టార్గెట్ టీబీజీకేఎస్..!
Published Fri, Jul 22 2016 12:17 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
గుర్తింపు సంఘం ఎన్నికల్లో
కలిసి పోటీ చేయనున్న
ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ?
ఆ దిశగా అడుగులు వేస్తున్న సంఘాలు
గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో జాతీయ కార్మిక సంఘాలు ఏకం కానున్నాయా..? రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఓడించాల నే లక్ష్యంతో జట్టు కడుతున్నాయా..? ఇందుకు ఇటీవలి పరిణామాలు అనుకూల సంకేతాలిస్తున్నాయి.
సింగరేణిలో 1998 నుంచి ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికలు ఇప్పటి వరకు ఐదు సార్లు జరిగాయి. మూడు సార్లు ఏఐటీయూసీ, ఒక్కో సారి ఐఎన్‌టీయూ సీ, టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా గెలుపొందారుు. ఎన్నిక తేదీని బట్టి చూస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీబీజీకేఎస్ కాల పరిమితి ముగిసింది. అరుుతే సెప్టెం బర్ లేక అక్టోబర్‌లో గుర్తింపు ఎన్నికలు జరిగే అవకాశాలున్నారుు. ఈ సారి టీబీజీకేఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనే లక్ష్యంతో పలు జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.
ఏడాది క్రితం నుంచే..
దేశవ్యాప్తంగా బొగ్గుగనుల్లో కార్మికులు ఎదుర్కొంటు న్న పలు సమస్యల పరిష్కారం కోసం ఏడాది క్రితం నుంచి జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో పాటు వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టా యి. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలనే ఆలోచనకు ఏఐటీయూసీ నుంచి ప్రతిపాదన రాగా అందుకు ఐఎన్‌టీయూసీ సైతం అంగీకరించింది. త్వరలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండడంతో ఇరు సంఘాలు కలిసి పోటీ చేయడానికి ముందుకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయి తే సింగరేణిలో కొనసాగుతున్న ఐఎన్‌టీయూసీలోని రెండు సంఘాలను కలిపితే తాము కలిసి పోటీ చేయడానికి సిద్ధమని ఏఐటీయూసీ నాయకత్వం ప్రతిపాదన తెచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి సింగరేణిలో ఐఎన్‌టీయూసీలోని రెండు సంఘాలను కలిపే ప్రయత్నం చేసి సఫలమయ్యారు.
ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ ఒక అవగాహనకు వచ్చి ఏఐటీయూసీ బ్యానర్‌పైనే సింగరేణి ఎన్నిక ల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు కూడా కోల్‌బెల్ట్‌లో ప్రచారం జరుగుతున్నది. ఇదే గనుక నిజమైతే సింగరేణిలో అధికార కార్మిక సంఘం టీబీజీకేఎస్‌కు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నారుు. ఐఎన్‌టీయూసీలోని రెండు సంఘాలు, ఏఐటీయూసీ కలిస్తే మరింత బలం పెరిగి గుర్తింపు ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు మొండుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకపోవడం, సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించకపోవడం ఆ యూనియన్‌కు ఇబ్బంది కరంగా మారే పరిస్థి తి ఉందని అంటున్నారు.
Advertisement
Advertisement