
తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకను మలేషియాలో ఘనంగా నిర్వహిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. సినీ పెద్దలతో చర్చించి త్వరలోనే వేడుకల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది. తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులుగా ఉండటం చాలా గర్వంగా ఉంది.జులైలో మలేషియాలో తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలు నిర్వహిస్తాం.
తెలుగు సినీ పరిశ్రమ ఘన కీర్తిని తొడ కొట్టి చెప్పాలనే ఈ వేడుకలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ వేడుకల గురించి ఫిల్మ్ ఛాంబర్‌తో మాట్లాడాం. జులైలో తెలుగు పరిశ్రమకు రెండు మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరాం.అందుకు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారు. దేశంలో ఉన్న ఐదు అసోసియేషన్ లతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒప్పందం చేసుకున్నాం. భారతీయ సినిమాను ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కృషి చేస్తోంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment