Association elections
-
సినిమా ఇండస్ట్రీలో కులం లేదు..అలా చేయడం తప్పు : డైరెక్టర్
Director Samudra Contesting In Directors Association Elections: ‘‘డైరెక్టర్స్ అసోసియేషన్‌కు డిసిప్లిన్, డిగ్నిటీ, డీసెన్సీ ఉన్నాయి. ఎలక్షన్స్‌లో భాగంగా కొందరు కులప్రస్తావన తీసుకువస్తున్నారు. ఇది తప్పు. సినిమా ఇండస్ట్రీలో కులం లేదు. సినిమా ఇండస్ట్రీలో దర్శకులు, హీరోలు, నిర్మాతలు.. అందరిదీ ఒకటే కులం’’ అన్నారు దర్శకుడు సముద్ర. ఈ నెల 14న (ఆదివారం) హైదరాబాద్‌లోని ఫిలింనగర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో దర్శకుల సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దర్శకుల సంఘం అధ్యక్ష పదవికి వి.సముద్ర పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తన ప్యానల్‌ను గురించిన వివరాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సముద్ర మాట్లాడుతూ – ‘‘ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావుగారి జయంతిని మే 3,4 తేదీల్లో ఓ పండగలా చేస్తాం. డైరెక్టర్స్ డే (ప్రముఖ దివంగత దర్శకులు దాసరినారాయణరావు జయంతిన దర్శకుల సంఘం అసోసియేషన్ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేయాలనుకుంటున్నాం. అన్నపూర్ణ క్యాంటీన్, ‘మా’ అసోసియేషన్‌లో కథల రిజిస్ట్రేషన్, లెజెండ్ సెంచరీ అవార్డ్స్లను మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. హామీలను నేరవేర్చకపోతే మే 5న రాజీనామా చేస్తాను.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సముద్ర ప్యానెల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే..ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్న కారణంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని, ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న జర్నలిస్టు ప్రభు నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ విషయమై ప్రభు హైకోర్టును ఆశ్రయించగా, ఆయన ఎన్నికల్లో పోటీ చేయవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. కొందరు వ్యక్తులు చేస్తున్న అప్రజాస్వామిక వ్యవహారాలకు ఈ తీర్పు చెంపపెట్టు అని ప్రభు అన్నారు. -
నాయీ బ్రాహ్మణ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లింగం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నాయీ బ్రాహ్మణ అడ్డకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హైకోర్టు అడ్వకేటు మద్దికుంట లింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కర్మాన్‌ఘాట్‌లోని జస్టిస్ వేణుగోపాలరావు కమ్యూనిటీ భవనంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. కార్యవర్గ సమావేశంలో న్యాయవాదులు సీఎల్ఎన్ గాంధీ, రామానందస్వామి, నాగన్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను అధ్యక్షుడిగా ఎన్నుకుందుకు కమ్యూనిటీ న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల హక్కుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్థానని పేర్కొన్నారు. మద్దికుంట లింగం గతంలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. -
నేడు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి నేడు ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష స్థానానికి ఆర్.వినోద్‌రెడ్డి, సి.దామోదర్‌రెడ్డి, పొన్నం అశోక్‌గౌడ్, మద్దిరెడ్డి శంకర్ పోటీపడుతున్నారు. ఉపాధ్యక్ష స్థానానికి ఆరుగురు పోటీ చేస్తున్నారు. కార్యదర్శుల పోస్టుల బరిలో ఐదుగురు ఉన్నారు. వీరిలో నుంచి ఇద్దరు కార్యదర్శులుగా ఎన్నికవుతారు. సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యుల పోస్టులకు సైతం పలువురు పోటీ చేస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఎన్నిక జరుగుతుంది. -
ముగిసిన మత్స్య పారిశ్రామిక సంఘం ఎన్నికలు
పోచమ్మమైదాన్ : జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు శుక్రవారం తో ఎన్నికలు ముగిశాయి. భూపాలపల్లి మం డ లం ఉడతలకొత్తపల్లి సంఘం అధ్యక్షుడిగా మం డల రవీందర్, ఉపాధ్యక్షుడిగా సమ్మయ్య, కార్యదర్శిగా మర్రి రాజ య్య, మద్దూరు మండలం వల్లంపట్లకు నారదాసు శ్రీధర్, చిట్టి లింగం, లింగయ్యలు ఎన్నికయ్యారు. అలాగే ధర్మసాగర్ మండలం వేలేరు అధ్యక్షుడిగా రాజు, ఉపా«ధ్య క్షుడిగా పిట్టల రాజు, ప్రధానకార్యదర్శిగా శంకరయ్య, భూపాలపల్లి మండలం గొర్లవీడుకు మొగిలయ్య, సాగర్, రావుల శంకరయ్య, కేసముద్రం మండలం పెనుగొండకు చిన్న లక్ష్మయ్య, వెంకన్న, నరేష్, లింగాలఘన్పూర్ మండలం నాగారం అధ్యక్షునిగా రాజేందర్, వెంకటయ్య, రవి, సంగెం మండ లం గవిచర్లకు రావుల బిక్షపతి, రఘుపతి, రాజులు ఎన్ని కయ్యారు. మొగుళ్ళపల్లి మండలం పోతుగల్‌కు రమేష్, చిలువరు రమేష్, నా రాయణ, డోర్నకల్ మండలం మన్నెగుడెంకు బాబు, రోశయ్య, ఉపేంద్ర, వెంకటాపూ ర్ మండలం పెద్దపూర్‌కు శ్రీనివాస్, సారయ్య, వీరయ్యలు ఎన్ని క య్యారు. అలాగే నర్సింహులపేట మండలం పెద్ద ముప్పారం కొండ వెంకన్న, రాంచందర్, ఎల్లయ్య, పర్వతగిరికి నీరటి శ్యాం, చంద్రయ్య, వెంకటేశ్వర్లు, నెక్కొండ మం డలం తపనపల్లికి సురేష్, భిక్షపతి, శ్రీని వాస్, భూపాలపల్లి మం డలం వెలిశాలపల్లికి పర్శబోయిన సాంబయ్య, లక్ష్మయ్య, స్వామిలు ఎన్ని కయ్యారు. తొర్రూర్ మండలం అమ్మపురం రా జు, రవి, యాకయ్య, «ధర్మాసాగర్ మండలం ధర్మసాగర్‌కు సదానం దం, శ్రీనివాస్, సుధాకర్, పరకాల మండలం నడికూడకు రాజు, బాబు, రమేష్‌లు ఎన్ని కయ్యారు. మరిపెడ మండలం ఉగ్గంపల్లికి యాక య్య, ఉప్పలయ్య, సుధాకర్, కిల్లించర్లకు ధనుం జయ, సత్యం, ఉపేందర్, చెన్నారావుపేట ము గ్దంపురం ప్రభాకర్, రవి, సాంబయ్య, నెల్లికుదు రు మండలం మేచరాజుపల్లికి విజయ్ కుమార్, వెంకన్న, గొడుకు వెంకన్నలు ఎన్నికయ్యారు. కురవి మండలం నారాయణపురం పిట్టల రామక్రిష్ణ, వీ రయ్య, సత్యం, చిట్యాల మండలం ఓడితలకు రాజయ్య, కృష్ణ, రాజేందర్లు ఎన్ని కయ్యారు. అలాగే నల్లబెల్లి మండలం శనిగరం నీలం రవి, రాజు, నర్సింహులు, ఆత్మకూరు మండలం కొగిల్వాయి వీరయ్య, అనిల్, లక్ష్మ య్యలు ఎన్ని కయ్యారు. బచ్చన్నపేట మండలం కో న్నం శ్రీనివాస్, బైరయ్య, బాలయ్య, వెంకటాపూర్ మండలం అడవి రంగాపూర్ మల్ల య్య, సమ్మయ్య, దేవేందర్, పర్వతగిరి మం డలం సోమారం అధ్యక్షునిగా చిట్ల శ్యాం, ఉపాధ్యక్షుడిగా పాడయ్య, కార్యదర్శిగా శ్రీనివాస్‌లు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఎఫ్డీఓలు వేణుగోపాల్, నరేష్ కుమార్ నాయుడు, సీనియర్ అసిస్టెంట్ రియాజ్ అహ్మద్, కిరణ్ కుమార్, వీరన్నలు వ్యవహరించారు. -
టార్గెట్ టీబీజీకేఎస్..!
గుర్తింపు సంఘం ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ? ఆ దిశగా అడుగులు వేస్తున్న సంఘాలు గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో జాతీయ కార్మిక సంఘాలు ఏకం కానున్నాయా..? రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఓడించాల నే లక్ష్యంతో జట్టు కడుతున్నాయా..? ఇందుకు ఇటీవలి పరిణామాలు అనుకూల సంకేతాలిస్తున్నాయి. సింగరేణిలో 1998 నుంచి ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికలు ఇప్పటి వరకు ఐదు సార్లు జరిగాయి. మూడు సార్లు ఏఐటీయూసీ, ఒక్కో సారి ఐఎన్టీయూ సీ, టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా గెలుపొందారుు. ఎన్నిక తేదీని బట్టి చూస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీబీజీకేఎస్ కాల పరిమితి ముగిసింది. అరుుతే సెప్టెం బర్ లేక అక్టోబర్‌లో గుర్తింపు ఎన్నికలు జరిగే అవకాశాలున్నారుు. ఈ సారి టీబీజీకేఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనే లక్ష్యంతో పలు జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఏడాది క్రితం నుంచే.. దేశవ్యాప్తంగా బొగ్గుగనుల్లో కార్మికులు ఎదుర్కొంటు న్న పలు సమస్యల పరిష్కారం కోసం ఏడాది క్రితం నుంచి జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో పాటు వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టా యి. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలనే ఆలోచనకు ఏఐటీయూసీ నుంచి ప్రతిపాదన రాగా అందుకు ఐఎన్టీయూసీ సైతం అంగీకరించింది. త్వరలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండడంతో ఇరు సంఘాలు కలిసి పోటీ చేయడానికి ముందుకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయి తే సింగరేణిలో కొనసాగుతున్న ఐఎన్‌టీయూసీలోని రెండు సంఘాలను కలిపితే తాము కలిసి పోటీ చేయడానికి సిద్ధమని ఏఐటీయూసీ నాయకత్వం ప్రతిపాదన తెచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి సింగరేణిలో ఐఎన్‌టీయూసీలోని రెండు సంఘాలను కలిపే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ ఒక అవగాహనకు వచ్చి ఏఐటీయూసీ బ్యానర్‌పైనే సింగరేణి ఎన్నిక ల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు కూడా కోల్‌బెల్ట్‌లో ప్రచారం జరుగుతున్నది. ఇదే గనుక నిజమైతే సింగరేణిలో అధికార కార్మిక సంఘం టీబీజీకేఎస్‌కు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నారుు. ఐఎన్‌టీయూసీలోని రెండు సంఘాలు, ఏఐటీయూసీ కలిస్తే మరింత బలం పెరిగి గుర్తింపు ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు మొండుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకపోవడం, సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించకపోవడం ఆ యూనియన్‌కు ఇబ్బంది కరంగా మారే పరిస్థి తి ఉందని అంటున్నారు. -
ప్రచార వే'ఢీ'
రీజియన్‌లో మారిన సమీకరణలు 19 న పోలింగ్ సత్తుపల్లి టౌన్ : గుర్తింపు సంఘం ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆర్టీసీలో ప్రచార వేడి ఊపందుకుంది. ఈ నెల 19న పోలింగ్ జరగనుండడంతో కార్మికులు, నాయకులు బిజీబిజీగా మారారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ దఫా పొత్తుల సమీకరణలు మారాయి. ప్రధానంగా రీజియన్ పరిధిలో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి, టీఎంయూల మధ్యే పోటీ నెలకొంది. అరుుతే గత ఎన్నికల్లో ఈ రెండు కలిసి పోటీ చేశాయి. రాష్ట్రంలో ఎంప్లాయీస్ యూనియన్ అధికారంలోకి రాగా, రీజియన్‌లో స్పష్టమైన ఓట్లు రాకపోవటంతో ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా కొనసాగింది. రీజియన్‌లో సగం ఓట్లు వస్తేనే గుర్తింపు.. ఖమ్మం రీజియన్‌లో మూడువేల మంది కార్మికులు ఉండగా 2844 మందికి ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ, ఎన్ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఐఎన్టీయూసీ సంఘాలు మాత్రమే ఉండగా, ఈ ఎన్నికల్లో కొత్తగా బీకేయూ(బహుజన కార్మిక సంఘం) ఆవిర్భవించింది. రీజియన్‌లోని 2844 ఓట్లకు గాను 1423 ఓట్లు ఏ యూనియన్‌కు వస్తే ఆ యూనియన్‌కు రీజినల్ గుర్తింపు వస్తుంది. ఏ సంఘానికి మొత్తం ఓట్లలో సగం ఓట్లు రాకపోతే రాష్ట్రంలో ఏ యూనియన్ గుర్తింపులో ఉంటే ఆ యూనియన్నే జిల్లా స్థానిక గుర్తింపు సంఘంగా పరిగణిస్తారు. ఒక్కో కార్మికుడికి రెండు ఓట్లు.. ఆర్టీసీలో ప్రతి కార్మికుడికి రెండు ఓట్లు ఉంటాయి. ప్రతి ఓటరు క్లాస్-6 రీజియన్‌లో, క్లాస్-3 రాష్ట్రస్థాయిలో ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ మొత్తం కార్మిక శాఖ అధికారులు నిర్వహిస్తారు. రీజియన్‌లోని ఖమ్మం,మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోలలో ఈ నెల 19న ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలు ప్రకటిస్తారు. మారిన పొత్తులు.. సమీకరణలు.. గత ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో టీఎంయూ మద్దతుతో ఈయూ రాష్ట్ర గుర్తింపు సాధించింది. జిల్లాలో స్థానిక గుర్తింపుకు కావాల్సిన ఓట్లు ఏ యూనియన్‌కు రాకపోవటంతో రాష్ట్రగుర్తింపు సంఘంగా ఉన్న ఈయూ ఖమ్మం రీజియన్‌లో స్థానిక గుర్తింపు సంఘంగా ఉంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఐఎన్టీయూసీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. టీఎంయూ, ఎన్ఎంయూ, బీకేయూ విడివిడిగా బరిలో నిలిచారుు. అయితే ఐఎన్టీయూసీ కేవలం రాష్ట్రంలో గుర్తింపు క్లాస్-3కి ఎంప్లాయీస్ యూనియన్ కూటమికి ఓటు వేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒప్పందం కుదిరింది. కానీ ఖమ్మం రీజియన్‌లో మాత్రం ఐఎన్టీయూసీ ఓటు ఆ సంఘానికే(క్లాస్-6) వేసుకుంటామని ప్రకటించారు. ముమ్మరంగా ప్రయత్నాలు గుర్తింపు సంఘం ఎన్నికల కోసం ఆర్టీసీలో ప్రచారం ఊపందుకుంది. ప్లెక్సీలు, కరపత్రాలు, హోర్డింగ్‌లు, బ్యాడ్జీలు, జెండాలతో ప్రచారం చేస్తున్నారు. డిపోలలో జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని స్థానిక గుర్తింపు కోసం ఆ యూనియన్ సభ్యులు వేరే యూనియన్‌కు ఓట్లు క్రాస్ కాకుండా చైతన్యం చేస్తున్నారు. రాష్ట్ర గుర్తింపు కోసం టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంయూ ప్రధాన పోటీలో ఉన్నాయి. -
పోటాపోటీ
మిర్యాలగూడ : ఆసియా ఖండంలోనే ప్రముఖమైన మిర్యాలగూడ రైస్ ఇండస్ట్రీకి అసోసియేషన్ ఎన్నికలు అత్యంతప్రాధాన్యత సంతరించుకున్నవి. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ఎన్నికలు పోటాపోటీగా సాగనున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్యవర్గ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్నందున ఎన్నికలు అనివార్యమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరగనున్న ఈ ఎన్నికలను అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. మిర్యాలగూడ రైస్‌ఇండస్ట్రీ అసోసియేషన్ 1968లో ఏర్పడింది. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులే ప్రతీసారి విజయంసాధిస్తూ వస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన వారు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2011 సెప్టెంబర్ 25వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో గార్లపాటి ధనమల్లయ్య గెలుపొందగా రెండవ పర్యాయం 2013లో కూడా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ నెలాఖరుతో కార్యవర్గ పదవీ కాలం ముగియనున్నందున ఈ నెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అసోసియేషన్‌కు 87 ఓట్లు ఉన్నాయి. కానీ ప్రతి ఓటు కూడా కీలకం కానున్నది. బరిలో ముగ్గురు : మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రతిసారి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండేవారు. కానీ ఈ సారి మాత్రం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న గార్లపాటి ధనమల్లయ్య, ఒక పర్యాయం అధ్యక్షుడిగా కొనసాగిన కర్నాటి రమేష్‌తో పాటు ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న బండారు కుశలయ్య పోటీలో ఉన్నారు. వీరిలో బండారు కుశలయ్య అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో ఉంటుండగా గార్లపాటి ధనమల్లయ్య, కర్నాటి రమేష్‌లు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడనున్నారు. కాగా ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రచారాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇప్పటి వరకు కొనసాగిన అధ్యక్షులు వీరే... మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అధ్యక్షులుగా ఎంతో మంది కొనసాగారు. 1968లో అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి 1980 వరకు గంథం విశ్వనాథం అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత ఐదు పర్యాయాలు చిల్లంచర్ల విజయ్‌కుమార్, మూడు పర్యాయాలు రేపాల లింగయ్య, గార్లపాటి ధనమల్లయ్య, మంచుకొండ వెంకటేశ్వర్లు, రెండు పర్యాయాలు మేడిశెట్టి వెంకటేశ్వర్లు, కొండూరు వీరయ్య, మారం ముత్తయ్య, ఒక్కొక్క పర్యాయం తిరునగరు గంగాధర్, కర్నాటి రమేష్‌లు అధ్యక్షులుగా కొనసాగారు.