సార్వత్రిక సమ్మె సక్సెస్
పరిగి : కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలని టీఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హ న్మంతు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మాధవరం వెంకటయ్య, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి పీర్ మహ్మద్ తదితరులు పేర్కొన్నారు. ఆయా పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పరిగిలో చేపట్టిన సార్వత్రిక సమ్మె అందరి భాగస్వామ్యంతో విజయవంతం అ యింది. ఇందులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా లు, వీఆర్‌ఏలు, ఏఎన్‌ఎంలు, ఆర్‌వీఎం కాం ట్రాక్టు ఉద్యోగులు, ఆశ వర్కర్లు సమ్మెలో పాల్గొని పరిగిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు మూసివేయించారు.
సీపీఐ ఆధ్వర్యంలో బస్‌స్టాండు ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛం దంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బస్సులన్నీ డిపోకే పరిమిత మయ్యాయి. సమ్మెలో భాగంగా డిపో ఎదుట టీఎం యూ, టీఎన్‌ఎంయూ, ఎంప్లాయిస్ తదితర యూనియన్ల ఆర్టీసీ కార్మికులు బస్ డిపో ముం దు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆచా సంఘాలు, యూనియన్ల నాయకులు శ్రీశైలం, వెంకట్, ప్రశాంత్, రాజశేఖర్,రవి, వెంకట్‌రాములు, మల్లేశం, బాలు, నిరంజన్, ఎస్‌జేఎం రెడ్డి, శ్రీనివాస్, మంజుల, సక్కుబాయి, స్వరూప, పద్మ పాల్గొన్నారు.