Maa association
-
త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మధ్య వివాదం కొన్నేళ్లుగా నడుస్తోంది. తాజాగా ఆమె మా అసోసియేషన్‌ను తప్పు పడుతూ ఒక ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసి చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు గురించి ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. అందుకు కౌంటర్‌గా మా అసోసియేషన్ తరఫున నటుడు, కోశాధికారి శివ బాలాజీ (Siva Balaji) రియాక్ట్ అయ్యారు. ఆమె నుంచి తముకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. గతంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు. ఇందుకు సమాధానంగా పూనమ్ మరోసారి రియాక్ట్ అయింది.మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీకి పూనమ్ కౌర్ కౌంటర్‌గా ఇచ్చింది. గతంలో త్రివిక్రమ్‌పై (Trivikram Srinivas) తాను చేసిన ఫిర్యాదుకు మా అసోసియేషన్ నుంచి గతంలో వచ్చిన మెసేజ్‌ని పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. తనను కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన మా అసోసియేషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదంటూ ఆమె పేర్కొంది. మా అసోసియేషన్ నుంచి పూనమ్‌కు వచ్చిన మెసేజ్‌లో ఇలా ఉంది. (ఇదీ చదవండి: రజనీకాంత్‌ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్‌తో సత్కారం)'త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదుకు సంబంధించి మీ మెయిల్ మాకు అందింది. మీ అభ్యర్థన మేరకు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో అంగీకరించిన తేదీ, సమయానికి ఇద్దరు పరిశ్రమకు చెందిన మహిళా సభ్యులతో పాటు మరోఇద్దరు మహిళా పరిశ్రమేతర సభ్యులతో ఇక్కడి ప్యానెల్లో మిమ్మల్ని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సమావేశం మొత్తం మహిళా ప్యానెల్‌గా ఉండాలని మీరు అభ్యర్థించారు. ఈ విషయంలో మేము ఎలా కొనసాగించాలో మీ కేసును స్పష్టమైన పద్ధతిలో చెప్పగలరని ఆశిస్తున్నాము.'త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పూనమ్ కౌర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చింది. సోషల్‌మీడియా వేదికగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆమె విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.అయితే, పూనమ్ బయటపెట్టిన ఆధారంతో ఇప్పుడు మా అసోసియేషన్ ఇరకాటంలో పడినట్లు అయింది. ఇదే క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌కు కూడా కాస్త ఇబ్బందులు తప్పవనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. No proceeds after this - thank you 🙏 pic.twitter.com/cW8TiWax0Q— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
హేమ సస్పెన్షన్ ను ఎత్తివేసిన మా అసోసియేషన్..
-
MAA అసోసియేషన్ సీరియస్... మరి ప్రభాస్ ని అంటే కన్నప్ప ఊరుకుంటాడా...
-
మా కోసం పది లక్షలు విరాళం
మూవీ ఆర్టిస్ట్స్’ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తన మూడో కుమార్తె (విష్ణు–విరానికా దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు) ఐరా విద్యా మంచు జన్మదినం (ఆగస్టు 9) సందర్భంగా ‘మా’ అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనకబడిన కళాకారుల సంక్షేమం కోసం ఆయన ఈ విరాళాన్ని అందించారు.కళాకారుల సంరక్షణ, సహాయాల నిమిత్తం ఈ నగదుని వెచ్చించనున్నారు. అలాగే ‘మా’ భవనంపై కూడా విష్ణు మంచు దృష్టి సారించారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే...ప్రస్తుతం విష్ణు మంచు హీరోగా ‘కన్నప్ప’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా డిసెంబరులో రిలీజ్ కానుంది. -
'మా' దూకుడు.. వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) చెప్పినట్లుగానే కఠిన చర్యలు చేపట్టింది. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మూవీ ఆర్టిస్టులపై అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్న వారికి గట్టి షాకిచ్చింది. తాజాగా అలాంటి కంటెంట్ ప్రసారం చేస్తున్న 18 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయించినట్లు మా అసోసియేషన్ ట్వీట్ చేసింది. అంతకుముందే అలాంటి వీడియోలను 48 గంటల్లోగా తొలగించకపోతే చర్యలు తప్పవని మా అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా నటీనటులు, వారి కుటుంబసభ్యులే లక్ష్యంగా అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న 18 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మా అసోసియేషన్ తెలిపింది. బ్రహ్మి ట్రోల్స్ 3.0, టీకే క్రియేషన్స్, డాక్టర్ ట్రోల్స్, ట్రోలింగ్ పోరడు, అప్డేట్ ట్రోల్స్, నేను మీ జాను, కామెడీ ట్రోలింగ్, మై ఛానెల్ మై రూల్స్ లాంటి ఛానెల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. కాగా.. అంతకుముందే మొదట ఐదు యూట్యూబ్ ఛానల్స్‌ను బ్లాక్ చేయించారు.ఈ సందర్భంగా యూట్యూబర్లు, సోషల్ మీడియా ట్రోలర్లకు మరోసారి మా హెచ్చరికలు పంపింది. పరువు నష్టం కలిగించేలా ఉన్న ట్రోల్ వీడియోలపై సైబర్ క్రైమ్ కార్యాలయానికి నివేదిక అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇబ్బందులు రాకుండా ఉండాలంటే దయచేసి మీ ఛానెల్స్ నుంచి అలాంటి కంటెంట్ వెంటనే తొలగించాలని మరోసారి మా విజ్ఞప్తి చేసింది. On behalf of #MAA, we urge all YouTubers and social media trollers to take a note. We are preparing to report defamatory troll videos to Cyber Crime office. Kindly remove such content from your channels and profiles to avoid complications.#RespectOurArtists— MAA Telugu (@itsmaatelugu) July 24, 2024As part of our ongoing efforts on terminating the YouTube channels for posting derogatory content on our artists.We have blocked an additional 18 channels that spread harmful content.Stay tuned for further updates.#MAA #RespectOurArtists pic.twitter.com/rDnCJbDVHX— MAA Telugu (@itsmaatelugu) July 24, 2024 -
ట్రోలర్స్ కి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన మా సభ్యులు
-
ట్రోలర్స్ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా....
-
రాజ్ తరుణ్ పై మా అసోసియేషన్ చర్యలు ?
-
‘మా’ కొరడా.. ఐదు యూట్యూబ్ ఛానెల్స్ తొలగింపు
రీసెంట్గా తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వల్ల ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లీ కూతుళ్ల బంధంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఇది ఇలా ఉండగా రెండు మూడు రోజుల క్రితం 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు.. పలు యూట్యూబ్ ఛానెల్స్‌కి వార్నింగ్ ఇచ్చాడు. సెలబ్రిటీలపై ఇష్టమొచ్చినట్లు చేసిన వీడియోలని 48 గంటల్లో డిలీట్ చేయాలని హెచ్చరించాడు. ఇప్పుడు దీనిపై మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంది.(ఇదీ చదవండి: లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా.. జర్నలిస్ట్‌పై 'జబర్దస్త్' రోహిణి ఫైర్) The crackdown has begun. Five YouTube channels have been terminated for posting derogatory comments about actors, their families, and personal attacks. This is just the start. We will continue to update the list as we take further action...— MAA Telugu (@itsmaatelugu) July 13, 2024 నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొరడా ఝళిపించింది. ఐదు యూట్యూబ్ ఛానెల్స్‌ని తొలగించిందింది. ఇది ప్రారంభం మాత్రమే అని చెబుతూ యూట్యూబర్స్‌కి 'మా' అసోసియేషన్ హెచ్చరిక జారీ చేసింది. ముందు ముందు మరిన్ని ఛానెల్స్ డిలీట్ అయ్యేలా చేస్తామని చెప్పుకొచ్చింది. ఇకపోతే తొలగించిన ఛానెల్స్‌లో 'జస్ట్ వాచ్ బీబీబీ', 'ట్రోల్స్ రాజా', 'బచిన లలిత్', 'హైదరాబాద్ కుర్రాడు', 'ఎక్స్‌వైజెడ్ ఎడిట్జ్ 007' ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అడ్వకేట్‌తో లావణ్య చాటింగ్) -
‘మా’లో హేమప్రాథమిక సభ్యత్వం సస్పెన్షన్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దీంతో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఆమెప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. హేమ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసే విషయమై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు ΄్యానెల్ సభ్యులతో బుధవారం సమావేశం నిర్వహించారట. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ‘మా’ కార్యదర్శి రఘుబాబు ఓ లేఖ విడుదల చేశారు.మే నెలలో బెంగళూరు రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల నివేదికలో నిర్ధారణ కావడంతో ‘మా’ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు ‘మా’ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె నుంచి స్పందన లేకపోవడంతో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు, విచారణ తేలేవరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుందన్నట్లు హేమకు ‘మా’ లేఖ పంపినట్లు తెలిసింది. -
రష్మిక ఫేక్ వీడియో ఘటన.. 'మా' అధ్యక్షుడి రియాక్షన్
స్టార్ హీరోయిన్ రష్మిక ఫేక్ వీడియోపై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ తరఫున మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించాడు. ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే?) 'డీప్ ఫేక్ కాంట్రవర్సీకి గురైన రష్మికకు నా మద్దతు తెలియజేస్తున్నాను. టెక్నాలజీని దుర్వినియోగం చేసే ఇలాంటి డేంజరస్ కంటెంట్ క్రియేట్ చేయడంపై మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) తీవ్రంగా ఆందోళన పడుతోంది. ఇలాంటి సంఘటనలపై పోరాడేందుకు అవసరమైన గైడ్‌లైన్స్ రూపొందించే దిశగా ఏఐ, న్యాయ నిపుణులతో 'మా' సంప్రదింపులు జరుపుతోంది.ఫేక్ వీడియోలపై తక్షణమై స్పందించాల్సిన అవసరం ఉందని రష్మికకు ఎదురైన ఘటన తెలియజేస్తోంది. ఏఐ టెక్నాలజీ సాయంతో నటీనటుల రక్షణకు భంగం కలిగించే ఇలాంటి వీడియోలను ‘మా’ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించదు.' అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. అసలేంటి గొడవ? ఓ సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ వీడియోకి డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించిన రష్మిక ఫేస్ చేర్చారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై ఫస్ట్ ఫస్ట్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఆ తర్వాత హీరో నాగచైతన్య, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కవిత కూడా స్పందించారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. (ఇదీ చదవండి: భూటాన్‌లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత) I strongly support Rashmika, who is one of the many victims of the deep fake controversy video. We at , Movie Artiste Association (MAA) , are deeply concerned about the misuse of technology to create such harmful content. MAA is actively collaborating with legal and AI experts to… — Vishnu Manchu (@iVishnuManchu) November 8, 2023 -
నన్ను చంపేందుకు ప్లాన్ చేశారు.. కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్
ఏదో ఒక విధంగా ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది నటి కరాటే కల్యాణి. గత కొద్ది కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలతో టాలీవుడ్లో సంచలనంగా మారిన కళ్యాణి మరో సారి వార్తల్లో నిలిచారు. ఖమ్మంలో ఏర్పాటు చేయాలనుకున్న దివంగత ఎన్టీఆర్ విగ్రహంపై కరాటే కల్యాణి చేసిన వ్యాఖ్యల వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్ని ఇప్పటికే రద్దు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్యాణి తనకు ప్రాణ హాని ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్) ఈ మధ్యనే తన కారు రెండు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని, ఆ విషయాన్ని గమనించకండా అదే కారులో ప్రయాణించినట్లు తెలిపింది. ఆపై కొంత దూరం వెళ్లిన తర్వాత కారు టైర్లు పేలిపోయి స్వల్ప ప్రమాదంతో భయటపడినట్లు తెలిపింది. అదే హైవే మీద ప్రయాణించి ఉంటే తన పరిస్థితి వేరేలా ఉండేది అని వాపోయింది. అనంతరం మెకానిక్ వద్దకు వెళ్తే.. ఎవరో కావాలనే కారు టైర్లను కోసేశారని తేలడంతో ఖంగుతిన్నట్లు తెలిపింది. ఖమ్మంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహం .. కృష్ణుడి రూపంలో ఉంది అని ఆమె రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. చివరకు కోర్డు నుంచి స్టే కూడా తీసుకువచ్చింది. ఈ కోపంతోనే ఎవరో కావాలని టైర్లు కోసేసి ఉంటారని ఆమె ఆరోపించింది. (ఇదీ చదవండి: ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తా, పెళ్లి తిరుపతిలోనే : ప్రభాస్) -
విశ్వక్ సేన్‌పై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు అర్జున్ సర్జా ఫిర్యాదు?
యంగ్ హీరో విశ్వక్సేన్-యాక్షన్ కింగ్ అర్జున్‌ల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. విశ్వక్ సేన్ షూటింగ్‌కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్ సర్జా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన కూతురిని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. అర్జున్ డైరెక్షన్లో రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయ్యింది. చదవండి: సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత ఇలాంటి సమయంలో విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అర్జున్ సీరియస్ అయ్యాడు. షూటింగ్‌కి సమయానికి రాకుండా ఇబ్బందులు పెట్టాడని, విశ్వక్ కమిట్మెంట్ లేని యాక్టర్ అంటూ అర్జున్ ఫైర్ అయ్యాడు. అయితే అర్జున్ ఆరోపణలపై విశ్వక్ సేన్ సైతం స్పందించాడు. రాజయోగం టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న విశ్వక్ షూటింగ్ సమయంలో తన ప్రవర్తన బాలేదని ఒక్క లైట్ బాయ్ చెప్పిన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: చిక్కుల్లో షారుక్ చిత్రం, డైరెక్టర్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు అంతేకాదు ఇందులో తన తప్పు ఉంటే క్షమించండి అర్జున్ సర్ అంటూ చివరిలో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్‌పై ‘మా’ అసోసియేషన్‌లో తాజాగా అర్జున్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వక్ సేన్ ప్రవర్తన సరిగా లేదని, షూటింగ్ సమయంలో ఇబ్బంది పెట్టాడని, తనను, తన యూనిట్ణి అవమానించాడంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణుకి ఫిర్యాదు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. కానీ, దీనిపై మంచు విష్ణు ఎలా స్పందిస్తాడు, విశ్వక్ సేన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోనున్నాడనేది ఆసక్తిని సంతరించుకుంది. -
అలా చేస్తే వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తా: మంచు విష్ణు
సాక్షి, హైదరాబాద్: మా ఎన్నికల్లో తాను చేసిన వాగ్దానాలు 90 శాతం పూర్తయ్యాయన్నాడు మా అధ్యక్షుడు మంచు విష్ణు. సంక్రాంతి తర్వాత మా కోసం యాప్ తీసుకొస్తామని, నటీనటుల అవకాశాల కోసం ప్రత్యేక బుక్లెట్ తయారుచేశామని చెప్పాడు. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. '2021 మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. అక్టోబర్ 13న నేను మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను. నేను ఎలక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు సినీపరిశ్రమలో ఎంతో అలజడి నెలకొంది. నేను మా అసోసియేషన్‌కే కాదు ప్రేక్షకులకు కూడా జవాబుదారీనే! మా అసోసియేషన్‌లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. మా అసోసియేషన్ సభ్యత్వం కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకున్నాం. నటీనటులు కనీసం రెండు చిత్రాల్లో నటించి, అవి విడుదలైతేనే వారికి మాలో శాశ్వత సభ్యత్వం ఉంటుంది. కనీసం ఐదు నిమిషాలైనా సినిమాలో కనిపించి డైలాగ్ చెప్పిన వాళ్లకు అసోసియేట్ సభ్యత్వం కల్పిస్తాం. అసోసియేట్ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదు. మా అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎవరైనా నటీనటులు, కార్యవర్గ సభ్యులు ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం. ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారు పోటీకి అనర్హులవుతారు. మా అసోసియేషన్ భవనానికి రెండు ప్రతిపాదనలు సూచించాను. ఫిల్మ్ నగర్‌కు అరగంట దూరంలో ఓ భవనం నిర్మిస్తున్నాం. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం కట్టేందుకు నేను ఖర్చు భరిస్తాను. చాలా మంది సభ్యులు రెండో అంశానికే మద్దతు పలికారు' అని చెప్పాడు. చదవండి: ఆరోహి పోయిందంటే ఇనయను తగులుకున్నాడు సినిమా ఛాన్స్ అని ఇంటికి పిలిచి.. : నటి -
మా సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం తొలి ప్రాధాన్యత: మంచు విష్ణు
Manchu Vishnu Interesting Comments On Maa Building: ‘‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) సభ్యుల ఆరోగ్యం, అవకాశాలు, సంక్షేమం కోసం తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎన్నికల హామీలో భాగంగా ‘మా’కి శాశ్వత భవన నిర్మాణం కోసం ఆరు నెలల్లో భూమి పూజ చేస్తాం’’ అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో ‘మా’ సభ్యులకు ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘మా’ ఎన్నికల హామీలను 6 నెలల్లోనే 75 శాతం పూర్తి చేశాను. ‘మా’ సభ్యులకు ప్రతి మూడు నెలలకు ఒక హెల్త్ క్యాంప్ నిర్వహిస్తాం. ‘మా’ సభ్యత్వం నిబంధనలను కఠినతరం చేశాం.. అందుకు డీఆర్సీ కమిటీ చైర్మన్ కృష్ణంరాజు, సభ్యులు బాలకృష్ణ, మోహన్ బాబు, గిరిబాబు, జయప్రద, శివకృష్ణ అమోదం తెలిపారు. కళామతల్లిని నమ్ముకున్న వారే ‘మా’లో సభ్యులుగా చేరాలి. సినిమా టెక్కెట్ ధరల పెంపు విషయంలో నేను మాట్లాడలేదని నన్ను విమర్శించినా, సైలెంట్‌గా ఉన్నా. ఒక రాష్ట్రంలో టిక్కెట్ ధరలు పెంచినందుకు, మరో రాష్ట్రంలో టిక్కెట్ ధరలు తగ్గించినందుకు కోర్టులకు వెళ్లారు. అలాగే కొన్ని సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచారు. దాని వల్ల విపరీతమైన ఇబ్బంది ఉందని అంటున్నారు. ఏది తప్పు? ఏది ఒప్పు? అనే చర్చ చాలా పెద్దది. దాని గురించి నేను చెప్పేకన్నా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ కలిసి చర్చించి, ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ఉపాధ్యక్షులు మాదాల రవి, పృధ్వీ, నటుడు వీకే నరేష్, ట్రెజరర్ శివబాలాజీ, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్.. చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
యాక్సిడెంట్ అయి సింగపూర్‌కి వెళ్తే అలా అన్నారు: మంచు విష్ణు
'మా' అసోసియేషన్ సభ్యుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంచు విష్ణు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో 'మా' సభ్యుల కోసం ఉచిత హెల్త్ చెకప్ నిర్వహించారు. దీని ప్రకారం మా సభ్యులకు డాక్టర్ కన్సల్టేషన్తో పాటు పది రకాల హెల్త్ చెకప్‌లు ఉచితంగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. 'మా సభ్యులకు ఏఐజీ వారు ఉచితంగా చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్‌తో మాకు సేవలందించారు. డా.నాగేశ్వర రెడ్డికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది.గతంలో మలేసియాలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మాస్టర్ చెకప్‌కి సింగపూర్‌కి వెళ్తే ఇండియాలో ఏఐజీ పెట్టుకొని ఇక్కడిదాకా ఎందుకు వచ్చారు అని అడిగారు. అలాంటి హాస్పిటల్లో ఇకపై మా సభ్యలకు ఉచితంగా హెల్త్ చెకప్ అందిస్తుండం సంతోషం. ఈ క్యాంప్ వల్ల మా సభ్యులందరూ బెనిఫిట్ పొందుతున్నారు' అని పేర్కొన్నారు. ఇక మంచు విష్ణు అధ్యక్షుడు అయ్యాక ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందని నటుడు నరేష్ అన్నారు. కరోనా సమయంలో ఆర్టిస్టులు కష్టాలు చూసి విష్ణు ఇప్పుడు మెడికల్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈరోజు జరిగిన క్యాంప్‌లో సుమారు 300కి పైగా మా సభ్యులు చెకప్‌లు చేసుకున్నారని తెలిపారు. ఏఐజీ ఇంటర్నేషనల్ లెవల్లో ఉందన్నారు. ఇక ఈ సందర్బంగా ఏఐజీ డైరక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో చాలా మంది ఆర్టిస్టులు వ్యాక్సిన్లు వేసుకొని షూటింగ్ చేయొచ్చా అని అడిగేవారు. వాళ్లు చాలా కష్టపడుతున్నారు. అయితే ఆర్టిస్టులలో లైఫ్‌స్టైల్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. లంగ్స్ వ్యాధి, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అని పేర్కొన్నారు. -
మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్.. 'ఆ జీవోపై చర్చ జరగాలి'
Manchu Vishnu Sensational Comments About Maa Association: హీరో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మన్యం రాజు మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలోనే మా అసోసియేషన్ తరపున మా భవనం గురించి మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు. మోహన్‌బాబు నాయకత్వంలో తిరుపతిలో స్టూడియో ఏర్పాటు గురించి త్వరలోనే ప్రకటన చేస్తారని పేర్కొన్నారు. 'నూతన నటీనటులు , సాంకేతిక సిబ్బందిని ప్రోత్సాహిస్తాం. సినిమా టికెట్స్ ధరలు విషయం లో ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్పడం సరికాదు. లెజెండరీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు,నాగార్జున, వెంకటేష్ మాకు ఆదర్శం. దాసరి నారాయణరావు వై.ఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి సీఎంగా ఉన్నపుడు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి జీవో తెచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు నలుగురి కోసం ఆ జీవో మార్చారు. దీనిపై చర్చ జరగాలి' అని విష్ణు సంచలన కామెంట్స్ చేశారు. -
‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘనవిజయం
‘‘ఇది ఏ ఒక్కరి విజయం కాదు. ‘మా’లోని సభ్యులందరి విజయం. అందరూ మనవాళ్లే. అందరి ఆశీస్సులు ఉన్నాయి. నా బిడ్డ(మంచు విష్ణు), అతని జట్టు సభ్యులు గెలిచారు. ఇది ఆనందం అనుకుంటే కరెక్ట్ కాదు. భయంకరమైన ప్రామిస్‌లు చేసేశారు. వాటన్నింటినీ నా బిడ్డ వందశాతం సాధిస్తాడు. నా బిడ్డ చెప్పింది చెప్పినట్లు చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పదలచుకున్నది ఏంటంటే... జరిగింది... జరిగిపోయింది.. అందరం కళామతల్లి బిడ్డలం అని గుర్తుపెట్టుకోవాలి. నటుడిగా నాకు జన్మనిచ్చిన దాసరిగారు ఎక్కడ ఉన్నారో!. ఇకపై మూవీ ఆర్టిస్ట్స్ ఎలక్షన్స్ జరగకుండా ఏకగ్రీవంగా జరిగేలా పెద్దలు నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టండి. ఆ ప్యానల్ వారు కావొచ్చు.. ఈ ప్యానల్ వారు కావొచ్చు.. నా సోదరులు, నా ఆడపడుచులు.. ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా మీడియా ముందుకు వెళ్లవద్దని కోరుకుంటున్నాను. ఆ దేవుడి ఆశీస్సులతో పాటు రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు నా బిడ్డకు, అతని జట్టు సభ్యులకు ఉండాలి. వారు అనుకున్నది విజయవంతం అవుతుంది. నా తమ్ముడు నరేశ్ చాలా కష్టపడ్డారు. ఎలక్షన్ అధికారికి, సహకరించిన కొందరు ‘మా’ సభ్యులకు ధన్యవాదాలు. ఇది అందరి విజయం. కృష్ణ, కృష్ణంరాజు, నా సోదరుడు బాలయ్య, నా ఆత్మీయుడు చిరంజీవి, పవన్‌కల్యాణ్.. ఇలా అందరి ఆశీస్సులు నా బిడ్డకు ఉండాలని కోరుకుంటున్నాను. విష్ణు మంచుకు ఆల్ ది బెస్ట్’’ అని మోహన్‌బాబు అన్నారు. దాదాపు మూడు నాలుగు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల హడావిడికి ఆదివారం తెరపడింది. ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు వైస్‌ప్రెసిడెంట్స్, ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్లతో పాటు 18 మంది ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) సభ్యులతో కూడిన 26 మంది ‘మా’ (2021– 2023) ప్యానల్ సభ్యుల కోసం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారు. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘనవిజయం సాధించారు. మంచు విష్ణుకు 381 ఓట్లు పోలవ్వగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పడ్డాయి. విజేతలను ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రకటించారు. ‘‘925 మంది సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో 883 ఓటర్లు ఉండగా 665 మంది ఓట్లు వేశారు (52 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు). ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ గెలుపొందారు. సమయాభావం వల్ల మిగతా వివరాలను సోమవారం అధికారికంగా వెల్లడిస్తాం’’ అని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అన్నారు. ‘మనమంతా ఒకటే కుటుంబం. ప్రకాశ్‌రాజ్‌గారు అంటే నాకు చాలా ఇష్టం. నరేశ్‌గారికి, సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఆ ప్యానల్, ఈ ప్యానల్ అంటూ లేదు. మేం అందరం ఒకటే కుటుంబం. రెండు నెలలుగా నరకం అనుభవిస్తున్న ఫీలింగ్ కలిగింది. ‘మా’ లో ఇలాంటి పరిణామాలు ఇంకెప్పుడూ జరగకూడదు’’ అని అన్నారు మంచు విష్ణు. ‘‘తెలుగు బిడ్డ గెలిచాడు. విష్ణు మంచుకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు ప్రకాశ్‌రాజ్. ‘‘నేను వెళ్లేటప్పుడు మంచి వారసుడిని ఇచ్చి వెళతాను అని చెప్పాను. మంచు విష్ణు రూపంలో మంచి వారసుడు వచ్చాడు. ‘మా’ మసకబారలేదు.. మెరుగుపడింది’’ అన్నారు నరేశ్. ఇదిలా ఉంటే... మంచు విష్ణు ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, జాయింట్ సెక్రటరీగా గౌతమ్‌రాజు ఇటు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ గెలుపొందారని తెలిసింది. అలాగే ఈసీ మెంబర్స్‌గా ప్రగతి, పూజిత, శశాంక్, జయవాణి, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ, మాణిక్, హరినాథ్‌బాబు, బొప్పన విష్ణు, శ్రీనివాసులు, సంపూర్ణేష్ బాబు, శివారెడ్డి, కౌశిక్, అనసూయ, సురేశ్ కొండేటి, బ్రహ్మాజీ, ఖయ్యుం గెలిచారనే వార్త బయటికొచ్చింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రికార్డు పోలింగ్ ‘మా’ ఎలక్షన్స్‌లో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు పోలింగ్ నమోదు అయ్యింది. గత ‘మా’ ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే నమోదు కాగా, ఈ సారి 665 (883 ఓట్లకు గాను..70 శాతానికి పైగా) ఓట్లు పోల్ అయ్యాయి. పోలైన ఓట్లలో 52 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. అయితే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకే పోలింగ్‌కు అనుమతి ఉన్నప్పటికీ రెండు ప్యానల్స్ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పోలింగ్ సమయాన్ని మరో గంట పొడగించారు. ఎప్పుడూ లేనట్లుగా ‘మా’లో భాగమైన సభ్యులు ఇతర రాష్ట్రాల (ముంబై, చెన్నై, కర్ణాటక) నుంచి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయాన్ని పొడగించడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ‘మా’ సభ్యులు కూడా ఉత్సాహంగా ‘మా’ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వంటి కారణాలు పోలింగ్ శాతం పెరగడానికి కారణం అయ్యాయని చెప్పుకోవచ్చు. ఫైటింగ్.. బైటింగ్.. బెట్టింగ్! ‘మా’ ఎన్నికల పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌కల్యాణ్ వంటి స్టార్స్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ బూత్‌లో హడావిడి చేస్తున్న ఓ అజ్ఞాతవ్యక్తిని నటుడు వీకే నరేశ్ పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు ప్యానల్ సభ్యుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగి, కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ‘మా’ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందంటూ ఇరువర్గాల అభ్యర్థులు ఆరోపించారు. అలాగే పోలింగ్ కేంద్రంలో తమ ప్యానల్స్ తరఫున ప్రచారం చేసే ప్రక్రియలో భాగంగా శివబాలాజీ, సమీర్‌లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో శివబాలాజీ చేతిని నటి హేమ కొరకడం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆ తర్వాత శివబాలాజీ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. మరోవైపు ‘మా’ ఎన్నికల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కొందరు బెట్టింగ్‌రాయుళ్లు ‘మా’ ఎన్నికల జయాపజయాలపై బెట్టిం గ్‌కు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఫైటింగ్.. బైటింగ్.. బెట్టింగ్ నడుమ ఎన్నికలు జరిగాయి. ఓటుకు దూరం కొన్ని రోజులుగా ‘మా’ ఎన్నికల గురించి హీట్ నడుస్తున్నప్పటికీ కొందరు ప్రముఖ నటీనటులు ఎన్నికల్లో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేశ్, రానా, మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, నిహారిక, అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, సుమంత్, సుశాంత్ ఓటు హక్కును వినియోగించుకోనట్లు తెలిసింది. ఇంకా మహేశ్‌బాబు (స్పెయిన్‌లో ‘సర్కారు వారిపాట’ షూటింగ్లో ఉన్నారు) ప్రభాస్, ఎన్టీఆర్, నితిన్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకోలేదు. ముంబయ్ నుంచి జెనీలియా, ఢిల్లీ నుంచి జయప్రద హైదరాబాద్‌కు వచ్చి ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయడం విశేషం. చెల్లని ఓట్లు ఈసీ మెంబర్స్ కోసం పోలైన 665 ఓట్లలో 44 ఓట్లు చెల్లనవిగా ఎలక్షన్ అధికారులు వెల్లడించారు. అయితే ‘మా’ సభ్యులకు పోలింగ్‌పై అవగాహన లేకపోవడం వల్ల చెల్లని ఓట్లు నమోదయ్యాయా? లేక సభ్యులకు ఇష్టం లేక చెల్లని విధంగా ఓట్లు వేశారా? అన్న చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యర్థుల ఆలింగనం ‘మా’ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీలో నిలిచిన మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ మధ్య పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆదివారం ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా పోలింగ్ కేంద్రం నుంచి ప్రకాశ్‌రాజ్‌తో తాను ఉన్న ఫోటోను షేర్ చేశారు మంచు విష్ణు. ఈ ఫోటో, ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నటుడు, నిర్మాత నాగబాబు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారాయన. ‘‘ప్రాంతీయవాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక అసోసియేషన్‌లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు. నా రాజీనామాను 48 గంటల్లో ‘మా’ కి నా సిబ్బంది ద్వారా పంపిస్తాను. ఇది నేను ఎంతగానో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం’’ అని ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు నాగబాబు. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. ‘‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, ఇతర విజేతలందరికీ పేరు పేరునా అభినందనలు.. నా శుభాకాంక్షలు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. ‘మా’ ఇప్పటికీ, ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచనట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. -
MAA Elections: మా ఎన్నికల తేదీ ఖరారు, ఎప్పుడంటే..
-
MAA Elections 2021:‘మా’ బిల్డింగ్ నిర్మాణంపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
-
సీనియర్ నటి కవిత ఇంటికి వెళ్లిన ‘మా’ సభ్యులు
సీనియర్ నటి కవిత ఇంట ఇటీవల విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రోజుల వ్యవధిలోనే కుమారుడు స్వరూప్, భర్త దశరాథ రాజు కరోనాతో మృత్యువాత పడ్డారు. కుటుంబంలోని ముఖ్యమైన ఇద్దరూ వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో కవిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు మరణం మరవక ముందే భర్త మృతి వార్త ఆమెను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆమెను ఓదార్చం ఎవరి తరంగా కావడం లేదు. అయితే టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెను ఫోన్ ద్వారా పరామర్శించినప్పటకీ తాజాగా మా అసోసియేషన్ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. సీనియర్ నటుడు, మా అధ్యక్షులు నరేష్‌తో పాటు కరాటే కల్యాణి, నటి పవిత్రలు కవిత, ఆమె కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు. ఇక భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా తప్పకుండా అందిస్తామని నరేష్ భరోసానిచ్చారు. కాగా కవిత భర్త దశరథ రాజు నెల రోజుల కరోనా పాజిటివ్‌గా తేలింది. మధ్యలో ఓ సారి నెగిటివ్‌గా వచ్చింది. ఈ క్రమంలోనే వారి తనయుడు స్వరూప్ కరోనాతో మృత్యువాత పడ్డాడు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న దశరథ రాజును కవిత ఆస్పత్రికి తరలించారు. దాదాపు 20 రోజులు చికిత్స తీసుకున్న తర్వాత కవిత భర్త కన్నుమూశారు. కవిత 'ఓ మజ్ను' అనే తమిళ సినిమాతో 11 ఏళ్లకే వెండితెర అరంగ్రేటం చేశారు. సుమారు 50కి పైగా తమిళ చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఆమె తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. Movie artists association (MAA) President @ItsActorNaresh, along with other artists from TFI met and conveyed their condolences to actress #kavitha on the huge loss of her husband and son due to #Covid19. pic.twitter.com/SJ5MiSTyIW — BARaju's Team (@baraju_SuperHit) July 3, 2021 -
ఇండస్ట్రీకి సేవ చేయడమే నా కర్తవ్యం: మంచు విష్ణు
-
MAA Elections 2021: 'మా' అధ్యక్ష బరిలో మరో అభ్యర్థి
-
Pavala Syamala: పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి సాయం
సాక్షి, హైదరాబాద్ : నటి పావలా శ్యామల దీనగాధపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆమెను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను తీసుకున్నారు. ‘మా’ సభ్యత్వంతో పాటు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ సభ్యులు కరాటే కళ్యాణి, సురేష్ కొండేటి శ్యామల ఇంటికి చేరుకొని 'మా' అసోసియేషన్ కార్డు సహా 1,01,500 రూపాయల చెక్కును అందించారు. ఇక ‘మా’ మెంబర్ షిప్ కార్డ్ తో నెలకు 6 వేల చొప్పున ప్రతినెలా ఫించను రూపంలో అందుతుందని తెలిపారు. ‘మా’ సభ్యత్వం పొంది ఉంటే ఎవరైనా ఆర్టిస్ట్ అకాల మరణం చెందితే వారికి రూ. 3లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. పావలా శ్యామల కూతురి వైద్యానికి సంబంధించి న్యూరో సిటీ సెంటర్ వైద్య నిపుణులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇక చిరంజీవి తనకు సాయం చేయడం పట్ల పావలా శ్యామల ఆనందం వ్యక్తం చేశారు. గతంలోను ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి రూ. 2లక్షలు ఇచ్చి సాయం అందించారని, మళ్లీ ఇప్పుడు తనను ఆదుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'గతంలోనూ తీవ్ర మానసిక వేదనను అనుభవించాను. నా కుమార్తెకు టీబీ వ్యాధికి చికిత్స చేయించలేని పరిస్థితి. కాలు విరిగి తీవ్ర ఇబ్బందిలో ఉంటే.. అప్పుడు ఆ రెండు లక్షల ఆర్థిక సాయం నన్ను ఎంతో ఆదుకుంది. ఆ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. అప్పుడు సినీ పరిశ్రమలో ఎవరూ సాయం చేయలేదు. కానీ నాకు మెగాస్టార్ కుమార్తె వచ్చి 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ కష్టంలో మరోసారి లక్షా పదిహేను వందల రూపాయలను చెక్ రూపంలో అందించారు.అంతేకాకుండా ప్రతి నెలా ఆరువేల రూపాయలు సాయం అందించేందుకు సాయపడ్డారు. మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి నా ధన్యవాదాలు' అని అన్నారు. ఇక చిరంజీవి సాయానికి 'మా' కమిటీ సభ్యులు సైతం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చదవండి : పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన డైరెక్టర్ పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో.. -
పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి సాయం
-
తప్పయిపోయింది మహాప్రభో, క్షమించండి: నటుడు
సాక్షి, హైదరాబాద్: దివంగత నటుడు కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ విష్ణువర్థన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలుగు నటుడు విజయ్ రంగరాజు క్షమాపణలు కోరారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్థన్‌ను ఎకవచనంలో సంబోధిస్తు.. అవమానకర రీతిలో పదజాలాన్ని వాడారు. దీంతో కన్నడ ప్రజలు, హీరో విష్ణువర్థన్ అభిమాన సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని కన్నడ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రంగరాజు ఓ వీడియో విడుదల చేశాడు. మూడు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో రంగరాజు ‘ప్రముఖ సూపర్ స్టార్ విష్ణువర్థన్‌పై నేను చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నా తప్పిదానికి కన్నడ ప్రజలకు, పరిశ్రమ పెద్దలు, నటీనటులకు నా క్షమాపణలు. నాకు తెలుసు నేను పెద్ద పాపం చేశాను. దానికి నేను శిక్షార్షుడిని. కరోనా అని నేను మొహనికి మాస్క్ పెట్టుకున్నాను. కానీ నేను చేసిన పాపానికి నా మొహం చూపించలేక మీ నుంచి చాటేసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇక మహమ్మారి కాలంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఆ ఆవేశంలోనే తాను ఇలా మాట్లాడనని స్పష్టం చేశాడు. తన తప్పిదానికి విష్ణువర్థన్ అభిమానులు, ఆయన భార్య, కుటుంబ సభ్యులు క్షమించాలని కోరాడు. అంతేగాక కన్నడ సూపర్ స్టార్స్ సుదీప్ కిచాచా, పునీత్ రాజ్‌కుమార్‌లను కూడా మోకాళ్లపై నిలుచుని క్షమాపణలు ఆర్జిస్తూ కన్నీటీ పర్యంతరం అయ్యాడు. ఇక ఆయనతో పాటు తెలుగు సీనియర్ నటుడు, ‘మా’ (మూవీ ఆర్టీస్ట్స్ అసోషియేషన్) అధ్యక్షడు నరేష్ సైతం కన్నడ ప్రజలకు, పరిశ్రమకు క్షమాపణలు చెప్పాడు. కన్నడ స్టార్ హీరో అయిన విష్ణువర్థన్‌పై విజయ రంగరాజు చేసిన వ్యాఖ్యాలు తనను బాధించాయని, తెలుగు సినీ పరిశ్రమ తరపున కన్నడ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానంటూ నరేష్ ట్విటర్లో వీడియో సందేశం ఇచ్చాడు. ‘విష్ణువర్థన్‌ను రంగరాజు ఏకవచనంలో సంభోదిస్తూ అసభ్య పదజాలం వాడటం సరికాదు. ఇందుకు కన్నడ సోదరి సోదరీమణులను మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. డాక్టర విష్ణువర్థన్ తమిళ, కన్నడ పరిశ్రమలోనే గాక తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. నేను కూడా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనకు నేను కూడా పెద్ద అభిమానిని. అలాంటి ఆయనపై రంగరాజు వ్యక్తిగత అభిప్రాయయం చెప్పినా, అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి తప్పే. ఇందుకు ‘మా’ తరపున, తెలుగు సినీ పరిశ్రమ తరపున నేను క్షమాపణలు కోరుతున్నా’ అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. అలాగే ఇకముందు కూడా ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటున్నానని, తాను వ్యక్తిగతంగా కూడా రంగరాజుతో మాట్లాడి హెచ్చరిస్తానన్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నటుడు విజయ రంగరాజు కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ విష్ణువర్థన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ వీడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో కన్నడ పరిశ్రమ, కన్నడ ప్రజలు ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అవమానకర రీతిలో పదాలు వాడినందుకు రంగరాజుపై మండిపడుతూ క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఓ సూపర్ స్టార్‌పై విజయ రంగారాజు చేసిన వ్యాఖ్యాలు సరికావని, ఆయనన అనే ముందు ఆయనేంటో తెలుసుకోవాలన్నారు. ఇక ఆయన కన్నడ, తమిళ పరిశ్రమలో ఎలా అడుగుపెడతారో చూస్తామన్నారు. ఇక తన వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కితీసుకోని విష్ణువర్థన్ కుటుంబ సభ్యలుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
పరుచూరికి చిరంజీవి పరామర్శ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి మృతికి మెగస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి తన ప్రగాఢ సానభూతిని తెలియజేశారు. పరచూరి తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు. (ప్రముఖ రచయిత ఇంట విషాదం) 'మా' సంతాపం విజయలక్ష్మీ మృతికి పలువురు సినీ ప్రముఖుల సంతాపం తెలియజేశారు. వెంకటేశ్వరరావుకి మూవీ ఆర్టిస్టుల సంఘం తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. విజయలక్ష్మి మరణం పరుచూరి కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయితలుగా పరుచూరి బ్రదర్స్ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. -
‘మా’ 2020 డైరీ ఆవిష్కరణ
-
మా అసోషియేషన్ ఎక్కడ..?
పెరంబూరు: గొల్లపూడి మారుతీరావు భౌతికాకాయానికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంతిమయాత్రలో బంధువులతో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక టీ.నగర్‌లోని కన్మమ్మపేటలోని శ్మశానవాటికలో శస్త్ర బద్ధంగా గొల్లపూడికి అంత్యక్రియలు జరిగాయి. ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ కర్మకాండలను నిర్వహించారు. అంతకుముందు ఇంటి వద్ద పలువురు సినీప్రముఖులు, బంధువులు గొల్లపూడి మారుతీరావు భౌతిక కాయానికి నివాళ్లులర్పించారు. లబ్ద ప్రతిష్టుడు గొల్లపూడి గొల్లపూడి మారుతీరావు లబ్దప్రతిష్టుడని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గొల్లపూడికి అంజలి ఘటించిన బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గొల్లపూడి సతీమణి తనను చూసి మీరు ఆయనకు ఆత్మబంధువు అని అన్నారన్నారు. అది తన భాగ్యంగా పేర్కొన్నారు. గొల్లపూడి తాను నిర్మించిన శుభసంకల్పం చిత్రానికి మాటలు అందించడంతో పాటు ప్రముఖ పాత్రను పోషించారని గుర్తు చేశారు. ఆ చిత్రం ద్వారా ఆయనతో తన పయనం ఆరు నెలలు అద్భుతంగా సాగిందని తెలిపారు. ఆయన భాషా సాంస్కృతికవేత్తతో పాటు మంచి విశ్లేషకుడని కీర్తించారు. అలా ఆయన నుంచి సాంస్కృతిక పరమైన విషయాలను చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఇంట్లో కంటే బయట జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొనడాన్ని తాను ఇష్టపడేవాడినని చెప్పారు. ఆయన ఎన్నో జాతీయ, అంతర్జాతీయ విషయాలను చాలా గొప్పగా విశ్లేషించేవారని చెప్పారు. తెలుగు భాష ఏమైపోతుందోనని చాలా మంది బాధ పడుతుంటారన్నారు. నిజానికి భాష ఎక్కడికీ పోదన్నారు. గొల్లపూడి లాంటి వారు ఉన్నంత వరకూ భాషకు కలిగే ముప్పేమీ లేదన్నారు. గొల్లపూడి మహా ప్రతిభామూర్తి అని పేర్కొన్నారు. గొప్ప చేతన, శ్రేయస్సుకారుడని అన్నారు. గొప్పవారు లేని లోటు తీర్చలేనిదంటారని, అయితే నిజంగా ఒక శూన్యం ఉంటుందని, దాన్ని ఎవరూ భర్తీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అలాంటి వారి లక్ష్యాలను మనం ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. మారుతీరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుటూ, ఆయన కటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి నిర్మాత దగ్గుబాటి సురేశ్ గొల్లపూడితో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గొల్లపూడి చాలా మంచి వ్యక్తి అని అన్నారు. తాము ఈ పక్క వీధిలోనే ఉండేవాళ్లం అని, ప్రారంభ దశ నుంచే నాన్నతో గొల్లపూడికి మంచి అనుబంధం ఉండేదని అన్నారు. వెంకటేశ్ నటించిన పలు చిత్రాల్లో ఆయన నటించారని, లీడర్ చిత్రంలోనూ గొల్లపూడి మంచి పాత్రను పోషించారని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆయన చిన్న కొడుకు మరణించడంతో ఆయన పేరుతో ఒక జాతీయ అవార్డును నెలకొల్పి నూతన ప్రతిభావంతులకు ప్రదానం చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నానన్నారు. గొల్లపూడి హీరో కూడా గొల్లపూడి మారుతీరావు హీరో అని సీనియర్ నిర్మాత, దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ పేర్కొన్నారు. గొల్లపూడితో తనకు 1974 నుంచే పరిచయం ఉందన్నారు. ఆయన నాటకాల నుంచి వచ్చిన తరువాత లక్ష్మీ ప్రొడక్షన్లో గోస్ట్ రైటర్‌గా పని చేశారని గుర్తు చేశారు. ఆ తరువాత తాను నిర్మించిన మూడు చిత్రాల్లో నటించినట్లు తెలిపారు. గొల్లపూడి మారుతీరావు నటుడు, రచయిత, సాహితీవేత్తనే కాకుండా హీరోగా నటించారన్నారు. సంసారం ఒక చదరంగం చిత్రంలో ఆయనే హీరో అని పేర్కొన్నారు. ఆయన పత్రికల్లో రాసిన శీర్షికలు ఎంతో ప్రాచుర్యం పొందినట్లు తెలిపారు. ఏ రోజు ఏ టాపిక్‌పై రాస్తారోనని ఆసక్తిగా ఎదురు చూసేవారని అన్నారు. అదే విధంగా సీనియర్ నిర్మాత ఏకాంబరేశ్వరరావు గొల్లపూడి భౌతక కాయానికి నివాళులర్పించి తను అనుభవాలను పంచుకున్నారు. గొల్లపూడిని దర్శకుడు కోడిరామకృష్ణకు పరిచయం చేసింది తానేనని చెప్పారు. తన మిత్రుడు, భాగస్వామి అయిన కే.రాఘవకి సిఫార్సు చేసి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రానికి మాటలు రాయించడంతో పాటు అందులో నటింపజేసినట్లు తెలిపారు. కాగా జేకే రెడ్డి, టీటీడీ స్థానిక సలహామండలి మాజీ అధ్యక్షుడు శ్రీకృష్ణ గొల్లపూడి భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు తొలి గ్రహీత ఆంగ్లోఇండియన్ లెస్లీ కార్వోలో గొల్లపూడికి నివాళులర్పించారు. కాగా ప్రఖ్యాత నటుడు, రచయితగా పేరు గాంచిన గొల్లపూడి మారుతీరావుకు నివాళులర్పించడానికి మా అసోషియేషన్ నుంచి ఏ ఒక్కరూ కూడా వచ్చి నివాళులర్పించకపోవడం ఖండించదగ్గ విషయం. -
త్వరలో ఏపీ మా అవార్డులు
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో త్వరలో అవార్డులు ఇవ్వనున్నట్లు ‘మా ఏపీ’ వ్యవస్థాపకుడు–దర్శకుడు దిలీప్‌రాజా, ‘మా ఏపీ’ ప్రెసిడెంట్ సినీ నటి కవిత తెలిపారు. తెనాలిలో ఇటీవల ‘మా ఏపీ’ సర్వసభ్య సమావేశం జరిగింది. తొలుత స్వర్గీయ విజయ నిర్మలకు నివాళులర్పించారు. అనంతరం దిలీప్‌రాజా, కవిత మాట్లాడుతూ– ‘‘2018కి సంబంధించి ఉత్తమ చిత్రాలకు అవార్డులు ఇవ్వనున్నాం. ఎలాంటి జ్యూరీని నియమించకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని అవార్డులకు ఎంపిక చేస్తాం. స్వర్గీయ విజయనిర్మల స్మారక అవార్డును ప్రముఖ దర్శకులకుగానీ, ప్రముఖ మహిళా నటీమణికిగానీ ఇస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఆగస్టు 15, 2019 వరకు ఎంట్రీలను పంపొచ్చు. తమ పేరు, చిరునామా, ఆధార్ కార్డులతో ప్రజలు తమ తీర్పును సీల్డ్ కవర్లో ‘మా ఏపీ’ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి–522201, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు పంపాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు, ‘మా ఏపీ’ ప్రధానకార్యదర్శి నర్సింహరాజు, జయశీల, నిర్వహణ కమిటీ చైర్మన్ బాసింశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘మా’లో మరో వివాదం
ఎన్నికల తరువాత కూడా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ ఆసోషియేషన్)లో వివాదాలు సద్దుమణగటం లేదు. శివాజీరాజా, నరేష్‌ల మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. గత టర్మ్‌లో ఒకే ప్యానల్లో కలిసి పని చేసిన శివాజీ, నరేష్‌లు ఈ సారి ప్రత్యర్థులుగా బరిలో దిగారు. ఉత్కంఠ కలిగించిన ఈ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తరువాత కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. నరేష్ వర్గం ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తం నిర్ణయించుకుంది. అయితే శివాజీ రాజా మాత్రం ‘తమకు మార్చి 31 వరకు గడువు ఉందని కోర్టు వెళ్తామన్నా’రని నరేష్ వెల్లడించారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న చెక్కులపై సంతకాలు పెట్టేందుకు కూడా పూర్వ సభ్యులు సహకరించటం లేదన్నారు. తమకు కుర్చీ పిచ్చి లేదన్న నరేష్, ఎన్నికల సమయంలో శివాజీ రాజా తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మా సభ్యులను శివాజీ వర్గం ఎత్తుకెళ్లిందని ఆరోపించారు. చట్టపరంగా ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎప్పుడైనా బాద్యతలు స్వీకరించే హక్కు మాకు ఉందన్న నరేష్, పెద్దలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మా కోసం పనిచేయడానికి వచ్చామని తమకు అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. -
మా అధ్యక్ష ఎన్నికల్లో నరేష్ విజయం
-
‘మా’ అధ్యక్షుడిగా నరేష్ విజయం
సాక్షి, హైదరాబాద్ : ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేష్ విజయం సాధించారు. ప్రత్యర్థి శివాజీ రాజాపై ఆయన గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌పై రాజశేఖర్ గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజయం సాధించారు. జనరల్ సెక్రటరిగా రఘుబాబుపై జీవిత రాజశేఖర్ గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు, శివబాలాజీ విజయం సాధించారు. ట్రెజరర్‌గా కోట శంకర్రావుపై రాజీవ్ కనకాల గెలుపొందారు. గెలుపొందిన ఈసీ మెంబర్స్ : 1). అలీ 2). రవిప్రకాష్ 3). తనికెళ్ల భరణి 4). సాయికుమార్ 5). ఉత్తేజ్ 6). పృథ్వి 7). జాకీ 8).సురేష్ కొండేటి 9). అనితా చౌదరి 10). అశోక్ కుమార్ 11). సమీర్ 12). ఏడిద శ్రీరామ్ 13).రాజా రవీంద్ర 14). తనీష్ 15). జయలక్ష్మి 16). కరాటి కళ్యాని 17). వేణుమాధవ్ 18). పసునూరి శ్రీనివాస్. ఆదివారం ‘మా’ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. మా అసోషియేషన్‌లో మొత్తం 745మంది సభ్యులు ఉండగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
‘మా’ బరిలో ఉన్న అభ్యర్థులకు జీహెచ్ఎంసీ షాక్
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల బరిలో తలపడుతున్న నరేష్, శివాజీ రాజాలకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. నిబంధలకు విరుద్ధంగా ఫిలిం చాంబర్ పరిసరాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసినందుకు గాను ప్రధాన అభ్యుర్దులు శివాజీ రాజా, నరేష్లతో పాటు మరికొంత మందికి పెనాల్టీ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. పై అధికారులతో చర్చించిన తరువాత తదుపరి ఎలాంటి చర్యలు తీసుకొవాలన్న విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. శివాజీ రాజా, నరేష్ ప్యానల్లు తలపడుతున్న ఈ ఎలక్షన్ల పోలింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, నాగబాబు, ఆర్ నారాయణమూర్తి, రాజీవ్ కనకాల, జీవితా రాజశేఖర్ దంపతులు, హీరోయిన్ ప్రియమణి, యాంకర్లు ఝాన్సీ, సుమలతో పాటు 260 మంది వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభిస్తారు. 8 గంటలకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. -
రసవత్తరంగా ‘మా’ పోలింగ్
-
‘మా’ అధ్యక్ష బరిలో నరేష్
-
సేవ చేస్తుంటే కామెంట్లు చేస్తున్నారు!
‘‘మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షునిగా రెండేళ్లు పూర్తయింది. ఆర్టిస్టులంతా మరోసారి అధ్యక్షుడిగా ఉండాలని కోరారు. నేను ఉండను.. ఎవరైనా పోటీ చేయండి అని అన్నాను. కానీ ఈ ఒక్కసారికి చేయండి అంటూ ఆర్టిస్టులు అడిగారు’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో పంచుకున్న విశేషాలు... ► నాకు పుట్టినరోజులు చేసుకునే అలవాటు లేదు. 32ఏళ్ల కెరీర్లో పరిశ్రమలో ఇదే తొలిసారి. ఓసారి మిత్రుల కోసం బర్త్ డే పార్టీ ఇచ్చాను. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే జరుపుకుంటున్నా. ► ‘మా’ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ సంవత్సరం ఇది. ఏ గొడవలు లేకుండా సంతోషంగా ముందుకు సాగాలి. కష్టాల్లో ఉన్నవారికి సాయపడే తత్వం నాది. ఈ రెండేళ్లలో రకరకాల సేవలు చేసాను. దానిపై కామెంట్లు చేయడం బాధ అనిపించింది. ఈసారి తనీష్, ఖయ్యూమ్ లాంటి యువకులు మా ప్యానెల్లో పోటీ చేస్తున్నారు. భవిష్యత్ తరం బావుండాలనే ప్రయత్నమిది. ► మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికల్లో ఎవరైనా పోటీకి దిగొచ్చు. ‘మీ అబ్బాయి హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు.. హ్యాపీగా ఉండొచ్చు కదా? అంటే.. నా చుట్టూ ఉన్నవారికి మంచి చేసేందుకు ఇలా చేస్తున్నా. ► ఆర్టిస్టులకు గోల్డేజ్ హోమ్(ఓల్డేజ్ హోమ్) నిర్మాణం నా డ్రీమ్. ఈ హోమ్ నిర్మాణానికి హీరో, దర్శకుడు రంగనాథ్గారి మరణమే కారణం. ఆయన చివరి రోజుల గురించి అందరికీ తెలిసిందే. ఇందుకోసం ఓ ఎన్నారై ఆరు ఎకరాల భూమిని దానమిస్తానన్నారు. శంకర్పల్లి సమీపంలో పది ఎకరాలు ఇచ్చేందుకు వేరొక వ్యక్తి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఫైనల్ చేయాల్సి ఉంది. ‘గోల్డేజ్ హోమ్’ కోసం ఇప్పటికే కొన్ని విరాళాలు అందాయి. -
కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ‘మా’
రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో విజయ పతాకాన్ని ఎగురవేసిన టి.ఆర్.ఎస్. అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావును మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అభినందించింది. అందరి అంచనాలను మించి అఖండ విజయాన్ని రెండోసారి కూడా సాధించిన ఘనత కె.సి.ఆర్.కు దక్కిందని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. టి.ఆర్.ఎస్. ప్రభుత్వం చిత్రసీమ అభివృద్ధి కోసం ఎంతో కట్టుబడి ఉందని, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, ఎఫ్.డి.సి. ఛైర్మన్ రామ్మోహనరావు గారిని ఎప్పుడు ఏ పని నిమిత్తం కలిసినా ఎంతో సహకరించారని ఆయన చెప్పారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా తమ ముందు ఓ పెద్ద బాధ్యత ఉందని, గోల్డేజ్ హోమ్ నిర్మాణాన్ని ఈ కార్యవర్గం ఉండగానే ప్రారంభించాలను కుంటున్నామని శివాజీరాజా తెలిపారు. అందుకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు, కె.టి.ఆర్., హరీశ్ రావు, కవిత, తలసాని శ్రీనివాస యాదవ్ గార్ల సహకారం లభిస్తుందని భావిస్తున్నామని అన్నారు. తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'గోల్డ్ ఏజ్ హోమ్'ను కేసీఆర్ సహకారంతో ప్రారంభిస్తామన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పిన ఫిగర్ ను రీచ్ కావడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, చెప్పి మరీ కేసీఆర్ మ్యాజిక్ ఫిగర్ ను దాటి భారీ మెజారిటీ సాధించారని 'మా' కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. సినీ ప్రముఖుల సహకారంతో, ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ లో గోల్డ్ ఏజ్ హోమ్ ను ప్రారంభించాలను కుంటున్నామని, తెలంగాణ ప్రభుత్వం సైతం తమ వంతు సహకారం అందిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. -
సద్దుమణిగిన ‘ మా అసొషియేషన్’ వివాదం
-
‘నోరు జారాడు.. చర్యలు తీసుకోండి’
సూపర్ స్టార్ మహేష్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ కమెడియన్ మనోజ్ ప్రభాకర్‌పై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మనోజ్.. ఫేస్బుక్ పోస్ట్‌తో పాటు ఓ వీడియో సందేశం రూపంలో క్షమాపణ కోరినా.. అభిమానులు శాంతించటం లేదు. తాజాగా ఈ వివాదం పై మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కూడా తీవ్రంగా స్పందించింది. టాలీవుడ్ సూపర్ స్టార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మనోజ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ నడిగర్ సంఘానికి లేఖ రాసింది మా అసోషియేషన్. వీలైనంత త్వరగా ఈ సమస్యకు సంబంధించి సరైన యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నామని లేఖలో పేర్కొంది. ‘మా’ అసోషియేషన్ తరపున జనరల్ సెక్రటరీ వీకే నరేష్ ఈ లేఖను నడిగర్ సంఘానికి పంపించారు. -
సద్దుమణిగిన ‘మా’ వివాదం
గత కొద్ది రోజులుగా మా అసొషియేషన్‌లో వివాదాలు ఇండస్ట్రీని కుదిపేశాయి. శివాజీరాజా, నరేష్‌లు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన ఇండస్ట్రీ పెద్దలు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ విషయంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వజ ‘అన్ని సంస్థలలో ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇరు వర్గాలు ప్రెస్‌మీట్ పెట్టి తప్పు చేశారు. ఇక నుండి అన్నీ విషయాలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే చూసుకుంటుంద’న్నారు. ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన కలెక్టివ్ కమిటీలో ‘మా’లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేలిందని తెలిపారు. ఇక నుంచి మా అధ్యుక్షుడు శివాజీ రాజా, సెక్రటరీ నరేష్‌లు కలిసి పనిచేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో కలెక్టివ్ కమిటీనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందన్నారు. నరేష్ మాట్లాడుతూ.. ‘సంస్ధ లో డిఫరెంట్ ఓపినియన్స్ రావటం సహజం. కలెక్టివ్ కమిటీ ద్వారా అందరం కలుసుకొని మాట్లాడుకున్నాం. గతం గతః. రాబోయే రోజుల్లో జరిగే ఈవెంట్స్ కలిసి సక్సెస్ చేస్తాం. నేను, శివాజీ రాజా గారు సినీ పెద్దల సపోర్ట్ తో సిల్వర్ జూబ్లీ ఈవెంట్ లను సక్సెస్ చేయటానికి కృషి చేస్తాం’ అన్నారు. అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ.. చిన్న చిన్న మనస్పర్దలు వచ్చిన మాట వాస్తవమే.. కలెక్టివ్ కమిటీ ముందు అన్నీ వివరాలు ఉంచాము. ఎలాంటి అవకతవకలు లేవని తేలిందన్నారు. -
సిని‘మా’.. వివాదం
-
మా మద్య ఎలాంటి విభేదాలు లేవు
-
ఇక కెమెరా సాక్షిగా ఆడిషన్స్
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో మహిళల భద్రత గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను చలన చిత్ర పరిశ్రమ తీవ్రంగా పరిగణించింది. సినిమాల్లో వివిధ శాఖలకు సంబధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. పరిశ్రమలోని అన్ని శాఖలూ ఈ అంశాలను కూలంకుషంగా చర్చించి సరైన తీరులో సక్రమంగా స్పందించాలని నిర్ణయించాయి. అందులో భాగంగా కొన్ని దీర్ఘకాలిక నిర్ణయాలను అమలుపరచాలనుకుంటున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత పి. కిరణ్, నిర్మాత ముత్యాల రాందాస్, దర్శకులు ఎన్. శంకర్, నందినీరెడ్డి పాల్గొని, తాము తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ► సెక్సువల్ హెరాస్మెంట్ నియంత్రించడానికి ఏర్పాటు చేస్తున్న ‘క్యాష్’ కమిటిలో 50 శాతం చిత్రపరిశ్రమవారు, 50 శాతం ఇండస్ట్రీ బయట వ్యక్తులు ఉండాలి. డాక్టర్లు, లాయర్లు, సైకాలజిస్టులు అందులో మెంబర్లుగా ఉంటారు. ► ప్యానల్‌కు సంబంధించిన చట్టపరమైన నిబంధల రూపకల్పనకు న్యాయ సలహాలు తీసుకుంటాం. ► మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై చిత్ర పరిశ్రమ వివిధ సంస్థలకి గైడ్ లైన్స్ పంపించడం జరిగింది. మహిళా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆడిషన్స్ నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా కెమెరాలు ఉండాలి. ఓ మహిళా స్టాఫ్ తప్పనిసరిగా ఉండాలి. సమాచార సాధనాల్లో భాషను సక్రమంగా వాడేలా చూడాలి. ► 24 క్రాఫ్ట్స్‌లోని మహిళల సమస్యలను తెలుసుకొని వాటికి తగ్గట్టుగా పాలసీలను రూపొందించేందుకు మహిళలందర్ని ఒక చోట కలిపి వర్క్ షాప్ ఏర్పాటు చేయబోతున్నాం. ► లైంగిక వేధింపుల పై ఏర్పాటు చేయనున్న ప్యానల్లో ‘షీ’ టీమ్‌లో ఒక డైరెక్ట్ హాట్‌లైన్ ఉంటుంది. దీని ద్వారా వేగంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ► ఈ–మెయిల్/పోస్ట్ ద్వారా హెల్ప్ లైన్లు ఛాంబర్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ► మోడలింగ్ కో–ఆర్డినేటర్స్‌కు సరైన లైసెన్సింగ్/అర్హతలు ఉండేలా చూస్తాం. ► కొత్తగా ఇండస్ట్రీకి ప్రవేశించాలనే నటీనటులకు కౌన్సిలింగ్ చేసేందుకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేయనున్నాం. ఈ చర్యల ద్వారా సినీ పరిశ్రమలోని మహిళలు సురక్షితమైన వాతావరణంలో పని చేసుకునే వీలుంటుందని సమావేశంలో ప్రముఖులు తెలిపారు. -
ముగిసిన సినీ పెద్దల సమావేశం
సాక్షి, హైదరాబాద్ : కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై సినీ పెద్దలు ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశం పూర్తయ్యింది. దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై సినీ ప్రముఖులు చర్చించినట్టుగా తెలుస్తోంది. సినీరంగానికి చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులతో పాటు 24 శాఖలకు చెందిన 80 మందికి పైగా సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను, తీసుకున్న నిర్ణయాలను మీడియాకు మాత్రం వెల్లడించలేదు. ముందుగా ఈ సమావేశానికి పవన్ కూడా హాజరవుతారన్న ప్రచారం జరిగినా.. భద్రతా కారణాల దృష్ట్యా హాజరు కాలేదు. అయితే అదే సమయంలో పవన్ న్యాయవాదులతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. -
అన్నపూర్ణ స్టూడియోస్‌కు పవన్..!
గత కొద్ది రోజులు తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సినీపెద్దలు అన్ని రంగాల వారితో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మా అధ్యక్షులు శివాజీ రాజా.. నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, కేయస్ రామారావు, దానయ్య,ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఠాగూర్ మధు, అశోక్ కుమార్, సీ కల్యాణ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన యన్వి ప్రసాద్, నరేష్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, జెమినీ కిరణ్, కాశీ విశ్వనాథ్, హలు అన్నపూర్ణ 7 ఎకరాల స్టూడియోకు చేరుకున్నారు. పవన్ కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుండటంతో అభిమానులు కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఈ రోజు సాయంత్రం 4గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా సినిమా రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు వంటి అంశాలపై సినీరంగ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, కార్మిక శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. -
‘అలా అయితే నా కూతురిని సినిమాల్లోకి ఎలా తెస్తాను’
సాక్షి, హైదరాబాద్ : సినిమా పరిశ్రమలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న సంఘటనలపై నటుడు కొణిదెల నాగబాబు ఘాటుగా స్పందించారు. కాస్టింగ్ కౌచ్‌పై తెలుగు సినిమా పరిశ్రమపై వస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు కొన్ని పరిమితులు ఉంటాయని అన్నారు. బుధవారం ఫిల్మ్ చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగబాబు మాట్లాడారు. ‘మా’ ఎవరికి అవకాశాలు ఇప్పించదని, కేవలం సభ్యుల సమస్యలను మాత్రమే పరిష్కరిస్తుందని చెప్పారు. మా అసోసియేషన్‌లో సభ్యత్వ నమోదుపై జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం జరుగుతుందని వెల్లడించారు. ఉచితంగా మా సభ్యత్వం ఇవ్వరని తెలిపారు. ఈ విషయంలో మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజాను నిందించడం తప్పని అన్నారు. అవగాహన లేకుండా మా గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. నెల రోజుల నుంచి పరిశ్రమలో జరిగే సంఘటనలు గమనిస్తున్నానని, శ్రీరెడ్డి వ్యవహారం అసలు విషయం వదిలేసి పక్కదారి పట్టిందని చెప్పారు. ‘ప్రతి విషయానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కదలి రావాల్సిన పని లేదు. నా లాంటి ఎవరో ఒకరు చాలు. ఈ విషయాన్ని చాలా సులువుగా పరిష్కరించవచ్చు. తెలుగువాళ్లకే క్యారెక్టర్లు ఇవ్వాలి అంటున్నారు. తెలుగు వాళ్లకు కాకపోతే ఇంకెవరికి ఇస్తున్నాం?. హీరో, హీరోయిన్లు, కొన్ని విలన్ క్యారెక్టర్లు సదరు సినిమా అవసరాన్ని బట్టి నిర్మాతలు తీసుకుంటున్నారు. మా అసోసియేషన్ తెలుగు అమ్మాయిలకు, తెలుగువాళ్లకు క్యారెక్టర్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేయగలదు. అంతేగానీ వారి మెడలు వంచి అవకాశాలు ఇప్పించలేదు. అలా చెయ్యదు కూడా. ఎందుకంటే నిర్మాత కోట్ల రూపాయలు వెచ్చించి చిత్రాలను తెరకెక్కిస్తారు. వాళ్లను మేం చెప్పినట్లు చేయమని ఎలా అడగుతాం. ఆ అధికారం మాకు లేదు. వాళ్లకు నష్టం వస్తే మా అసోసియేషన్ ఇవ్వలేదు కదా. చాలామంది నిర్మాతలు జీవితాలను ఫణంగా పెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు. ఒక భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. ఒకరు రాకూడదు. చేయకూడదు అనేది లేదు. మా అసోసియేషన్ 100 శాతం నిర్మాతలను తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వమని అడుగుతుంది. వాళ్లు హిందీ, తమిళం ఇలా ఎక్కడి నుంచైనా హీరోయిన్లను తెచ్చుకోవచ్చు. వాళ్లను నియంత్రించలేం. ఈ మధ్య ప్రతి వాళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. చులకనగా చూస్తున్నారు. ఏ అన్ని సినిమాలు బ్యాడ్‌గానే తీసున్నామా? బ్యాడ్‌గానే చూపిస్తున్నామా. సినిమాల్లో ఉండేవాటిని చూసి జనాలు చెడిపోతున్నారా?. సినిమాల్లోని అంశాలను చూసి జనాలు చెడిపోతున్నారని మీరే అంటున్నారు కదా. సినిమాల్లో చూపించే మంచిని ఎందుకు ఫాలో కావడం లేదో మీరే చెప్పండి. నోరు మూసుకుని ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీ అందరికీ ఒక సాఫ్ట్ టార్గెట్‌గా మారింది. ఇక్కడకు వచ్చి చూడండి. బయట నిలబడి ఇండస్ట్రీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మీకు మీ సంఘాలకు ఎంత గొప్పతనం ఉందో మాకూ అంతే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇండస్ట్రీపై నోటికి వచ్చినట్లు పేలొద్దు. టాలీవుడ్ నుంచి ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. ఇప్పటికీ తీస్తున్నారు. 10 శాతం నుంచి 20 శాతం వరకూ వచ్చే చెత్త సినిమాల పేరిట ఇండస్ట్రీ మొత్తాన్ని బాధ్యులను చేయడం సరికాదు. కమర్షియల్ సినిమాలు తీస్తే తప్పేంటి? రామాయణ, మహాభారతాలు తప్ప మరే సినిమాలు తీయకూడదా?. మీరు అలాంటి సినిమాలు చూడకండి. సినిమాల్లో హింస తదితర అంశాలను తగ్గించడానికి ప్రయత్నిస్తాం. సెన్సార్ అప్రూవల్ తర్వాతే సినిమాలు విడుదల అవుతున్నాయి. సెన్సార్ అనుమతితో విడుదలైన సినిమాలపై మీరు ఎలా మాట్లాడతారు? సినిమా ఇండస్ట్రీలో నీతి, నిబద్దత కలిగిన వారు చాలామంది ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ పదం ఇప్పుడే తెలిసిందా?. సినిమా పరిశ్రమలో అందరూ పాడైపోయిన అమ్మాయిలే అంటున్నారు. అలా అయితే నా కూతురిని సినిమాల్లోకి ఎందుకు తెస్తాను. వచ్చిన అమ్మాయిలందరూ కాస్టింగ్ కౌచ్‌కు బలై పెద్ద హీరోయిన్లు అవలేదు. చాలామంది అమ్మాయిలు గౌరవప్రదంగానే వచ్చి మంచి స్థాయికి ఎదిగారు. అందరినీ చులకనగా చూడకండి. మహానటి సావిత్రి, భానుమతి లాంటి వారూ గౌరవప్రదంగా ఇండస్ట్రీకి వచ్చి గొప్పస్థాయికి ఎదిగినవారే. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొత్తం సినిమా పరిశ్రమను బలి చేయకండి. ఇంతకాలం జరిగింది నన్ను కదిలించలేదు. మంగళవారం ఎంతోమంది ఆడవాళ్లు మాట్లాడిన మాటలు నన్ను కదిలించింది. వాళ్ల సమస్యలను పరిష్కరిస్తాం. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ రావాల్సిన పని లేదు. ఒక మంచి పనికి ఎవరైనా రావొచ్చు. పవన్ ఏం తప్పు మాట్లాడాడు? సమస్యపై పోలీసు స్టేషన్‌కు వెళ్లి రిపోర్ట్ చేయమనడం తప్పా?. ఎదుటివ్యక్తులపై బురద జల్లడానికి యత్నించకండి. పని ప్రదేశంలో మహిళలకు అన్ని సదుపాయాలు అందుబాటులు ఉండేలా చూస్తాం.’ అని నాగబాబు అన్నారు. -
శ్రీరెడ్డి అప్లికేషన్‌ను తిరస్కరిస్తున్నాం
-
శ్రీరెడ్డికి మెంబర్షిప్ ఇవ్వం : ‘మా’
ఫిలిం ఛాంబర్‌పై ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి పై చర్యలు తీసుకునేందుకు మా అసోషియేషన్ రెడీ అవుతోంది. నిన్న(శనివారం) జరిగిన సంఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన మా అధ్యక్షుడు శివాజీ రాజా.. వివాదం చేస్తే కార్డ్ వస్తుందని భావించటం తప్పన్నారు. ‘ఇప్పటికే శ్రీరెడ్డిని మా అసోషియేషన్‌లోకి ఆహ్వానిస్తూ అప్లికేషన్ ఫాం ఇచ్చాం. కానీ ఆమె పూర్తి వివరాలు ఇవ్వలేదు. పైగా మా సభ్యులపై ఆరోపణలు చేస్తోంది. ఇది సరికాదు. శ్రీరెడ్డిపై లీగల్ చర్యలు తీసుకుంటాం. శ్రీరెడ్డి అప్లికేషన్‌ను తిరస్కరిస్తున్నాం. మా సభ్యులెవరు ఆమెతో కలిసి నటించరు. ఒక వేళ ఎవరైనా నటిస్తే వారిని కూడా సస్పెండ్ చేస్తా’మని మా సభ్యులు వెల్లడించారు. మా అసోషియేషన్‌కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా మద్ధతు తెలిపింది. -
సినీ తారల ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్
సాక్షి, హైదరాబాద్: సినిమా నటుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న బొమ్మ రాహుల్ అనే బీటెక్ స్టూడెంట్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ అమీర్‌పేట్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ హీరోయిన్ల ఫొటోలను అప్లోడ్ చేస్తున్నట్టుగా సీఐడీ గుర్తించి అతడిని పట్టుకుంది. కొంతకాలంగా రాహుల్ ఇలాంటి ఫొటోలను వెబ్ సైట్ లలో పెడుతున్నట్టుగా తేల్చారు. ఈ విషయంపై ఇటీవల స్పందించిన మా అసోషియేషన్ తారల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ సీఐడీకి ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల నుంచి వెబ్ సైట్లను కొందరు వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన సీఐడీ చర్యలు చేపట్టింది. -
వరద బాధితులకు ‘మా’ చేయూత
-
‘మా’లో తెలంగాణ, ఆంధ్ర విభేదాలు లేవు
‘మా’లో ఆంధ్ర, తెలంగాణ విభేదాలు లేవని, భవిష్యత్‌లో కూడా ఉండబోవని సినీనటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని ఆదివారం ఆయన సందర్శించిన క్రమంలో మాట్లాడారు. హన్మకొండ కల్చరల్ : ‘మా’లో ఆంధ్ర, తెలంగాణ భేదాలు లేవని, భవిష్యత్‌లో కూడా ఉండబోవని సినీనటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేం ద్రప్రసాద్ అన్నారు. ఆదివారం రాత్రి పార్లమెంటరీ సెక్రెటరీ వినయ్‌భాస్కర్, ‘మా’ కార్యదర్శులు విజయ్, పబ్బిని శ్రీనివాస్‌తో కలిసి చారిత్రక శ్రీ భద్రకాళి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజు శర్మ, అర్చకులు ప్రబాకరశర్మ, ప్రదీప్కుమార్శర్మ వారిని పట్టువస్త్రాలతో సన్మానించారు. మహదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ‘మా’ ఎన్నికల సమయంలో మిత్రుడు దాస్యం వినయ్‌భాస్కర్ తనకు ఎంతో సహాయం చేశారన్నారు. అదే సమయంలో భద్రకాళి అమ్మవారి గురించి చెప్పారన్నారు. అందుకే ఎన్నికల అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ వాళ్లకి సినీ పరిశ్రమలో అన్యాయం జరిగితే అమ్మవారు తనను తొక్కేస్తుందని తెలుసన్నారు. భక్తులు రాజేంద్రప్రసాద్‌ను చూడడానికి జనం ఎగబడ్డారు. ధర్మకర్తలు రంగరాజ బలరాం, అడ్లూరి శ్రీనాథ్, మామిండ్ల నర్సింహులు, సునీల్‌కుమార్, సిబ్బంది కూచన హరినాథ్, అద్దంకి విజయ్, వెంకటయ్య, రాము, కృష్ణ, శ్యాంసుందర్ ఉన్నారు. -
జబర్దస్త్ వేణుపై దాడిని ఖండించిన 'మా'
హైదరాబాద్ : కమెడియన్ వేణుపై జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఖండించింది. సినిమా అవకాశం ఉందంటూ పిలిచి దాడి చేయడం దారుణమని 'మా' కార్యదర్శి రాఘవ అన్నారు. వేణుపై దాడిని నిరసిస్తూ... జబర్దస్త్ టీం సభ్యులు సోమవారం ఫిల్మ్ చాంబర్లో .. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సమయంలో తమకు అండగా నిలువాలని 'మా' సభ్యులను కోరారు. ఏ విపత్తు వచ్చినా కమెడియన్స్‌గా తాము ముందుంటున్నాం, అలాంటిది తమపై దాడి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.