కమెడియన్ వేణుపై జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఖండించింది. సినిమా అవకాశం ఉందంటూ పిలిచి దాడి ..
హైదరాబాద్ : కమెడియన్ వేణుపై జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఖండించింది. సినిమా అవకాశం ఉందంటూ పిలిచి దాడి చేయడం దారుణమని 'మా' కార్యదర్శి రాఘవ అన్నారు. వేణుపై దాడిని నిరసిస్తూ... జబర్దస్త్ టీం సభ్యులు సోమవారం ఫిల్మ్ చాంబర్‌లో .. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సమయంలో తమకు అండగా నిలువాలని 'మా' సభ్యులను కోరారు. ఏ విపత్తు వచ్చినా కమెడియన్స్‌గా తాము ముందుంటున్నాం, అలాంటిది తమపై దాడి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.