
మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, కొప్పులకు వినతి పత్రం సమర్పిస్తున్న తెలంగాణ గౌడ సంఘం నేతలు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించినందుకు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీమంత్రి కేటీఆర్, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌లకు తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఆదివారం కమిటీ సభ్యులు చైర్మన్ బాలగౌని బాలరాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో మంత్రులను కలసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.