విజయనగరం అర్బన్: ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో రీజియన్ కమిటీని ఎంప్లాయీస్ యూనియన్ కైవసం చేసుకుంది. నార్త్ ఈస్ట్ కోస్ట్ (నెక్) రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో ఏడు చోట్ల సమీప నేషనల్ మజ్దూర్ (ఎన్‌ఎంయూ) కంటే ఓట్లు అధికంగా తెచ్చుకొని విజయఢంకా మోగించింది. వరుసగా మూడోసారి నెక్ రీజియన్‌లో విజయం సాధించి పాగావేసింది. తొమ్మిది డిపోలలో విజయనగరం, పార్వతీపురం, సాలూరు, ఎస్‌కోట, పాలకొండ, టెక్కలి, పలాస డిపోలలో ఎంప్లాయీస్ యూనియన్‌కి, శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2 డిపోల్లో ఎన్‌ఎంయూకి అధిక ఓట్లు లభించాయి. దీంతో నెక్ రీజియన్‌లో గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించింది. ఈ మేరకు ఓట్ల వివరాలు కార్మిక శాఖ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విజయనగరం డిపో పరిధిలో ఎంప్లాయీస్ యూనియన్‌కు 306, 309, ఎన్‌ఎంయూకు 205, 205, కార్మిక పరిషత్‌కు 41, 39, ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు 12, 20, వైఎస్‌ఆర్‌సీఎంయూకు 1, 0, కార్మికసంఘ్‌కు 1, 1 పోలయ్యాయి. చెల్లనివి 1, 1.
సాలూరు డిపో పరిధిలో 364 ఓట్లకు నూరు శాతం ఓట్లు పోలయ్యాయి. వీటిలో 181 ఓట్లు ఎంప్లాయీస్ సొంతం చేసుకోగా, నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 157, కార్మిక పరిషత్‌కు 19, వైఎస్సార్ అనుబంధ సం ఘానికి 4, ఎస్‌డబ్ల్యూకు 1 ఓటు వచ్చాయి.
పార్వతీపురం డిపో పరిధిలో 454 మొత్తం ఓట్లకు 448 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రెండు ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు, నాలుగు అన్‌ఫోల్డ్ ఓట్లు ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్ (బస్సు గుర్తు)కు 275, 278, ఎన్‌ఎంయూ (కాగడ గుర్తు)కు 123, 128, వైఎస్‌ఆర్ సీపీ బలపరిచిన (టేబుల్ ఫ్యాన్‌గుర్తు)కు 34, 30 ఓట్లువచ్చాయి. టీడీపీ బలపరచిన కార్మిక పరిషత్‌కు (టైరు గుర్తు)కు 6, 7, ప్రజాసంఘాలు బలపరిచిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు (నక్షత్రం గుర్తు)కు 5, 3, యు వర్కర్‌కు 1, 0 ఓట్లు రాగా, 4, 2 ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఎస్.కోట ఆర్టీసీ డిపోలో మొత్తం 293 ఓట్లు పోలవ్వగా ఎంప్లాయీస్ యూనియన్‌కు 256, నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 28, వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్‌కు 4, కార్మిక పరిషత్‌కు 3, కార్మికసంఘ్‌కు 1 మొత్తం 292 ఓట్లు రాగా ఒక ఓటు చెల్లలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన కొత్తవలస సహాయ కార్మిక అధికారిణి టి.సుజాత గురువారం సాయంత్రం వెల్లడించారు.
దూసుకుపోయిన ‘బస్సు’
Published Fri, Feb 19 2016 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM
Advertisement
Advertisement