gowda community
-
‘తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. బీసీల ప్రభుత్వం’
సాక్షి, నిజామాబాద్: డిసెంబర్ 3న తెలంగాణలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్‌లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్తాలు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని.. బీసీల ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. గీత కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించండి. గీత కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ తోడు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో డి.శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి లాంటి పెద్ద నేతలు పని చేసినా నిజామాబాద్‌లో ఒకే ఒక బీసీ హాస్టల్ ఉండేదని, తాము వచ్చాక 15 హాస్టళ్లు, బీసీ గురుకులాలు ఏర్పాటు చేశామని వివరించారు. నిజామాబాద్‌లో గణేష్ గుప్తాను గెలిపించాలని కవిత కోరారు. చదవండి: హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్.. -
బీసీ రిజర్వేషన్‌పై కేటీఆర్‌కు కృతజ్ఞతలు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించినందుకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీమంత్రి కేటీఆర్, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్లకు తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఆదివారం కమిటీ సభ్యులు చైర్మన్ బాలగౌని బాలరాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో మంత్రులను కలసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
గౌడ కులస్తులు ఆత్మన్యూనత వీడాలి: కేఈ
సాక్షి, హైదరాబాద్: గౌడ కులస్తులు ఆత్మన్యూనతాభావం వీడాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆకాశం నుంచి తీసుకువచ్చే అమృతంగా నీరాను భావించాలని సూచించారు. గౌడ్లు మరుగునపడిన బంగారమని, సానబెట్టినకొద్దీ రాటుదేలుతారని తెలి పారు. సర్దార్ సర్వాయి పాపన్న త్యాగధనుడు, అభిమానధనుడని కొనియాడారు. సర్వమత రక్షకుడిగా పాపన్న తన కాలంలో పనిచేశారని చెప్పారు. ‘జై గౌడ్’ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ మహారాజ్ 368 జయంతి వారోత్సవాలను ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. కృష్ణమూర్తి మాట్లాడు తూ లండన్ మ్యూజియంలో పాపన్న ప్రతిమ ఉందని, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పాపన్న చరిత్ర పదిలంగా ఉందన్నారు. పాపన్న స్ఫూర్తితో గౌడ కులస్తులు ముందుకు సాగాలన్నారు.‘కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్థాయిలో గతంలో గౌడ కులస్తులైన ప్రసాద్ లాంటివారు పని చేశారు. మనం ఎవరికీ ఎందులోనూ తక్కువ కాదు’అని పేర్కొన్నారు. రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, బడుగు, బలహీన వర్గాలే తనకు అండగా నిలిచారని అన్నారు. ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ పాపన్న అని అన్నారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం పెట్టడమే ధ్యేయంగా జైగౌడ్ ఉద్యమం ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో రాబోయే కాలం మనదే. మళ్లీ నేను, మధుయాష్కీ గౌడ్ ఎంపీలుగా గెలుస్తాం’అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ గౌడ సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం సముచిత పోస్టులు కల్పించడంలేదని విమర్శించారు. ఈ నెల 16న గౌతు లచ్చన్న జయంతి ఉత్సవాలను గుంటూరులో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు, జైగౌడ్ ఉద్యమం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వి. రామారావు, నేతలు బూర మల్సూర్, బొమ్మగాని శ్రీనివాస్, ఎం.ఏడుకొండలు, తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు గౌడ కులస్తులు ఏకం కావాలి: పొన్నం
హైదరాబాద్: గౌడ కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో తెలంగాణ గౌడ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హజరైన పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌడ కులస్తుల సంక్షేమానికి చిన్నాచితకా సంఘాలు కాకుండా అన్ని సంఘాలు ఒకే గొడుగు కిందికి వచ్చి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సాక్షాత్తూ మంత్రి అయ్యి ఉండి విస్కీ తాగితే ఆయుష్షు పెరుగుతుందని చెప్పడం సబబు కాదని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావునుద్దేశించి అన్యాపదేశంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పోలీసులకు అధికారం ఇచ్చి దాడులు చేయించి గౌడ కులస్తులను అణచివేసే కుట్ర చేస్తోందన్నారు. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు నర్సగౌడ్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లే లక్ష్మణ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి శశిధర్రావు, ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌తో పాటు 10 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
'నవ్విస్తున్న మమ్మల్ని కొట్టడం అమానుషం'.
-
జబర్దస్త్ వేణుపై దాడిని ఖండించిన 'మా'
హైదరాబాద్ : కమెడియన్ వేణుపై జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఖండించింది. సినిమా అవకాశం ఉందంటూ పిలిచి దాడి చేయడం దారుణమని 'మా' కార్యదర్శి రాఘవ అన్నారు. వేణుపై దాడిని నిరసిస్తూ... జబర్దస్త్ టీం సభ్యులు సోమవారం ఫిల్మ్ చాంబర్లో .. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సమయంలో తమకు అండగా నిలువాలని 'మా' సభ్యులను కోరారు. ఏ విపత్తు వచ్చినా కమెడియన్స్‌గా తాము ముందుంటున్నాం, అలాంటిది తమపై దాడి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. -
'నవ్విస్తున్న మమ్మల్ని కొట్టడం అమానుషం'
-
'నవ్విస్తున్న మమ్మల్ని కొట్టడం అమానుషం'
హైదరాబాద్ : కమెడియన్ వేణుపై దాడిని నిరసిస్తూ జబర్దస్త్ టీమ్‌తో పాటు టీవీ, సినీ ఆర్టిస్టులు సోమవారం నిరసన తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వరకూ ర్యాలీ చేపట్టారు. తమపై జరిగిన దాడిని నిరసిస్తూ జబర్దస్త్ టీమ్‌తో పాటు టీవీ, సినీ ఆర్టిస్ట్‌లు...ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం ఈ ఘటనపై ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నటుడు నాగబాబు మాట్లాడుతూ రెండేళ్లుగా నవ్వులు పండిస్తున్న నటులను కొట్టడం అమానుషమన్నారు. ఏ విపత్తు వచ్చినా కమెడియన్స్‌గా తమ వంతు సాయంగా ముందుంటున్నామని, అలాంటిది తమపై దాడి చేయటం దారుణమని ధన్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈటీవీలో ప్రసారమౌతున్న 'జబర్దస్త్' షో ఫేం వేణుపై గౌడ కులస్తులు నిన్న ఉదయం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్‌లోని అయ్యప్ప ఆలయానికి వచ్చిన వేణును చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కామెడీ కోసమే ఆ స్క్రిప్ట్ తయారు చేశానని, ఒక కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అతను చెప్తుండగానే వారు దాడి చేశారు. జబర్దస్త్ టీమ్, ఈటీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో రెండు గంటలపాటు ఫిలించాంబర్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. వేణును ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కూడా గౌడ విద్యార్థులు అడ్డుపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేణు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గౌడ విద్యార్థి సంఘం నేతలపై ఐపీసీ 341, 323 కింద కేసులు నమోదు చే శారు. వేణు కూడా తమపై దాడి చేశాడంటూ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుపై ఐపీసీ 323, 509కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జబర్దస్త్ వేణుపై కేసు నమోదు
హైదరాబాద్ : తెలుగు టీవీ కామెడీ షో జబర్దస్త్ వేణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వేణుపై 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వేణుపై దాడి చేసిన గౌడ సంఘం నేతలపై కూడా కేసు నమోదైంది. ఈ గొడవకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రామిక గౌడ మహిళా జీవన విధానాన్ని అవమానపర్చిన 'జబర్దస్త్' కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం జిల్లా నాయకులు రెండ్రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'జబర్దస్త్' కార్యక్రమంలో కల్లు వృత్తిని, శ్రామికగౌడ మహిళా జీవన విధానాన్ని అవమానించే విధంగా స్కిడ్ ప్రసారం చేశారని, వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివాదం నడుస్తుండగానే ఆదివారం ఫిల్మ్ నగర్లో కొందరు వ్యక్తులు వేణుపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన అతడిని...స్నేహితులు చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. -
జబర్దస్త్ వేణుపై దాడి, ఆస్పత్రికి తరలింపు
-
జబర్దస్త్ వేణుపై దాడి, ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్ : కమెడియన్ జబర్దస్త్ వేణుపై ఆదివారం ఫిల్మ్ నగర్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన అతడిని...స్నేహితులు చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా ఓ టీవీ షోలో గౌడ సంఘాన్ని కించపరిచే విధంగా స్కిట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుండగులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రామిక గౌడ మహిళా జీవన విధానాన్ని అవమానపర్చిన 'జబర్దస్త్' కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం జిల్లా నాయకులు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 18న రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారమైన 'జబర్దస్త్' కార్యక్రమంలో కల్లు వృత్తిని, శ్రామికగౌడ మహిళా జీవన విధానాన్ని అవమానించే విధంగా స్కిడ్ ప్రసారం చేశారని, గతేడాది జూలై 11న కూడా 'జబర్దస్త్' లో కల్లుగీత కార్మికుల్ని ఘోరంగా అవమానించారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.