'మా' అసోసియేషన్ సభ్యుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంచు విష్ణు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో 'మా' సభ్యుల కోసం ఉచిత హెల్త్ చెకప్ నిర్వహించారు. దీని ప్రకారం మా సభ్యులకు డాక్టర్ కన్సల్టేషన్‌తో పాటు పది రకాల హెల్త్ చెకప్‌లు ఉచితంగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ..
'మా సభ్యులకు ఏఐజీ వారు ఉచితంగా చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్‌తో మాకు సేవలందించారు. డా.నాగేశ్వర రెడ్డికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది.గతంలో మలేసియాలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మాస్టర్ చెకప్‌కి సింగపూర్‌కి వెళ్తే ఇండియాలో ఏఐజీ పెట్టుకొని ఇక్కడిదాకా ఎందుకు వచ్చారు అని అడిగారు. అలాంటి హాస్పిటల్‌లో ఇకపై మా సభ్యలకు ఉచితంగా హెల్త్ చెకప్ అందిస్తుండం సంతోషం. ఈ క్యాంప్ వల్ల మా సభ్యులందరూ బెనిఫిట్ పొందుతున్నారు' అని పేర్కొన్నారు.
ఇక మంచు విష్ణు అధ్యక్షుడు అయ్యాక ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందని నటుడు నరేష్ అన్నారు. కరోనా సమయంలో ఆర్టిస్టులు కష్టాలు చూసి విష్ణు ఇప్పుడు మెడికల్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈరోజు జరిగిన క్యాంప్‌లో సుమారు 300కి పైగా మా సభ్యులు చెకప్‌లు చేసుకున్నారని తెలిపారు. ఏఐజీ ఇంటర్నేషనల్ లెవల్‌లో ఉందన్నారు.
ఇక ఈ సందర్బంగా ఏఐజీ డైరక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో చాలా మంది ఆర్టిస్టులు వ్యాక్సిన్‌లు వేసుకొని షూటింగ్ చేయొచ్చా అని అడిగేవారు. వాళ్లు చాలా కష్టపడుతున్నారు. అయితే ఆర్టిస్టులలో లైఫ్‌స్టైల్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. లంగ్స్ వ్యాధి, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment