
‘బ్యాక్ టు షూట్’ అంటూ దాదాపు నెల రోజుల తర్వాత రష్మికా మందన్నా(Rashmika Mandanna) షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టారు. గత నెల జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆమె కాలికి గాయం అయిన విషయం తెలిసిందే. దాంతో కొన్ని వారాలు ఆమె షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చారు. గాయం తగ్గిపోవడంతో షూట్‌కి రెడీ అయ్యారు.
సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం ‘సికందర్’(Sikandar) షూట్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ సినిమాకి సంబంధించి నైట్ షూట్ జరుగుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ‘సికందర్’ కాకుండా హిందీలో ‘థామా’, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘కుబేర’, తెలుగు చిత్రం ‘గర్ల్ ఫ్రెండ్’ వంటివి రష్మిక సైన్ చేశారు. నెల రోజుల బ్రేక్ తీసుకున్నారు కాబట్టి ఇక ఈ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment