పెడుతోందని, దీంతో రుణాలకు ఇబ్బందిగా మారిందని కార్మికులు పేర్కొంటున్నారు. దీంతో వేరే బ్యాంకుల నుంచి రుణాలు పొందేవారు. సాధారణంగా ఆర్టీసీ అధికారుల ద్వారా రుణ దరఖాస్తు వస్తే బ్యాంకులు సులభంగా రుణమిస్తాయి. ఒకవేళ కార్మికులు తిరిగి చెల్లించకున్నా, ఆర్టీసీ పూచీగా ఉంటుందన్న ధీమా బ్యాంకులకు ఉంటుంది. ఇప్పుడు రుణాలకు సిఫారసు చేయొద్దని, వేతనాల నుంచి రికవరీకి బ్యాంకులకు అవకాశం ఇవ్వవద్దని పేర్కొంటూ పాత ఆదేశాలను తిరిగి తెరపైకి తేవడం విశేషం. సీసీఎస్ దివాలాతో.. గతంలో ఆర్టీసీ కార్మికులకు బ్యాంకు రుణాల అంశం పెద్ద సమస్యగా ఉండేది కాదు. ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) సుభిక్షంగా ఉండటంతో దాని ద్వారానే కావాల్సిన రుణాలు పొందేవారు. కొంతకాలంగా దాని నిల్వ నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకుని, దాదాపు వేయి కోట్లకుపైగా బకాయి (వడ్డీతో సహా) పడటం, నెలనెలా దానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవటంతో సీసీఎస్ దాదాపు దివాలా దశకు చేరిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి నుంచి రుణాలు నిలిచిపోవడం కార్మికులకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు బ్యాంకుల నుంచి సులభంగా రుణం పొందే వీలు లేకపోవటంతో వారికి ప్రైవేటు వడ్డీ వ్యాపారులే దిక్కయ్యారు. గతంలో బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సమయానికి చెల్లించిన రికార్డు ఉన్న వారు పాత పరిచయాలతో రుణాలు పొందగలుగుతున్నా... మిగతా వారికి మాత్రం ఆర్టీసీ నుంచి సిఫారసు లేకుండా రుణం రాని పరిస్థితి నెలకొంది. ‘ఇదేం ఘోరం’ అటు సీసీఎస్‌ను నిర్విర్యం చేసి రుణాలు అందని పరిస్థితి తెచ్చి, ఇటు బ్యాంకుల నుంచి రుణ సిఫారసులు లేకుండా చేసి కార్మికులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సరికాదని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఎస్‌ను పునరుద్ధరించే దాకా బ్యాంకుల నుంచి స్వేచ్ఛగా రుణాలు పొందే వీలు కల్పించాలని, తాజా సర్క్యులర్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆర్టీసీని రక్షించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌దే
హస్తినాపురం: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సంస్థను రక్షించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి, ఎంప్లాయీస్ యూనియన్ పోరుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. సంస్థలో యూనియన్లను పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ హస్తినాపురంలోని కేకే గార్డెన్స్‌లో మంగళవారం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించాలని, కార్మికులకు బకాయి ఉన్న పేస్కేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విదానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం కేసీఆర్‌కు.. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో తమ మద్దతు కోరినప్పుడు ఇదే అంశాన్ని స్పష్టం చేశామని, అందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. కార్మికుల డిమాండ్లన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీతో తమ పార్టీది పేగుబంధమని తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే... నిరవధిక దీక్షకు సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు వి.ఎస్.బోస్, అధ్యక్షుడు బాబు, నాయకులు కె.రాజిరెడ్డి, పద్మాకర్ తదితరులు ప్రసంగించారు. -
ఆర్టీసీకి ఆక్సిజన్ వైఎస్ కుటుంబం
తిరుపతి అర్బన్: వెంటిలేటర్‌పై ఉన్న ఆర్టీసీకి ఆక్సిజన్ అందించింది వైఎస్ కుటుంబమేనని ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య తెలిపారు. తిరుపతిలో బుధవారం వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో చల్లా చంద్రయ్య మాట్లాడుతూ.. డిసెంబర్ 14న జరుగనున్న ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో అసోసియేషన్ విజయ పతాకాన్ని ఎగురవేయాలని చెప్పారు. 1999లో అప్పటి నేతలు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారని చెప్పారు. అయితే 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న 27వేల మందిని ఆర్టీసీలో భాగస్వాములు చేశారని చెప్పారు. అదేవిధంగా ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ పోరాటం చేయకపోయినా.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయమన్నారు. ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర, జోనల్, రీజనల్‌కు చెందిన లతారెడ్డి, టీవీ మురళీధరన్, అర్జున్, ఎంటీఆర్ రెడ్డి, రాంబాబు, పరంధామయ్య, మణితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డిపో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కారం
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వంలో విలీనం మొదలు.. వారి ప్రయోజనాల్ని పరిరక్షిస్తూనే మరో వైపు పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ తీర్చింది. గతంలో ఏ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఈ విధంగా మేలు చేయలేదని యూనియన్లు పేర్కొంటున్నాయి. ఈ మేరకు యూనియన్ల ప్రతినిధులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు, వైఎస్సార్ ఆర్టీసీ యూనియన్ నేతలు.. గడిచిన ఏడాదిగా ఆర్టీసీ కార్మికులకు చేకూరిన లబ్ధిపై ప్రకటనలు జారీ చేశారు. ► కోవిడ్ కారణంగా ఆర్టీసీ కనీవినీ నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ.. 52 వేల మంది ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి. ► కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేశారు. ► ఇటీవలే 2013 పే స్కేల్ బకాయిలు రూ.800 కోట్లు విడుదల చేశారు. ► విలీనం తరువాత.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే కారుణ్య నియామకాలను ఆర్టీసీ ఉద్యోగులకు వర్తించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ► ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోయిన కార్మికులకు ప్రభుత్వం కల్పించే ‘మరణానంతర ప్రయోజనాలు’ వర్తింపజేస్తూ గత వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ► ఆర్టీసీలో మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. లైంగిక వేధింపులపై ప్రాంతీయ స్ధాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ► రూ.10 లక్షల బీమా కల్పించింది. విధి నిర్వహణలో ఉన్నా.. లేకున్నా.. ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ బీమా వర్తిస్తుంది. ఈ ఏడాది మే 31 నాటికి ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి ఈ బీమా వర్తిస్తుంది. ► చంద్రబాబు హయాంలో యూనిఫాంకు కూడా డబ్బులు ఇవ్వలేదు. -
రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, అమరావతి: జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే రూ.6,400 కోట్ల మేరకు నష్టాల్లో ఉందన్నారు. దీనికితోడు ఏటా రూ.3,600 కోట్ల భారాన్ని ప్రభుత్వం తన భుజాన వేసుకుందని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. 54 వేల ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ జేజేలు పలకాలని కోరారు. సీఎం తీసుకున్న నిర్ణయం దేశంలోనే ఒక చరిత్రాత్మక సంఘటనగా నిలిచిపోతుందన్నారు. సంక్రాంతికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే వారి నుంచి ప్రైవేటు ట్రావెల్స్ రెండు, మూడు రెట్లు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికొచ్చిందని.. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా అధికంగా చార్జీలు వసూలు చేస్తే 8309887955 నంబర్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. చంద్రబాబు మాటలే జర్నలిస్టులపై దాడికి కారణం రాజధాని ప్రాంతంలో మహిళా జర్నలిస్టు దీప్తి, మరికొందరిపై దాడి చేస్తే జర్నలిస్టు సంఘాలు ఎందుకు స్పందించలేదని మంత్రి నాని ప్రశ్నించారు. అక్రెడిటేషన్ కార్డుల కోసం బయలుదేరే జర్నలిస్టు సంఘాలు, యూనియన్లు.. హరీష్ (ఎన్టీవీ), వసంత్ (మహాటీవీ), కెమెరామెన్లు, డ్రైవర్లపై దాడి జరిగితే ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. దాడికి గురైన జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి వెళ్లి చంద్రబాబు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిన మాటలే ఇలాంటి సంఘటనలకు కారణమని ధ్వజమెత్తారు. టీవీ9 ఇటీవల వరకూ వారు చెప్పినట్లు వార్తలు ఇచ్చిందని.. ఇప్పుడు అలా చేయడం లేదనే అక్కసుతోనే దాడి చేశారన్నారు. తమపై రోజూ విషం చిమ్మే ఏబీఎన్, టీవీ5 చానెళ్లను ఏనాడైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముట్టుకున్నారా? అని ప్రశ్నించారు. సుజనా చౌదరి భారతీయ తెలుగుదేశం పార్టీకి చెందిన వారని.. ఆయన మాటలు టీడీపీవేనని.. అందువల్ల ఆయన చెప్పే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక పవన్ నాయుడు ఎవరి కోసం పని చేస్తారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి జనవరి 1 నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు. దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మినహాయించి ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సంస్థలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 51,488 మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణా శాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు.. - సంస్థకు ఆర్థిక భద్రత చేకూరడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందుతాయి. - ఆర్టీసీ లాభనష్టాలతో సిబ్బందికి సంబంధం ఉండదు. పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంటుంది. - కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను రెండేళ్లలో చెల్లిస్తారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.47 కోట్ల మేర బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లకు నగదు చెల్లిస్తారు. - ఆర్టీసీ సిబ్బందిపై అనవసర ఒత్తిళ్లు ఉండవు.. అధికారుల పెత్తనం తగ్గుతుంది. పనిష్మెంట్లు ఇష్టారీతిన ఇచ్చేందుకు కుదరదు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు రవాణా, ఆర్ అండ్ బీ పరిపాలన నియంత్రణలోనే పీటీడీ శాఖ రవాణా, ఆర్ అండ్ బీ పరిపాలన నియంత్రణలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ)ను ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రజా రవాణా శాఖ ఏర్పాటైంది. ఆర్టీసీ విలీనంపై రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి నివేదిక అందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పీటీడీ ఏర్పాటుపై కార్యదర్శుల కమిటీ కొన్ని సూచనలు చేసింది. పిదప ఆర్టీసీ బోర్డు కూడా విలీనాన్ని ఆమోదించింది. దీంతో జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కానున్నారు. ఫిబ్రవరి 1న వీరికి ప్రభుత్వమే వేతనాలు చెల్లించనుంది. కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఆర్థిక శాఖ చర్యలు చేపట్టనుంది. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు ఏపీసీఎఫ్ఎంఎస్ (ఆంధ్రప్రదేశ్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం) ద్వారా జరుగుతాయి. వేతన సవరణ అమలు చేసే వరకు ప్రస్తుతం ఆర్టీసీలో కొనసాగుతున్న అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కార్యదర్శుల కమిటీ ప్రతిపాదించిన పే స్కేల్స్‌ను వేతన సవరణ కమిటీకి నివేదించి అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పీటీడీ వ్యవస్థాగత నిర్మాణం ఇలా.. రవాణా శాఖ మంత్రి.. ప్రజా రవాణా శాఖ మంత్రిగా, రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి.. ప్రిన్సిపల్ సెక్రటరీగా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్/డైరెక్టర్‌గా.. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రధాన కార్యాలయంలో ఈడీలు అదనపు కమిషనర్లుగా, రీజినల్ మేనేజర్లు జాయింట్ కమిషనర్లుగా, డివిజనల్ మేనేజర్లు డిప్యూటీ కమిషనర్లుగా, డిపో మేనేజర్లు అసిస్టెంట్ కమిషనర్లుగా వ్యవహరిస్తారు. జోనల్/రీజియన్లలో ఉండే ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలు, డీఎంలకు ఇవే హోదాలు వర్తిస్తాయి. వీరు జిల్లాల్లో ఉంటారు. -
ఇది చరిత్రాత్మకమైన బిల్లు
-
ఆర్టీసీ ఉద్యోగుల విలీనం చరిత్రాత్మకం
ఆర్టీసీలో రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లే. దానిని 60 ఏళ్లకు పెంచాలని చంద్రబాబును వేడుకున్నారు. మా జీవితాలు కూడా బాగుపడతాయి, మేం కూడా ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉన్నాం కదా, మాక్కూడా రిటైర్మెంట్ వయస్సు పెంచండి అని అంటే చంద్రబాబు అస్సలు పట్టించుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లు అడక్కపోయినా కూడా రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలకు పెంచుతూ ముందుగానే ఆదేశాలు జారీ చేశాం. ఆ తర్వాతే విలీన ప్రక్రియ మొదలుపెట్టాం. సాక్షి, అమరావతి: జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చారిత్రాత్మకమని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. వీరంతా జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతారని అన్నారు. అధికారంలో ఉన్న అయిదేళ్లపాటు చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని, ఇప్పుడు టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అందుకే ఆర్టీసీ విలీనం కోసం చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టామని తెలిపారు. ఇంకా సీఎం వై.ఎస్. జగన్ ఏమన్నారంటే.. సభలో ఇన్ని మేజర్ బిల్లులపై చర్చ జరుగుతుంటే చంద్రబాబు సభలో కనిపించరు. వాళ్ల ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు కాళ్లా, వేళ్లా పడ్డారు. ‘కనికరించండయ్యా.. విలీనం చేయండయ్యా’ అని వేడుకున్నా, ఏమాత్రం కూడా కనికరించకుండా ఈ పెద్ద మనుషులు వాళ్లకు పూర్తిగా అన్యాయం చేశారు. ఈరోజు మైక్ పుచ్చుకుని ఆర్టీసీ కార్మికులే కాదు, ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్టు కార్మికులను కూడా విలీనం చేయండి అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. విలువలతో, విశ్వసనీయతతో కూడినదే రాజకీయం అంటారు. కానీ వీళ్ల మాటలు, వీళ్ల చేతలు చూసినప్పుడు రాజకీయాలు ఏ మేరకు దిగజారిపోయాయో అని బాధనిపిస్తోంది. ఇది చరిత్రాత్మకమైన బిల్లు ఈ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తున్నదన్నది అందరూ ప్రశ్నించుకోవాలి. 1997లో చంద్రబాబు ఒక చట్టం చేశారు. దాని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్ధల్లో ఉన్న ఏ ఒక్క ఉద్యోగీ ప్రభుత్వంలో విలీనం కావడానికి వీలు లేదు. అందుకే ఇవాళ విలీనం చేసేందుకు కొత్తగా ఇంకో బిల్లు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఇది ఓ చరిత్రాత్మకమైన బిల్లు. దీని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలోని ఉద్యోగులందరూ ప్రభుత్వంలో విలీనం అవుతారు. ఏ రకంగా అయితే ఇరిగేషన్, హోం డిపార్ట్మెంట్ ఉన్నాయో, ఏ రకంగా అయితే సివిల్ సఫ్లైస్, మున్సిపాల్టీ, పంచాయితీ రాజ్, అలా డిఫరెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అదే విధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కింద వీళ్లందరినీ తీసుకుంటాం. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది సాక్షి, అమరావతి: ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా శాఖ (పీటీడీ) ఉద్యోగులుగా మారనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బిల్లును శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ప్రస్తుతం ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో పని చేస్తున్న 51,488 మంది జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో భాగంగా ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లో చేర్చుకోవటానికి సంబంధించిన బిల్లును రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) సోమవారం శాసన సభలో ప్రవేశపెట్టారు. సభలో చర్చ అనంతరం సభ్యుల హర్షధ్వానాల మధ్య బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పీటీడీలో అన్ని విభాగాల్లో మొత్తం 58,953 మంది ఉద్యోగులకు ఆమోదం లభించింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పీటీడీలో విలీనమైన వెంటనే చెల్లిస్తారు. విలీనం తర్వాత ప్రభుత్వంపై ఏడాదికి సుమారుగా రూ.3,600 కోట్లు (నెలకు రూ.300 కోట్లు) ఆర్ధిక భారం పడుతుంది. ప్రస్తుతం ఉన్న రూ.3,688 కోట్ల తక్షణ చెల్లింపుల బాకీలు 2019–20, 2020–21 సంవత్సరాల్లో తీరిపోతే, 2021–22 సంవత్సరానికి రూ.687 కోట్లు నికర మిగులు ఉంటుందని మంత్రి పేర్ని నాని అసెంబ్లీకి సమర్పించిన ఆర్ధిక మెమొరాండంలో వివరించారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నభూతో.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును ఆమోదించడం నభూతో.. అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. రూ. 6934 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ఎంతో ధైర్యం, మానవత ఉండాలన్నారు. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో దాదాపు రూ.3,600 కోట్లు వేతనాల రూపంలో ప్రభుత్వం భారం తీసుకుంది. చిరునవ్వుతో ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఉద్యోగుల జీవితాల్లో ఈ రోజు వెలుగులు నింపాలి. వారందరికీ పండగ దినం కావాలి’ -
విలీనానికి ముందే కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి : విలీన వేళ ఆర్టీసీ కార్మికులకు అండగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణయాలు అమలుచేయనున్నారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటుచేసి ఆర్టీసీ సిబ్బంది మొత్తాన్ని ప్రభుత్వోద్యోగులుగా మార్చేందుకు రాష్ట్ర కేబినెట్ ఈ నెల 11న ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియకు సంబంధించి కొత్త చట్టాన్ని సోమ లేదా మంగళవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఉద్యోగులకు వరాలు ప్రకటించింది. కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 40 శాతం వేతన సవరణ బకాయిలు చెల్లించడానికి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిల మొత్తం రూ.210 కోట్లను విడుదల చేసింది. గత ఐదేళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఆర్టీసీ యాజ మాన్యం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో 2015 డిసెంబర్ 31 వరకు 237 మంది పేర్లతో ఉన్న జాబితాను ఆమోదించింది. వీరందరికీ మెడికల్ పరీక్షలు నిర్వహించి శిక్షణకు పంపించారు. కండక్టర్ల అభ్యర్థుల ఎత్తును 153 సెం.మీల నుంచి 145 సెం.మీలకు తగ్గిస్తూ నిబంధనలు సవరించారు. అలాగే డిస్ ఎంగేజ్ (డ్యూటీకి గైర్హాజరైన వారు) అయిన మొత్తం 135 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. 2015 తర్వాత కారుణ్య నియామకాలను త్వరలో చేపట్టేందుకు.. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో కార్మిక సంఘాలన్నీ హర్షం వ్యక్తంచేస్తున్నాయి. కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధి నిర్వహణలో మరణిస్తున్న ఘటనలపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తర్వులిచ్చింది. ఆర్టీసీలో సుమారు 52 వేల మందికి ముందస్తుగా అన్ని రకాల వైద్య పరీక్షలు అందనున్నాయి. ఇప్పటివరకు ఇలా కంటి పరీక్షలు మాత్రమే నిర్వహించే వారు. సర్కారు తాజా నిర్ణయంతో ఇకపై అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. -
ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ లంచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకి ఐదుగురు చొప్పున సీనియర్ కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశ అనంతరం కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని కార్మికులకు తెలియజేసేందుకే సీఎం కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే కార్మికుల సమస్యలు ఏంటో నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను నేరుగా సీఎంకే వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించి తమను ఆదుకుంటానని హామీ ఇచ్చారని కార్మికులు పేర్కొన్నారు. -
విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులు
సాక్షి, కరీంనగర్/ఆదిలాబాద్/నిజామాబాద్: ఆర్టీసీలో నవ శకం మొదలైంది. 55 రోజుల తర్వాత తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది డిపోల పరిధిలో 3,800 మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆరు డిపోల వద్ద శుక్రవారం ఉదయం 3.30 గంటల నుంచి ఇప్పటివరకు దాదాపు 15 మంది కండక్టర్లు,డ్రైవర్లు విధుల్లోకి చేరారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు 5 గంటల నుంచే డ్రైవర్లు,కండక్టర్లు తొలి షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్ కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల డిపోలో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరారు. మెదక్ జిల్లాలో 2,890, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,098 మంది కార్మికులు విధుల్లోకి చేరారు. ఖమ్మం టౌన్: ఖమ్మం డిపోలో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరవుతున్నారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 2600 మంది విధులకు హాజరుకానున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కార్మికులు విధులకు హాజరయ్యారు. చదవండి: డ్యూటీలో చేరండి -
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి: భట్టి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరపాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కమిటీ వేస్తామని హైకోర్టు చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. -
కార్మికులు గెలవడం పక్కా కానీ..
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ హైకోర్టు చెరో మెట్టు దిగమని ప్రభుత్వానికి, కార్మికులకు చెప్పింది. కానీ కార్మికులు మెట్టు దిగాల్సిన అవసరం లేదు. వారు మెట్టు మీద అసలే లేరు’ అని ఎమ్మార్మీస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అడ్డుకునేవారు ఉన్నంతసేపు కార్మికులు అనుకున్న ఫలితాలు రావు కానీ, చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేసి విరమించిన రోజు కూడా అదే జరిగిందన్నారు. దీక్ష విరమించగానే తెలంగాణ రాలేదని, తర్వాత వచ్చిందని, అలాగే కార్మికుల లక్ష్యాలు కూడా తర్వాతి రోజుల్లో నెరవేరుతాయని అశాభావం వ్యక్తంచేశారు. ఎప్పుడు గెలుస్తారో చెప్పలేం కానీ కార్మికులు మాత్రం గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఎళ్లవేళలా ఎమ్మార్మీస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీకి ఉందని, కార్మికులు ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. ఆర్టీసీ ఆస్తులు దోచుకోవడానికి సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో పోలిస్తే సమైక్యాంధ్ర నాయకులు వందశాతం నయమని చెప్పారు. ఉద్యోగాల పట్ల కార్మికులు ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
భిక్షాటనతో ఆర్టీసీ కార్మికుల నిరసన
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. గురువారంతో 41వ రోజుకు చేరింది. జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో జేఏసీ పిలుపు మేరకు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపి, వారికి మద్దతుగా భిక్షాటన చేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్ నాగేశ్వర్(43) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నాగేశ్వర్ నారాయణఖేడ్ డిపోలో విధులు నిర్వర్తించేవాడు. ఆయన మృతితో జోగిపేటలో ఉద్రిక్తత నెలకొంది. -
తరుముతున్న డెడ్‌లైన్.. కార్మికుల్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: గత 32 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తిరిగి బేషరతుగా విధుల్లో చేరడానికి మంగళవారం అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డెడ్‌లైన్ పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ విధించిన డెడ్‌లైన్ గడువు మరికాసేపట్లో ముగియబోతుండటంతో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ విధించిన డెడ్‌లైన్‌కు కార్మికులు తలొగ్గుతారా? లేక సమ్మెను కొనసాగిస్తారా? కార్మికులు దిగిరాకపోతే.. కేసీఆర్ అన్నట్టే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు చేస్తారా? అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆఫర్‌కు కార్మికుల నుంచి ఓ మోస్తరుగా స్పందన వస్తున్నట్టు కనిపిస్తోంది. సీఎం డెడ్‌లైన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 208 మంది ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరినట్టు సమాచారం. బస్‌భవన్ కేంద్రంగా 100 మందికిపైగా విధుల్లో చేరినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్పీ కార్యాలయాల్లో, ఆర్ఎం కార్యాలయాల్లో నేటి అర్ధరాత్రి వరకు కార్మికులు విధుల్లోకి చేరేందుకు అవకాశం కల్పించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5100 రూట్లను ప్రైవేటీకరించిన సంగతి తెలిసిందే. డెడ్‌లైన్‌లోపు కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరకపోతే.. పూర్తిగా అన్నీ రూట్లను ప్రైవేట్ చేస్తామంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ విధించినా కార్మికులు విధుల్లో చేరేది లేదని, ఇప్పటివరకు విధుల్లో చేరిన కార్మికులు కూడా తిరిగి వెనక్కి వస్తున్నారని ఆర్టీసీ జేఏసీ తెగేసి చెప్తోంది. కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిందేనని, సమ్మె చేస్తున్న కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేస్తోంది. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రైవేటీకరించలేదని, ఇందుకు కేంద్రం అనుమతి కూడా ఉండాలని అంటున్నారు. ఇప్పటివరకు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. -
సీఎం ‘ఆఫర్’ను అంగీకరించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ‘ఆఫర్’ను అంగీకరించాలని ఆల్ ఇండియా మజ్లిస్–ఏ–ఇత్తెహాదుల్–ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సాధించిన విజయాల నేపథ్యంలో హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో నిరవధిక సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికుల బాధ అర్థం చేసుకోదగిందేనని, అయితే బయట పేదరికం, ధరాఘాతం తీవ్రంగా ఉందని చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకునైనా సీఎం కేసీఆర్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని వాటిని అంగీకరించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సమ్మెలో కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మిమ్మల్ని మీరు చంపుకోవద్దని కోరారు. సీఎం కేసీఆర్‌తో చర్చలకు కూర్చోవాలని, కాంగ్రెస్, బీజేపీ మోసపూ రిత వలలో పడి జీవితాలను నాశనం చేసుకో వద్దని సూచించారు. కార్మికులందరికి తెలంగాణపై హక్కు ఉందని, చర్చలతో సమస్యను పరిష్కరించు కోవచ్చన్నారు. త్వరలో ప్రతిష్ఠంభన వీడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిఫ్టీ..ఫిఫ్టీ ఏంటి? మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఫిఫ్టీ–ఫిఫ్టీ ఫార్ములాను అసదుద్దీన్ తప్పుపట్టారు. ఈ ఫార్ములాపై ఇరు పార్టీల మధ్య నెలకొన్న వివాదాన్ని ఎద్దేవా చేశారు. మార్కెట్లో ఫిఫ్టీ–ఫిఫ్టీ పేరుతో కొత్త బిస్కట్ వచ్చిందా అని ప్రశ్నిం చారు. మహారాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలనే తపన బీజేపీ, శివసేనకు లేదని, ఇరు పార్టీలు ఫిఫ్టీ–ఫిఫ్టీ గురించి మాట్లాడుతున్నాయన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ లేదా శివసేనకు తమ పార్టీ మద్దతు ఇవ్వబోదని తెలిపారు. శివసేనకు ఏం చేయాలో పాలుపోవడం లేదని, ఉద్ధవ్ ఠాక్రేకు ప్రధాని మోదీ భయం పట్టుకున్నట్టు కనిపిస్తోందన్నారు. ఈ సభలో మహారాష్ట్ర, బిహార్ నుంచి విజయం సాధించిన పార్టీ ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. జెడ్ అక్షరం తొలగించొద్దు ఆర్టీసీని ప్రైవేటీకరించినప్పటికీ బస్సుల నంబర్ ప్లేట్లలోని ‘జెడ్’అక్షరం తొలగించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌కు ఓవైసీ అభ్యర్థించారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా పేరు నుంచి ఆర్టీసీ నంబర్ ప్లేట్లలో జెడ్ అనే అక్షరం వచ్చిందని గుర్తు చేశారు. ఇది హైదరాబాద్ చరిత్రలో ఒక భాగమన్నారు. బస్సులో జెడ్ అక్షరాన్ని కొనసాగించా లని విజ్ఞప్తి చేశారు. -
కార్మికులను రెచ్చగొట్టే యత్నం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సహనంతో, గాంధీజీ అహింస సిద్ధాంతంతో సమ్మెను కొనసాగిస్తున్నారని, సీఎం కేసీఆర్ చేసే భయానక ప్రకటనలు వారిపై కించిత్తు ప్రభావం కూడా చూపడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు చెబుతున్నా, ప్రజాసంఘాలు సూచిస్తున్నా సీఎం ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నారని, పిచ్చి ప్రేలాపణలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక కూడా ఆత్మహత్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేసీఆర్ హైకోర్టునే ధిక్కరించే విధంగా మాట్లాడుతున్నారని, కోర్టులో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం లక్ష్మణ్ సమక్షంలో మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారు. -
ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: తన మొండి వైఖరితో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తాము అండగా ఉంటామని, ఆర్టీసీ కార్మికుల పక్షాన కాంగ్రెస్ నిలుస్తుందని చెప్పారు. మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం మొండివైఖరితో సాగడం మంచిది కాదన్నారు. వెంటనే సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్, శ్రీనివాసరావులు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశలో పయనిస్తున్న తీరును పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీపీ) ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వివరించారు. ఈ సమావేశంలో దాసోజు శ్రావణ్, ఆర్.సి.కుంతియా, జానారెడ్డి, భట్టివిక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొడెం వీరయ్య, పార్టీ నేతలు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి చికిత్సకు ఉత్తమ్ ఉత్తమ్ ప్రకృతి చికిత్స తీసుకునేందుకు బెంగళూరుకు వెళ్లారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు జిందాల్ నేచుర్‌కేర్ సెంటర్లో బసచేసి చికిత్స పొందుతారు. గత డిసెంబర్ నుంచి వరుసగా వస్తున్న ఎన్నికలతో కలిగిన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఆయన చికిత్సకు వెళ్తున్నారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. -
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు
-
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మావోయిస్టుల లేఖ
-
ఆర్టీసీ సమ్మె: సాయంత్రం 6 లోగా చేరాలి.. లేకపోతే అంతే!
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో తెలంగాణ ప్రభుత్వం కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల్లోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని, ఒకవేళ వారు విధులకు హాజరుకాకపోతే.. వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని మరోసారీ టీఎస్ సర్కారు తేల్చిచెప్పింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. విధుల్లో చేరని కార్మికులను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించబోదని ఆయన తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగనిరీతిలో శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ముఖ్యంగా మూడు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలీస్తున్నదని పువ్వాడ చెప్పారు. మూడు నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం, ఆర్టీసీ బస్సులు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఉద్యోగావకాశం కల్పించడం.. వారికి తక్షణం తగు శిక్షణ ఇచ్చి, బస్సులను యధావిధిగా నడపడం తదితర చర్యలను తీసుకోనున్నట్టు ఆయన వివరించారు. సమ్మెను ఎదుర్కోవడంలో భాగంగా ఆరు నుంచి ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. శనివారం సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తోందని, ఆదివారం ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమీక్షను ప్రభుత్వం నిర్వహించి.. ఆర్టీసీకి సంబంధించి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తుందని ఆయన వెల్లడించారు. సమ్మెపై సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. -
సీఎం జగన్ కీలక నిర్ణయం.. పాలాభిషేకాలు, హర్షాతిరేకాలు
సాక్షి, అమరావతి : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సంచనలన నిర్ణయం పట్ల ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కల సాకారమయిదంటూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ, స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకరించిన సీఎం జగన్‌కు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో చేసినందుకుగాను మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో ఈయూ నాయకులు వలిశెట్టి దామోదరరావు(వైవీ రావు), ఎన్‌ఎమ్‌యూ నాయకులు వై శ్రీనివాసరావు, ఏ విష్ణు రెడ్డి, ఏ సుధాకర్, వెంకటరమణ తదితరులు ఉన్నారు. విజయవాడలో ఈయూ నేతల సంబరాలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో సంబరాలు చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పుష్పార్చన చేసి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేందుకు సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విలీనంతో పాటు ఆర్టీసీలోని ఇతర సమస్యలు, తమకు దక్కాల్సిన బెనిఫిట్స్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం ఆర్టీసీ కార్మీకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మచిలీపట్నం ఈయూ సంఘ నేతలు అనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలిపారు. తిరువూరులో ఆర్టీసీ కార్మికుల సంబరాలు సీఎం వైఎస్ తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల కృష్ణా జిల్లా తిరువూరు ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల తమ కల నెరవేరిందంటూ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు సంబరాలు చేసుకున్నారు. విలీనాన్ని హర్షిస్తూ సీఎం జగన్, రవాణా మంత్రి పేర్నినాని, ఎమ్మెల్యే కే.రక్షణనిది చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. తిరుపతిలో.. ఆర్టీసీ ఉదోగుల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల తిరుపతిలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కేకులు కట్ చేసి సంతోషంగా ఒకరికి ఒకరు తినిపించుకొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువనేత భూమన అభినయ రెడ్డి కూడా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఆర్టీసీ కార్మికులు అన్నారు. నెల్లూరులో.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంపై ఎంఎంయూ నేత రమణ రాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి పూలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మాట ఇస్తే నిలబెట్టుకొంటారనే దానికి ఇదే ఉదాహరణ అన్నారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చిత్తూరులో.. ఆర్టీసి విలీనాన్ని హర్షిస్తూ మదనపల్లిలో ఎమ్మెలే నవాబ్ బాషా సమక్షంలో ఆర్టీసీ కార్మికులు బారీ కేక్‌ను కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమ దశాబ్దాల కలను నెరవేర్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో.. ఆర్టీసీ ను ప్రభుత్వం లో విలీనం చేస్తూ కాబినెట్ ఆమోదముద్ర వేయడంతో మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్ర పటానికి పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. గుంటూరులో.. విలీనాన్ని హర్షిస్తూ మాచర్ల ఆర్టీసీ కార్మికులు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. విజయనగరంలో.. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనాన్ని హర్షిస్తూ ఆర్టీసీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. మజ్దూర్ యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. -
‘పరపతి’ పోయింది!
నా జీతం నుంచి కట్ చేసి సహకార పర పతి సంఘం (సీసీఎస్)లో డిపాజిట్ చేసిన డబ్బు రూ.రెండున్నర లక్షలు ఉంది. అందులోంచి రూ. 2.5 లక్షల రుణం కోరితే లేదంటే ఎలా?. అత్యవసరమై పిల్లల చదువు కోసం బయట అప్పు చేశా. ప్రతినెలా రూ.10 వేలు వడ్డీ కట్టాల్సి వస్తోంది. వేతనంలో అంత మొత్తం అటు పోతే మేము బతికేదెట్లా – నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ గోడు కుటుంబ అవసరాల కోసం ఓ కండక్టర్ వడ్డీ వ్యాపారి వద్ద రూ.9 లక్షలు అప్పు చేశాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇప్పుడు ఆయన కుటుంబం అప్పు తీర్చేదెలా అని లబోదిబోమంటోంది. అదే ఆర్టీసీ సహకార పరపతి సంఘం నుంచి లోన్ వచ్చి ఉంటే, నిబంధనల ప్రకారం ఆ అప్పు మాఫీ అయి ఉండేది. – హైదరాబాద్‌కు చెందిన కండక్టర్ కుటుంబం ఆవేదన ఇలా ఎంతో మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు ప్రతినెలా తమ జీతంలో నుంచి దాచి పెట్టుకున్న నిధిని ఆర్టీసీ యాజమాన్యం స్వాహా చేసేయటమే దీనికి కారణం. ఏడాది కాలంగా ఆ మొత్తాన్ని సొంత అవసరాలకంటూ ఆర్టీసీ వాడేసుకుని, ఇప్పుడు చెల్లించలేమంటూ చేతులెత్తేయడంతో అత్యవసరాలకు రుణాలు అందక కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఇదీ ఆర్టీసీ సహకార పరపతి సంఘం దీనావస్థ. కాగా, యాజమాన్య తీరును నిరసిస్తూ ఆ సంఘం నిర్వాహకులు చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టారు. ఏమిటీ ఈ నిధి... ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యేకంగా సహకార పరపతి సంఘం ఏర్పాటైంది. ప్రతి ఉద్యోగి జీతంలో బేసిక్‌పై 7 శాతం మొత్తాన్ని సంస్థ కట్ చేసి ఈ సంఘానికి జమ చేస్తుంది. అలా ప్రతినెలా తెలంగాణ ఆర్టీసీలో రూ.40 కోట్లు జమ కావాలి. అలా వచ్చే మొత్తం నుంచి కార్మికులు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవటం... తదితర అవసరాలకు రుణంగా పొందుతారు. ఆ మొత్తాన్ని బ్యాంకు వడ్డీ కంటే తక్కువ వడ్డీతో చెల్లిస్తారు. జరిగింది ఇదీ.. దాదాపు 12 నెలలుగా ఆర్టీసీ ఆ నిధులను సీసీఎస్‌లో జమ చేయటం లేదు. దీంతో ఏడు నెలలుగా సీసీఎస్ అధికారులు రుణాలు ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులూ రావటం లేదని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఉపయోగం లేదని అధికారులు పేర్కొనటంతో గత్యంతరం లేక సీసీఎస్ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో సీసీఎస్ నిధిని వాడుకుంటే ఆర్టీసీ వడ్డీతో సహా తిరిగి చెల్లించేది. కానీ టీఎస్ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి వడ్డీ ఇవ్వక రూ.45 కోట్ల బకాయిలు పడింది. దీంతో సీసీఎస్ అంటేనే కార్మికులకు నమ్మకం సడలింది. కొంతకాలంగా దాదాపు 4 వేల మంది కార్మికులు సభ్యత్వాన్ని రద్దు చేసుకుని బయటకొచ్చారు. – సాక్షి, హైదరాబాద్ -
త్వరలో సీఎంను కలవనున్న ఆర్టీసీ కార్మికులు
-
ఆర్టీసీలో సమ్మె సైరన్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. జూన్ 13 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. బుధవారం ఆర్టీసీ హౌస్‌లో యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించలేదని కార్మిక నేతలు పేర్కొన్నారు. యాజమాన్యం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. సమ్మె నోటీసులు ఇచ్చి 14 రోజులు అయినా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి చూపుతుందని మండిపడ్డారు.తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు 2013 కి వేతనాల సవరణకు సంబందించిన పెండింగ్ అరియర్సు వెంటనే చెల్లించాలి. 4000 మంది సిబ్బందిని తగ్గించాలంటూ వీసీ, ఎండీలు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అద్దెబస్సుల పెంపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి ఆర్టీసీ బస్సులను పెంచాలి. ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రావాల్సిన రూ.650 కోట్లు వెంటనే చెల్లించాలి. సీసీఎస్ నుంచి ఆర్టీసి యాజమాన్యం వాడుకున్న రూ.285 కోట్ల కార్మికుల సొమ్మును వెంటనే యాజమాన్యం చెల్లించాలి. గ్రాడ్యుటీ, వీఆర్ఎస్ సర్క్యులర్‌లో ఉన్న లోపాలు సరిచేయాలి. కారుణ్యనియామాకాలు వెంటనే చేపట్టాలి. మిగిలి ఉన్న కాంట్రాక్టు కార్మికులను తీసుకోవాలి. అందరినీ రెగ్యూలర్ చెయాలి. ఆర్టీసి పాలకమండలిలో కార్మిక సంఘాలకు బాగస్వామ్యం కల్పించాలి. చట్ట ప్రకారం కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన సౌకర్యాలలో వీసీ, ఎండీ తొలగించిన సౌకర్యాలను పునరుద్దరించాలి. -
‘ఎస్మా చట్టాలు సమ్మెను ఆపలేవు’
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఆటంకం కలిగించే విధంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సమస్యలపై, సంస్థ పరిరక్షణ కోసం సమ్మె నోటీసులు ఇచ్చిన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం ఎస్మా చట్టాలను బయటకు తెచ్చి ఆరునెలలు సమ్మె నిషేధమంటారని విమర్శించారు. ఈ మేరకు ఎపీఎస్ ఆర్టీసీ కార్మిల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు లేఖను విడుదల చేశారు. ఎస్మా చట్టాలు సమ్మెను ఆపలేవని, ఈనెల 20 తర్వాత ఎప్పుడైనా సమ్మె ఉండొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదనన్నారు. ఆర్టీసీ యాజమాన్య సిబ్బంది కుదింపుపై తీసుకున్న చర్యలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. కాగా ఏపీఎస్ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. మొత్తం 19 డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఇటీవల ఆర్టీసీ ఎండీకి అందించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది కుదింపు చర్యలు ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆర్థిక భారం.. లేదు సాయం
సాక్షి, అమరావతి: సామాన్యుడి రవాణా సాధనమైన ఆర్టీసీ బస్సు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. గత ఐదేళ్లుగా నష్టాలు నానాటికీ పెరుగుతుండడం, సర్కారు నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. కాస్త చేయూతనందించి, కష్టాల కడలి నుంచి గట్టెక్కించండి అని పదేపదే విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం కనీసం స్పందించిన పాపానపోలేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థను కాపాడుకోవాలంటే టిక్కెట్ చార్జీలు పెంచడం మినహా మరో గత్యంతరం లేదని ఆర్టీసీ యాజమాన్యం తేల్చిచెబుతోంది. సంస్థ ఆస్తులు హాంఫట్ ఆర్టీసీపై అప్పుల భారం ప్రస్తుతం రూ.6,445 కోట్లకు చేరింది. నష్టాలు ప్రతిఏటా పెరుగుతూ ఇప్పుడు రూ.1,029 కోట్లకు చేరాయి. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోకపోగా, సంస్థ ఆస్తులను అస్మదీయులకు అప్పనంగా అప్పగించేసింది. బీవోటీ విధానంలో విలువైన ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టి ఆర్టీసీ మనుగడను దెబ్బతీసింది. ప్రభుత్వ ప్రచారానికి, అధికార పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను యథేచ్ఛగా వాడుకున్నారు. పోలవరం యాత్రలకు ఆర్టీసీ బస్సులను తిప్పారు. ఇందుకు గాను ఆర్టీసీకి ప్రభుత్వం రూ.75 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు జల వనరుల శాఖ విడుదల చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయినా ఇప్పటిదాకా రూపాయి కూడా రాలేదు. ముఖ్యమంత్రి సభలకు, ధర్మపోరాట దీక్షలకు డ్వాక్రా మహిళలను, జనాన్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నారు. వాటికి సక్రమంగా బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. ఫలితంగా ఆర్టీసీ రూ.కోట్లల్లో ఆదాయం కోల్పోయింది. ఆర్టీసీ సొమ్ముతో ముఖ్యమంత్రి సోకులు ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఆర్టీసీకి చెందిన రూ.9 కోట్ల నిధులతో అత్యాధునికమైన బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన సుబ్బారావు అనే పొగాకు రైతు తమకు గిట్టుబాటు కల్పించడం లేదు గానీ ముఖ్యమంత్రి కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏటా రూ.281 కోట్ల వడ్డీ కట్టాల్సిందే.. ఆర్టీసీపై అప్పుల భారం పెరిగిపోవడంతో రుణాల కోసం బ్యాంక్‌లను ఆశ్రయించక తప్పడం లేదు. బస్టాండ్లను తనఖా పెట్టి మరీ రుణాలు పొందారు. ప్రస్తుతం బ్యాంకు రుణాలు రూ.2,026 కోట్లు ఉండగా, వీటికి వడ్డీ కింద ప్రతిఏటా రూ.281 కోట్లు బ్యాంకులకు చెల్లిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘హడ్కో’ నుంచి పొందిన రుణం రూ.793 కోట్లు ఉంది. సంస్థకు చెందిన క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ, ప్రావిడెంట్ ఫండ్‌లో కార్మికులు దాచుకున్న రూ.1,232 కోట్లను ఆర్టీసీ వాడుకుంది. కనీసం ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన యూనిఫాంను మూడేళ్లుగా ఇవ్వడం లేదు. ఎంవీ ట్యాక్స్ ముక్కు పిండి మరీ వసూలు మోటార్ వాహన పన్ను(ఎంవీ ట్యాక్స్) ఆర్టీసీకి పెనుభారంగా పరిణమించింది. ఎంవీ ట్యాక్స్ తగ్గించాలని ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలను ప్రతిఏటా ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆర్టీసీకి పన్ను మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఎంవీ ట్యాక్స్ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ ఆదాయంలో 13 శాతం ఉండేది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని 7 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీని ఆదుకోవాలంటే ఎంవీ ట్యాక్స్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ప్రభుత్వానికి ఏటా రూ.300 కోట్లు ఎంవీ ట్యాక్స్ కింద ఆర్టీసీ ఏటా ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో ప్రతి మూడు నెలలకు 7 శాతం వంతున మోటార్ వాహన పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రతి రోజూ ఆర్టీసీకి సగటున రూ.12 కోట్ల ఆదాయం వస్తోంది. అంటే మూడు నెలలకు రూ.1,080 కోట్లు, ఏడాదికి రూ.4,320 కోట్లు. ఈ ఆదాయంలో రూ.302 కోట్ల వరకు ఎంవీ ట్యాక్స్ కింద ప్రభుత్వానికి చెల్లించాలి. 2015–16లో ఎంవీ ట్యాక్స్ రూ.280 కోట్లు ఉండగా, 2018–19 నాటికి అది రూ.316 కోట్లకు చేరింది. డీజిల్ భారం రూ.650 కోట్లు డీజిల్ ధర 2015–16లో లీటర్‌కు రూ.49 ఉండగా, 2018–19 నాటికి రూ.70.41కి చేరింది. డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆర్టీసీపై భారం పెరిగిపోతోంది. డీజిల్ భారం ఆర్టీసీపై ఈ ఏడాది రూ.650 కోట్లు ఉంది. ఈ భారాన్ని భరించాలని యాజమాన్యం పలుమార్లు వినతి చేసినా ప్రభుత్వం లెక్కచేయలేదు. డీజిల్‌పై వ్యాట్ 17 వాతం వరకు ప్రభుత్వానికి చెల్లించాలి. దీన్ని తగ్గించాలని కోరుతున్నా సర్కారు ససేమిరా అంటోంది. ధనిక వర్గాలు ప్రయాణించే విమాన ఇంధనంపై ప్రభుత్వం కేవలం 1 శాతమే వ్యాట్ వసూలు చేస్తోంది. మిగిలిన 16 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తుండడం గమనార్హం. -
సమ్మెకు రెడీ..!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్ధమయ్యాయి. కార్మికసంఘాలు పోటాపోటీగా ఆర్టీసీ ఎండీ ఎన్వీ సురేంద్రబాబుకు సమ్మె నోటీసులు అందించనున్నాయి. బుధవారం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నాయకులు ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందించారు. ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి నేతృత్వంలో ఆ యూనియన్ నాయకులు సమ్మెకు సిద్ధమని ప్రకటించారు. మొత్తం 19 డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఎండీకి అందించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది కుదింపు చర్యలు ఆపేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ఉన్న అప్పులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈక్విటీ కింద మార్పు చేయాలని, ఎంవీ ట్యాక్స్‌ను పదేళ్ల పాటు హాలిడే ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) గురువారం ఎండీకి మరోసారి సమ్మె నోటీసు ఇవ్వనుంది. గతంలో ఈయూ సమ్మె నోటీసిచ్చిన సందర్భంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో చర్చలు జరిపి సమ్మె నోటీసును ఉపసంహరించుకున్నారు. ఆర్టీసీ సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు ప్రకటించింది. గత నవంబర్‌లో ఎంప్లాయీస్ యూనియన్‌తో ఆర్టీసీ యాజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయడంలో విఫలమైందని పేర్కొంది. ఈయూ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ.. సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అన్ని యూనియన్లు కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఏప్రిల్ 5వ తేదీలోపు ఇవ్వాల్సిన బకాయిలను, క్రెడిట్ సొసైటీకి చెల్లించాల్సిన రూ. 250 కోట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒప్పందాన్ని అమలు చేయడానికి ఎన్నికల నిబంధనావళి అడ్డంగా ఉందని ఆర్టీసీ ఎండీ చెప్పడం సరికాదన్నారు. కార్మికులు సమ్మెకు దిగితే అందుకు ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ఈయూ అధ్యక్షుడు వైవీ రావు, కార్యదర్శి పి.దామోదరరావు తదితరులు ప్రసంగించారు. -
చక్రం తిరుగుతోంది చందాలతోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పరిస్థితి అత్యంత దయ నీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కార్మికులకు జీతాలు ఇవ్వడానికే దిక్కులు చూస్తున్న సంస్థ.. ఏవైనా పనులు చేయించాలంటే వారి వద్దే చేయి చాస్తోంది. కార్మికులు తమ జేబులో నుంచి డబ్బులు తీస్తే తప్ప.. సంస్థలో అభివృద్ధి పనులు జరగని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ ఏర్పడిన తర్వాత 8 దశాబ్దాల్లో ఎన్నడూ ఇంతటి గడ్డు పరిస్థితి లేదు. నష్టాలు వచ్చినప్ప టికీ.. సిబ్బంది వేతనాలు, ఇతరత్రా అభివృద్ధి పనులకు అంతగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా మారింది. సంస్థ వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో కొత్త బస్సులు కొనలేక డొక్కు బస్సులతోనే నెట్టు కొస్తోంది. కార్మికుల కోసం డిపోల పరిధిలో ఏవైనా పనులు చేయాల్సి వస్తే ‘బస్ భవన్’ నిస్సహాయంగా చూస్తోంది. దీంతో కార్మికులే చందాలు వేసుకుని పనులు చేసుకుంటున్నారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు... వరంగల్ రీజియన్ పరిధిలోని కార్మికులందరి చేతిలో ‘క్లినిక్ డిస్పెన్సరీ డెవలప్మెంట్ ఫండ్’ కూపన్లే కనిపిస్తున్నాయి. హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల కోసం విశాలమైన డిస్పెన్సరీ ఉంది. వరంగల్–1 డిపో మేనేజర్ కార్యాలయం ఉన్న భవనం రెండో అంతస్తులో దీనిని ఏర్పాటు చేశారు. అయితే, దీనికి లిఫ్టు వసతి లేదు. కనీసం ర్యాంపు కూడా లేకపోవడంతో అత్యవసర చికిత్స కోసం వచ్చే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పైకి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల డిమాండ్ మేరకు డిస్పెన్సరీని రీజినల్ మేనేజర్ కార్యాలయం ఉన్న భవనంలో కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.లక్షల్లోనే ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ, ఆ నిధులు ఇచ్చేందుకు ఆర్టీసీ వద్ద ఎలాంటి ఫండ్ లేదు. ఏరోజుకారోజు టికెట్ల రూపంలో వచ్చే డబ్బులు తప్ప ఆర్టీసీ వద్ద ఎలాంటి నిధులూ లేవు. కార్మికుల భవిష్యనిధి, ఆర్టీసీ పరపతి సహకార సంఘం, పదవీ విరమణ, చనిపోయిన కార్మికులకు ఇచ్చే థ్రిఫ్ట్ అండ్ బెన్వలెంట్ ఫండ్‌ను కూడా వదలకుండా వాడేసుకుంటున్న దుస్థితి నెలకొంది. దీంతో ఇలాంటి అభివృద్ధి పనులకు ఇవ్వడానికి నయా పైసా కూడా సంస్థ వద్ద లేదు. ఆర్టీసీ కేంద్ర కార్యాలయం నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేకపోవటంతో వరంగల్ రీజియన్ అధికారులు స్థానిక కార్మిక సంఘాలతో సమావేశమై చందాలు వేసుకుని ఈ పని చేయించుకోవాలని నిర్ణయించారు. వరంగల్ రీజియన్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు రూ.50 చొప్పున చెల్లించే విధంగా రశీదు పుస్తకాలు ముద్రించారు. వాటిని డిపోలకు పంపిణీ చేసి చందాలు వసూలు చేస్తున్నారు. లక్కీ డ్రా తీసి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామంటూ కూపన్లపై ముద్రించారు. దీంతో కొందరు కార్మికులు పది వరకు కూపన్లు తీసుకుంటున్నట్టు తెలిసింది. డిస్పెన్సరీ చాలా ఉపయోగకరమైంది కావటంతో కొంతమంది స్వచ్ఛందంగా అదనంగా చందాలు రాస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న మొత్తంతో కొత్త డిస్పెన్సరీ పనులు చేయిస్తున్నారు. డ్రైవర్డేకు చందాలే దిక్కు... కార్మికుల సంక్షేమం, ఇతర ప్రత్యేక రోజులకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీ. డ్రైవర్ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఆ రోజు డ్రైవర్ల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవటంతోపాటు వారికి బహుమతులు ఇచ్చి, ఉత్తమ డ్రైవర్లను సన్మానిస్తారు. ఇలాంటి కార్యక్రమాలకు ఆర్టీసీనే ఖర్చు భరిస్తుంది. కానీ నిధులు లేక ఇటీవల కార్మికులే చందాలు వేసుకుని ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వరంగల్ రీజియన్‌లో ఇలా రూ.50, రూ.100 చొప్పున చందాలు వేసుకుని అన్ని డిపోల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రం కావడంతో అన్ని డిపోల్లో మంచినీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇందుకోసం చాలాచోట్ల భారీ ట్యాంకులు ఏర్పాటు చేసి కార్మికులకు మంచినీటిని అందుబాటులో ఉంచుతున్నారు. అయితే, ట్యాంకులు కొనడానికి నిధులు లేకపోవటంతో చాలాచోట్ల కార్మికులే చందాలు వేసుకున్నట్టు సమాచారం. అవినీతికి ఆస్కారం కాదా? అభివృద్ధి పనుల పేరుతో కార్మికుల నుంచి చందాలు వసూలు చేయటాన్ని కొందరు తప్పుపడుతున్నారు. అది అవినీతికి దారి తీస్తుందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికుల నుంచి చందాలు వసూలు చేసి పనులు పూర్తి చేసిన తర్వాత, భవిష్యత్తులో ఆ ఖర్చు తాలూకు బిల్లులు పెట్టి ఆర్టీసీ నిధుల నుంచి వసూలు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ భాగస్వామ్యంలో ఇలాంటి పనులు జరగడం సంతోషంగా ఉందని అనేవారూ ఉన్నారు. గతంలో తమ జీతాల నుంచి కొంత మొత్తం మినహాయించి కొత్త బస్సులు కొన్నారని, ఇప్పటికీ అవి తిరుగుతున్నాయని, వాటిని చూస్తే ఆనందం కలుగుతుందని పేర్కొంటున్నారు. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి నిర్మాణ సమయంలో కూడా తాము చందాలు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలేం చేస్తున్నారు..? వాస్తవానికి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు తమ అభివృద్ధి నిధులను కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం గతంలోనే ఎమ్మెల్యేలకు ఆర్టీసీ లేఖలు రాసింది. గత ప్రభుత్వ హయాంలో ఈటల రాజేందర్, మధుసూదనాచారి, మహేందర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ సహా పది పన్నెండు మంది మాత్రమే కొంతమేర ఆర్టీసీకి నిధులిచ్చారు. మిగిలినవారు ఎవరూ స్పందించలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఒక్కరు కూడా ఆర్టీసీకి నిధులు కేటాయించలేదు. కొన్ని చోట్ల అధికారులు విన్నవించినా ఎమ్మెల్యేలు స్పందించలేదు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ధర్నా
-
ఈ నెల 6నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె
-
కొనసాగుతున్న ఏపీఎస్ ఆర్టీసీ ఎన్నికలు
సాక్షి, అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. దాదాపు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలోని 128 డిపోల్లో పోలింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, బస్ భవన్లలో 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఎన్‌ఎమ్‌యూ, ఈయూల మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది. రాత్రి 10.30 గంటల్లోపు ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. -
ఆర్టీసీలో యూనిఫాంల కొరత
సాక్షి, హైదరాబాద్: ఎండనకా.. వాననకా.. శ్రమించే కార్మికులు వారు. రుతువులతో సంబంధం లేకుండా.. ప్రజలందరినీ గమ్యస్థానాలకు చేర్చడమే వారిపని. ప్రగతి రథ చక్రాలను 24 గంటల పాటు నడిపిస్తూ ఆర్టీసీ మనుగడకు ఊపిరిగా నిలుస్తున్నారు. అలాంటి ఆర్టీసీ కార్మికులకు ఐదేళ్లుగా సంస్థ నుంచి యూనిఫాం అందట్లేదు. దీంతో ఇన్నేళ్ల నుంచి సిబ్బంది సొంత డబ్బులతో యూనిఫాం కొనుక్కుని విధులకు హాజరవుతున్నారు. నిబంధనల ప్రకారం రెండేళ్లకు మూడు యూనిఫాంలను సిబ్బందికి సంస్థ సరఫరా చేయాలి. (1.2 మీటర్ల ప్యాంటు, 2 మీటర్ల షర్ట్ క్లాత్). దాంతోపాటు కుట్టుకూలీ కింద రూ.200 చెల్లించాలి. చివరిసారిగా 2013లో సిబ్బందికి యూనిఫాంలు అందజేశారు. ఆర్టీసీ అధికారులను ఎప్పుడు అడిగినా.. ఇదిగో ఇస్తున్నాం.. అదిగో ఇస్తున్నాం.. అంటున్నారే తప్ప ఆచరణలో విఫలమవుతున్నారు. కాగా, ఇప్పటికే పలురకాల సమస్యలతో సతమతమవుతోన్న ఆర్టీసీ కార్మికులకు యూనిఫాం అదనపు భారంగా మారింది. సంస్థ ఇవ్వకపోవడంతో గత్యంతరంలేక వారే కుట్టించుకుంటున్నారు. అయితే ఈ దుస్తుల రంగుల్లో ఏకరూపత ఉండట్లేదు. ఒకే డిపోలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు ధరించే దుస్తుల ఖాకీ రంగుల్లో పలు రకాల వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఎవరు బాధ్యులు? 52 వేల మందికిపైగా ఉన్న సంస్థలో కిందిస్థాయి ఉద్యోగులకు చీఫ్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ కార్యాలయం యూ నిఫారాలను ఇస్తుంది. ఇందుకు ముందుగా టెండర్లు పిలుస్తుంది. అందులో ఎంపిక చేసిన కాంట్రాక్టరు నుం చి నాణ్యమైన దుస్తులను ఎంపిక చేస్తుంది. గుర్తింపు యూనియన్ నుంచి నాణ్యత కమిటీ దుస్తుల మన్నికను పరిశీలిస్తుంది. వీరు సంతృప్తి వ్యక్తం చేశాక, ఆ వస్త్రాన్ని ఎంపిక చేస్తారు. ఈ మొత్తం టెండర్ల వ్యవహారాలు ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) ఆధ్వర్యంలో జరుగుతుంది. రిటైరైన వారి సంగతేంటి? 2014 నుంచి 2018 ఆగస్టు వరకు ఏటా వందలాది కార్మికులు రిటైరయ్యారు. ఈ సంఖ్య 4 వేలకుపైనే ఉండొచ్చని సమాచారం. వారంతా ఈ ఐదేళ్లకాలానికి యూనిఫాంను సొంత డబ్బుతోనే కుట్టించుకున్నారు. ఇప్పుడు వీరికి యూనిఫాం అలవెన్సులు అందుతాయన్న విషయంలోనూ స్పష్టత లేదు. కాగా, ఐదేళ్ల కింద కుట్టుకూలీ కింద పురుషులకు ఒక్కోజతకు రూ.200, మహిళలకు రూ.100 చొప్పున చెల్లించాలి. ప్రస్తుతం ఈ ధరకు మార్కెట్లో ఎవరూ దుస్తులు కుట్టరని కార్మికులు చెబుతున్నారు. కనీసం ఈసారైనా మెరుగైన కుట్టుకూలీ చెల్లించాలని కోరుతున్నారు. 2013లో చివరిసారిగా కార్మికులకు (కొన్నిచోట్ల మాత్రమే) దుస్తులు అందజేశారు. అప్పటినుంచి ఐదో ఏడాది రెండో త్రైమాసికం కూడా పూర్తి కావొస్తోంది. ఇప్పటికీ దుస్తులు అందలేదు. దాదాపు రూ.20 కోట్లకుపైగా కార్మికుల దుస్తులు, కుట్టుకూలీ రూపంలో సంస్థ మిగుల్చుకుందని విమర్శలు వస్తున్నాయి. వేధింపులు సరేసరి.. ఆర్టీసీలో యూనిఫాంలు ఇవ్వట్లేదు. అయినా ఈ విషయంలో అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. యూనిఫాం ధరించకుండా విధులకు హాజరైన సిబ్బందికి డ్యూటీలు వేయట్లేదు. కొందరికి తాఖీదులు జారీ చేస్తున్నారు. మరికొందరిని మానసికంగా వేధిస్తున్నారు. క్వాలిటీ కోసం అన్వేషణ తెలంగాణ ఏర్పడ్డాక విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా కార్మికులకు యూనిఫాం అందజేయలేకపోయాం. మంచి క్వాలిటీ దుస్తుల కోసం అన్వేషిస్తున్నాం. రెండు, మూడు నెలల్లో అందజేస్తాం. – శివకుమార్, ఈడీఏ దుస్తుల ఎంపిక జరుగుతోంది యూనిఫాం ఇవ్వడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమే. టెండర్లకు సిద్ధమవుతున్నాం. ప్రస్తుతం దుస్తుల ఎంపిక జరుగుతోంది. గుర్తింపు యూనియన్ నాయకులకు శాంపిల్స్ చూపిస్తున్నాం. త్వరలోనే అందజేస్తాం. – అజయ్‌కుమార్, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ -
ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుంది
సాక్షి, విజయవాడ : ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుందని ఏపీఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులు నష్టాల్లో నడుస్తున్నా సామాజిక బాధ్యతతో తిప్పుతున్నామని తెలిపారు. గత రెండు నెలలుగా కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాల్ని చేపట్టామని, సెలవుల్లో విషయంలో ఇబ్బంది లేకుండా అదనపు సిబ్బందిని సమకూర్చామని పేర్కొన్నారు. దాదాపు 20,200 మందికి పెన్షన్లు పెండింగ్‌లో ఉన్న విషయం గుర్తించామన్నారు. కార్మికులకు పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని, జూన్ నెలలో రిటైరయ్యే వారికి అదేరోజున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని ఆదేశించానని సురేంద్రబాబు అన్నారు. పాత బకాయిలు క్లియర్ చేసే పనిలో ఉన్నాం.. పాత బకాయిలు క్లియర్‌చేసే పనిలో ఉన్నామని సురేంద్రబాబు తెలిపారు. కార్మికులను చార్జిమెమోలతో వేధించే విధానానికి స్వస్తి పలికి సరికొత్త విధివిధానాలను రూపొందించామని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా వేళలు మార్చడంద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందన్నారు. విద్యార్థుల బస్‌పాస్‌లను నెలవారీ కాకుండా త్రైమాసికం, వార్షిక విధానానికి వెసులుబాటు కల్పించామన్నారు. రెండు వందల కోట్లతో 850 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని, డిమాండ్ ఉన్న రోజుల్లో టికెట్ల ధరలు పెంచుతామని పేర్కొన్నారు. పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి భారంగా మారాయని, టికెట్ల ద్వారానే కాకుండా ఇతన మార్గాల ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఆర్టీసీ స్థలాల్ని వాణిజ్యపరంగా వినియోగంలోని తీసుకువస్తామన్నారు. -
‘ఆర్టీసీ నష్టాలకు అధికారులే బాధ్యులు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాలకు కార్మికుల పనితీరుకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం నేతలు తేల్చి చెప్పారు. అధికారుల పనితీరు సరిగా లేకపోవటం, గతంలో తీసుకున్న అప్పులకు ఇప్పటికీ వడ్డీలు చెల్లిస్తుండటం, భారీగా పెరిగిన డీజిల్ ధరల వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందని, దానికి కార్మికులను బాధ్యులను చేయటం సరికాదని స్పష్టంచేశారు. వాస్తవాలను దాచి అధికారులు తప్పుడు లెక్కలతో సీఎంనే తప్పుదారి పట్టించారని ఆరోపించారు. బుధవారం ఆర్థిక మంత్రి ఈటల అధ్యక్షతన మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో మరోసారి ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ప్రతినిధులతో భేటీ అయింది. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో జీతాల కోసం పట్టుపట్టడం, సమ్మె నోటీసు ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం, ఆర్టీసీ అధికారులతో చర్చ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశంలో గుర్తింపు సంఘం నేతలు దానికి కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయటం ఏమాత్రం సరికాదని, నష్టాల బూచి చూపి వేతన సవరణ నుంచి తప్పించుకునే ప్రయత్నం సరికాదని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ సిబ్బంది వేతనాలు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కంటే తక్కువగా ఉన్నాయని సీఎం అన్న మాటలను ఖండించారు. మహారాష్ట్ర లాంటి చోట్ల ఆర్టీసీ కార్మికుల బేసిక్ తక్కువగా ఉన్నా అలవెన్సులు మనకంటే చాలా ఎక్కువని, మొత్తంగా చూస్తే వారి వేతనాలు తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది వేతనాల కంటే ఎక్కువే ఉంటాయని వివరించారు. ‘‘ఢిల్లీ, హరియాణ లాంటి చోట్ల ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? కావాలంటే ఆర్టీసీ అధికారులతో కలసి తాము అధ్యయనానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యమంలో ముందున్న ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవాల్సిందే’’అని పేర్కొన్నారు. జాప్యమైతే 25% ఐఆర్ ప్రకటించండి వేతన సవరణ ఇవ్వటం సాధ్యం కాదనుకుంటే ఇంటీరియమ్ రిలీఫ్ (ఐఆర్) 25 శాతం ప్రకటించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. హరీశ్‌పై గుర్రు: టీఎంయూ గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు బుధవారం నాటి సమావేశానికి హాజరయ్యారు. కానీ ఆయన తమకు అనుకూలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాము డి మాండ్లపై మొత్తుకుంటున్నా ఏమీ పట్టనట్టు కూర్చున్నారని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాదనతో మంత్రులు ఏకీభవించారని, వేతన సవరణ విషయంలో సీఎంతో మరోసారి చర్చిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని సమావేశానంతరం ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణరావు, సంఘం ప్రతినిధులు తిరుపతి, థామస్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేస్తామంటే చేసుకోమనండి ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ఉదంతం ఎప్పుడైనా ఉందా? మా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని తరహాలో కార్మికులు అడిగినదాని కంటే ఎక్కువ ప్రకటిస్తే.. ఇప్పుడు ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారా? వేతన సవరణ చేయకుంటే సమ్మె చేస్తామని హెచ్చరిస్తారా? అదీ రూ.750 కోట్ల మేర వార్షిక నష్టాలున్నప్పుడు... ఏమనుకుంటున్నారు..? చేస్తామంటే చేసుకోమనండి.. చేస్తే అట్నుంచి అటే పోతే?’’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. బుధవారం రాత్రి మంత్రివర్గ ఉప సంఘం, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెరసి కార్మిక సంఘాల డిమాండ్‌కు తగ్గట్టు వేతన సవరణ జరగదనే స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయినా ఈ అంశం మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనలో ఉందని, సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘నేను ఓ దినమంతా ఆర్టీసీ సమీక్షలో గడిపాను. వేల ఆటోలు, బైకులు రోడ్డుమీదకు వచ్చిన తరుణంలో ఆర్టీసీ ఎలా మనుగడ సాగించాలో స్పష్టంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని చెప్పాను. ఆర్టీసీని రక్షించేందుకు రూ.3,400 కోట్ల మొత్తాన్ని విడుదల చేశాం. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు పెట్టాం. అయినా ఇంకా డిమాండ్లు చేస్తే ఏమనాలి? సమ్మె చేస్తామంటే చేసుకోమనండి. కార్మికులు, యాజమాన్యం అంతా కలిసి మునుగుతారు’’అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లాంటి కొన్ని రాష్ట్రాల్లో అసలు ఆర్టీసీలే లేవని, కేరళలో బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుంటే వారు పట్టించుకోకుండా సమ్మెకు పోతామంటే చేసేదేముంటుందని ప్రశ్నించారు. అధికారులు తనకు ఇచ్చిన లెక్కలు తప్పులని, నన్ను తప్పుదోవ పట్టించారని కార్మిక సంఘాలు అనడం తప్పన్నారు. ఓ ముఖ్యమంత్రికి తప్పుడు లెక్కలు ఎలా ఇవ్వగలుగుతారని, వాస్తవ పరిస్థితిని తనకు అధికారులు వివరించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ విషయంలో పూర్తి సానుకూలత వ్యక్తం చేయటమే కాకుండా ఉద్యోగుల పనితీరుపై అభినందనల వర్షం కురిపించిన సీఎం.. అదే వేదికపై ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై విమర్శల వర్షం కురిపించటం విశేషం. -
ఆర్టీసీ వేతన సవరణపై నేడే చర్చలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై మంత్రుల కమిటీ ఆదివారం సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘం నేతలతో చర్చించనుంది. ప్రస్తుత వేతన సవరణ గడువు 14 నెలల క్రితమే ముగిసిపోయినందున కొత్త వేతన సవరణను ప్రకటించాలని కొద్దిరోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వేతన సవరణలో జాప్యం జరిగే పరిస్థితి ఉంటే 25% మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రధాన సంఘాలన్నీ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు కూడా అందజేశాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో.. ఆర్టీసీలో వేతన సవరణ అంశాన్ని కూడా దానికి అప్పగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోని మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలతో కూడిన కమిటీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, ఇతర అధికారులు, గుర్తింపు కార్మిక సంఘం నేతలతో చర్చించనుంది. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా చూడాలన్న అభిప్రాయం ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తోంది. మొత్తంగా 15 శాతం నుంచి 18 శాతం మధ్య ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. -
ఆర్టీసీలో మళ్లీ వేతన సవరణ రగడ
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఆర్టీసీ, చేతి వృత్తుల కార్మికులు
-
ఎమ్మెల్యేల జీతాలు పెంచుతారు కానీ..
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఏడో రోజుకు చేరింది. తమ సమస్యలు పరిష్కరించనిదే సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన కార్మికులు ఆందోళనను ఉద్రితం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సమ్మె విరమణకు సిద్ధమని మంగళవారం కార్మిక సంఘాలు ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పళనిస్వామి ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల వేతనాలు పెంచుకుంటారు కానీ.. తమ వేతనాలు గురించి పట్టించుకోరా అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. -
బ్రీత్ ఎనలైజర్లతో కష్టాలు
ఆత్మకూరు: ఆర్టీసీ బస్సుల్లో కార్మికులకు బ్రీత్ ఎనలైజర్‌తో కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కడుపు మండిన ఆర్టీసీ కార్మికులు ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆత్మకూరు డిపో ఎదుట ధర్నా చేపట్టారు. డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ చల్లా రవిరెడ్డి ఆదివారం తెల్లవారుజామున విధులకు హాజరయ్యే ముందు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన మద్యం సేవించినట్లు 10 పాయింట్లు ఆ మిషన్‌లో కనబడడంతో సెక్యూరిటీ రిపోర్టు మేరకు అతడ్ని విధులకు హాజరుకాకుండా చేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. అదే సమయంలో విధులకు హాజరైన కార్మికులందరూ అసలు మద్యమే ముట్టని రవిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం సేవించాడంటూ నిర్ణయించడం సరికాదని వాదులాడారు. అనంతరం అన్ని కార్మిక యూనియన్ల నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని రవికి ప్రభుత్వాస్పపత్రిలో పరీక్షలు నిర్వహించాలని పట్టుబట్టారు. అందుకు యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సమాచారమందుకున్న డిపో మేనేజర్ త్రినా«థ్‌రావు అక్కడికి చేరుకుని, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో దాదాపు మూడు గంటలకు పైగా బస్సులు డిపోలో నిలిచిపోయాయి. మీడియాపై రుసరుస విషయం తెలుసుకున్న మీడియా ఘటన స్థలానికి చేరుకోవడంతో డిపో మేనేజర్ త్రినా«థ్‌రావు వారిపై రుసరుసలాడారు. ఈ క్రమంలో కార్మికులు తామే మీడియాకు సమాచారమిచ్చామని చెప్పడంతో విధిలేక ఆయన ఉన్నతా«ధికారులను మరోసారి సంప్రదించారు. అనంతరం రెండోసారి బ్రీత్ ఎనలైజర్ ద్వారా రవిరెడ్డికి అందరి ఎదుట పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో సున్నా పాయింట్లు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ మిషీన్లో పొరపాటు పెట్టుకుని కార్మికులను మానసిక క్షోభకు గురిచేయడం సరికాదని, గతంలోనూ ఇలానే ఓ కార్మికుడిని సస్పెన్షన్‌కు గురిచేశారని తెలిపారు. చివరికి కార్మికులు విధులకు హాజరవడంతో వ్యవహారం సర్దుమణిగింది. నీరు తాగితే నమోదు కాదు కాగా మంచినీరు ఎక్కువగా తాగితే మద్యం తాగినట్లు బ్రీత్ ఎనలైజర్ గుర్తించలేదని డిపో మేనేజర్ సెలవిచ్చారు. బ్రీత్ ఎనలైజర్ అలా ఎందుకు రెండు విధాలుగా నమోదు చేసిందని త్రినాథ్‌రావును ప్రశ్నించగా రెండోసారి కార్మికుడు అధికంగా నీళ్లు తాగి పరీక్షలు చేయించుకోవడంతో అలా నమోదైందని వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వ వైఖరిపై ఆర్టీసీ కార్మికుల ఆందోళన
అమరావతి: ఆర్టీసీ యాజమాన్యం ఆవలంభిస్తున్న నిర్లక్ష్యనికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టనున్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 14 న రాష్ర్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నామని ఆర్టీసీ కార్మిక సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది. ఆర్టీసీ బస్సుల సంఖ్యను, సిబ్బందిని కుదిస్తున్నందుకు నిరసనగా మొత్తం 13 జిల్లాల్లోని 128 డిపోలు, వర్కుషాపుల వద్ద ఆందోళనలు చేస్తామని ఈయూ పేర్కొంది. యాజమాన్యం సీసీఎస్, ఎస్ఆర్బీఎస్, పీఎఫ్ ట్రస్టులకు బకాయి డబ్బులను వెంటనే చెల్లించాలని కోరింది. పెండింగ్ రుణాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. -
ఆర్టీసీ సీసీఎస్ కార్యదర్శిని తొలగించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సహకార పరిపతి సంఘం (సీసీఎస్)లో అలజడి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సొసైటీ కార్యదర్శిని వెంటనే తొలగిం చాలని కొందరు కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే హైకోర్టు తలుపు తట్టిన ఆ కార్మిక వర్గం.. ఇటీవల సహకార శాఖ విచారణ జరిపి చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. పదవీ విరమణ పొందినా నిబంధనలకు విరుద్ధంగా కార్యదర్శిగా నాగరాజు కొనసాగు తున్నారని, ఆంధ్రా ప్రాంతంలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివినందున తెలంగాణలో కొనసాగే అవకాశం లేనప్పటికీ కొనసాగు తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. స్థాయికి మించి అక్రమంగా అధిక వేతనం పొందుతున్నందున ఇప్పటివరకు పొందిన మొత్తాన్ని తిరిగి సంఘానికి చెల్లించాలని విచారణాధికారులు తేల్చారని పేర్కొంటున్నారు. ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఆయనను తొలగించాలని సహకార శాఖ సిఫార్సు చేసిందని ఆర్టీసీ బహుజన కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రేమ్‌నాథ్ సహా పలువురు కార్మికులు చెబుతన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సహకార పరపతి సంఘం మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసింది. అయితే కార్యదర్శిని కాపాడుకునేందుకు కొందరు కుట్రపన్నారని, సమావేశంలో ఆయనకు అనుకూల తీర్మానం చేయబోతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మరోవైపు సహకార శాఖ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీసీఎస్ చైర్మన్, ఆర్టీసీ ఎండీ రమణరావు పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు: కార్యదర్శి నాగరాజు కార్మిక సంఘాల మధ్య ఉన్న విభేదాల వల్లే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సీసీఎస్ కార్యదర్శి నాగరాజు అన్నారు. సహకార శాఖ విచారణ జరిపి తనకు క్లీన్‌చీట్ ఇచ్చిందని, బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా తాను రుణం పొందినట్లు తేలలేదన్నారు. -
సెలవు.. వివాదాల నెలవు
♦ ‘నెలలో మూడు రోజులు సెలవు’పై ఆర్టీసీలో రగడ ♦ అనుమతి లేకుండా డుమ్మా కొట్టే సిబ్బందిపై డిస్మిస్ కొరడా ♦ కార్మిక నేతలు, అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కార్మికులకు, అధికారులకు మధ్య సెలవుల రగడ మొదలైంది. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే డ్రైవర్లు, కండక్టర్లపై యాజమాన్యం కఠిన చర్యలకు దిగడం వివాదాస్పదమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు నెలలో మూడు రోజులు సెలవు తీసుకునే వెసులుబాటు ఉంది. చాలామంది సిబ్బంది ముందస్తు అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరై తర్వాత దాన్ని మూడు రోజుల సెలవు విధానంలోకి మార్చుకుంటున్నారు. అకస్మాత్తుగా విధులకు డుమ్మా కొడుతుండటంతో బస్సు సర్వీసు షెడ్యూళ్లకు తీవ్ర విఘాతం కలుగుతోంది. దీనిపై యాజమాన్యానికి డిపో మేనేజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి సిబ్బందికి మెమోలు జారీ చేయాలని, పరిస్థితి పునరావృతమయితే విధుల నుంచి తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది. దీంతో కొందరు కార్మిక నేతలు యాజమాన్యం వైఖరిని తప్పుపడుతూ ఆయా డిపోల్లో ఆందోళనలకు దిగుతున్నారు. వెరసి కార్మిక నేతలు, అధికారులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. జిల్లా సర్వీసులకు తీవ్ర విఘాతం హైదరాబాద్‌లోని కొన్ని డిపోల పరిధిలో జిల్లా సర్వీసులు కూడా ఉన్నాయి. వీటిల్లో దూరప్రాంతాలకు వెళ్లేందుకు గరుడ బస్సులున్నాయి. ఈ ప్రీమియం కేటగిరీ బస్సులను ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లు తప్ప సాధారణ డ్రైవర్లు నడపలేరు. ఇలాంటి డ్రైవర్లు పరిమితంగా ఉంటారు. తరచూ గరుడ బస్సు సర్వీసు బయలుదేరే వేళ వరకు కూడా సదరు డ్రైవర్ విధులకు రావడంలేదు. దీంతో అప్పటికప్పుడు మరో డిపో నుంచి డ్రైవర్‌ను పిలిపించటం లాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ లోపు సమయం మించిపోయి ప్రయాణికులు ఆందోళన చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా కొన్ని దూరప్రాంత సర్వీసులు తరచూ ఆలస్యంగా నడపాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో రద్దు చేయాల్సి వస్తోంది. ప్రతి నెలా 16వ తేదీన మస్టర్స్ సిద్ధం చేసే సమయంలో కొందరు కార్మిక సంఘాల నేతలు రంగ ప్రవేశం చేసి, ముందస్తు అనుమతి లేకుండా విధులను ఎగ్గొట్టిన సిబ్బందికి మూడు రోజుల సెలవు నిబంధన వర్తింపజేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇలా ఒక్కో డిపోలో వంద వరకు సెలవుల పంచాయితీ నెలకొంటోంది. తాజాగా ఆదివారం ఓ డిపోలో 66 మంది విధులకు డుమ్మా కొట్టారు. అయితే, ఆరోజు అసెంబ్లీలో ముస్లిం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంతో కొన్ని రాజకీయపార్టీలు ఆందోళనకు దిగాయి. దీంతో అధికారులు సిటీలో ఏసీ బస్సులను నిలిపివేశారు. డుమ్మా కొట్టినవారి స్థానాల్లో ఇక్కడి డ్రైవర్లు, కండక్టర్లను ఆ రోజు విధుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. గత రెండు, మూడురోజులుగా డుమ్మా కొట్టిన పలువురు సిబ్బందిని డిస్మిస్ చేశారు. ఇప్పుడీ వ్యవహారం మరోసారి ఆర్టీసీలో వివాదానికి కారణమవుతోంది. -
ఆర్టీసీ కార్మికుల బీమా మొత్తం పెంపు
రూ. 3.60 లక్షల నుంచి రూ. 6 లక్షలకు.. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చనిపోతే చెల్లించే బీమా మొత్తాన్ని పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం సర్క్యులర్ జారీ చేసింది. ఈపీఎఫ్ బోర్డు ట్రస్టీలు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు యాజమాన్యం అంగీకరించటం విశేషం. ప్రస్తుతం విధి నిర్వహణలో ఉన్న కార్మికులు చనిపోతే బీమాగా రూ. 3.60 లక్షలు చెల్లిస్తున్నారు. దీన్ని రూ. 6 లక్షలకు పెంచుతూ గతేడాది మేలో కేంద్ర బోర్డు నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటివరకు టీఎస్ఆర్టీసీ దాన్ని అమలు చేయలేదు. తాజా గా గత మే 24 నుంచి వర్తించేలా దాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అంటే.. గత మే 24 తర్వాత చనిపోయిన వారికి ఆ మొత్తం అందాల్సి ఉంటుంది. ఇప్పటికే పాత పద్ధతిలో చెల్లింపులు జరిగి ఉంటే.. మిగతా మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగానైనా దీన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం పట్ల ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ కార్మికులు రోడ్డుపాలు
అన్‌సీజన్ పేరుతో 59 మంది తొలగింపు యాజమాన్యతీరుపై కార్మిక సంఘాల ఆగ్రహం అనంతపురం న్యూసిటీ: అన్‌సీజన్ పేరుతో ఆర్టీసీ యాజమాన్యం రీజియన్ వ్యాప్తంగా 59 మంది కార్మికులను రోడ్డుపాలు చేసింది. శనివారం నుంచి విధులకు హాజరుకావాల్సిన పనిలేదని తేల్చి చెప్పింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఉన్నఫలంగా విధుల నుంచి తొలగిస్తే తమ బాధ ఎవరితో చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీజియన్‌లోని రెగ్యులర్‌గా తిరిగే 42 బస్సులను రద్దు చేసిన కారణంగా కార్మికులు వీధిన పడాల్సి వచ్చిందని కార్మిక సంఘాలంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కాంట్రాక్టు పద్ధతిన ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రీజియన్‌లో 109 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాదిన్నర గడిచిన తర్వాత 106 మంది విధుల్లో చేరారు. సమ్మె కాలంలోనూ విధులకు హాజరయ్యారని 28 మందిని ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఇక మిగితా వారిని కాంట్రాక్టు పద్ధతినే కొనసాగించింది. 42 సర్వీసుల రద్దు... రద్దీగా ఉండే బెంగళూరు, బళ్లారి, హిందూపురం, ధర్మవరం, పెనుకొండ, కళ్యాణదుర్గంలాంటి ప్రాంతాలకు సంబంధించి 42 బస్సు సర్వీసులను అధికారులు ఆపేశారు. ఈ కారణం చూపి యాజమాన్యం కాంట్రాక్టు సిబ్బందిని పక్కన పెట్టింది. అసలే ప్రైవేట్ వాహనాలతో ప్రజలకు భద్రత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఉన్న బస్సులను తొలగించి ప్రైవేట్ రవాణాకు ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ్మెలో పని చేసినా తొలగించారు : మల్లికార్జున డ్రైవర్, అనంతపురం సమ్మె కాలంలో పనిచేసిన తనను రెగ్యులర్ చేయలేదు. ఇప్పుడేమో విధులకు రావద్దని చెబుతున్నారు. 240 రోజులు విధుల్లో పని చేస్తే రెగ్యులర్ చేయాలి. ఆ నిబంధనను పాటించలేదు. మా పరిస్థితేమిటి? ప్రభుత్వం ఆదుకోవాలి. సరైన పద్ధతి కాదు : కొండయ్య, ఈయూ నాయకుడు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అన్‌సీజన్ పేరుతో కార్మికులను తొలగించడం సరైన పద్ధతి కాదు. ఒక్కసారిగా 59 మందిని తొలగిస్తే వారెక్కడికి వెళ్లాలి. ప్రభుత్వం తక్షణం వారిని విధుల్లోకి తీసుకోవాలి. కార్మికులతో ఆడుకోవద్దు.. : సుందర్రాజు, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ ప్రభుత్వం, యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు ఉద్యోగభద్రత లేకుండా పోయింది. కార్మికులతో ఆడుకోవద్దు. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. -
పట్టు వీడం..
ప్రధాన డిమాండ్లు ⇒35 శాతం వేతన పెంపు ⇒ఒక విభాగం నుంచి మరో విభాగానికి సిబ్బందిని బదిలీ చేయడానికి వీలుగా నూతన పాలసీ రూపకల్పన ⇒ఎనిమిది గంటల పని ⇒ఆరునెలల శిక్షణ కాలం తర్వాత కచ్చితంగా ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. ⇒శిక్షణ కాలంలో రూ.18 వేల గౌరవవేతనం ⇒విశ్రాంత రవాణాశాఖ ఉద్యోగులకు కనిష్టంగా రూ.10 వేల పింఛన్, రూ.10 లక్షల వరకూ జీవితబీమా పాలసీ ⇒ఉన్నతాధికారుల తనిఖీల్లో టికెట్టు లేని ప్రయాణికులు పట్టుబడినప్పుడు కండక్టర్‌పై చర్యలు తీసుకోకూడదు. బెంగళూరు : అటు కార్మిక సంఘాల్లోను ప్రభుత్వంలోను పట్టువిడుపులు లేకపోవడంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. తొలిరోజు కేఎస్ ఆర్టీసీ సమ్మె పూర్తిగా విజయవంతమైంది. తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందే నంటూ కార్మికులు పట్టుబట్టగా ముందు సమ్మె విరమించండి ఆ తరువాత డిమాండ్ల గురించి ఆలోచిస్తాం అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి చెప్పడంతో ఆర్టీసీ కార్మికులు స్పందించలేదు. 35 శాతం వేతన పెంపు అసాధ్యమంటూ సోమవారం మంత్రి రామలింగారెడ్డి మీడియాతో అన్నారు. ఇదిలా ఉంటే ఆదివారం అర్ధరాత్రి నుంచి కేఎస్ ఆర్టీసీ సిబ్బంది సమ్మెలోకి వెళ్లిపోవడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో లక్షల మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు ప్రైవేట్ రవాణా సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నారు. వేతన సవరణతో ఇతర డిమాండ్లు పరిష్కరించాలని 1.25 లక్షల మంది సిబ్బంది ఒక్కసారిగా సమ్మె చేస్తుండటంతో 23 వేల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో సగటున రోజు ప్రభుత్వానికి రూ. 21 కోట్ల ఆదాయం గండిపడింది. ఇదిలా ఉండగా సమ్మె సందర్భంగా కొంతమంది దినసరి వేతనంపై కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో కొన్ని చోట్ల బస్సులను నడపడానికి ప్రయత్నించగా ఆందోళకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో పదిమందికి గాయాలు కాగా 142 బస్సులు ధ్వంసమయ్యాయి. ఒక్కరోజే రూ. 12 లక్షల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రైవేటు దోపిడీ : రెండు రోజుల పాటు ప్రైవేట్ రవాణాకు అనుమతి ఇవ్వడంతో వారు అందినకాడికి దోచుకున్నారు. వివిధ ఉపాధి, ఉద్యోగ నిమిత్తం పల్లెల నుంచి బెంగళూరు, మైసూరు, మంగళూరు వంటి నగరాలకు వచ్చేవారు ప్రైవేట్ బస్సులపైకి ఎక్కి గమ్యస్థానాలకు చేరుకోవడం కనిపించింది. ఇక వివిధ పట్టణాల్లో ఆస్పత్రులకు వచ్చే వారి పరిస్థితి వర్ణనాతీతం. సమ్మె విషయం తెలిసిన కొంతమంది రోగులు వారి సహాయకులతో ఆదివారం రాత్రికే ఆయా నగరాల బస్టాండ్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి వెళ్లేందుకు రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లకు రెట్టింపు చార్జీలు చెల్లించి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు బెంగళూరు శివారులోని అత్తిబెలె నుంచి ఫోరంమాల్ వరకూ సాధారణ రోజుల్లో రూ.35 వసూలు చేసే ప్రైవేటు బస్సులు సోమవారం ఒక్కొక్కరి నుంచి రూ.87 వసూలు చేసింది. ఇక ఆటోవాలాలు ఇదే అదనుగా తీసుకుని రూ. 200 నుంచి 800 వరకు వసూలు చేశారు. ఇక సమ్మె నేపథ్యంలో మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మెట్రోకు పెరిగిన డిమాండ్... సమ్మెలో భాగంగా బెంగళూరులో బీఎంటీసీ సేవలు కూడా నిలిచిపోవడంతో ‘మెట్రో’కు డిమాండ్ పెరిగింది. తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి మెట్రోరైలును ఆశ్రయించే ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బీఎంఆర్సీఎల్ అధికారులు ప్రతి ఆరు నిమిషాలకు ఒక మెట్రో రైలును ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ఉన్న మెట్రో సేవలను మరో గంట పాటు పెంచుతూ 11 గంటల వరకూ అందబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. అదనపు సర్వీసుల ఆలోచనలో... బెంగళూరులోని ‘శాంతలా సిల్క్స్’ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ సంస్థలు బస్సు సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. సమ్మె ప్రభావం తమ సేవలపై కొంత మేర ప్రభావం చూపుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శాంతలా శిల్క్స్ చేరుకోవడానికి బీఎంటీసీ బస్సులు లేకపోవడంతో కొంతమంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు మరోరెండురోజుల పాటు ఇక్కడి పరిస్థితులను చూసి ఏపీఎస్ ఆర్టీసీ అదనపు సర్వీసులను నడిపే ఆలోచనలో ఉంది. సాధారణంగా ప్రయాణాలను ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ వాయిదా వేసుకోలేరని అందువల్ల మరో రెండు రోజుల తర్వాత సాధారణం కంటే ఎక్కువగానే ప్రయాణికులు వస్తారని ఇక్కడి అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నారు. అదే గనుక జరిగితే అదనపు సర్వీసులను కూడా నడిపే ఆలోచన ఉందని ఏపీఎస్ఆర్టీసీ బెంగళూరు విభాగం ఏటీఎం రవీంద్ర తెలిపారు. కార్మికులతో చర్చలు జరపాలి : మాజీ సీఎం కుమార మైసూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కార్మికులకు వేతనాలు పెంచితే సంస్థ నష్టాలపాలవుతుందని చెబుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందు సంస్థలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేతనాలు పెంచాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా పెడచెవిన పెట్టడంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారని పేర్కొన్నారు. ఇంధన ధరలు తగ్గినపుడు టికెట్ ధరలను తగ్గించ కుండా అటు ప్రజల్లోనూ, వేతనాలు పెంచకుండా ఇటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. -
ఈ నెల 23 నుంచి ఆర్టీసీ సిబ్బంది సమ్మె
కార్మికుల హక్కుల పరిరక్షణకోసం ఈ నెల 23న మొదటి డ్యూటీ నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం అవుతుందని తెలంగాణ ఆరీ్టిసీ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. గురువారం ఆజామాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి, ఎన్ఎంయూ చైర్మన్ కమాల్ రెడ్డి, ఎస్డబ్ల్యుఎఫ్ కార్యదర్శి వి.ఎస్.రావు తదితరులు మాట్లాడారు. తమ సమస్యల పరిస్కారానికి ఆర్టీసీలోని 7 యూనియన్లుతో కూడిన జేఏసీ గత నెల 16న యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చినా ఎటువంటి స్పందన లేదని తెలిపారు. వేతన సవరణ సందర్భంగా పెరిగిన జీతాల ఖర్చు నెలకు రూ.75 కోట్లు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి తన హామీని తుంగలో తొక్కారన్నారు. వేతన సవరణ బకాయిలను రెండో విడత ఇంత వరకు చెల్లించలేదని, 50 శాతం ఏరియర్స్, బాండ్స్ నేటికి విడుదల కాలేదని చెప్పారు..రెండేళ్లు గడిచినా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల ఒప్పందాలు ఇంత వరకు అమలు కాలేదని విమర్శించారు. దీనికి నిరసనగా 7 సంఘాలతో కలిసి సమ్మె చేస్తున్నామని వారు చెప్పారు. -
ఆర్టీసీ కార్మికుల డీఏ పెంపుపై ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మే నెలకు సంబంధించి 3.4 శాతం కరువు భత్యం(డీఏ) పెంచుతూ సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 21.5 శాతంగా ఉన్న కరువు భత్యాన్ని 24.9 శాతానికి పెంచుతూ గత సంవత్సరం నిర్ణయం తీసుకుంది. అయితే నిధుల కొరత వల్ల ఇప్పటి వరకు అమలు చేయలేదు. ప్రస్తుత నెలకు సంబంధించి దాన్ని కార్మికులకు అందజేయాలని నిర్ణయించి బుధవారం ఉత్తర్వు జారీచేసింది. అయితే గత సంవత్సరం జూలై నుంచి నవంబర్ వరకు ఐదు నెలలు, పెరిగిన కరువు భత్యానికి సంబంధించి ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్న బకాయిలు ఇవ్వకుండా ఒక్కనెల కరువు భత్యం ఇవ్వడం సరికాదని, వెంటనే బకాయిలు మొత్తం విడుదల చేయాలని కార్మిక సంఘం నేతలు ఆర్టీసీ జేఎండీకి విజ్ఞప్తి చేశారు. డీఏ బకాయిలతో పాటు వేతన సవరణ బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు కూడా విడుదల చేయాలని కోరారు. -
ఆర్టీసీ కార్మికులకు 3.4 శాతం డీఏ అమలు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు 3.4 శాతం డీఏ అమలు కానుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు డీఏ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంపై తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి టీఎమ్‌యూ నేత థామస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆర్టీసీ కార్మికులపై అదనపు వడ్డీ భారం
1 శాతం అదనపు వడ్డీ వసూలుకు సర్క్యులర్ 289 జారీ కదిరి: ఆర్టీసీ కార్మికులు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) ద్వారా తీసుకున్న రుణాలపై ఒక శాతం అదనపు వడ్డీ వసూలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు గతనెల 23న సర్క్యులర్ నంబర్ 289ను విడుదల చేసింది. ఇప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సీసీఎస్ ద్వారా పొదుపు చేసుకున్న మొత్తానికి పది శాతం వడ్డీ ఇచ్చేవారు. అదేవిధంగా సీసీఎస్ ద్వారా పొందిన స్వల్పకాలిక, విద్యా, గృహ రుణాలపై 11 శాతం వడ్డీ వసూలు చేసేవారు. తాజా సర్క్యులర్ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 1 శాతం అంటే ఇకపై 12 శాతం వడ్డీ వసూలు చేయనున్నారు. సుమారు రూ.32 లక్షలకుపైగా అదనపు భారం కార్మికులపై పడనుంది. -
ఆర్టీసీ కార్మికులపై కక్ష సాధింపు సరికాదు
► టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ► ఆర్ఎం తీరుపై మండిపాటు ► జిల్లాకేంద్రంలో నిరాహార దీక్ష ► తరలివచ్చిన కార్మికులు మహబూబ్‌నగర్ క్రైం: ఆర్టీసీ కార్మికులపై ఆర్ఎం కక్షసాధింపు సరికాదని టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. కార్మికులు, సిబ్బంది యాజమాన్యం ఇంట్లో పనిచేసే పని మనుషులు కాదనే విషయం గుర్తించుకోవాలని హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఆయన మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నెలరోజుల్లో 20మంది కార్మికులను సస్పెండ్ చేశారని, వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. జిల్లాలో కార్మికులతో 12నుంచి 14గంటల పాటు బలవంతపు విధులు నిర్వహింపజేస్తున్నారని, వాటిని మానుకోవాలని సూచించారు. డాక్టర్ ఇచ్చి సిక్ లీవ్‌లకు అనుగుణంగా సెలవులు మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. 26 సమస్యలతో ఎజెండా ఇస్తే నేటికీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని జిల్లాల్లో కారుణ్య నియామకాలు జరిగినా ఇక్కడ మాత్రం జరగలేదన్నారు. సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతకుమందు స్థానిక బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజసింహుడు, డీఎస్ చారి, కొండన్న, రవీందర్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, టీఎస్‌ఎస్‌రెడ్డి, విజయ్‌బాబు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు కరవు భత్యం
సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన 3.4 శాతం కరువు భత్యం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. మే నెల జీతంతో కలిపి చెల్లిం చేందుకు మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ సాంబశివరావును ఎన్ఎంయూ నేతలు మంగళవారం కలసి కార్మికుల సమస్యలపై చర్చించారు. -
కార్మికులు నాయకత్వాన్ని నేర్పారు
► జీవిత కాలం ఆర్టీసీ కార్మికులకు రుణపడి ఉంటా ► ప్రజల మధ్య ఎలా ఉండాలో నేర్చుకున్నాను ► మేయర్, టీఎంయూ గౌరవాధ్యక్షుడు నరేందర్ హన్మకొండ : ఆర్టీసీ కార్మికులు తనకు నాయకత్వాన్ని నేర్పారని వరంగల్ మేయర్, టీఎంయూ వరంగల్ రీజియన్ గౌరవాధ్యక్షుడు నన్నపునేని నరేం దర్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని జిల్లా బస్‌స్టేషన్‌లో టీఎంయూ ఆధ్వర్యంలో మేయర్ నన్నపునేని నరేందర్ సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు అండదండలతో టీఎంయూ రీజియన్ గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానన్నారు. గౌరవాధ్యక్షుడిని కావడం వలన ప్రజల మధ్యఎలా ఉండాలో నేర్చుకున్నాని చెప్పారు. తాను కార్పొరేటర్‌గా గెలిచేందుకు ఆర్టీసీ కార్మికులు ఎంతగానో శ్రమించారని తెలిపారు. అందుకే జీవిత కాలం ఆర్టీసీ కార్మికులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. వరంగల్ రీజియన్‌లో టి. మజ్దూర్ యూనియన్ బలంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ టీఎంయూకు వెన్నుదన్నుగా ఉన్నారన్నా రు. పేదింటి బిడ్డను గుర్తించి తనను సీఎం కేసీఆర్ మేయర్‌ను చేశారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీఎంయూ పై ప్రత్యర్థులు కావాలని దుష్ర్పచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. వచ్చే గుర్తింపు ఎన్నికలు ఏకపక్షంగా జ రుగుతాయని, వరంగల్ రీజియన్‌లోని అన్ని డి పోల్‌లో టీఎంయూ గుర్తింపును పొందుతుందనే ధీమా వ్యక్తం చేశారు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథామరెడ్డి మాట్లాడుతూ టీఎం యూకు పెద్ద దిక్కుగా నిలిచి నిస్వార్థంగా సేవ చేసినందునే మేయర్‌గా అవకాశం వచ్చిందన్నారు. ప్రజలకు చక్కని పాలన అందించి ప్రజ ల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు థామస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంప్లాయూస్ యూనియన్ మొత్తం తుడుచుకు పెట్టుకుపోయిందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్, ప్రముఖ మెజీషియన్ జూలకుంట్ల శ్రీనివాస్‌రెడ్డిని టీఎంయూ సన్మానించింది. ఈ సందర్భంగా ఎన్ఎంయు, ఈయూ నుంచి కార్మికులు టీఎంయూలో చేరా రు. సభలో టీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, కె.వాసుదేవరెడ్డి, టీఎంయూ నాయకులు వి.ఎస్.రెడ్డి, పిఆర్ రెడ్డి, పి.లక్ష్మయ్య, ఎం.ఎన్.రావు, ఈఎస్ బాబు,తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు శుభవార్త
- పెండింగ్ బకాయిల చెల్లింపునకు యాజమాన్యం అంగీకారం సాక్షి, హైదరాబాద్: . దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్ఎంయూ నేతలు బుధవారం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావును కలసి చర్చించారు. దీంతో బకాయిలను ఏప్రిల్ 5లోగా చెల్లించేందుకు ఎండీ హామీనిచ్చారు. వేతన బకాయిలు(2013 నుంచి) ఒక నెల అరియర్స్, 2015లో జులై, ఆగస్టు, సెప్టెంబరుకు సంబంధించి డీఏ అరియర్స్‌ను వచ్చే నెల 5లోగా చెల్లించడానికి ఎండీ అంగీకరించినట్లు ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య, వర్కింగ్ అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి తెలిపారు. 2013 నుంచి పదవీ విరమణ చేసిన సిబ్బందికి రావాల్సిన వేతన బకాయిల్లో 50 శాతం ఏప్రిల్‌లో మంజూరు చేస్తామని చెప్పారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు ప్రత్యేక సెలవు, 2012కు ఇవ్వాల్సినలీవ్ ఎన్క్యాష్మెంటు ఈ ఏడాది మేలో ఇస్తామని ఎండీ తెలిపారని చెప్పారు. తిరుపతి, వైజాగ్, నెల్లూరు, కర్నూలులో స్టాఫ్ రెస్ట్ రూంలను ఏసీతో ఆధునికీకరించేందుకు, 126 డిపోల్లో ఆర్వో ప్లాంట్ల ద్వారా వాటర్ కూలర్స్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారని ఎన్ఎంయూ నేతలు తెలిపారు. అద్దె బస్సుల్లో డ్రైవర్లకు టిమ్స్ మిషన్లు ఇచ్చే విధానాన్ని విరమిస్తామని ఎండీ సాంబశివరావు అంగీకరించారని చెప్పారు. -
దూసుకుపోయిన ‘బస్సు’
విజయనగరం అర్బన్: ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో రీజియన్ కమిటీని ఎంప్లాయీస్ యూనియన్ కైవసం చేసుకుంది. నార్త్ ఈస్ట్ కోస్ట్ (నెక్) రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో ఏడు చోట్ల సమీప నేషనల్ మజ్దూర్ (ఎన్ఎంయూ) కంటే ఓట్లు అధికంగా తెచ్చుకొని విజయఢంకా మోగించింది. వరుసగా మూడోసారి నెక్ రీజియన్‌లో విజయం సాధించి పాగావేసింది. తొమ్మిది డిపోలలో విజయనగరం, పార్వతీపురం, సాలూరు, ఎస్‌కోట, పాలకొండ, టెక్కలి, పలాస డిపోలలో ఎంప్లాయీస్ యూనియన్‌కి, శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2 డిపోల్లో ఎన్‌ఎంయూకి అధిక ఓట్లు లభించాయి. దీంతో నెక్ రీజియన్‌లో గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించింది. ఈ మేరకు ఓట్ల వివరాలు కార్మిక శాఖ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విజయనగరం డిపో పరిధిలో ఎంప్లాయీస్ యూనియన్‌కు 306, 309, ఎన్ఎంయూకు 205, 205, కార్మిక పరిషత్‌కు 41, 39, ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు 12, 20, వైఎస్ఆర్సీఎంయూకు 1, 0, కార్మికసంఘ్‌కు 1, 1 పోలయ్యాయి. చెల్లనివి 1, 1. సాలూరు డిపో పరిధిలో 364 ఓట్లకు నూరు శాతం ఓట్లు పోలయ్యాయి. వీటిలో 181 ఓట్లు ఎంప్లాయీస్ సొంతం చేసుకోగా, నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 157, కార్మిక పరిషత్‌కు 19, వైఎస్సార్ అనుబంధ సం ఘానికి 4, ఎస్డబ్ల్యూకు 1 ఓటు వచ్చాయి. పార్వతీపురం డిపో పరిధిలో 454 మొత్తం ఓట్లకు 448 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రెండు ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు, నాలుగు అన్ఫోల్డ్ ఓట్లు ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్ (బస్సు గుర్తు)కు 275, 278, ఎన్ఎంయూ (కాగడ గుర్తు)కు 123, 128, వైఎస్ఆర్ సీపీ బలపరిచిన (టేబుల్ ఫ్యాన్‌గుర్తు)కు 34, 30 ఓట్లువచ్చాయి. టీడీపీ బలపరచిన కార్మిక పరిషత్‌కు (టైరు గుర్తు)కు 6, 7, ప్రజాసంఘాలు బలపరిచిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు (నక్షత్రం గుర్తు)కు 5, 3, యు వర్కర్‌కు 1, 0 ఓట్లు రాగా, 4, 2 ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎస్.కోట ఆర్టీసీ డిపోలో మొత్తం 293 ఓట్లు పోలవ్వగా ఎంప్లాయీస్ యూనియన్‌కు 256, నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 28, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్‌కు 4, కార్మిక పరిషత్‌కు 3, కార్మికసంఘ్‌కు 1 మొత్తం 292 ఓట్లు రాగా ఒక ఓటు చెల్లలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన కొత్తవలస సహాయ కార్మిక అధికారిణి టి.సుజాత గురువారం సాయంత్రం వెల్లడించారు. -
ఇళ్ల స్థలాల పేరుతో భారీ స్కామ్
పీలేరు: చిత్తూరు జిల్లాలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇళ్ల స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేసి, ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంతో పీలేరులో ఆర్టీసీ కార్మికులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఆర్టీసీ డిపో పక్కనే ఉన్న హౌసింగ్ సొసైటీ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు 480 మంది కార్మికుల నుంచి రూ.2 కోట్ల మేర వసూళ్లు చేసినట్టు ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. రెండేళ్లయినా ఇంతవరకూ ఇంటి స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిటీలోని సీఐ రామచంద్రంనాయుడుతోపాటు మిగిలిన వారు వేధింపులకు పాల్పడుతున్నారని బాధితులు చెప్పుతున్నారు. -
'ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విస్మరిస్తోంది'
కర్నూలు: ఆర్టీసీ కార్మికులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆర్టీసీ మాజ్దార్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్మికుల సమస్యల కోసం 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఎన్నికల్లో 126 స్థానాల నుంచి వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుందని రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. -
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో మెరుపు సమ్మె
ఆదిలాబాద్ జిలా మంచిర్యాల ఆర్టీసీ డిపోలో కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. కార్మికులపై పని భారం పెంచడాన్ని నిరసిస్తూ డ్రైవర్లు, కండక్టర్లు ఆకస్మికంగా మంగళవారం తెల్లవారుజాము నుంచివిధులు బహిష్కరించారు. దీంతో డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదల్లేదు. ఈ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు రోజూ 300 బస్సులు వెళుతుంటాయి. -
దసరా అడ్వాన్స్ కోసం ఆర్టీసీ కార్మికుల ధర్నా
కర్నూలు (రాజ్‌విహార్) : దసరా అడ్వాన్స్‌లను ఇవ్వాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ... పండుగ ముందే దసరా అడ్వాన్స్‌లను ఇవ్వాలని అలాగే, వేతన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. -
సార్వత్రిక సమ్మె సక్సెస్
పరిగి : కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలని టీఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హ న్మంతు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మాధవరం వెంకటయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పీర్ మహ్మద్ తదితరులు పేర్కొన్నారు. ఆయా పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పరిగిలో చేపట్టిన సార్వత్రిక సమ్మె అందరి భాగస్వామ్యంతో విజయవంతం అ యింది. ఇందులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా లు, వీఆర్ఏలు, ఏఎన్ఎంలు, ఆర్వీఎం కాం ట్రాక్టు ఉద్యోగులు, ఆశ వర్కర్లు సమ్మెలో పాల్గొని పరిగిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు మూసివేయించారు. సీపీఐ ఆధ్వర్యంలో బస్‌స్టాండు ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛం దంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బస్సులన్నీ డిపోకే పరిమిత మయ్యాయి. సమ్మెలో భాగంగా డిపో ఎదుట టీఎం యూ, టీఎన్‌ఎంయూ, ఎంప్లాయిస్ తదితర యూనియన్ల ఆర్టీసీ కార్మికులు బస్ డిపో ముం దు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆచా సంఘాలు, యూనియన్ల నాయకులు శ్రీశైలం, వెంకట్, ప్రశాంత్, రాజశేఖర్,రవి, వెంకట్రాములు, మల్లేశం, బాలు, నిరంజన్, ఎస్జేఎం రెడ్డి, శ్రీనివాస్, మంజుల, సక్కుబాయి, స్వరూప, పద్మ పాల్గొన్నారు. -
సమ్మె...సక్సెస్
నల్లగొండ : కార్మిక సంఘాల ఆధ్వర్యం లో తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమ్మె ప్రశాంతంగా ముగి సింది. కార్మిక సంఘాలకు మద్దతుగా వివిధ రాజకీయ పక్షాలు తమ సంఘీభావాన్ని తెలిపాయి. సమ్మెలో కేంద్ర ప్రభు త్వ ఉద్యోగులు, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మికులు, ట్రేడ్ యూనియన్లు, ఆటో వర్కర్లు, హమాలీ, భవన నిర్మాణ రంగ కార్మికులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. సమ్మెకు మద్దతుగా బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. కార్మికులకు సమ్మెకు మద్దతుగా సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లా వ్యాప్తం గా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలు, ఆటోలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు నిలిపేశారు. జిల్లా కేంద్రంలో భోజన విరామసమయంలో రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి సమ్మెకు మద్దతు తెలిపాయి. స్థానిక గడియారం సెంటర్ వద్ద కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. భువనగిరి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఆగిపోయా యి. అన్ని మండలాల్లో వివిధ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాలు కలిసి బైక్ ర్యాలీలు నిర్వహించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. మిర్యాలగూడలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాజీవ్ చౌక్ వద్ద సభ నిర్వహించారు. వేములపల్లిలో సీఐటీ యూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా....దామరచర్లలో అద్దంకి - నార్కట్‌పల్లి రహదారిపై కార్మికులు మానవహారం నిర్వహించారు. కోదాడ లో కార్మిక సంఘాలు, అనుబంధ సం ఘాలు కలిసి పట్టణంలో బైక్ ర్యాలీలు నిర్వహించాయి. ఆర్టీసీ బస్టాండ్, రంగా థియేటర్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. నకిరేకల్‌లో సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యం లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఆటోలతో ర్యాలీతో నిరసన తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీ లు నిర్వహించారు. చౌటుప్పల్‌లో సీఐటీ యూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో వ్యాపార సంస్థలను బంద్ చేశారు. సంస్థాన్ నారాయణపురంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మునుగోడులో ర్యాలీ తీశారు. చండూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆలేరు ఆత్మకూరు (ఎం), బొమ్మలరామారం, రాజాపేట, గుండా ల, తుర్కపల్లి మండలాల్లో కార్మిక సం ఘాలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిం చారు. హుజూర్‌నగర్‌లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, టీఆర్ఎస్కేవీ, వైఎస్సార్సీపీటీ యూ, కార్మిక సంఘాలు, అనుబంధ సం ఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచ ర్ల, మేళ్లచెర్వులో ప్రధాన రహదారులపై ర్యాలీలు నిర్వహించారు. తిరుమలగిరి, మోత్కూరు, నూతనకల్, తుంగతుర్తి, శాలిగౌరారం, అర్వపల్లి మండల కేం ద్రాల్లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి రాస్తారోకో చేశారు. దేవరకొండలో కార్మి క సంఘాలు తలపెట్టిన సమ్మెలో ఎమ్మె ల్యే రవీంద్రకుమార్ పాల్గొన్నారు. -
తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందాం
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ: ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని బలపరచాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండలో జరిగిన ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయోత్సవ సభలో కడియం శ్రీహరి మాట్లాడారు. కార్మికులు ఊహించని విధంగా సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని చెప్పారు. ఇది కేసీఆర్ అందించిన తెలంగాణ కానుక అని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఆర్టీసీ కార్మికులు భాగస్వాములు కావాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందామన్నారు. తెలంగాణను అడ్డుకొన్న శక్తులే.. ఏర్పాటైన రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు జేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. పాలమూరు బంద్‌కు టీఎంయూ మద్దతు.. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడాన్ని నిరసిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 10వ తేదీన చేపట్టనున్న బంద్‌కు ఆర్టీసీ టీఎంయూ సంపూర్ణ మద్దతు ఇస్తోందని టీంఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి చెప్పారు. బంద్‌లో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటారన్నారు. టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డికి.. టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను, టీఎంయూను విమర్శించే హక్కు లేదన్నారు. రాజిరెడ్డీ నువ్వెంత, నీ సెజైంత? నీ దమ్మెంత.. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి నీది కాదు.. అని మండిపడ్డారు. -
చార్జీల పెంపునకు సిద్ధం..!
టికెట్ ధరల సవరణపై యాజమాన్యం దృష్టి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు అడిగిన దానికంటే ఒక శాతం ఎక్కువగా ఫిట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. ఇక బస్సు చార్జీల పెంపుపై దృష్టి సారించనుంది. ఫిట్మెంట్ భారాన్ని అధిగమించే యత్నాల్లో చార్జీల పెంపు కూడా ఒకటని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. అయితే ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా చూస్తామని పేర్కొన్నారు. కానీ, డీజిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో ఆర్టీసీపై రూ.75 కోట్ల అదనపు భారం పడింది. ఇప్పటికే నష్టంతో కుంగిపోతున్న ఆర్టీసీ ఈ భారం మోయలేమని స్పష్టం చేస్తోంది. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసిన వెంటనే దాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక భారం నుంచి కొంతైనా తప్పించుకోవాలని చూస్తోంది. కార్మికులకు ఫిట్మెంట్ ఇచ్చిన వెంటనే టికెట్ ధరలు పెంచితే.. ఆ భారాన్ని నేరుగా ప్రజలపై మోపిన భావన వస్తుందనే ఉద్దేశంతో చార్జీల పెంపును వెంటనే అమలు చేయొద్దని భావించింది. కానీ, డీజిల్ ధరలు పెరగడంతో ఇక టికెట్ ధరల పెంపు అనివార్యంగా మారింది. కార్మికులకు ఫిట్మెంట్ ప్రకటిస్తే 15 శాతం మేర టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతించాలని ఆర్టీసీ గత నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అది ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దానికి వెంటనే పచ్చజెండా ఊపాలని ఇప్పుడు ఆర్టీసీ కోరబోతోంది. దీనికి సంబంధించి మరో రెండుమూడు రోజుల్లో కొత్త ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించే సమయంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీకి పలు వరాలు ప్రకటించారు. అందులో కొన్ని మినహా మిగతా వేటిపై స్పష్టత లేదు. ముఖ్యంగా.. 44 శాతం ఫిట్మెంట్ ప్రకటనతో పడే రూ.850 కోట్ల భారాన్ని ప్రభుత్వం నేరుగా భరిస్తుందా, ఆర్టీసీకి కొంతమేర గ్రాంట్ల ద్వారా సర్దుబాటు చేస్తుందా అన్న విషయంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఇక ఆర్టీసీకి తీవ్ర భారంగా మారిన రూ.1,900 కోట్ల అప్పుల విషయంలోనూ అలాంటి గందరగోళమే నెలకొంది. అప్పులకు సంబంధించి ఆర్టీసీ రూ.186 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీ భారం నుంచి బయటపడాలంటే ముందుగా అప్పులు లేకుండా చేయాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. కానీ, ఆ అప్పులను ఎవరు తీర్చాలనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆర్టీసీకి జరుపుతామన్న కేటాయింపులు ఎంత అనేదీ స్పష్టం కాలేదు. జూన్ నెల నుంచి ఫిట్‌మెంట్‌ను చెల్లించాల్సిన నేపథ్యంలో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ, ముఖ్యమంత్రి హామీల్లో స్పష్టత వస్తేగానీ ఈ లెక్కలు తేలవు. దీంతో ఆర్టీసీ అధికారులు రవాణాశాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ రెండుచోట్ల కూడా స్పష్టత లేకపోవడంతో ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదించి చెప్తామనే సమాధానం వచ్చినట్టు తెలిసింది. -
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌లాల్ అచ్చంపేట రూరల్ : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు 44శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ఆర్టీసీ టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. మోహన్‌లాల్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే బాలరాజును ఆర్టీసీ కార్మికులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికులకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ఇతర ప్రభుత్వాలు కార్మికులతో వెట్టిచాకిరీ చేయించాయన్నారు. 44శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపిన మంత్రి హరీష్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మరోసారి నిరూపించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారన్నారు. అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంయూ డిపో సెక్రటరీ దాసపత్రి వెంకటేష్, నాయకులు చంద్రయ్య, వీసీమౌళి, ఎ.జంగిరెడ్డి, కరీం, ఎంజీనాయక్, టీఆర్ఎస్ నాయకులు నర్సింహగౌడ్, సీఎం రెడ్డి, కటకం రఘురాం, అంతటి శివ, రహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీదు రూ. 200 కోట్లు
యాదమరి: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి నందుకు రూ.200 కోట్లు నష్టం వచ్చిందని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఆరోపించారు. ఆయన గురువారం విలేకరితో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ 43 శాతం ఇవ్వాలని ముందే అడిగారనీ,ఇవ్వకపోతే సమ్మె చేస్తామని హెచ్చరికలు చేసినా ప్రభుత్వం వీరి సమస్యలు పట్టించుకోకుండా పోవడంతో వారు ఎనిమిది రోజులుగా సమ్మె చేశారు. ప్రయాణికుల సమస్యలను చూడలేక వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ మేరకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందన్నారు. సమ్మె కాలంలో వాటిల్లిన దాదాపు రూ.200 కోట్ల నష్టం ప్రభుత్వం భరించాలని పేర్కొన్నారు. నేడు సప్లై ఛానల్ పరిశీలన మండలంలోని నేరేనగర్ ముస్లింవాడ గ్రామం నుంచి శ్మశాన స్థలానికి వెళ్లే సప్లై ఛానల్‌ను పూతలపట్టు నియోజక వర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ జెడ్పీటీసీ ఉషారాణి, ఎంపీపీ రాధమ్మ , వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు,సర్పంచ్‌లు పరిశీలించనున్నట్లు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ధనంజయరెడ్డి తెలిపారు. -
ఏపీలో 43 శాతం ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రయాణికుల కష్టాలకు ఫుల్స్టాప్ పడింది. ఆంధ్రప్రదేశ్‌లో గత బుధవారం నుంచి సమ్మెలోకి దిగిన ఆర్టీసీ కార్మికుల డిమాండ్ మేరకు ఎట్టకేలకు 43 శాతం ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె వీడి విధుల్లో చేరాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు సుదీర్ఘంగా చర్చలు సాగించాయి. చివరకు 43 శాతం వేతన సవరణకు అంగీకరిస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎరియర్స్‌ను పదవీ విరమణ సమయంలో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) తీసుకునే లోపే అందిస్తామని కార్మిక సంఘాలకు హామీనిచ్చింది. ఏప్రిల్, మే, జూన్ నెలల ఎరియర్స్‌ను దసరా, దీపావళి పండగులకు అందిస్తామని ప్రకటించింది. 43 శాతం ఫిట్మెంట్ వల్ల నెలకు రూ.73 కోట్లు, ఏడాదికి రూ.936 కోట్ల భారం పడుతుందని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు నాలుగు రోజుల్లో పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించిన మర్నాడే ప్రభుత్వం దిగొచ్చిందని, లేదంటే 8 రోజులుగా సమ్మె చేస్తున్నా తమను పట్టించుకోలేదని ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆర్టీసీ చార్జీలు పెంచే యోచన లేదు ఆర్టీసీ కార్మికులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని, సమ్మె ముగిసినట్లేనని కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. కార్మిక సంఘాల నేతలతో చర్చల అనంతరం రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. చార్జీలు పెంచే యోచనేదీ లేదని చెప్పారు. రూ.వంద కోట్ల నష్టం: మంత్రి శిద్ధా ఆర్టీసీ కార్మికులు ఎనిమిది రోజులుగా చేసిన సమ్మె వల్ల ఆర్టీసీకి రూ.వంద కోట్ల నష్టం వాటిల్లిందని రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. సమ్మె సమయంలో 70 శాతం బస్సులు నడిపామని, ఆర్టీసీ భవిష్యత్తు దృష్ట్యా 43 శాతం ఫిట్‌మెంట్‌కు ఓకే చెప్పామన్నారు. భారాన్ని వివిధ మార్గాల్లోసమకూర్చుకుంటాం: ఎండీ 43 శాతం ఫిట్మెంట్తో ఆర్టీసీకి రూ.936 కోట్ల భారం పడుతుందని, ఈ భారాన్ని వివిధ మార్గాల్లో సమకూర్చుకుంటామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ప్రకటించారు. ఈ భారాన్ని ప్రజలపై మోపేది లేదన్నారు. చార్జీలు పెంచితే సహించం: వైఎస్సార్సీపీ ఆర్టీసీ సిబ్బందికి ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల భారం పడిందనే పేరుతో ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు బస్సు చార్జీలను పెంచితే సహించేది లేదని వైఎస్సార్సీపీ హెచ్చరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ తరువాత బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోరాడి తమ డిమాండ్లను సాధించుకున్న ఆర్టీసీ కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికులు సమ్మెకు నోటీసు ఇచ్చినప్పుడే సమస్యలు పరిష్కరించి ఉంటే సంస్థపై మరింత భారం పడి ఉండేదే కాదని, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే వారే కాదని పద్మ అన్నారు. ఈ సమస్యను రెండు ప్రభుత్వాలూ నాన్చి పెద్దది చేశాయని ఆమె విమర్శించారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెలో కార్మికులు విజయవంతంగా తమ డిమాండ్లను సాధించుకోవడం పట్ల వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రాజారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో బకాయిలు 1,548 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను 2013 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. పెంచిన వేతన సవరణ ఈ ఏడాది జూన్ నుంచి అమల్లోకి రానుంది. అయితే, 2013 నుంచి 2015 మార్చి వరకు ఎరియర్స్ రూ.1,548 కోట్లు మేర ఉన్నాయి. వీటికి సంబంధించి బాండ్లు జారీ చేయనున్నారు. ఆర్టీసీలో అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి నెలా జీతాల రూపంలో రూ.180 కోట్లకు పైగా ఖర్చవుతుంది. రూ.10వేల మూల వేతనం ఉన్న ఉద్యోగికి 43 శాతం ఫిట్మెంట్తో రూ.4,300 పెరగనుంది. ఆనందంతో ఆగిన గుండె తొండూరు: ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందనే వార్త విని సంతోషం పట్టలేక ఉబ్బితబ్బిబైన ఓ డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. వైఎస్ఆర్ జిల్లా తొండూరుకు చెందిన పి. నారాయణ(46) పులివెందుల డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సమ్మెలో కూడా పాల్గొన్నాడు. 43% ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం అంగీకరించిందనే వార్తను టీవీలో చూసిన నారాయణ.. ఆనందంతో గుండెపోటుకు గురై కన్నుమూశాడు. -
సంబురం
సీఎం ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల జోష్ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని వెల్లడి నిజామాబాద్ నాగారం: ఎనిమిది రోజులపాటు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు సాగించిన పోరాటానికి ఫలితం లభించింది. ఊహకందని విధంగా సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో కార్మికులు సంబరాలలో మునిగిపోయూరు. టీవీలలో ఈ వార్త ప్రసారమైన వెంటనే బస్సు డిపోలు, బస్టాండ్లు, రహదారుల పై టపాసులు పేల్చారు. బ్యాండ్, బాజాలతో నృత్యాలు చేస్తూ, తెలంగాణ పాటలు పాడుతూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.మిఠారుు లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు ఊహకందని విధంగా కడుపు నిండా ఫిట్ మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామన్నా. సంస్థ అభివృద్ధి పయనించే విధంగా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. కేసీఆర్ తమ కష్టాలను తెలుసుకొని న్యాయం చేసినందుకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో కో-కన్వీనర్లు సయ్యద్ అహ్మద్, వందేమా తరం శ్రీనివాస్, సాయిబాబా, సంజీవ్, పురుషోత్తం, సాయన్న, వివిధ కార్మిక సంఘాల నాయకులు, టీఎన్జీఓఎస్ నేత గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు ఎనిమిది రోజుల సమ్మె తరువాత బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కారుు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో కార్మికులు సమ్మెను విరమించారు. దీంతో బస్సులన్నీ డిపోల నుంచి బస్టాండ్‌కు చేరుకున్నాయి. ఈ ఎనిమిది రోజులపాటు ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ప్రైవేట్ వాహనాలు దోచుకున్నారుు. ఇది ఆర్టీసీ కార్మికుల విజయం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థరెడ్డి నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడం ఆర్టీసీ కార్మికుల విజయమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి పేర్కొ న్నారు. గత కొన్ని రోజులుగా కార్మికులు కలిసి పోరాడి తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారన్నారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకవచ్చి నిరసనలు తెలిపి వి జయం సాధించారన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విస్మరించిన సమయంలో ఆర్టీసీ సంఘాలు, కార్మికులు ఏకతాటిపైకి వచ్చి పోరాడడం అభినందనీయమ న్నారు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం తలొగ్గి డిమాండ్ల పరిష్కారం కోసం దిగి వచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటు ందన్నారు. కార్మికులకు ఎలాంటి నష్టం జరిగినా వారి కోసం పోరాడుతుందన్నారు. -
ఆనందోత్సాహం
నల్లగొండ : ఆర్టీసీ కార్మికులు సంబురాల్లో మునిగితేలారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించే దిశగా 8 రోజుల నుంచి చేస్తున్న సమ్మెకు బుధవారం బ్రేక్ పడింది. కార్మికులు డిమాండ్ చేసిన దానికంటే ఒక శాతం ఎక్కువ ఫిట్మెంట్ ప్రకటించడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 43 శాతం ఫిట్మెంట్ పెంచాలని సంఘాలు డిమాండ్ చేయగా...సీఎం 44 శాతం ఇస్తామని ప్రకటించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం వరకు సమ్మెలో ఉన్న కార్మిక సంఘాలు ఒక్కసారిగా రోడ్డుమీదకు వచ్చి సంబురాలు నిర్వహించాయి. తెలంగాణ తెలుగు తల్లి విగ్ర హానికి పూలమాలలు, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పలుచోట్ల కార్మికులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. కాగా ఈ సమ్మెలో కార్మికులకు అండగా ఉద్యోగులు సైతం కదలిరావడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇదే క్రమంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టేంచేందుకు అధికారులు, కార్మికులు తమ వంతు కృషి చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే రీజియన్ పరిధిలో ఖర్చు తగ్గించుకుని ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఎనిమిది రోజుల సమ్మె కారణంగా నల్లగొండ రీజియన్‌కు రూ.5.6 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడంతో పాటు, మితిమీరిన ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కార్మికుల సంబురాలు...కదిలిన బస్సులు సీఎంతో జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో సాయంత్రం 4 గంటల నుంచే బస్సులు రోడ్డుమీదకు రావడం మొ దలుపెట్టాయి. గురువారం ఎంసెట్ ప్రవేశ పరీక్ష దృష్ట్యా బుధవార అర్ధరాత్రి అన్ని గ్రామాలకు బస్సులు పంపిం చారు. ప్రత్యేకంగా 115 బస్సులు ఏర్పాటు చేశారు. నల్లగొండ డిపో ఎదుట కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి వెళ్లి క్లాక్ టవర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి బాణాసంచా కాల్చారు. సూర్యాపేటలో డిపో ఆవరణ నుంచి మొదలుకొని తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ తీస్తూ బాణాసంచాలు కాల్చారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నార్కట్‌పల్లి, దేవరకొండలో కార్మికులు, ఉద్యోగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ హర్షం ప్రకటించారు. మిర్యాలగూడలో కార్మికులు స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు. కోదాడలో కార్మికలు స్థానిక బస్టాండ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. -
రైట్.. రైట్..
43 శాతం ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ కార్మికులు బుధవారం విజయోత్సవం జరుపుకొన్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.బస్సుల రాకపోకలు పూర్తిస్థాయిలో మొదలవడంతో బస్‌స్టేషన్ మళ్లీ కళకళలాడింది. విజయవాడ : ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోర్కెలను పరిష్కరిస్తామని ప్రకటించింది. ఆర్టీసీ యూనియన్లు తన ముందు ఉంచిన డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించడంతో బుధవారం మధ్యాహ్నం సమ్మె ముగిసింది. దీంతో ఆర్టీసీ కార్మికులు, వివిధ సంఘాల నాయకులు బస్‌స్టాండ్‌లో విజయోత్సవాలు జరుపుకొన్నారు. ఎనిమిది రోజు కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి జిల్లాలో పూర్తిస్థాయిలో అన్ని సర్వీసులు నడిచాయి.ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె ముగి సింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకారం తెలి పింది. 2013 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు తక్షణం, సర్వీసుల్లో ఉన్న కార్మికులకు బాండ్ల రూపంలో ఏరియర్స్ ఇస్తామని ప్రకటించింది. జూలై పేస్కేల్ నుంచి ఫిట్మెంట్తో కలిసిన జీతం అమలులోకి రానుంది. ఉదయం నుంచి కొనసాగిన సమ్మె సమ్మెలో భాగంగా ఉదయం నుంచి జిల్లాలో పటుచోట్ల కార్మికుల నిరసన కార్యక్రమాలు యథాతథంగా కొనసాగాయి. విజయవాడ పాత బస్‌స్టాండ్ నుంచి కొత్త బస్‌స్టాండ్ వరకు సిబ్బంది నోటికి నల్లరిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేట డిపోలో జరిగిన నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను మద్దతు పలికారు. గుడివాడ, ఇబ్రహీంపట్నం, నూజివీడు, తిరువూరు తదితర డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. విజయోత్సవాలు కార్మికులు సమ్మె విరమణ అనంతరం విజయోత్సవాలు జరుపుకొన్నారు. పాత బస్‌స్టాండ్ నుంచి కొత్త బస్‌స్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్‌స్టాండ్‌లో రంగులు చల్లుకొని, స్వీట్లు పంచుకున్నారు. జిల్లాలోని ఇతర డిపోల్లోనూ కార్మికులు సంబరాలు జరుపుకొన్నారు. రూ.12 కోట్ల నష్టం ఆర్టీసీకి జిల్లాలో 8 రోజుల సమ్మెతో రూ.12 కోట్ల నష్టం వాటిల్లింది. మొదటి మూడు రోజు సమ్మె ప్రభావంతో ఎక్కువ సర్వీసులు నడవలేదు. బుధవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 950 బస్సు సర్వీసులు నడిచాయి. బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్ ఇతర దూరప్రాంతాలకు కూడా సర్వీసులు మొదలయ్యాయి. నేటి నుంచి పూర్తిస్థాయిలో ఆర్టిసీ సర్వీసులు బస్‌స్టేషన్ : ఆర్టీసీ సర్వీసులు గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని రీజనల్ మేనేజర్ సుదేష్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులు ఎనిమిది రోజులు సమ్మె నిర్వహించడంతో ప్రయాణికులకు సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. పలు రూట్లలో సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయని వివరించారు. ఈ నేపథ్యంలో 43 శాతం ఫిట్మెంట్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులకు విధులకు హాజరవుతుని తెలిపారు. -
రైట్.. రైట్
44 శాతం ఫిట్‌మెంట్‌కు ఓకే.. సమ్మె విరమణ నెరవేరిన కార్మికుల కల.. కదిలిన రథచక్రాలు.. హన్మకొండ: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడంతో ఎనిమిది రోజులుగా కొనసాగిన సమ్మె బుధవారం ముగిసింది. 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతోపాటు ఈ నెల 14వ తేదీ నుంచి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్లు... సమ్మెలో కార్మికులపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కార్మికుల ఆనందోత్సవాలకు అవధుల్లేకుండా పోయాయి. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ యూనియన్ల నాయకులు, కార్మికులు సమ్మె విరమించి సంబరాల బాటపట్టారు. రంగులు చల్లుకుని.. బాణ సంచా కాల్చి... స్వీట్లు పంచుకున్నారు. రోజు వారి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉదయం హన్మకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట టీఎంయూ, జేఏసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ధర్నా చేసిన కార్మికులు.. అదే చోట సంబరాలు నిర్వహించుకున్నారు. హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు కడియం శ్రీహరి, హరీష్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, టీఎంయూ రాష్ట్ర నాయకులు అశ్వథ్థామరెడ్డి, థామస్‌రెడ్డి, తిరుపతయ్య ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఎంప్లాయూస్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రంగులు చల్లుకుని సంబ రాలు జరుపుకున్నారు. -
కార్మికుల బాధలు అర్థం చేసుకున్న కేసీఆర్
► జీతాలు తక్కువ ఉన్నందుకే 44 శాతం ఫిట్మెంట్ ► కేసుల ఎత్తివేత.. సస్పెన్షన్లు రద్దు ► రానున్న నెలరోజుల్లో డిపోల వారీగా సమీక్షలు ► రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరు : ఆర్టీసీ కార్మికుల బాధలను అర్థం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరుకు వచ్చిన మంత్రికి బుధవారం రాత్రి ఆర్టీసీ కార్మికులు మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ఆర్టీసీ నష్టాలను చవిచూసిందన్నారు. రూ.18 వందల కోట్ల నష్టాలు ఉన్నప్పటికీ తెలంగాణ సర్కారు కార్మికుల కోర్కెలన్నీ తీర్చిందన్నారు. కార్మికులు కోరిన 43 శాతం కన్నా ఒక్క శాతం ఫిట్మెంట్ పెంచడంవల్ల సంస్థపై సుమారు రూ.8 వందల కోట్ల భారం పడుతున్నా.. కార్మికుల సంక్షేమానికే సీఎం ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే ఆర్టీసీ కార్మికుల జీతాలు తక్కువగా ఉన్నందుకే సబ్ కమిటీలో మంత్రులు సూచనల మేరకు సీఎం 43కు బదులు 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారని మహేందర్‌రెడ్డి వివరించారు. వారం రోజుల సమ్మె కాలంలో తెలంగాణలో సుమారు రూ.80 నుంచి రూ.100 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఏడాదికి రూ.400 కోట్ల నష్టాలు ఉన్నాయన్నారు. ఏడాదికి రూ.9 కోట్ల ఆదాయం వస్తే రూ.10 కోట్ల ఖర్చు ఉంటుందన్నారు. సస్పెండయిన అధికారులు, ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్నారు. సమ్మె కా లాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణంలోకి తీసుకుంటామన్నా రు. తెలంగాణలో ఆర్టీసీని లాభాలబాటలోకి తీసుకువచ్చేందుకు కార్మికులు బాధ్యతగా పనిచేయాలన్నారు. వచ్చేనెల రోజుల్లో పది జిల్లాల్లో డిపోలవారీగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తాండూరు డిపో మేనేజర్ లక్ష్మీధర్మా, అధికారులు మంత్రిని కలిశారు. కార్మికులు, యూనియన్ నాయకులు మంత్రిని గజమాల, శాలువాతో సన్మానించారు. -
నేడు ఆర్టీసీ సమ్మెపై అటో.. ఇటో!