
చాలామంది హీరోయిన్లతో పోలిస్తే రష్మికది ఇంకా చిన్న వయసే. కానీ సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. అందుకే ఇప్పడు పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన రష్మిక జోరుకి 'సికిందర్'తో ఇప్పుడు బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: 'పెద్ది' సర్ ప్రైజ్.. ఉగాదికి కాదు శ్రీరామనవమికి)
అసలు విషయానికొస్తే ఈద్ సందర్భంగా సికందర్ మూవీ తాజాగా థియేటర్లలో రిలీజైంది. సల్మాన్ ఖాన్ హీరో కాగా రష్మిక హీరోయిన్. తొలి ఆట నుంచే దీనికి నెగిటివ్ టాక్ వచ్చేసింది. విడుదలకు ముందే పైరసీ అవడం మరో మైనస్. సోషల్ మీడియా ట్రెండ్ చూస్తుంటే సినిమా గట్టెక్కడం కష్టమే అనిపిస్తుంది.
మరోవైపు తెలుగులో రాబిన్ హుడ్ మూవీ తాజాగా రిలీజైంది. దీనికి కూడా మొదటి ఆట నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. సోమవారం వస్తే అసలు ఫలితం తేలుతుంది. తొలుత ఈ మూవీలో రష్మికనే హీరోయిన్. కానీ కొన్ని కారణాలతో ఈమె తప్పుకోవడంతో శ్రీలీలకు ఛాన్స్ వచ్చింది. కాకపోతే హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన‍్యం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో రష్మిక ఇక్కడ తప్పించుకుంది గానీ బాలీవుడ్ లో సికిందర్ దెబ్బకు దొరికేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)