Director Samudra Contesting In Directors Association Elections: ‘‘డైరెక్టర్స్ అసోసియేషన్‌కు డిసిప్లిన్, డిగ్నిటీ, డీసెన్సీ ఉన్నాయి. ఎలక్షన్స్‌లో భాగంగా కొందరు కులప్రస్తావన తీసుకువస్తున్నారు. ఇది తప్పు. సినిమా ఇండస్ట్రీలో కులం లేదు. సినిమా ఇండస్ట్రీలో దర్శకులు, హీరోలు, నిర్మాతలు.. అందరిదీ ఒకటే కులం’’ అన్నారు దర్శకుడు సముద్ర. ఈ నెల 14న (ఆదివారం) హైదరాబాద్‌లోని ఫిలింనగర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో దర్శకుల సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దర్శకుల సంఘం అధ్యక్ష పదవికి వి.సముద్ర పోటీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా తన ప్యానల్‌ను గురించిన వివరాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సముద్ర మాట్లాడుతూ – ‘‘ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావుగారి జయంతిని మే 3,4 తేదీల్లో ఓ పండగలా చేస్తాం. డైరెక్టర్స్ డే (ప్రముఖ దివంగత దర్శకులు దాసరినారాయణరావు జయంతిన దర్శకుల సంఘం అసోసియేషన్ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేయాలనుకుంటున్నాం. అన్నపూర్ణ క్యాంటీన్, ‘మా’ అసోసియేషన్‌లో కథల రిజిస్ట్రేషన్, లెజెండ్ సెంచరీ అవార్డ్స్‌లను మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది.
హామీలను నేరవేర్చకపోతే మే 5న రాజీనామా చేస్తాను.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సముద్ర ప్యానెల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే..ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్న కారణంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని, ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న జర్నలిస్టు ప్రభు నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ విషయమై ప్రభు హైకోర్టును ఆశ్రయించగా, ఆయన ఎన్నికల్లో పోటీ చేయవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. కొందరు వ్యక్తులు చేస్తున్న అప్రజాస్వామిక వ్యవహారాలకు ఈ తీర్పు చెంపపెట్టు అని ప్రభు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment