‘పుష్ప2’తో శ్రీవల్లిగా థియేటర్లలో దుమ్మరేపిన రష్మిక మందన్న(Rashmika Mandan) ఆసుపత్రిలో చేరింది. తన కాలికి గాయం కావడంతో చికిత్స పొందుతున్నారు. కొత్త సంవత్సరంలో ఇలా జరగడంతో ఆమె తీవ్ర నిరాశ చెందారు. పాన్ ఇండియా రేంజ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న ఆమె చేతిలో నాలుగు చిత్రాలకు పైగా ఆమె చేతిలో ఉన్నాయి. గాయం కారణంగా షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆమె తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో ఆమె పంచుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ)
కొత్త సినిమాల కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తూ గాయపడినట్లు రష్మిక మందన్న ఇలా తెలిపారు. 'నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఇలా మొదలైంది. జిమ్‌లో శిక్షణ తీసుకుంటూ ఉండగా నేను గాయపడ్డాను. దీంతో కొన్ని వారాలు, నెలలు పాటు రెస్ట్‌లో ఉండాలి. పూర్తిగా కోలుకునేందుకు ఎన్నిరోజులు పడుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇక నుంచి పూర్తిగా రెస్ట్ మోడ్‌లోనే ఉండాల్సి వస్తుంది. అంతా బాగాయ్యాక నేను మళ్లీ 'సికందర్ (Sikandar), కుబేర(Kubera), థామ(Thama)' సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటానని అనిపిస్తోంది. నా వల్ల సినిమా ఆలస్యం అవుతుంది. అందుకు దర్శకులు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. షూటింగ్‌లో పాల్గొనేందుకు నా కాళ్లు సహకరించినప్పుడు తప్పకుండా వచ్చేస్తాను. నేను కూడా త్వరగా కోలుకునేందుకు వర్కౌట్స్ చేస్తాను' అని ఆమె అన్నారు.
సికిందర్‌కు బ్రేకులు పడనున్నాయా..?
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సికందర్’. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ ప్రాజెక్ట్‌లో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2025 రంజాన్ కానుకగా మార్చి 2న విడుదల కానున్నట్లు వార్తలు వచ్చాయి. యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో రష్మికకు బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు సికందర్ మూవీ ఆమెకు మరింత పాపులరాటిని తీసుకురావచ్చని చెప్పవచ్చు. అయితే, ఆమె గాయం కారణంగా ఈ చిత్రం రంజాన్‌కు విడుదల అవుతుందా అనే సందేహాలు వస్తున్నాయి.
జూన్‌లో కుబేర కష్టమే
జూన్‌లో థియేటర్స్‌లోకి ‘కుబేర’ వస్తారని అందరూ అనుకున్నారు. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుందనే ప్రచారం సాగింది. కానీ జూన్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అయితే, రష్మిక మందన్నకు గాయం కావడంతో జూన్‌లో విడుదల కష్టమేనని తెలుస్తోంది.
ఈ సినిమా చిత్రకరణ కోసం రష్మిక గాయపడ్డారా..?
హీరోయిన్ రష్మికా మందన్నా కెరీర్‌లో రానున్న తొలి హారర్ మూవీ ‘థామా’. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. హారర్ మూవీ ‘ముంజ్య’తో హిట్ కొట్టిన దర్శకుడు ఆదిత్యా సర్పోత్తా ఈ సినిమాకు దర్శకుడు. ‘బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాది విడుదలైంది. రీసెంట్‌గా ‘థామా’ చిత్రీకరణ కోసం ఢిల్లీ బయలుదేరినట్లుగా తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఈ సినిమా కోసం కసరత్తులు చేస్తున్న క్రమంలోనే ఆమె గాయపడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment