సంబురం
సీఎం ప్రకటనతో ఆర్‌టీసీ కార్మికుల జోష్
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం
రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని వెల్లడి
నిజామాబాద్ నాగారం: ఎనిమిది రోజులపాటు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్‌టీసీ కార్మికులు సాగించిన పోరాటానికి ఫలితం లభించింది. ఊహకందని విధంగా సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడంతో కార్మికులు సంబరాలలో మునిగిపోయూరు. టీవీలలో ఈ వార్త ప్రసారమైన వెంటనే బస్సు డిపోలు, బస్టాండ్లు, రహదారుల పై టపాసులు పేల్చారు. బ్యాండ్, బాజాలతో నృత్యాలు చేస్తూ, తెలంగాణ పాటలు పాడుతూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.మిఠారుు లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌టీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు ఊహకందని విధంగా కడుపు నిండా ఫిట్ మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామన్నా. సంస్థ అభివృద్ధి పయనించే విధంగా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. కేసీఆర్ తమ కష్టాలను తెలుసుకొని న్యాయం చేసినందుకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో కో-కన్వీనర్లు సయ్యద్ అహ్మద్, వందేమా తరం శ్రీనివాస్, సాయిబాబా, సంజీవ్, పురుషోత్తం, సాయన్న, వివిధ కార్మిక సంఘాల నాయకులు, టీఎన్‌జీఓఎస్ నేత గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు.
రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
ఎనిమిది రోజుల సమ్మె తరువాత బుధవారం సాయంత్రం ఆర్‌టీసీ బస్సులు రోడ్డెక్కారుు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడంతో కార్మికులు సమ్మెను విరమించారు. దీంతో బస్సులన్నీ డిపోల నుంచి బస్టాండ్‌కు చేరుకున్నాయి. ఈ ఎనిమిది రోజులపాటు ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ప్రైవేట్ వాహనాలు దోచుకున్నారుు.
ఇది ఆర్‌టీసీ కార్మికుల విజయం
వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థరెడ్డి
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం ఆర్‌టీసీ కార్మికుల విజయమని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి పేర్కొ న్నారు. గత కొన్ని రోజులుగా కార్మికులు కలిసి పోరాడి తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారన్నారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకవచ్చి నిరసనలు తెలిపి వి జయం సాధించారన్నారు. ప్రభుత్వం ఆర్‌టీసీ కార్మికులను విస్మరించిన సమయంలో ఆర్‌టీసీ సంఘాలు, కార్మికులు ఏకతాటిపైకి వచ్చి పోరాడడం అభినందనీయమ న్నారు. దీంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తలొగ్గి డిమాండ్ల పరిష్కారం కోసం దిగి వచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా ఆర్‌టీసీ కార్మికులకు వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటు ందన్నారు. కార్మికులకు ఎలాంటి నష్టం జరిగినా వారి కోసం పోరాడుతుందన్నారు.