'27వ తేదీ అర్ధరాత్రి నుంచి ఒక్క బస్సు కూడా రోడ్డెక్కదు'
హైదరాబాద్:ప్రగతిరథ చక్రాలు మళ్లీ నిలిచిపోనున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏ ఒక్క ఆర్టీసీ బస్సుకూడా రోడ్డెక్కదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. కార్మికులకు రావాల్సిన మధ్యంతర భృతిపై ఆర్టీసీ యాజమాన్యం సరిగా స్పందించని కారణంగా తాము సమ్మెకు సమాయత్తమవుతున్నట్లు తెలిపాయి. శుక్రవారం ఆర్టీసీతో జరిగిన కార్మిక సంఘాల చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
చర్చల అనంతరం ఈయూ, టీఎంయూ సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు. కార్మికలకు వెంటనే 46 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. కాని పక్షంలో సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.