trade unions
-
ఆర్టీసీలో అసంతృప్తి స్వరం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ప్రధాన సంఘాలకు నాయకత్వం వహించిన నేతల్లో ఎక్కువమంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉన్నా, ప్రస్తుతం వారు కూడా ఇతర సంఘాల తరహాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ అంటూ లేదు. కొన్ని సంఘాలు కలిపి ఒక కమిటీగా, మరికొన్ని సంఘాలు కలిపి ఒక సంఘంగా పనిచేస్తున్నాయి. ఈ రెండు జేఏసీలతో సంబంధం లేకుండా కొన్ని సంఘాల ప్రతినిధులు సొంతంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ కారి్మకుల సమస్యల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం స్పందించని నేపథ్యంలో అన్ని సంఘాలు కలిపి ఒక జేఏసీగా ఏర్పడి ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమయ్యేలా చేస్తామంటూ కొన్ని సంఘాలు చెబుతున్నాయి. కార్మిక సంఘాల గుర్తింపే ప్రధాన లక్ష్యం గత ప్రభుత్వం ఆర్టీసీలో కార్మిక సంఘాల ఉనికి లేకుండా చేసింది. వాటి స్థానంలో డిపోల్లో ఉద్యోగుల ఆధ్వర్యంలో సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేసి ఆయా అంశాలు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత అప్పగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తోంది. దీంతో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో కార్మిక సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. కార్మిక సంఘాలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటంతో ఇటీవల ఓ సంఘం సీఎంకు సీఐటీయూ ప్రతినిధుల ద్వారా వినతిపత్రం ఇప్పించాల్సి వచి్చంది. కార్మిక సంఘాలను భాగస్వాములను చేయాలి ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంతోపాటు వారికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే అందించాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశంతో సంబంధం లేని 11 అంశాలను ముందుగా పరిష్కరించాలి. ప్ర భుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతో సంబంధం ఉన్న మరి కొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంది. ఆయా అంశాలపై తీసు కునే నిర్ణయాల్లో కార్మిక సంఘాలను భాగస్వాములను చేయాలి. – వీఎస్‌రావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఇవీ డిమాండ్లు.. » ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ ప్రకటించటం మినహా ప్రస్తుత ప్రభుత్వం దానిని అమలులోకి తేలేదు. ఫలితంగా ఆర్టీసీ ఉద్యోగులు.. ఆర్టీసీ ఉద్యోగులుగానే ఉండిపోవాల్సి వచ్చింది. దీన్ని ప్రధాన డిమాండ్‌గా కొన్ని సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. » సరిపోను డ్రైవర్లు లేక ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. దీనివల్ల వారు తీవ్ర ఒత్తిడి ని ఎదుర్కొంటున్నారు. దీన్ని నివారిస్తూ అన్ని రకాల పోస్టుల్లో ఖాళీలు భర్తీ చేయాలన్న డి మాండ్‌ను అన్ని సంఘాలు పేర్కొంటున్నాయి. » సాంకేతిక సమస్యలతో జరిగే పొరపాట్లు, చి న్నచిన్న తప్పిదాలకు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, వెంటనే వారికి ఉద్యో గ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. » 2021 వేతన సవరణ జరపాలని, 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, చనిపోయిన, మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిచ్చి వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకోవాలని, ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య తగ్గించి, అవసరమైన సంఖ్యలో బస్సులను సొంతంగా సమకూర్చుకోవాలని, మహిళా ఉద్యోగులను రాత్రి 8 తర్వాత పని చేయించవద్దని, రిటైర్ అయిన వారికి ఇవ్వాల్సిన అన్ని బకాయిలు చెల్లించాలని... ఇలా పలు అంశాలను ప్రభుత్వం ముందుంచుతున్నారు. -
రిపోర్టు అన్నారు...రిక్తహస్తం చూపారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. 317 జీవో వల్ల ఎదురైన సమస్యలపై తమ వాదనను సీఎస్ ముందు ఉంచారు. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ హామీ ఇచి్చనట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం భేటీ కావడం తెలిసిందే. ఆర్థిక అంశాలపై మార్చి వరకు వేచి ఉండాలని సూచించిన ఆయన.. 317 జీవో ద్వారా జరిగిన తప్పిదాలను సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ దిశగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎస్ సమక్షంలో పరిశీలించాలని ఉద్యోగులకు సూచించారు.ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సీఎస్‌ను కలిశారు. అయితే మంత్రివర్గ ఉససంఘం 317 సమస్యల పరిష్కారానికి సూచించిన సాధ్యాసాధ్యాలను సీఎస్ బహిర్గతపరచలేదని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. నివేదిక చూపిస్తామని పిలిచి సూచనలు ఇవ్వాలంటూ పంపాశారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక 317 జీవో వల్ల పలువురు ఉద్యోగులకు జరిగిన నష్టం, స్పౌజ్ కేసుల పరిష్కారం, అనారోగ్యంతో బాధపడే వారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీలు తదితర అంశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి పలువురు ఉద్యోగ నేతలు సీఎస్‌ను అడగ్గా ఆ ఫైల్ సర్క్యులేషన్లో ఉందని.. బహుశా కేబినేట్ పరిశీలనకు వెళ్లే వీలుందని ఆమె సర్దిచెప్పినట్లు సమాచారం. మరోవైపు ఆందోళన బాట పట్టాలనుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ ప్రకటిస్తారా లేదా అనే అంశాన్ని పరిశీలించాక తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. సీఎస్‌తో భేటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఏలూరు శ్రీనివాస్‌రావు, చావా రవి, వి. రవీందర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, హనుమంతరావు, కత్తి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయం తగ్గింది.. మార్చి దాకా అడగొద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. వచ్చే మార్చి 31 వరకు ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడులు చేయవద్దని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని.. దీనికి సంబంధించి మంత్రులతో కమిటీ వేస్తున్నామని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)ఆందోళన బాట పడతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఏసీ ప్రతినిధులతో సీఎం రేవంత్ గురువారం సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి జేఏసీ నుంచి హాజరైన 36 మందికి మాట్లాడే అవకాశం కల్పించారు. వారు చెప్పిన అంశాలు, సమస్యలను విన్నారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం రేవంత్ 15 నిమిషాల పాటు మాట్లాడారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. డీఏలపై ఆలోచన చేస్తాం.. ప్రభుత్వం ఇవ్వాల్సిన 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలని సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కనీసం మూడు డీఏలను వెంటనే ఇవ్వాలని.. 26న జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏలపై ప్రకటన చేయాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని, ఏమాత్రం వీలైనా ఎంతో కొంత న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. పెండింగ్ బిల్లులు, నగదు రహిత ఆరోగ్య కార్డుల జారీ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని తెలిపారు. డీఏల విషయంలో ప్రభుత్వానికి ఒకట్రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. 317 జీవో సమస్యలను పరిష్కరిస్తాం.. స్థానిక జిల్లాలకు ఉద్యోగుల బదిలీ కోసం తీసుకొచ్చిన 317 జీవోతో ఏర్పడ్డ సమస్యలను పరిష్కారిస్తామని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదికను శుక్రవారం ఉద్యోగ ప్రతినిధుల ముందే తెరుస్తామని చెప్పారు. అందులోని అంశాలను పరిశీలించి, తగిన సలహాలు ఇస్తే.. సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. భట్టి నేతృత్వంలో మంత్రుల కమిటీ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో.. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబులతో కమిటీ వేస్తున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. దీపావళి పండుగ తర్వాత ఈ కమిటీ సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతుందని.. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వానికి సూచనలు చేస్తుందని తెలిపారు. సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శి జనరల్ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, కో–చైర్మన్ చావా రవితోపాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎంకు సమస్యలు వివరించాం ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులంతా సీఎంతో నేరుగా మాట్లాడారు. అన్ని సమస్యలను ఆయన ముందు పెట్టారు. తొలి సమావేశం సుహృద్భావ వాతావరణంలోనే జరిగింది. సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నాం. – మారం జగదీశ్వర్, జేఏసీ అధ్యక్షుడు కనీసం రెండు డీఏలైనా ఇవ్వాలి తక్షణమే రెండు డీఏలైనా ఇస్తే ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం కుదురుతుంది. ప్రతీ దానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం సరికాదు. ప్రభుత్వంతో కలసి ప్రజలకు సేవ చేసేందుకు ఉద్యోగులు అన్నివేళలా కృషి చేస్తారు. – చావా రవి, జేఏసీ కో–చైర్మన్ కొంత సానుకూలం సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. ప్రభుత్వం మార్చి 31 వరకూ సమయం కావాలని కోరింది. ఇది న్యాయమైన కోరికే. అయితే, పెండింగ్‌లో ఉన్న 5 డీఏల విషయంలో కనీసం రెండు ఇవ్వడానికి కేబినేట్ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, జేఏసీ అదనపు సెక్రటరీ జనరల్ సీపీఎస్ వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వంపై నయాపైసా భారం పడని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేయాలి. సీపీఎస్‌తో రెండు దశాబ్దాలుగా సామాజిక భద్రత లోపిస్తోంది. భవిష్యత్తులోనూ ఇది అధిక భారంగా మారుతుంది. కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు రాజస్థాన్, ఛత్తీస్గడ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఈ విధానాన్ని రద్దు చేశాయి. రాష్ట్రంలోనూ సీపీఎస్‌ను రద్దు చేస్తే ఎల్బీ స్టేడియంలో రెండు లక్షల కుటుంబాలతో ధన్యవాదాలు తెలుపుతాం. – సీఎంకు సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ వినతి పరిస్థితి బాగోలేదు.. సహకరించండి!ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయమైనవేనని, వాటిని పరిష్కరించేందుకు తమకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్ తెలిపారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉందని.. కొన్నాళ్లుగా వివిధ శాఖల ఆదాయం కూడా తగ్గిందని తెలిపారు. వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆర్థిక అంశాల్లో తమపై ఒత్తిడి తేవొద్దని కోరారు. ఆర్థిక అవసరాలు లేని బది లీలు, పాలనాపరమైన అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. -
సివిల్ సప్లైస్‌లో కంత్రీ ప్లాన్
సాక్షి, అమరావతి: పౌరసరఫరాల సంస్థలో బదిలీల పర్వం ఉద్యోగుల్లో చిచ్చురేపుతోంది. బదిలీల ప్రక్రియ కోసం సంస్థ నియమించిన ఫోర్ మెన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి.. మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పేర్లకు పట్టం కట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీవోలను, ఉద్యోగుల వినతులు, మానవీయ కోణాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం బదిలీలు చేశారంటూ మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు చేపట్టింది. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల నుంచి రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తులు ఆహా్వనించింది. ఇవన్నీ కేవలం ప్రక్రియలో భాగంగా చేపట్టారే తప్ప.. క్షేత్ర స్థాయిలో విస్మరించారు. వాస్తవానికి ఫోర్‌మెన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి 20 మందికి పైగా ఉద్యోగుల బదిలీకి సిఫారసు చేస్తే ఆదివారం మధ్యాహ్నం నాటికి ఆ మేరకు అధికారులు నివేదిక రూపొందించారు. తీరా సాయంత్రానికి మంత్రి కార్యాలయం నుంచి మరో జాబితా వచ్చింది. అందులో పేర్కొన్న వ్యక్తులకు మాత్రమే బదిలీ చేయాలని సాక్షాత్తూ మంత్రి హుకుం జారీ చేయడం.. ఎండీ వారిని బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి. చేతులు మారిన ముడుపులు? పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయంలో పని చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఏకంగా తొమ్మిది మందిని ప్రధాన కార్యాలయంలో నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో తప్పనిసరి బదిలీలు లేనివారు, రిక్వెస్టు కూడా పెట్టుకోని వారు ఉండటం గమనార్హం. ఇక్కడే మొత్తం బదిలీల్లో తెనాలి, విజయవాడలోని ప్రముఖ హోటళ్ల వేదికగా భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిస్తున్నాయి. డీఎం పోస్టుకు డిమాండ్ ఉన్నచోట రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు, మిగిలిన జిల్లాల్లో రూ.10 లక్షలకు పైగా రేట్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆరోపణలున్నా పట్టించుకోలేదు విజయనగరం జిల్లా డీఎం తప్పనిసరిగా బదిలీ కావాల్సి రావడంతో ఆమెను ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. అదే ఉద్యోగిని తిరిగి వెనక్కి పంపించే ఉద్దేశంతో అక్కడి పోస్టును వేకెంట్‌గా చూపించి వదిలేసినట్టు తెలుస్తోంది. కర్నూలులో డీఎంగా పనిచేస్తున్న ఉద్యోగిని రిక్వెస్ట్ పెట్టుకోకుండానే ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమెపై హైదరాబాద్‌లో పని చేస్తున్నప్పటి నుంచి వివిధ ఆరోపణలతో చార్జెస్ నమోదయ్యాయి. ఇదే మాదిరిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిధుల దురి్వనియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని, రెండేళ్లు ఉద్యోగంలో చెప్పాపెట్టకుండా మాయమైన మరో ఉద్యోగిని సైతం ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. దీనిపై పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్‌ను వివరణ కోరగా.. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేశామన్నారు. బదిలీల్లో ఎవరి సిఫారసులు తావివ్వలేదన్నారు. రొటేషన్ పద్ధతిలో ఫీల్డ్‌లోని ఉద్యోగులను ప్రధాన కార్యాలయానికి, ఇక్కడి ఉద్యోగులను ఫీల్డ్‌కు పంపించామన్నారు. భారీ దోపిడీకి కుట్ర! ఉద్యోగుల బదిలీలను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి కుట్ర పన్నారనే ఆరోపణలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రారంభిస్తుండటం, డిసెంబర్, జనవరిలో పండుగలు ఉండటంతో పౌరసరఫరాల సంస్థలో భారీఎత్తున నిత్యావసర సరుకులకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారీగా కాంట్రాక్టులు ఉంటాయి. ఈ సందర్భంలో సదరు కాంట్రాక్టర్లను లొంగదీసుకుంటే భారీగా కమీషన్లు కొట్టేయొచ్చనే కుట్రకు బీజం వేశారు. అంటే అకౌంట్స్, ఫైనాన్స్, టెండర్ల వంటి కీలక పోస్టులు మంత్రికి అనుకూలమైన వ్యక్తులు ఉంటే వారి ద్వారా భారీగా కమీషన్లు దండుకునే ప్రణాళికలో భాగంగానే మొత్తం బదిలీల ప్రక్రియ నడిచినట్టు తెలుస్తోంది. అందుకే ప్రధాన కార్యాలయంలో మంత్రి చెప్పిన వారికి కీలక పోస్టింగ్‌లు కట్టబెట్టనున్నారు. వీరి సహాయంతో నెలావారీ వసూళ్లు మంత్రి కార్యాలయానికి నేరుగా చేరిపోయేలా స్కెచ్ వేసినట్టు సమాచారం. అందుకే కొంత మంది ఉద్యోగులపై గతంలో చార్జెస్ నమోదైనప్పటికీ అవి తేలకుండా తిరిగి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వడంపై దోపిడీ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. -
పదోన్నతులు ఎలా ?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖలో పదోన్నతులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈఓ నుంచి ఏఓకు, ఏఓ నుంచి ఏడీఏ పోస్టులకు పదోన్నతులు నిర్వహించేందుకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు ఉత్తర్వు లు ఇచ్చారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ కన్వీనర్‌గా, సహకార శాఖ కమిషనర్, ఉపకార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా రెండేళ్ల కాల పరిమితితో డీపీసీని ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖలోని మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించడమే దీని ఉద్దేశమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలంటే, ఆయా పోస్టుల్లో ప్రస్తుతమున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలి. ఉదాహరణకు ఏఓ నుంచి ఏడీఏ పోస్టుల్లోకి ప్రమోషన్ ఇవ్వాలంటే, ఏడీఏ పోస్టుల్లో ఖాళీలు ఉండాలి. కానీ ఏడీఏ నుంచి డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు పదోన్నతులు జరపకుండా, ఖాళీలు ఎలా ఏర్పడతాయని వ్యవసాయ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అతి కొద్దిగా మాత్రమే రిటైర్మెంట్లు ఉంటాయి. కాబట్టి పూర్తిస్థాయిలో ప్రమోషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఇక ఏఈఓ నుంచి ఏఈలుగా పదోన్నతులు ఇవ్వాలన్నా అటువంటి క్లిష్టమైన పరిస్థితే తలెత్తుతుంది. పైస్థాయిలో కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ ఆఫీసర్ల పదోన్నతులు చేయడం కుదరదని అంటున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులువ్యవసాయశాఖలో దాదాపు 500 మందికి పైగా పదోన్నతు లకు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒకేసారి అన్ని శాఖల్లో పదోన్నతులు జరిగినా, వ్యవసాయశాఖలో మాత్రం చేయలేదు. ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం లేదని సాకులు చెబుతూ పదోన్నతులు ఆపేశారని అంటున్నారు. ఏఓ స్థాయి నుంచి అడిషనల్ డైరెక్టర్ కేడర్ వరకు పదోన్న తులు జరగాలి. సర్వీస్ రూల్స్ ప్రకారం పదోన్నతులు నిర్ణీత కాలంలో జరపకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని సంఘాల నేతలు అంటున్నారు. పదోన్నతులు రాకపోవడం వల్ల సీనియర్లు మనోవేదనకు గురవుతున్నారు. దీనివల్ల పోస్టింగ్‌ల్లోనూ అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నా రు. ఇప్పుడు కేవలం రెండు కేడర్లలో పదో న్నతులకు మాత్రమే డీపీసీని ఏర్పాటు చేశారు. దీని వల్ల పైస్థాయిలో కద లిక రాకుంటే వీటికి కూడా ప్రమోషన్లు ఇచ్చే పరి స్థితి ఉండదని అంటున్నారు. ఆయా విషయాలపై ఇటీవ ల అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవ స్థాపక అధ్యక్షుడు కె.రాము లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎన్నికలకు ముందే విజ్ఞప్తి చేశారు. కానీ ప్రక్రియ మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. బదిలీల మాటేంటి?గత ప్రభుత్వంలో అంటే దాదాపు ఐదారేళ్ల క్రితం వ్యవసాయ శాఖలో బదిలీలు జరిగాయి. అవి కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అనేకమంది ఉద్యోగులు ఒకే చోట తిష్టవే యగా, కొందరు కుటుంబాలకు దూరంగా ఉంటూ అన్యా యానికి గురవుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు వ్యవసా య ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నాయి. ఉద్యోగు ల్లో దాదాపు 2 వేల మందికి పైగా బదిలీలకు ఎదు రుచూస్తున్నారు. కొందరైతే అక్రమ బదిలీలు చేయించుకుంటున్నారన్న విమర్శ లున్నాయి. మరికొందరైతే డిప్యూ టేషన్లు చేయించుకుంటున్నారు. వ్యవసాయ శాఖ లో చాలామంది డిప్యూటేషన్లు, ఓడీలు, ఫారిన్ సర్వీసులపై ఉంటున్నారు. బదిలీలు జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికీ డిప్యూటేషన్లకు వందల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆ అధికారి వెల్లడించారు. నిర్ణీత సమయం ప్రకారం బదిలీ లు జరగాలని, అది ఉద్యోగుల హక్కు అని ఆయన వ్యాఖ్యానించారు. -
డీఏపై కేబినెట్లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరుతో పాటు ఇతర అంశాలపై ఈ నెల 12న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలపై కక్ష గట్టి రద్దు చేస్తే, ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేశారని ఎద్దేవా చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగ సంఘాలు ఉండాల్సిందేనని, మంత్రివర్గ ఉప సంఘం శాఖల వారీగా సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ఆదివారం సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనసాగింపుపై త్వరలో నిర్ణయం గత పదేళ్లుగా తమ సమస్యలను చెప్పుకోవడానికి ఉద్యోగులకు అవకాశం లభించలేదని, వారి ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఆ మేరకు ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఇన్నాళ్లూ ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే వ్యవహరించారని విమర్శించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గవర్నర్‌ను సంప్రదించి ప్రొఫెసర్ కోదండరాంను శాసనమండలికి పంపుతామని, ఆయన ఎమ్మెల్సీగా ఉంటే మండలికి గౌరవమన్నారు. బడులు, కళాశాలలకు ఉచిత విద్యుత్! ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా బాధ్యత ప్రభుత్వానిదేనని, దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఉద్యోగుల తరఫున ప్రాతినిధ్యం ఉండాలన్నారు. తెలంగాణ బాపు జయశంకరే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్ధమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడతారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ, తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారని, శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారని తెలిపారు. తెలంగాణ బాపు తానే అని కేసీఆర్ చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలని విమర్శించారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకరే అని, తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని అన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలన ను గాడిలో పెడుతున్నామని, తాము పదేళ్లు అధి కారంలో ఉండటం ఖాయమని సీఎం అన్నారు. -
ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటాం
సాక్షి, అమరావతి : ఉద్యోగులకు సంబంధించిన అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, మరో ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఆందోళనను విరమించుకోవాలని కోరగా.. వారు అంగీకరించారని తెలిపారు. ఇవ్వాల్సిన సమయంలోనే పీఆర్సీని ప్రకటిస్తామన్నారు. మధ్యంతరం భృతి (ఐఆర్) ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని, పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ ఇస్తారని, ఇవ్వాల్సిన సమయంలోనే పీఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లు కోవిడ్ ప్రభావంతో పీఆర్సీ ఆలస్యమైందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. మార్చిలోపు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను చెల్లిస్తామన్నారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌పై వచ్చి న అభ్యర్థనను సీఎం జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో కొత్త పీఆర్సీకి సంబంధించిన ఫిట్మెంట్, డీఏ, జీపీఎఫ్, ఎస్ఎల్ఎస్ బిల్లుల చెల్లింపు వంటి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో ప్రభుత్వ సర్విసెస్ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ సర్విసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అలాగే, సెర్ప్ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉద్యోగ సలహాదారులు ఎన్.చంద్రశేఖరరెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఫైనాన్స్ మినిస్టర్ సమావేశపు హాల్లో ఈ సమావేశం నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగుల క్రమబద్దికరణకు సంబంధించిన క్యాడర్ ఫిక్సేషన్, పేపిక్సేషన్ అంశాన్ని చర్చించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ గౌరవ స్పెషల్ సీఎస్ బి.రాజశేఖర్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అడిషనల్ సీఈవో విజయకుమారి, అడ్మిన్ డైరెక్టర్ సుశీల, సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు టి.ధనంజయరెడ్డి, కె.నాగరాజు, జె.శోభన్‌బాబు ఎంఎస్ మూర్తి, అబ్దుల్ రెహమాన్, ఆదయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కార్మికులు
సాక్షి నెట్వర్క్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఐక్య కార్మిక సంఘాల అధ్వర్యంలో ఆయా కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో వ్యవసాయ మార్కెట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. హనుమకొండలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లిలోని సింగరేణి గనుల్లో అన్ని సంఘాల నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జనగామలో రైల్వేస్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యా లీగా వచ్చి ధర్నా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచే పార్టీలు, సంఘాల నాయకులు ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, అధికారులు ముందుగానే దూరప్రాంత సర్విసులు రద్దుచేశారు. మిగతా సర్విసులు మధ్యాహ్నం తర్వాత మొదలయ్యాయి. కాగా, ఖమ్మం రూరల్ మండలం కాశిరాజుగూడెం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులను కూడా నిరసనకారులు అడ్డుకున్నారు. హాల్ టికెట్లు చూపించినా అనుమతించకపోవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతం కాగా, ఇతరులు సర్దిచెప్పడంతో పంపించారు. ఇక సింగరేణివ్యాప్తంగా సమ్మె పాక్షికంగానే సాగింది. 39,010 మంది కార్మికులకు 18,072 వేల మంది(60 శాతం) విధులకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. అయితే, రోజువారీ లక్ష్యంలో 10 శాతం మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. -
గనులు తెచ్చి.. ఉపాధినిచ్చే...ఘనులెవరు..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల డిమాండ్లను పరిష్కరించి తమ బతుకుల్లో వెలు గులు నింపాలని అన్ని కార్మి క సంఘాలు డిమాండ్ చేశాయి. సింగరేణి కార్మి కుల ఎజెండాపై గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘సాక్షి చర్చా వేదిక’లో అన్ని గుర్తింపు, జాతీయ, విప్లవ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. కెంగర్ల మల్లయ్య– టీజీబీకేఎస్, వాసిరెడ్డి సీతారామయ్య– ఏఐటీయూసీ, జనక్ ప్రసాద్–ఐఎన్టీయూసీ, రియాజ్ అహ్మద్– హెచ్ఎంఎస్, యాదగిరి సత్తయ్య–బీఎంఎస్, తుమ్మల రాజారెడ్డి– సీఐటీయూ,జి.రాములు– ఏఐఎఫ్టీయూ, విశ్వనాథ్, నరేష్–ఐఎఫ్టీయూ పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ, యాంత్రీకరణ, కాంట్రాక్టు కార్మి కుల క్రమబద్దీకరణ, రెండుపేర్లకు చట్టబద్ధత, ఆదాయపు పన్ను మినహాయింపు, సొంతింటికల, డీఎంఎఫ్ నిధుల మళ్లింపు వంటి ప్రధాన సమస్యలపై ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రాజకీయ పార్టీలు కేవలం వాగ్దానాలతో కాలయాపన చేయడమే తప్ప.. ఇంతవరకూ ఆ సమస్యలను పరిష్కరించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగనులు, ఉపాధి ఎక్కడ...? తెలంగాణ రాష్ట్రం వస్తే.. కొత్త గనులు వచ్చి స్థానికులకు ఉపాధి లభిస్తుందనుకున్న తమ ఆశలు అడియాసలయ్యాయని కార్మిక సంఘాల నేతలు వాపోయారు. ఇక్కడ మరో 180 ఏళ్లకు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. యాంత్రీకరణ వల్ల ఉపాధి అవకాశాలు తగ్గినా.. ఏటా ఐదు కొత్త గనులు ప్రారంభించి, దాదాపు లక్ష మందికి కల్పించే వీలుందని సింగరేణి ఉన్నతాధికారులే ధ్రువీకరించారని గుర్తు చేశారు. కానీ 1.16 లక్షల మంది కార్మికులున్న సంస్థను ఇపుడు 40 వేలకు కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంస్థలో 40 వేలమంది కాంట్రాక్టు కార్మి కులు ప్రాణాంతక పరిస్థితుల్లో పనిచేస్తున్నా.. వారికి అత్తెసరు వేతనాలే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవీ డిమాండ్లు ♦ కాంట్రాక్టు కార్మి కులను వెంటనే క్రమబద్దీకరించాలి. ♦ ఆదాయపు పన్ను మినహాయింపులో స్లాబ్ మార్చడం లేదా పార్లమెంటులో చట్టం ద్వారా శాశ్వత ఉపశమనం కల్పించాలి ♦ డీఎంఎఫ్టీ (డిస్ట్రిక్ట్ మిమినరల్ ఫౌండేషన్ ట్రస్ట్) నిధులను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు మళ్లించకుండా సింగరేణి ప్రభావిత గ్రామాల్లోనే ఖర్చు చేయాలి. ♦ ఇక రెండు పేర్ల చట్టబద్ధతపై విధానపరమైన నిర్ణయం తీసుకుని వారి వారసులకు 40 ఏళ్ల వయోపరిమితితో కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించాలి. ♦ బొగ్గు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న డిమాండ్‌ను నిలబెట్టుకోవాలి ♦ సింగరేణి డిక్లరేషన్ తేవాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా డిక్లరేషన్ తరహాలో అన్ని పార్టీ లు సింగరేణి డిక్లరేషన్ చేసిన వారికే ఈ ఎన్నికల్లో ఓటేస్తామని స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో సింగరేణి మనుగడకు గతంలో పార్టీలు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే తమ డిమాండ్లను మేనిఫెస్టోలో చేరుస్తారో వారికే తమ సంఘాలు, కార్మి కులు మద్దతు తెలుపుతాయని నేతలు స్పష్టం చేశారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవ వేళ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త అందించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ బద్ధీకరణకు సంబంధించి ఐదేళ్ల సర్వీసు నిబంధనను ఎత్తివేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన మాట ప్రకా రం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులరైజేషన్ చేసేలా నిబంధన విధించారు. తాజాగా సీఎం జగన్ ఐదేళ్ల నిబంధనను తొలగిస్తూ సంబంధిత ఫైలుకు మంగళవా రం ఆమోద ముద్ర వేశారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేయాలనే ఉద్దేశంతో ఏ సంఘం డిమాండ్ చేయకుండానే స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ల నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసు కున్నారు. ఈ నిర్ణయంతో 2014 జూన్ 2వ తేదీకి ముందు నియమితులై ఇప్పటి వరకు కొన సా గుతున్న కాంట్రాక్టు ఉద్యోగులందరి సర్వీసును రెగ్యులరైజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేస్తా నని గత ఎన్నికల ముందు సీఎం జగన్ హామీ ఇచ్చి న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కాంట్రాక్టు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలియ చేస్తున్నారు. నాడు బాబు సర్కారు నమ్మక ద్రోహం.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయబోమని, సుప్రీం కోర్టు తీర్పు అందుకు అనుమతించదని గ తంలో చంద్రబాబు ప్రభుత్వం సాకులు చెప్పింది. ఎ న్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా సుప్రీం కోర్టు తీర్పు పేరుతో కాంట్రాక్టు ఉద్యోగులను మో సం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యు లరైజేషన్పై ముగ్గురు మంత్రుల బృందాన్ని నియ మిస్తూ 2014 సెప్టెంబర్ 9న చంద్రబాబు సర్కారు జీవో 3080 జారీ చేసింది. ఐదేళ్ల పాటు సమావేశాలతో సాగదీసిన మంత్రుల బృందం చివ రికి కోర్టు తీర్పును బూచిగా చూపిస్తూ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సాధ్యం కాదంది. నేడు మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేర కు న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులను అధిగ మించి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు సిద్ధ మైంది. ప్రభ్వుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను అర్హత, సర్వీసును పరిగణలోకి తీసుకుని వీ లైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫేస్టోలో హామీ ఇచ్చారు. ఆ ప్రకారం రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. మంత్రుల కమిటీతో పాటు సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ క మిటీని నియమించింది. ఈ కమిటీలు న్యాయ పరమైన, చట్టపరమైన చిక్కులపై చర్చించాయి. రెగ్యులరైజేషన్‌పై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని కమిటీలు సూచించాయి. ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు దొడ్డి దారి కాకూడదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. కాంట్రాక్టు ఉద్యోగు ల క్రమబద్ధీకరణకు చిక్కులు ఎదురుకాకుండా న్యా యపరంగా అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణ లోకి తీసుకుంది. నాడు బాబు సర్కారు కోర్టు తీ ర్పును బూచిగా చూపిస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా మోసగించగా సీఎం జగన్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటూనే క్రమబద్ధీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం హర్షం కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ విషయంలో తొలుత విధించిన ఐదేళ్లు సర్వీసు నిబంధనను తొలగిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర పాలిటెక్నిక్ ఆల్ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెటు్టకున్న ముఖ్యమంత్రి జగన్‌కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తరపున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. వేల మందికి మేలు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేకూరుతోందని ఎమ్మెల్సీ తమటం కల్పలత పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్‌కు కాంట్రాక్టు ఉద్యోగులందరూ రుణపడి ఉంటారన్నారు. మనసున్న ముఖ్యమంత్రి వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. సీఎం వైఎస్ జగన్ మనసున్న ముఖ్యమంత్రిగా మరోసారి నిరూపించుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. – కె.మురళిరెడ్డి, యూనివర్సిటీస్ వైఎస్సార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిరస్మరణీయమైన రోజు కాంట్రాక్టు ఉద్యోగులకు ఇది జీవితంలో మరిచిపోలేని రోజు అని తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో కాంట్రాక్టు అధ్యాపకులు కూడా రెగ్యులరైజ్ అవుతారని తెలిపారు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్‌కు కాంట్రాక్టు ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. – ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి వెలుగులు నింపిన సీఎం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 5 వేల మందిని రెగ్యులరైజ్ చేసేలా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం తమ జీవితాల్లో వెలుగులు నింపుతోందని గవర్నమెంట్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మాటకు కట్టుబడ్డ సీఎం జగన్‌కు సంఘం నేతలు వై.రామచంద్రారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, కరీంఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ రెగ్యులర్ చేస్తున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని ఏపీ పాలిటెక్నిక్ ఆల్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.సాయిరాజు పేర్కొన్నారు. – గవర్నమెంట్ కాంట్రాక్టు లెక్చరర్స్ ఫెడరేషన్ -
రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలపై ఉద్యోగ సంఘాల భేటి
అమరావతి: జోనల్ వ్యవస్థలో మార్పులపై ఉద్యోగ సంఘాలతో జీఏడి సెక్రెటరీ పోలా భాస్కర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన, జిల్లాల విభజన తర్వాత ఇప్పటి వరకు పాత విధానంలోనే జరుగుతున్న ఉద్యోగాల భర్తీ పై చర్చ జరిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలకు తెలియజేసి వారి నుంచి పలు సూచనలు, సలహాలను స్వీకరించారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, బండి.శ్రీనివాసులు, బొప్పరాజు, ఆస్కార్ రావు తదితర నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టు రిక్రూట్మెంట్)కు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు 1975కు సవరణ ప్రతిపాదనపై నివేదికలను అధికారులు సిద్దం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి పోస్టుల భర్తీపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను అధికారులు తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్ -
ప్రభుత్వ ఉద్యోగుల 341 డిమాండ్లు పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 461 డిమాండ్లలో 341 డిమాండ్లను పరిష్కరించామని, మిగతా వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. సీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎస్ వివరించారు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. శాఖల స్థాయిలో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, చాలా వరకు పరిష్కరించినట్లు చెప్పారు. ఆరేడు నెలలుగా ఉద్యోగ సంఘాలతో తరచూ మంత్రివర్గ ఉప సంఘం, అధికారులు సమావేశమై చర్చిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు అన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య విధానంలో త్వరలోనే 1042 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగుల వేతన సవరణకు మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 12వ పీఆర్సీని కూడా నియమించినట్లు చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఆ శాఖల ఉన్నతాధికారులు వివరించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.ప్రవీణ్ కుమార్, అజయ్ జైన్, బి.రాజశేఖర్, ఎం.టి. కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్య కార్యదర్శులు చిరంజీవి చౌదరి, జయలక్ష్మి, శశిభూషణ్ కుమార్, ప్రవీణ్ ప్రకాశ్, శ్యామల రావు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నుండి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రెవెన్యూ సర్వీసెస్ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు సాయి శ్రీనివాస్, ఎం.కృష్ణయ్య, ఎన్.వెంకటేశ్వర్లు, జి.హృదయరాజు, సీహెచ్ శ్రావణ్ కుమార్, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, ఏపీజీఈఏ జనరల్ సెక్రటరీ జె.ఆస్కార్ రావు, ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ల అధ్యక్షులు సి.గోపాలకృష్ణ, ఎస్.మల్లేశ్వరరావు, వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు వేణుమాధవరావు, ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సంఘం అధ్యక్షుడు రజనీష్ బాబు, జూనియర్ వెటర్నరీ అధికారులు, వెటర్నరీ లైవ్‌స్టాక్ అధికారులు సంఘం అధ్యక్షుడు సేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు. వేగంగా సమస్యల పరిష్కారం హర్షణీయం: బండి శ్రీనివాసరావు 40 ఏళ్ల చరిత్రలో తొలిసారి చాలా గొప్ప జాయింట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. వేగంగా సమస్యల పరిష్కారం హర్షణీయం. 40 రోజుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో 16 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాం. పెన్షనర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరాం. పోలీసులు, ఉద్యోగులకు సరెండర్ లీవుల బకాయిలు రూ. 800 కోట్లు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో క్లియర్ చేస్తామన్నారు. యూరోపియన్ ఏఎన్ఎంలను రెగ్యులరైజేషన్, ఎంపీడీవోల ప్రమోషన్లలో మినిస్టీరియల్ సిబ్బందికి 34 శాతం కోటాపై సానుకూలంగా స్పందించారు. 2004 కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి ఓపీఎస్ అమలు చేయమని కోరాం. మన్మోహన్ సింగ్ ను పీఆర్సీ కమిషన్ చైర్మన్‌గా నియమించడం హర్షణీయం. ఓపీఎస్ టు జీపీఎస్ గతంలోకంటే బాగుంది: వెంకట్రామిరెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులందరి క్రమబద్ధీకరణకు ఒకే జీవో ఇస్తామన్నారు. వారు పనిచేసే చోట రెగ్యులర్ చేసేంత వరకు నోటిఫికేషన్లు ఇవ్వొద్దని కోరాం. ఓపీఎస్ టు జీపీఎస్ గతంలోకంటే బాగుంది. జీపీఎస్ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని కోరాం. అందుకు సీఎస్ అంగీకరించారు. జగనన్న లే అవుట్లలో ఇచ్చిన స్థలం కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఉద్యోగులకు వంద ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరాం. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని, జీతాలు పెంచాలని కోరగా సీఎస్ అంగీకరించారు. గ్రీవెన్స్ డే నిర్వహించడం సంతోషం: బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇకపై నాలుగు నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మొదటిసారిగా గ్రీవెన్స్ డే నిర్వహించడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయం. 2014 జూన్ 2 నాటికి ఉద్యోగంలో చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలి. జీతాలు, పింఛన్లు 1వ తేదీన చెల్లించాలని కోరాం. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇవ్వడం సంతోషం. ఆర్టీసీ ఉద్యోగుల అలవెన్సులు కూడా జీతాలతో కలిపి ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను బలోపేతం చేయాలని, తక్షణమే ట్రస్ట్ అకౌంట్లో డబ్బులు జమ చేయాలని కోరాం. -
ఎగవేతదారులతో బ్యాంకుల రాజీకి వ్యతిరేకత
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులతో బ్యాంకులు రాజీ పరిష్కారానికి ఆర్బీఐ అనుమతించడాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజీ పరిష్కారం, సాంకేతికంగా రుణాల మాఫీ పేరుతో ఆర్బీఐ ఇటీవలే ఓ కార్యాచరణను ప్రకటించింది. ఇది బ్యాంకుల సమగ్రత విషయంలో రాజీపడడమేనని, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చడమేనని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్దేశపూర్వక ఎగవతేదారుల సమస్య పరిష్కారానికి కఠిన చర్యలనే తాము సమర్థిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించాయి. మోసం లేదా ఉద్దేశపూర్వక ఎగవేతదారులంటూ వర్గీకరించిన ఖాతాల విషయంలో రాజీ పరిష్కారానికి అనుమతించడం అన్నది న్యాయ సూత్రాలకు, జవాబుదారీకి అవమానకరమని వ్యాఖ్యానించాయి. నిజాయితీ పరులైన రుణ గ్రహీతలను నిరుత్సాహపరచడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఆర్బీఐ తాజా ఆదేశాలు షాక్‌కు గురి చేశాయని పేర్కొన్నాయి. ఇది బ్యాంకింగ్ రంగం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని నీరు గారుస్తుందని, డిపాజిట్ల నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్బీఐ తన నిర్ణయాన్ని ఉపంసహరించుకోవాలని డిమాండ్ చేశాయి. -
వేల కళ్లలో వెలుగులు
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: కాంట్రాక్టు ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తూ క్రమబద్ధీకరణ నిర్ణయంతో వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వంలో విలీనం చేసి 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తమవుతోంది. ♦ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, కార్వేటినగరం, పలమనేరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఉద్యోగులు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ♦ విజయనగరం జిల్లా కేంద్రంలో సీఎం జగన్ చిత్రపటానికి కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది క్షీరాభిషేకం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరులో సీఎం జగన్, మంత్రి దాడిశెట్టి రాజా ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ♦ సీఎం జగన్ మాట తప్పని, మడమ తిప్పని నేతగా మరోసారి రుజువు చేసుకున్నారని విజయనగరం జిల్లా వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.కనకరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీవైవీపీ కార్యాలయం వద్ద ఉద్యోగులతో కలిసి ఆయన సీఎం జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ♦ తమ జీతాలను ఏకంగా 23 శాతం పెంచిన ముఖ్యమంత్రి జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు శుక్రవారం గుంటూరులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని కలసి ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.అశోక్‌కుమార్, అధ్యక్షుడు ఎ.విజయ్‌భాస్కర్ తదితరులున్నారు. ♦ ఏపీ ఎన్జీవోలు కర్నూలు కలెక్టరేట్ వద్ద ప్లకార్డులతో ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి నివాసంలో గవర్నమెంట్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ♦ కడపలో కాంట్రాక్టు లెక్చరర్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ సురే‹Ùబాబు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మ శివప్రసాద్‌రెడ్డి, ఏపీఎన్జీవోస్ నేతలు పాల్గొన్నారు. ♦ క్రమబదీ్ధకరణ ద్వారా సీఎం జగన్ 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్విసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) అధ్యక్షుడు అరవా పాల్, జనరల్ సెక్రటరీ ఆర్.గోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీవీవీపీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 14 వేల మంది ఉద్యోగులకు భరోసా కల్పించారన్నారు. ♦ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరించి ముఖ్యమంత్రి జగన్ మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విజయవాడ వైఎస్సార్ పార్క్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. -
ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం
సాక్షి, అమరావతి: అడగకుండానే 12వ పీఆర్సీని ఏర్పాటు చేసినందుకు.. సీపీఎస్ ఉద్యోగులకు ఊరటనిస్తూ జీపీఎస్ విధానాన్ని తెచ్చి నందుకు.. పది వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినందుకు.. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు సీఎంతో సమావేశమైన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా సీఎం పాటుపడుతున్నారని ప్రశంసించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఉద్యోగుల కోసం పరితపిస్తున్న సీఎం జగన్ ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమానికీ పెద్దపీట వేస్తున్నారు. అడగకుండానే 12వ పీఆర్సీ ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 25 ఏళ్లుగా పనిచేసినా.. చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉంది. ఇప్పుడు ఒక్క నిర్ణయంతో వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించారు. ఏపీవీపీని ప్రభుత్వంలో విలీనం చేసి... ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఒకే హెచ్ఆర్ఏ ఇచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్ ద్వారా 50 శాతం ఫిట్మెంట్తో పెరిగే ధరలకు అనుగుణంగా డీఏలు ఇచ్చి పెన్షన్ ఇస్తామని చెప్పడం ద్వారా భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. మా కోసం ఇంతగా పరితపిస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. జగన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీ ఎత్తున పాలాభిషేకాలు చేస్తున్నారు. – బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం మానవతామూర్తి సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ 2008లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 ఎన్నికల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరిస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ ఇచ్చి న మాట మేరకు 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మానవతామూర్తి. గతంలో పీఆర్సీ కోసం రోడ్డెక్కితే టీడీపీ సర్కార్ గుర్రాలతో ఉద్యోగులను తొక్కించింది. ఇప్పుడు ఎవరూ అడగకుండానే సీఎం వైఎస్ జగన్ పీఆర్సీని ప్రకటించి.. ఉద్యోగుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. – శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీఎన్జీవో సంఘం ఎప్పటికీ రుణపడి ఉంటాం.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఎప్పటికీ రుణపడి ఉంటాం. – రత్నాకర్ బాబు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నేత జీపీఎస్‌తో మేలు జరుగుతుందని భావిస్తున్నాం జీపీఎస్‌లో పది శాతం ఉద్యోగి షేర్, ప్రభుత్వ షేర్ కొనసాగుతుందని సీఎం జగన్ చెప్పారు. ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్యారెంటీ పింఛన్ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. జీపీఎస్‌తో ఉద్యోగులకు 60 శాతం ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నాం. – మురళీ మోహన్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత 15 ఏళ్ల సమస్యకు సీఎం పరిష్కారం ఆస్పత్రుల్లో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు. రెగ్యులర్ ఉద్యోగులమైనా మాకు జీతాలు రావటం లేదు. కానీ సీఎం జగన్ దృష్టికి రాగానే ఒకే ఒక్క సంతకంతో సమస్య తీర్చారు. వైద్య విధాన పరిషత్ ద్వారా అత్యంత మెరుగైన సేవలు అందిస్తాం. – సురేష్ కుమార్, ఏపీవీపీ సంఘం నేత నా 23 ఏళ్ల సర్విసులో ఇది అద్భుతం నా 23 ఏళ్ల సర్విసులో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలకు సంబంధించి పరికరాలు ఏర్పాటు చేయడం అద్భుతం. కాంట్రాక్టు ఉద్యోగులమైన మమ్మల్ని రెగ్యులరైజ్ చేసినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – వీఏవీఆర్ కిశోర్, ఏపీ కాంట్రాక్టు ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
Manifesto: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి
(సాక్షి, అమరావతి) : ఓట్లడిగేటప్పుడు వందలకొద్దీ హామీలివ్వటం... తీరా ఆ ఓట్లతో గెలిచాక హామీలను పక్కనబెట్టడం!. దశాబ్దాలుగా ఇక్కడ చూస్తున్నది అదే. అలవికాని హామీలను చూసి చూసి అలసిపోయిన జనం... ఎన్నికలప్పుడు పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకు విలువివ్వటమే మానేశారు. వాటినసలు చూడకుండానే పక్కనబెట్టేస్తున్నారు. కాకపోతే 2019 ఎన్నికల్లో... ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. నాడు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్సార్ సీపీ తరఫున ఒకే ఒక పేజీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తానని స్పష్టంగా చెప్పారు. జనం జై కొట్టారు. ఓ కొత్త చరిత్రకు అంకురార్పణ జరిగింది. మరి సింగిల్ పేజీ మేనిఫెస్టోతో ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశారు? ఆ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశారా? దీనికి నిజాయితీగా వినవచ్చే సమాధానం ఒక్కటే. అది... ‘ఆ రెండూ తప్ప’ అని!. ఎందుకంటే మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకున్న జగన్... తొలి ఏడాదే దాన్లో పేర్కొన్న 95 శాతం హామీలను అమల్లోకి తెచ్చారు. మిగిలిన సంక్లిష్టమైన హామీలను కూడా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను (సీపీఎస్) రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను (ఓపీఎస్) తిరిగి అమల్లోకి తెస్తామన్న హామీని అమలు చేయలేకపోయారు. ఓపీఎస్‌ను తిరిగి తేవటం ఆచరణ సాధ్యం కాదని తేలినా... ఉద్యోగులకిచ్చిన హామీ మేరకు మెరుగైన పెన్షన్ పథకాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం రెండేళ్లుగా రకరకాల గ్రూపులతో చర్చించి కసరత్తు చేస్తూ వచ్చింది. చివరకు వారి ప్రయోజనాలను కాపాడేలా గ్యారంటీడ్ పెన్షన్ పథకానికి (జీపీఎస్) రూపకల్పన చేసింది. ఉద్యోగ వర్గాలంతా ఈ జీపీఎస్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీన్ని అమల్లోకి తేవటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది కూడా. ఇక అమలు కాని హామీల్లో రెండవది మద్య నియంత్రణ. దశలవారీగా మద్యం వినియోగాన్ని తగ్గిస్తూ చివరకు దాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నా... రకరకాల సాంకేతిక, ఆర్థిక కారణాలతో పూర్తి స్థాయిలో ఆ హామీ అమలు కాలేదు. కాకపోతే నియంత్రణ దిశగా బలమైన అడుగులుపడ్డాయి. 2018–19తో పోలిస్తే విక్రయాలు 50 శాతానికన్నా తగ్గాయంటే నియంత్రణ దిశగా అడుగులు పడ్డాయన్నది స్పష్టంగా తెలియకమానదు. కాకపోతే ఈ రెండంశాలూ హామీ ఇచ్చినట్లుగా నూటికి నూరు శాతం అమలు కాలేదు కనక... మేనిఫెస్టోలో 99 శాతమే అమలయ్యిందని చెప్పాలి. నూటికి 99 శాతం మార్కులే ఇవ్వాలి. ఇక్కడ గమనించాల్సిందొక్కటే. అసలు మేనిఫెస్టోను ఇంత చిత్తశుద్ధితో అమలు చేసిన ప్రభుత్వాలను మనమెన్నడైనా చూశామా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదని? 2014లో ఆయన ఇచ్చిన ఏ హామీనైనా గెలిచాక అమలు చేశారా? అసలు మేనిఫెస్టోనే పార్టీ వెబ్సైట్లో నుంచి తొలగించిన చరిత్ర ఆయనది. ఒకటికాదు రెండు కాదు... వందలకొద్దీ హామీలనిచ్చారు. కానీ తొలి నాలుగున్నరేళ్లూ ఒక్క హామీని కూడా పట్టించుకోలేదు. మళ్లీ 2019లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయనగా హడావుడిగా కొన్ని హామీలను అరకొరగానైనా అమలు చేశామని చూపించుకోవటానికి ప్రయత్నించారు. కొద్ది మంది ఖాతాల్లో రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతిని జమచేయటం... పసుపు కుంకుమ కింద మహిళల ఖాతాల్లో నగదు వేయటం... ఇవన్నీ ఎన్నికలకు కేవలం రెండుమూడు నెలల ముందు చేశారు. అంతేకాదు! ఈ రాష్ట్రానికి తీరప్రాంతమే మణిహా రమంటూ రకరకాల గ్రాఫిక్‌లు చూపించి... ఎన్నికలకు కేవలం 20 రోజుల ముందు పోర్టులకు శంకుస్థాపనలంటూ హడావుడి చేశారు. భోగాపురం విమానాశ్రయానిదీ అదే కథ. విచిత్రమేంటంటే ఇలా ఏ హామీనీ అమలు చెయ్యని చంద్రబాబు నాయుడు... 2019 ఎన్నికల్లో మాత్రం తాను చెప్పివన్నీ చేశానని, మళ్లీ గెలిపిస్తే ఇంకేదో చేస్తానంటూ స్వర్గాన్ని గ్రాఫిక్‌లలో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నిజాయితీగా తన పనితీరుకు మార్కులు వేసుకుంటున్నారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలు చేయటానికి ప్రయత్నించటంతో పాటు రెండంశాలు తప్ప మిగిలివన్నీ 100 శాతం అమలు చేశారు. 99 శాతం మార్కులు సాధించగలిగారు. రాజకీయ వర్గాలు ఈ రెండు మేనిఫెస్టోలనూ ‘విశ్వసనీయత– వంచన’తో పోలుస్తున్నది కూడా అందుకేనేమో!!. ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే.. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలతో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని సాధించాక 2019 మే 30న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ.. వృద్ధాప్య పింఛన్‌ను పెంచే ఫైలుపై తొలి సంతకం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 56 శాతం పదవులు ఇచ్చి సామాజిక విప్లవానికి తెరతీశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే.. నవరత్నాలతో 95 శాతం హామీలను అమలు చేశారు. కోవిడ్ కష్టకాలంలోనూ మాట తప్పకుండా వాటిని కొనసాగించారు. ఉద్యోగులు అడగక ముందే 12వ పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం... సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా జీపీఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీమ్) విధానానికి ఆమోదం తెలపటం... కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపడంతో మేనిఫెస్టో అమల్లో మరింత ముందడుగు వేసినట్లయింది. 99 శాతం హామీలను నెరవేర్చినట్లయింది. ఇబ్బందుల్లోనూ చెప్పిన దాని కంటే మిన్నగా.. 2020లో ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన కరోనా మహమ్మారి ప్రభావం రాష్ట్రంపైనా పడింది. ఆర్థిక ఇబ్బందులను సృష్టించింది. కరోనా కష్టకాలంలోనూ.. ఆర్థిక ఇబ్బందులున్నా హామీల అమల్లో సీఎం వైఎస్ జగన్ వెనుకంజ వేయలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ అమలు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతులకు ఇస్తాన ని మేనిఫెస్టోలో చెప్పిన సీఎం జగన్.. దాన్ని మరో వెయ్యి పెంచి ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చేలా అమలు చేస్తున్నారు. అంటే.. రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు అదనంగా రూ. 17,500 ప్రయోజనం చేకూరుస్తున్నారు. మేనిఫె స్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర పథకాలనూ అమల్లోకి తెచ్చారు. 2019 ఎన్నికల తర్వాత.. జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్.. తిరుపతి లోక్‌సభ, ఆత్మకూరు, బద్వే లు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయాలు సాధించడమే ఆయనపై జనానికున్న నమ్మకానికి నిదర్శనం. అర్హతే ప్రామాణికం కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ చూడకుండా.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అంతే పారదర్శకంగా అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.16,786 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇతరత్రా రూపాల్లో లబ్ధి చేకూర్చిన పథకాలు కూడా కలిపితే (డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ) లబ్ధిదారులకు రూ.3.10 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి పేరిట ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతోపాటు పక్కా గృహాన్ని మంజూరు చేసి, నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇలా 31 లక్షల మందికి ఇంటి స్థలాలను ఇచ్చి.. వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన దాఖాలు గతమెన్నడూ లేవు. -
ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని వెల్లడించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కలిగిన ఉద్యోగ సంఘాల నాయకులతో సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉద్యోగులకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు. పీఆర్సీ, డీఏ బకాయిలు రెండింటినీ కలిపి ఒకటిగా చేసి చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయని, ప్రభుత్వం అందుకు అంగీకరించినట్లు చెప్పారు. మూడు నెలలకు ఒక విడత చొప్పున, సంవత్సరానికి నాలుగు విడతలు, నాలుగేళ్లలో 16 విడతల్లో ఈ బకాయిలను ఉద్యోగులకు ఇస్తామని వివరించారు. మొదటి సంవత్సరం పది శాతం, రెండో సంవత్సరం 20 శాతం, మూడో సంవత్సరం 30 శాతం, నాలుగో సంవత్సరం 40 శాతం చొప్పున ఇస్తామన్నారు. ఏటా పది శాతం చొప్పున పెంచుకుంటూ నాలుగు సంవత్సరాల్లో మొత్తం బకాయిలను ఇస్తామన్నారు. దీనికి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయన్నారు. సీపీఎస్ కంటే మెరుగ్గా ఉద్యోగులకు సీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ఇకపై 010 పద్దు ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. త్వరలో కొత్త పీఆర్సీ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. ఉద్యోగుల స్పెషల్ పే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ అంశాలన్నింటికీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం శాఖల వారీగా ఉత్తర్వులిస్తామన్నారు. ఆలస్యమైనా.. అనుకూలంగానే ఇది ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని, ఉద్యోగులంతా తమ సోదరులేనని మంత్రి బొత్స పేర్కొన్నారు. తమ కుటుంబాల్లోనూ ఉద్యోగులున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల వల్ల వారికి ఇవ్వాల్సిన వాటి విషయంలో కొంత ఆలస్యం జరిగిందే కానీ, ఉద్యోగుల పట్ల సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి మొదటిరోజు చెప్పిన మాటకే సీఎం కట్టుబడి ఉన్నారని, దాని ప్రకారమే వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఓపిగ్గా సంప్రదింపులు జరిపిన ఉద్యోగ సంఘాలకు బొత్స అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్యం) చిరంజీవి చౌదురి, ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ కేవీవీ సత్యనారాయణ (సర్వీసెస్, హెచ్ఆర్), కార్యదర్శి పి.భాస్కర్, ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, పీఆర్టీయు అధ్యక్షుడు కృష్ణయ్య, యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు, ఏపీజీఈఏ కార్యదర్శి ఆస్కార్‌రావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 71 డిమాండ్లు నెరవేరాయి: బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎదుట ఉంచిన 71 డిమాండ్లలో దాదాపు అన్నీ పరిష్కారమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఐదేళ్లకోసారి పీఆర్సీ డిమాండ్‌ను పోరాడి సాధించుకున్నాం. ఆ డిమాండ్ ప్రకారం 7వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామన్నారు. స్పెషల్ పే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొత్తగా ఏర్పడిన 8 జిల్లాలకు హెచ్ఆర్ఏను 16 శాతం పెంచడం మంచి విషయం. ఇన్నాళ్లూ వైద్య శాఖలో ఏబీవీపీని ఓ ప్రైవేట్ కంపెనీలా చూసేవారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు దక్కినందుకు అభినందిస్తున్నాం. సీపీఎస్ ఉద్యోగుల విషయాన్ని కేబినెట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. అన్నీ పాజిటివ్ అంశాలే : వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన సమావేశంలో అన్ని అంశాలు ఉద్యోగులకు పాజిటివ్‌గా ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. సీఎం గతంలో చెప్పినట్లుగా పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారికి పెన్షన్ భద్రత కల్పించేలా చూస్తామన్నారు. స్పెషల్ పే ఇవ్వడానికి అంగీకరించారు. డీఏ, పీఆర్సీ బకాయిలను నాలుగేళ్లలో విడతలవారీగా ఇస్తామన్నారు. పలు సానుకూల నిర్ణయాలు: బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను చాలా వరకు నెరవేర్చింది. ఉద్యోగులకు అనుకూలంగా చాలా సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. పీఆర్సీ, డీఏ బకాయిలు మొత్తం రూ.7 వేల కోట్లు ఉంటాయి. వాటిని నాలుగేళ్లలో విడతలవారీగా చెల్లించేందుకు అంగీకరించారు. విభజన నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సుమారు 7, 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు అంగీకరించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపైనా సానుకూలంగా స్పందించారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వచ్చే కేబినెట్లో తీర్మానం చేస్తామన్నారు. ఇది కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.మురళీరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. 2014కు ముందు ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ నిర్ణయం తీసుకోవడం వారికి శుభవార్త అంటూ ఈ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతీ ఉద్యోగి సీఎంకు అండగా నిలుస్తారన్నారు. 22 ఏళ్ల సుదీర్ఘ కల నెరవేరుతోంది.. సీఎంకు ఏపీ స్టేట్ కాంట్రాక్టు ఫార్మసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఏపీ స్టేట్ కాంట్రాక్టు ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ స్వాగతించింది. 22 ఏళ్ల తమ సుదీర్ఘ కలను నెరవేరుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2001 నుంచి శాశ్వత ఉద్యోగ నియామకాలకు స్వస్తి పలికి కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకుంటూ వచ్చారని.. ఇప్పుడు 2–06–2014కు ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని ముఖ్యమంత్రి జగన్ రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రత్నాకర్‌బాబు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
గతంలో ఉద్యోగ సంఘాలను రాజకీయాలకు వాడుకున్నారు: సజ్జల
సాక్షి, విజయవాడ: గతంలో ఉద్యోగ సంఘాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేవారు. ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కాగా, సజ్జల బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉద్యోగులు లేకుండా ఏమీ చేయలేము. లక్ష్యాన్ని చేరుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి సరైన మార్గంలోనే వెళ్తుంది. గతంలో ఉద్యోగ సంఘాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేవారు. కానీ, సీఎం వైఎస్ జగన్ మాత్రం ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగంగానే చూస్తున్నారు. పరిపాలన ఎలా ఉండాలో మూడున్నర ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ చూపించి ఒక రోల్ మోడల్‌గా నిలిచారు. ప్రతిపక్షం మాయల మరాటీగా మీడియా మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని అబద్దాలను ప్రచారం చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
భౌగోళికంగా విడిపోయినా మనసులు కలిసే ఉన్నాయి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భౌగో ళికంగా విడిపోయినప్ప టికీ మన మనసులు కలిసే ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యా టక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొ న్నారు. తెలుగు ప్రజలకు మంత్రి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా వెళ్లి శ్రీనివాస్‌గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీలోని జేఏసీ, అమరావతి ఉద్యోగుల సంఘాల నాయకులు బొప్పరాజు, వైవీ రావు తదితరులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో చిరకాల మిత్రుడు బొప్పరాజుతో కలసి కొన్ని దశాబ్దాలు ఉద్యోగ సమస్యలపై కలసి పనిచేశామని గుర్తు చేశారు. ప్రభు త్వంతో ఘర్షణ వైఖరి లేకుండా సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి, ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకొని వెళుతూ పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలనే సంకల్పం విజయ వంతం కావాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భగవంతుడు మరింత శక్తినివ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. -
సీఎం జగన్ ను కలిసిన పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు
-
కార్మిక హక్కులకు అసలు ప్రమాదం
మంచి జీవితాన్ని గడిపే హక్కు, సంపదను కొంతమంది చేతుల్లో కేంద్రీకరించని ఆర్థిక వ్యవస్థ, పనిలో మానవీయ పరిస్థితులు... ఇలా రాజ్యాంగ ప్రవేశికలో ప్రజల మనోభావాలన్నింటికీ రూపమివ్వడమే కాకుండా సోషలిస్టు అనే పదం కూడా జోడించారు. కానీ ఆచరణలో వేతనాలు, జీవన ప్రమాణాలు, యూనియన్ పెట్టుకునే హక్కు గగన కుసుమాల్లాగే మారాయి. వందేళ్లుగా అనేక పోరాటాలు, త్యాగాలతో కార్మికులు తమ హక్కులను కాపాడుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 46 లేబర్ చట్టాలను తొలగించి వాటి స్థానంలో 4 చట్టాలను తీసుకురావాలనుకుంటోంది. కార్మిక సంఘాలు ఈ మార్పుల పట్ల తీవ్ర ఆందోళనగా ఉన్నాయి. వారి డిమాండ్ల పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న మౌనం ప్రమాదకరంగా కనిపిస్తోంది. భారతీయ కార్మికవర్గం మొదటినుంచీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకుంటూ వచ్చింది. 1908లో ముంబైలో చేసిన ఆరురోజుల సమ్మె, 1913లో కెనడాలోని పంజాబీ వలస కార్మికులు స్థాపించిన గదర్ పార్టీ, 1930లో నాలుగురోజుల పాటు నడిచిన సోలాపూర్ కమ్యూన్ లాంటి వాటివల్ల భారత కార్మికవర్గం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1930లో కార్మికులు కలకత్తా కాంగ్రెస్ సెషన్‌లోకి దూసుకెళ్లినప్పుడు పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకటించడానికి దారి తీసింది. 1937లో కిసాన్ సభ, వర్కర్స్ పీసెంట్స్ పార్టీ కార్యాచరణలు, యునైటెడ్ ప్రావెన్స్‌లలో జమీందారీ వ్యవస్థ రద్దు తీర్మానాలకు దారితీశాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ దళాలకు సరఫరాలు తీసుకెళ్లడానికి 1945లో ముంబై, కలకత్తా డాక్ వర్కర్లు తిరస్కరిం చారు. 1946లో రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటుకు ముంబై కార్మిక వర్గం ఇచ్చిన వీరోచిత మద్దతు బ్రిటిష్ రాజ్‌కి చివరి సమాధి రాయిగా మారింది. ఈ కాలంలోనే, దేశంలో మొట్టమొదటి కార్మిక వర్గ సమాఖ్య అయిన అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌కు (ఇది తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీకి అనుబంధ సంస్థగా మారి పోయింది) బలమైన రాజకీయ మద్దతు లభించింది. లాలా లజపతి రాయ్ నుంచి జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సరోజిని నాయుడు వరకు ఈ సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు. మరోవైపున 1944లో ‘ఎ బ్రీఫ్ మెమొరాండమ్ అవుట్‌లైనింగ్ ఎ ప్లాన్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా’ (బాంబే ప్లాన్‌గా సుప్రసిద్ధమైంది) ప్రచురితమైంది. ఈ ప్లాన్‌పై జేఆర్‌డి టాటా, ఘన శ్యామ్ దాస్ బిర్లా, అర్దెషిర్ దలాల్, లాలా శ్రీరామ్, కస్తూర్ బాయి లాల్ భాయి, అర్దేషిర్ దారాబ్ ష్రాఫ్, పురుషోత్తమ్ దాస్ ఠాకూర్‌దాస్, జాన్ మథాయి వంటి ప్రముఖులు సంతకాలు పెట్టారు. జోక్యం చేసుకునే ప్రభుత్వం, ప్రభుత్వ రంగానికి ప్రాముఖ్యత ఉండే ఆర్థిక వ్యవస్థను బాంబే ప్లాన్ ప్రబోధించింది. ఆనాటి పెట్టుబడిదారీ వర్గం జాతీయవాద ఆకాంక్షలను ఒక మంచి మౌలికరంగ వ్యవస్థను అభి వృద్ధి చేసేవైపునకు మళ్లించాలనీ, అది దేశీయ ప్రైవేట్ పరిశ్రమకు పునాది వేస్తుందనీ భావించింది. మంచి జీవితాన్ని గడిపే హక్కు, సంపదనూ, ఉత్పత్తి సాధనా లనూ కొంతమంది చేతుల్లో కేంద్రీకరించని ఆర్థిక వ్యవస్థ, స్త్రీపురుషు లకు సమానవేతనం, ఆర్థిక అవసరాల పేరిట కార్మికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకపోవడం, వృద్ధాప్యం, వ్యాధులు, అంగవైకల్యం వంటి అంశాలలో సాయం చేయడం... ఇలా రాజ్యాంగ ప్రవేశికలో ప్రజల మనోభావాలన్నింటికీ రూపమివ్వడమే కాకుండా సోషలిస్టు అనే పదం కూడా దానికి జోడించారు. కానీ ఆచరణలో వేతనాలు, జీవన ప్రమాణాలు, యూనియన్ పెట్టుకునే హక్కు, అస్థిరత నుంచి పరి రక్షించే హక్కు వంటివి గగన కుసుమాల్లాగే మారాయి. 1920లో ఏఐటీయూసీ ఏర్పడిన నాటి నుంచీ గత వందేళ్లుగా అనేక పోరాటాలు, అనంత త్యాగాల నుంచే కార్మికులు తమ హక్కు లను కాపాడుకుంటూ వచ్చారు. భద్రతా ప్రమాణాలను నెలకొల్పి, పరిమిత పనిగంటలను కల్పించిన ఫ్యాక్ట రీస్ యాక్ట్, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, కనీస వేతనాల చట్టం వంటివి స్వాతంత్య్రం సిద్ధించిన ప్రారంభ సంవత్స రాల్లోనే ఏర్పడుతూ వచ్చాయి. 1950లలో విభిన్న కార్మిక బృందాలు తమ సమ్మె శక్తి ద్వారానే డాక్ వర్క్స్ చట్టం, గనుల చట్టం, ప్లాంటేషన్ యాక్ట్, సినీ వర్కర్స్ యాక్ట్, వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ వంటివి సాధించుకున్నారు. పెరుగుతున్న ప్రైవేట్ రంగం, రాజకీయాల్లో ప్రైవేట్ పరిశ్రమ దారుల బలం పెరుగుతూ వచ్చిన క్రమంలో రకరకాల పరిణామాలు సంభవించాయి. ప్రభుత్వ రంగం అనేది సామాజిక, ఆర్థిక సము ద్ధరణ లక్ష్యంతో పనిచేయడం కాకుండా లాభాలను సృష్టించే రంగంగా మారిపోసాగింది. శాశ్వత కార్మికులు సోమరులుగా ఉంటు న్నారనీ, కూర్చుండబెట్టి మరీ జీతాలు ఇస్తున్నారనే భావాలు కొత్తగా ఏర్పడే క్రమంలో లేబర్ వెసులుబాటు పేరుతో ఉద్యోగాల్లోకి తీసు కోవడం, ఉద్యోగాల్లోంచి తొలగించడం వంటి పద్ధతులు పుట్టు కొచ్చాయి. వెనువెంటనే మానవశక్తిని తగ్గిస్తూ, యాంత్రికీకరణను పెంచే ధోరణులు ప్రారంభమయ్యాయి. మొదట్లో పర్మనెంట్ వర్కర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. వారి స్థానంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరగసాగింది. 1950ల చివరలో భిలాయి స్టీల్ ప్లాంటులో 96 వేలమంది పర్మనెంట్ కార్మికులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య పదివేలకు పడిపోయింది. వారి స్థానంలో 40 వేలమంది కాంట్రాక్టు కార్మికులు వచ్చి చేరారు. వీరికి పర్మనెంట్ కార్మికుల జీతాల్లో మూడో వంతు కూడా దక్కడం లేదు. 1970లో వచ్చిన కాంట్రాక్ట్ లేబర్ (క్రమబద్ధీకరణ మరియు రద్దు) చట్టం పారిశ్రామిక రంగంలోని కార్మి కులకు అనుకూలంగా ఉన్న చిట్టచివరి చట్టాల్లో ఒకటి. కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థను తొలగించడం సాధ్యం కాకున్నా కాంట్రాక్ట్ కార్మికుల పని పరిస్థితులను మెరుగుపర్చి వారి వేతనాలకు, నిత్యాసరాలకు హామీ ఇచ్చేందుకు ఈ చట్టం వీలు కల్పించింది. కీలకమైన ఉత్పత్తి రంగంలో నిపుణ శ్రమలు, కఠిన శ్రమలు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా నామమాత్రపు కూలీ మాత్రమే దక్కుతోంది. 1974లో చారిత్రాత్మక రైల్వే సమ్మెలో 17 లక్షలమంది పాల్గొనగా 20 రోజులపాటు భారతదేశం స్తంభించిపోయింది. ఎమ ర్జెన్సీ విధింపునకు, నూతన పాలనకు కూడా ఇదొక కారణమని చెబుతుంటారు. ఈ సమ్మె తర్వాతే రైల్వే కార్మికుల్లో కాంట్రాక్టీరణ శర వేగంతో సాగింది. ఈరోజు లోకో పైలట్లు, ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామి నర్లు వంటి వివిధ విభాగాల కార్మికులు రైల్వే నియమాకం చేసినవారు కాదు. కేటరింగ్ స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్, గ్యాంగ్మెన్లు కూడా కాంట్రాక్టు కార్మికులుగా మారిపోయారు. ముంబైలో 1982లో 65 మిల్లులలోని 2.5 లక్షలమంది మిల్లు కార్మికులు తలపెట్టిన గొప్ప సమ్మె విషాదకరగా మిల్లులు మూసి వేతకు, భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు దారితీసింది. అప్పట్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు తమకు రావలసిన బకాయిల కోసం నేటికీ దీనంగా ఎదురుచూస్తున్నారు. 2011–12లో గుర్గావ్లో మారుతి సుజుకిలో జరిగిన సాహసోపేతమైన సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణిచేశారు. ఆ ఫ్యాక్టరీకి చెందిన మేనేజర్ హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలో కొంతమంది కార్మిక నేతలు నేటికీ జైల్లో ఉంటున్నారు. ఉద్యోగాల వాటా ప్రకారం చూస్తే దేశ అసంఘటిత రంగంలో 83 శాతం మంది ఉండగా 17 శాతం మాత్రమే సంఘటిత రంగంలో ఉంటున్నారు. కానీ ఎంప్లాయ్మెంట్ స్వభావం బట్టి చూస్తే, మన దేశంలో 92.4 శాతం మంది కార్మికులు అనియత రంగంలోనే ఉన్నా రని బోధపడుతుంది. వీరంతా రాతపూర్వక కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో లేరు కాబట్టి లేబర్ చట్టాలు వీరికి వర్తించవు. భారత్‌లో నిజవేతన పెరుగుదల ఆసియాలోనే అతి తక్కువ అని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. 2015–2018 వరకు భారత్‌లో నిజ వేతన పెరుగు దల 2.8 నుంచి 2.5 శాతానికి దిగజారుతూ వస్తోందని తెలిపింది. పాకిస్తాన్, శ్రీలంక, చైనా, నేపాల్ వంటి పొరుగు దేశాలతో పోలిస్తే కూడా భారత్‌లో నిజవేతన పెరుగుదల చాలా తక్కువగా నమోదైంది. ఈరోజు, కార్మికుల్లో చాలా తక్కువమంది యూనియన్లలో ఉంటున్నారు. అసంఘటిత రంగంలోని వివిధ సెక్షన్ల కార్మికులు ప్రత్యే కించి నిర్మాణ కార్మికులు, సఫాయి కర్మచారీలు, హాకర్లు వంటి వారు తమను కాపాడే చట్టాల కోసం పోరాడుతున్నారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశంలోని 46 లేబర్ చట్టాలను తొలగించి వాటిస్థానంలో 4 చట్టాలను తీసుకురావాలనుకుంటోంది. కానీ బీజేపికి చెందిన భార తీయ మజ్దూర్ సంఘంతో సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు ఈ మార్పుల పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ కార్మిక సంఘాల కనీసపాటి డిమాండ్ల పట్ల కూడా కేంద్రం ప్రదర్శిస్తున్న మౌనం మరింత భయంకరంగా కనిపిస్తోంది. వ్యాసకర్త న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త -
28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు మద్దతు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని ట్రేడ్ యూనియన్లు ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్కేవీ కార్మిక విభాగం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. సార్వత్రిక సమ్మె విజయవంతానికి అన్ని ట్రేడ్ యూనియన్లతో ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్‌హౌజ్‌లో తెలంగాణ రాష్ట్ర సన్నాహక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ పీఎస్‌యూల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. లాభాలతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్ర పూరితంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించిందన్నారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ, రైల్వే, బ్యాంక్, బీడీఎల్, హెచ్ఏఎల్, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ తదితర సంస్థల కార్మిక సంఘాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, పీఎస్‌యూ కార్మిక సంఘాల రాష్ట్ర కన్వీనర్ వి.దానకర్ణాచారి, రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఎల్.రూప్ సింగ్ పాల్గొన్నారు. -
హృదయాలను కదిలిస్తున్న జ్యూట్ మిల్లు కార్మికుల ఆవేదన
-
కేంద్రానికి ఈమెయిల్ ద్వారా మెసేజ్‌లు
-
AP: చర్చలకు సరే
సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోలను రద్దు చేస్తే కానీ మంత్రుల కమిటీతో చర్చలకు హాజరు కాబోమని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాలు పట్టువిడుపు ప్రదర్శించాయి. మంత్రుల కమిటీ నుంచి తమకు లిఖిత పూర్వకంగా ఆహ్వానం వస్తే చర్చలకు వెళతామని సోమవారం పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆ తరువాత కొద్దిసేపటికే మంత్రుల కమిటీ నుంచి వారికి లిఖితపూర్వక ఆహ్వానం అందడంతో ప్రతిష్టంభనకు తాత్కాలికంగా తెరపడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో చర్చలకు రావాలని మంత్రుల కమిటీ తరఫున జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆహ్వానించారు. పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, కె. వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేవీ శివారెడ్డి, సీహెచ్ కృష్ణమూర్తి తదితర 20 మంది పేర్లను లేఖలో పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాకు ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్ హాలులో సమావేశానికి రావాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి పంపిన ఆహ్వానంలో సూచించారు. చర్చలకు సిద్ధమే: స్టీరింగ్ కమిటీ మంత్రుల కమిటీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ప్రస్తుత పరిణామాలు, కార్యాచరణ, ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాత జీతాలే ఇవ్వాలని కోరతాం: బొప్పరాజు ఈనెల 3వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి అల్లూరి సీతారామరాజు వంతెన మీదుగా భాను నగర్ చేరుకుని సభ నిర్వహిస్తామన్నారు. 7వతేదీ నుంచి సమ్మె తలపెట్టిన నేపథ్యంలో న్యాయపరమైన అంశాలను ఎదుర్కొనేందుకు ఇద్దరు హైకోర్టు సీనియర్ న్యాయవాదులు వైవీ రవి ప్రసాద్, సత్యప్రసాద్‌లను నియమించుకున్నామని తెలిపారు. కొత్త జీవోలను నిలిపివేసి పాత జీతాలే చెల్లించాలని చర్చల్లో కోరతామన్నారు. మేం రాలేదనడం సరికాదు: బండి ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడం లేదని మంత్రుల కమిటీ పేర్కొనడం సరికాదని ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. స్టీరింగ్ కమిటీలోని 9 మంది సభ్యులంతా చర్చలకు సంబంధించిన అంశంపై సంతకాలు చేసి పంపినట్లు తెలిపారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో అర్ధం కావడం లేదన్నారు. రివర్స్ పీఆర్సీతో గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. భయపెట్టేలా మెమోలు: సూర్యనారాయణ తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ కోరారు. జీతాల చెల్లింపుపై అధికారులు భయపెట్టే విధంగా ఖజానా శాఖ ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఆటవిక చర్యని విమర్శించారు. ఆర్ధికశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. బెదిరింపులకు లొంగేది లేదని, అవసరమైతే న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఆర్థిక శాఖలోని ఐఏఎస్ అధికారులపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రింటెడ్ చార్జీ మెమోలకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనల ప్రకారం సీసీఏ రూల్ 20 ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాలన్నారు. సర్వీస్ రిజిస్టర్ లేకుండా పే ఫిక్సేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. చలో విజయవాడ సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని స్టీరింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు.