
డిపో ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు
ఆత్మకూరు: ఆర్టీసీ బస్సుల్లో కార్మికులకు బ్రీత్ ఎనలైజర్‌తో కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కడుపు మండిన ఆర్టీసీ కార్మికులు ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆత్మకూరు డిపో ఎదుట ధర్నా చేపట్టారు. డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ చల్లా రవిరెడ్డి ఆదివారం తెల్లవారుజామున విధులకు హాజరయ్యే ముందు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన మద్యం సేవించినట్లు 10 పాయింట్లు ఆ మిషన్‌లో కనబడడంతో సెక్యూరిటీ రిపోర్టు మేరకు అతడ్ని విధులకు హాజరుకాకుండా చేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. అదే సమయంలో విధులకు హాజరైన కార్మికులందరూ అసలు మద్యమే ముట్టని రవిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం సేవించాడంటూ నిర్ణయించడం సరికాదని వాదులాడారు.
అనంతరం అన్ని కార్మిక యూనియన్ల నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని రవికి ప్రభుత్వాస్పపత్రిలో పరీక్షలు నిర్వహించాలని పట్టుబట్టారు. అందుకు యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సమాచారమందుకున్న డిపో మేనేజర్ త్రినా«థ్‌రావు అక్కడికి చేరుకుని, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో దాదాపు మూడు గంటలకు పైగా బస్సులు డిపోలో నిలిచిపోయాయి.
మీడియాపై రుసరుస
విషయం తెలుసుకున్న మీడియా ఘటన స్థలానికి చేరుకోవడంతో డిపో మేనేజర్ త్రినా«థ్‌రావు వారిపై రుసరుసలాడారు. ఈ క్రమంలో కార్మికులు తామే మీడియాకు సమాచారమిచ్చామని చెప్పడంతో విధిలేక ఆయన ఉన్నతా«ధికారులను మరోసారి సంప్రదించారు. అనంతరం రెండోసారి బ్రీత్ ఎనలైజర్ ద్వారా రవిరెడ్డికి అందరి ఎదుట పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో సున్నా పాయింట్లు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ మిషీన్‌లో పొరపాటు పెట్టుకుని కార్మికులను మానసిక క్షోభకు గురిచేయడం సరికాదని, గతంలోనూ ఇలానే ఓ కార్మికుడిని సస్పెన్షన్‌కు గురిచేశారని తెలిపారు. చివరికి కార్మికులు విధులకు హాజరవడంతో వ్యవహారం సర్దుమణిగింది.
నీరు తాగితే నమోదు కాదు
కాగా మంచినీరు ఎక్కువగా తాగితే మద్యం తాగినట్లు బ్రీత్ ఎనలైజర్ గుర్తించలేదని డిపో మేనేజర్ సెలవిచ్చారు. బ్రీత్ ఎనలైజర్ అలా ఎందుకు రెండు విధాలుగా నమోదు చేసిందని త్రినాథ్‌రావును ప్రశ్నించగా రెండోసారి కార్మికుడు అధికంగా నీళ్లు తాగి పరీక్షలు చేయించుకోవడంతో అలా నమోదైందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment