ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫోటో)
సాక్షి, నిజామాబాద్: డిసెంబర్ 3న తెలంగాణలో ఏర్పడేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్‌లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్తాలు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదని.. బీసీల ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు.
గీత కార్మికులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించండి. గీత కార్మికులకు బీఆర్‌ఎస్ పార్టీ తోడు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో డి.శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి లాంటి పెద్ద నేతలు పని చేసినా నిజామాబాద్‌లో ఒకే ఒక బీసీ హాస్టల్ ఉండేదని, తాము వచ్చాక 15 హాస్టళ్లు, బీసీ గురుకులాలు ఏర్పాటు చేశామని వివరించారు. నిజామాబాద్‌లో గణేష్ గుప్తాను గెలిపించాలని కవిత కోరారు.
చదవండి: హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్..
Comments
Please login to add a commentAdd a comment