‘మా’ కొరడా.. ఐదు యూట్యూబ్ ఛానెల్స్‌ తొలగింపు | Telugu Movie Artist Association And Youtube Channels Issue Latest | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: మొన్న సీరియస్.. తాజాగా 'మా' అసోసియేషన్ యాక్షన్

Published Sat, Jul 13 2024 3:23 PM | Last Updated on Sat, Jul 13 2024 4:13 PM

Telugu Movie Artist Association And Youtube Channels Issue Latest

రీసెంట్‌గా తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వల్ల ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లీ కూతుళ్ల బంధంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఇది ఇలా ఉండగా రెండు మూడు రోజుల క్రితం 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు.. పలు యూట్యూబ్ ఛానెల్స్‌కి వార్నింగ్ ఇచ్చాడు. సెలబ్రిటీలపై ఇష్టమొచ్చినట్లు చేసిన వీడియోలని 48 గంటల్లో డిలీట్ చేయాలని హెచ్చరించాడు. ఇప్పుడు దీనిపై మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంది.

(ఇదీ చదవండి: లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా.. జర్నలిస్ట్‌పై 'జబర్దస్త్' రోహిణి ఫైర్‌)

 

 నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొరడా ఝళిపించింది. ఐదు యూట్యూబ్ ఛానెల్స్‌ని తొలగించిందింది. ఇది ప్రారంభం మాత్రమే అని చెబుతూ యూట్యూబర్స్‌కి 'మా' అసోసియేషన్ హెచ్చరిక జారీ చేసింది. ముందు ముందు మరిన్ని ఛానెల్స్ డిలీట్ అయ్యేలా చేస్తామని చెప్పుకొచ్చింది. ఇకపోతే తొలగించిన ఛానెల్స్‌లో 'జస్ట్ వాచ్ బీబీబీ', 'ట్రోల్స్ రాజా', 'బచిన లలిత్', 'హైదరాబాద్ కుర్రాడు', 'ఎక్స్‌వైజెడ్ ఎడిట్జ్ 007' ఉన్నాయి. 

 

(ఇదీ చదవండి: ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అడ్వకేట్‌తో లావణ్య చాటింగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement