ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు పరిష్కారం | Resolution of pending issues of RTC employees | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు పరిష్కారం

Published Mon, Aug 10 2020 6:09 AM | Last Updated on Mon, Aug 10 2020 6:09 AM

Resolution of pending issues of RTC employees - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వంలో విలీనం మొదలు.. వారి ప్రయోజనాల్ని పరిరక్షిస్తూనే మరో వైపు పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ తీర్చింది. గతంలో ఏ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఈ విధంగా మేలు చేయలేదని యూనియన్లు పేర్కొంటున్నాయి. ఈ మేరకు యూనియన్ల ప్రతినిధులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రతినిధులు, వైఎస్సార్‌ ఆర్టీసీ యూనియన్‌ నేతలు.. గడిచిన ఏడాదిగా ఆర్టీసీ కార్మికులకు చేకూరిన లబ్ధిపై ప్రకటనలు జారీ చేశారు.

► కోవిడ్‌ కారణంగా ఆర్టీసీ కనీవినీ నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ.. 52 వేల మంది ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి.
► కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేశారు. 
► ఇటీవలే 2013 పే స్కేల్‌ బకాయిలు రూ.800 కోట్లు విడుదల చేశారు.
► విలీనం తరువాత.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే కారుణ్య నియామకాలను ఆర్టీసీ ఉద్యోగులకు వర్తించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
► ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోయిన కార్మికులకు ప్రభుత్వం కల్పించే ‘మరణానంతర ప్రయోజనాలు’ వర్తింపజేస్తూ గత వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
► ఆర్టీసీలో మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. లైంగిక వేధింపులపై ప్రాంతీయ స్ధాయి కమిటీలు ఏర్పాటు చేసింది. 
► రూ.10 లక్షల బీమా కల్పించింది. విధి నిర్వహణలో ఉన్నా.. లేకున్నా.. ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ బీమా వర్తిస్తుంది. ఈ ఏడాది మే 31 నాటికి ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి ఈ బీమా వర్తిస్తుంది.
► చంద్రబాబు హయాంలో యూనిఫాంకు కూడా డబ్బులు ఇవ్వలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement