సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ హైకోర్టు చెరో మెట్టు దిగమని ప్రభుత్వానికి, కార్మికులకు చెప్పింది. కానీ కార్మికులు మెట్టు దిగాల్సిన అవసరం లేదు. వారు మెట్టు మీద అసలే లేరు’ అని ఎమ్మార్మీస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అడ్డుకునేవారు ఉన్నంతసేపు కార్మికులు అనుకున్న ఫలితాలు రావు కానీ, చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేసి విరమించిన రోజు కూడా అదే జరిగిందన్నారు. దీక్ష విరమించగానే తెలంగాణ రాలేదని, తర్వాత వచ్చిందని, అలాగే కార్మికుల లక్ష్యాలు కూడా తర్వాతి రోజుల్లో నెరవేరుతాయని అశాభావం వ్యక్తంచేశారు. ఎప్పుడు గెలుస్తారో చెప్పలేం కానీ కార్మికులు మాత్రం గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఎళ్లవేళలా ఎమ్మార్మీస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీకి ఉందని, కార్మికులు ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. ఆర్టీసీ ఆస్తులు దోచుకోవడానికి సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో పోలిస్తే సమైక్యాంధ్ర నాయకులు వందశాతం నయమని చెప్పారు. ఉద్యోగాల పట్ల కార్మికులు ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment