sundarayya science center
-
అమరుల ఆశయాలకు మరో ఉద్యమం
సుందరయ్య విజ్ఞానకేంద్రం/కాచిగూడ (హైదరాబాద్): తెలంగాణ ఉద్యమంలో ప్రజలు దేనికోసం అమరులయ్యారో ఆ అమరుల ఆశయాల సాధనకోసం మరోసారి ఉద్యమాలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ నేడు నిరుద్యోగుల ఆకాంక్షలు కూడా నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి పార్లమెంట్లో చర్చిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం చైతన్యవంతంగా పని చేసిన సంఘాలు తెలంగాణ వచ్చాక రద్దయ్యాయని విమర్శించారు. ఉద్యమకారుల కుటుంబాలకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అనేక మంది ఉద్యమకారుల బలిదానం వల్లనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ఉద్యమకారులను అనాథలను చేయటంలో అన్ని పార్టీలు ముందున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనంతరం పలువురు ఉద్యమకారులను సత్కరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు దిలీప్‌కుమార్, రాములు నాయక్, వేముల మారయ్య, సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న బీసీల డిమాండ్లను సాధించే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న సమయంలో దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదిరోజులుగా వేలాది మందితో ఢిల్లీలో పార్లమెంట్ వద్ద ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో జనాభా ప్రకారం సమాన వాటా ఇవ్వాలని కోరారు. త్వరలో జరిగే జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలగించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ప్రజలు అల్లాడుతుంటే పట్టదా?
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అటు దేశం లో, ఇటు రాష్ట్రంలో కరోనా కోరల్లో చిక్కి ప్రజలు అల్లాడుతుంటే పాలకులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అఖిల పక్ష నేతలు మండిపడ్డారు. కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేశాయని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య, తెలంగా ణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. సోమవారం సుందరయ్య వి జ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబు ల్ సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణలో తీవ్రస్థాయిలో కోవిడ్ మరణాలు పెరి గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహా ర భద్రత, వైద్య సేవలు ప్రజలకు అందడం లేదన్నారు. 30న కలెక్టరేట్ల వద్ద నిరసన ఇక ఈనెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల వేదిక (టీఎల్పీఎంఎఫ్) ద్వారా జిల్లాల కలెక్టరేట్లకు నల్ల జెండాలతో నిరసనగా వెళ్లి వినతి పత్రం అందజేస్తామని అఖిల పక్ష నేతలు తెలిపారు. కోవిడ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఆగస్టు 2న వర్చురల్ రచ్చబండ బహిరంగ సభ నిర్వహిస్తామన్నా రు. జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకు (ఆగస్టు 2 మినహా) ప్రతిరోజూ ఒక అంశంపై వెబినార్/సెమినార్లు ఉంటాయన్నారు. రోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల దాకా ఈ కార్యక్రమాలుంటాయని వెల్లడించారు. జూలై 28న కోవిడ్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం–న్యాయపోరాటం, 29న అసంఘటిత రంగం, వలస కూలీలపై కోవిడ్ ప్రభావం, 30న కొరవడుతున్న ప్రజారోగ్యం, 31న విద్యారంగంపై కోవిడ్ ప్రభావం, ఆగస్టు 1న కోవిడ్ బాధితులు–సహాయక చర్య లు, 3న ఉద్ధీపన పథకాల డొల్లతనం, 4న కోవిడ్ ప్రజాందోళనపై ప్రభుత్వ నిర్బంధం, ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు, నల్ల జెండాలతో, నల్ల బెలూన్లు ఎగరేసి మహానిరసన తెలుపుతామని వివరించారు. -
అప్పట్లో ఇలానే ఉంటే తెలంగాణ వచ్చేదా?
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఉమ్మడి రాష్ట్రంలో ఇంత నిర్బంధం ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా?అని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రావడానికి గల ఉద్యమాలను మర్చిపోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, యూనియన్లు అవసరం లేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉపా చట్టం కింద అందరినీ అరెస్టు చేస్తే తెలంగాణను సాధించుకునే వారిమా? అని ప్రశ్నించారు. ఇప్పటి ప్రభుత్వం కంటే అప్పటి ప్రభుత్వమే ప్రజాస్వామికంగా ఉందని అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్లో (టీపీటీఎఫ్) టీడీఎఫ్, టీడీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు విలీనమైన సందర్భంగా సదస్సు జరిగింది. ఈ సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కాశింను అరెస్టు చేసిన పద్ధతి అప్రజాస్వామికం అని అన్నారు. వైస్ చాన్స్‌లర్ అనుమతి లేకుండా పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చక్రధర్‌రావు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఏపీటీఎఫ్ మాజీ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ నూతన కమిటీ.. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) నూతన కమిటీని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రకటించా రు. అధ్యక్షుడిగా కె.రమణ, అసోసియేట్ అధ్యక్షుడిగా వై.అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా మైస శ్రీనివాసులు, అదనపు ప్రధాన కార్యదర్శిగా నన్నెబోయిన తిరుపతి, ఉపాధ్యక్షులుగా బి.రమేష్, పి.నారాయణమ్మ, ఎం.రవీందర్, జి.తిరుపతిరెడ్డి, కె.కిషన్‌రావు, రావుల రమేష్, కార్యదర్శులుగా పి.నాగమణి, పి.నాగిరెడ్డి, ఎం.రామాచారి, జె.చంద్రమౌళి, ఎ.రాంకిషన్, కె.కనకయ్య, మాడుగుల రాములు తదితరులు ఎన్నికయ్యారు. కాశింపై కేసులు ఎత్తివేయాలి సుల్తాన్‌బజార్: విరసం కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైన కాశింను విడుదల చేసి ఆయనపై మోపిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యవస్థాపక సభ్యుడు వరహరరావు ఏడాదికి పైగా పూణె జైలులో ఉన్నారని సభ్యులమీద సైతం కేసులు నడుస్తున్నాయని అన్నారు. ప్రజల పక్షాన మాట్లాడే ప్రజా సంఘాల నేతలను రాష్ట్ర ప్రభుత్వం జైళ్లకు నెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రం కోసం విద్యార్థి దశ నుంచి ఎన్నో పోరాటాల్లో భాగమైన కాశింను అక్రమంగా అరెస్ట్ చేయడం తగదన్నారు. ప్రజా సంఘాల బాధ్యులను వరుసగా అరెస్టు చేసి మొత్తం సమాజాన్ని ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుందని మండిపడ్డారు. సమావేశంలో విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, సహాయ కార్యదర్శి రివేర, కాశిం తల్లి వీరమ్మ పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్‌పై కేటీఆర్‌కు కృతజ్ఞతలు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించినందుకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీమంత్రి కేటీఆర్, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్లకు తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఆదివారం కమిటీ సభ్యులు చైర్మన్ బాలగౌని బాలరాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో మంత్రులను కలసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఉపాధ్యాయులపై నిందలు సహించం
సుందరయ్య విజ్ఞానకేంద్రం: ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నిందలు వేస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ఏదో ఒక సందర్భంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నిందలు వేస్తున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నర్సిరెడ్డి ఆధ్వర్యంలో పీఆర్సీని అమలు చేయాలని, ఉద్యోగులకు పదవీ విరమణ 60 ఏళ్లకు పెంచాలని, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. గతంలో అసెంబ్లీలో వీఆర్వోలు ఎంత పవర్ఫుల్ అంటే హోంమంత్రి మహమూద్ అలీ భూమిని వేరేవారి పేరున ఇతరుల భూమిని ఆయన పేరున మార్చే సత్తా ఉందని హేళన చేశారని అన్నారు. ప్రతిశాఖ ఉద్యోగులపై ఏదో ఒక సందర్భంలో నిందలు వేశారని, దీనిపై ప్రజలు ప్రశ్నించేలా వారిలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల జేఏసీలు సీఎంకు బలం చేకూర్చేలా ఉన్నాయని, అన్ని జేఏసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు బి.రాజేశం మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరం అన్నారు. పోరాటం చేస్తే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు జంగయ్య చెప్పారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకుడు కొండల్ రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ కార్యదర్శి చావ రవి, టీటీఎఫ్ నాయకుడు కె.రమణ, వివిధ సంఘాల నాయకులు పద్మశ్రీ, సుధాకర్ రావు, ప్రొఫెసర్ పురుషోత్తం, బి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్‌యూలో దారుణ పరిస్థితులు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఢిల్లీలోని జేఎన్‌యూలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్ ప్రతినిధి, సామాజికవేత్త మేధా పాట్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఇప్పుడుస్వేచ్ఛ కోసం అన్ని వర్గాలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘కమ్యూనిటీ టు రెసిస్ట్ కమ్యూనలిజం అండ్ ఫాసిజం’ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా సదస్సు జరిగింది. ఈ సదస్సులో మేధా పాట్కర్ మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై నేడు అన్ని వర్గాలు ఏకం అవుతున్నాయని చెప్పారు. జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని అహింసా దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ.. జేఎన్‌యూలో దాడి జరిగి 4 రోజులు కావస్తున్నా ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవటం దారుణమన్నారు. -
సాహిత్యంపై దాడులు జరుగుతున్నాయి..
హైదరాబాద్: దేశంలో సాహిత్యంపై దాడులు జరుగుతున్నాయని ప్రముఖ హిందీ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత మంగలేష్ దబ్రాల్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే 4వ లిటరరీ ఫెస్ట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా 135 మంది సాహితీవేత్తలు, స్కాలర్స్ రచించిన ‘తెలుగెత్తి జైకొట్టు’పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంగలేష్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త చరిత్ర, కొత్త వ్యక్తులను ముందుకు తీసుకొస్తున్నారని, గాంధీ, నెహ్రూలకు బదులుగా వారి త్యాగాలను చరిత్రను చెరిపేసి సావర్కర్, వల్లభాయ్ పటేల్‌ను ముందుకు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో మత ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రగతిశీలమైన రచయితలను నిషేధిస్తున్నారని విమర్శించారు. నేటి కవులు, రచయితలు అప్రమత్తంగా ఉండి దేశ వైవిధ్యాన్ని కాపాడాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. దిశ అత్యాచారం జరిగిన నేపథ్యంలో ప్రజల నిరసనలు పెరిగాయని అన్నారు. ప్రజల మీద, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద నమ్మకం లేనప్పుడే ఎన్కౌంటర్లు జరుగుతాయన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చెప్పారు. తెలుగును ఎత్తిపట్టుకోవాల్సిన సందర్భం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు వారిని అర్థం చేసుకునేది మాతృ భాష అని చెప్పారు. ప్రముఖ కవి సుధామ మాట్లాడుతూ.. సాహిత్యం లేకున్నా భాష ఉంటుంది.. కానీ భాష లేకుంటే సాహిత్యం ఉండదని పేర్కొన్నారు. ప్రముఖ విమర్శకులు కె.శివారెడ్డి మాట్లాడుతూ.. సాహిత్యానికి ఎల్లలు లేవని అన్నారు. సమాజం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కవులకు ఉందన్నారు. రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ.. భాష, సంస్కృతి ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు. తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవులు నిఖిలేశ్వర్, ఓయూ తెలుగు శాఖ అధిపతి సూర్య ధనుంజయ్, కవి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక విధానాలే గుత్తాధిపత్యానికి కారణం
హైదరాబాద్: నూతన ఆర్థిక విధానాలు గుత్తాధిపత్యానికి, ఆర్థిక అసమానతలకు కారణమయ్యాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జనవిజ్ఞాన వేదిక తెలంగాణ 30వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గుత్తాధిపత్య సంస్థల ఆకాంక్షలు ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొం దని, నేడు అత్యంత ఉన్నతమైన పరిజ్ఞానాన్ని గూగుల్, ఫేస్బుక్ లాంటి సంస్థలు తీసుకొస్తున్నాయన్నారు. వారు సృష్టించిన సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపైన, జిజ్ఞాసపై దాడి జరుగుతోందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 39వ ఆర్టికల్ ఉత్పత్తి శక్తులు ఎవరి చేతుల్లో కేంద్రీకరించరాదని చెబుతోందని, దీనికి భిన్నంగా నేటి పరిణామాలు కనిపిస్తున్నాయన్నారు. జాతీయ ఆదాయంలో 73% ఆదా యం ఒక్క శాతం జనాభా వద్దనే ఉందని, దీని వల్ల ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నా రు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యూట్రిషన్ శాస్త్రవేత్త డాక్టర్ మెహ్తాబ్ ఎస్.బాంజీ, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ పి.అంబేడ్కర్, డాక్టర్ భీమేశ్వర్రెడ్డి, డాక్టర్ టి.సుందరరామన్, ప్రొఫెసర్ శీలాప్రసాద్ పాల్గొన్నారు. -
ఓటుతో బుద్ధి చెప్పాలి
హైదరాబాద్: చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాలకులకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ (ఎపీసీఎల్ఏ) ఆధ్వర్యంలో ‘‘మానవ హక్కులు.. సుపరిపాలన’’అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో పాలకులను ప్రశ్నిస్తే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని, పైగా అభివృద్ధి నిరోధకులని ముద్ర వేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం, పాలకుల పనితీరు బాగుంటే ప్రజలు ఎందుకు కోర్టును ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై కోర్టుకు వెళ్లే న్యాయవాదుల పట్ల పాలకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. శాసనసభలు, బహిరంగ సభల్లో కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదన్నారు. మేధావుల ఆలోచనలు విస్మరిస్తున్నారు మేధావులు, నిపుణులు, సామాజిక కార్యకర్తల ఆలోచనలను ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవడం లేదని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేసిన చట్టాలను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులు ప్రజా సమస్యలపై స్పందించాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ పెరిగిందని, ఇది పక్క రాష్ట్రాలకూ పాకిందని అన్నారు. పాలకులకు చట్టం లేదు, రాజ్యాంగం లేదని, ఫిరాయింపులే చట్టంగా భావిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి తీరని నష్టమని విమర్శించారు. భూ నిర్వాసితుల చట్టం, సమాచార హక్కు చట్టాలను సైతం నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని అన్నారు. సమాజంలోని పౌరులందరికీ సమాన హక్కులు లభించినప్పుడే సుపరిపాలన లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎపీసీఎల్ఎ రాష్ట్ర అధ్యక్షుడు పొత్తూరి సురేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, సామాజిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు. -
తమ్మినేని, చాడలతో వరవరరావు భేటీ
12న భూమిని, రైతులను కాపాడుకోవడంపై రౌండ్‌టేబుల్ హైదరాబాద్: ప్రస్తుతం ఏపీ, తెలంగాణలలో అమలవుతున్న నయా పెట్టుబడిదారీ విధానాల నేపథ్యంలో భూమిని, రైతులను కాపాడుకునేందుకు ఏమి చేయాలనే దానిపై చర్చించేందుకు ఈ నెల 12న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు విరసం నేత వరవరరావు తెలిపారు. భూమిని కాపాడుకునేందుకు, ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రమాదాలను ఎదుర్కునేందుకు రైతులు, ఆదివాసీలు, ప్రజాసంఘాలతో కలిసి ఐక్యసంఘటనగా ఏర్పడి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీనిలో భాగంగా అన్ని పార్టీల ప్రజాసంఘాలను సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాతంత్ర దేశభక్త ఉద్యమం చొరవతో భూ నిర్వాసిత వ్యతిరేక కమిటీ, తెలంగాణ ప్రజాఫ్రంట్, విరసం తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు సాక్షికి చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎంబీభవన్‌లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో, మఖ్దూంభవన్‌లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఇంకా న్యూడెమోక్రసీ నేతలతో తాను సమావేశమైన ట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భూసేకరణ బిల్లును వాయిదా వేసినా, ఈ బిల్లుకు సవరణ చేయాలనుకున్న అంశాలను దొడ్డిదారిన అమలుచేసి, దోపిడీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వాల ద్వారా చర్యలను ప్రారంభించిందన్నారు. రైతుల భూమిని బాబు లాక్కొంటున్నారు దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణ ముందుభాగాన సాగుతున్నాయని వరవరవరావు చెప్పారు. రాజధాని నగరం కోసం భూసేకరణ పేరిట ఏపీ సీఎం చంద్రబాబు దారుణంగా రైతుల గోళ్లు ఊడగొట్టి మరీ భూములను లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ విధంగా రైతులు బలవంతంగా తమ భూమిని కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న లక్షలాది ఎకరాల భూమిని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ భూమిని ఏదోవిధంగా కొనుగోలు చేసి మైదాన ప్రాంతం నుంచి రైతులను దూరంగా తరిమేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. అటు చంద్రబాబు ఇటు కేసీఆర్ ఇద్దరూ సింగపూర్, ఇతర దేశాల మాదిరిగా ఏపీ, తెలంగాణలను మారుస్తామంటూ రైతులు, ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. -
‘ఓ ప్రభుత్వమా!.. ప్రజల గోడు ఆలకించు’
రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాంగ్రెస్ కార్యక్రమం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీలకు తిలోదకాలిస్తున్న తీరుపై చర్చించేందుకు తమ ఆధ్వర్యంలో ‘ఓ ప్రభుత్వమా!.. ప్రజల గోడు ఆలకించు’ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ పీసీసీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్, బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షత వహిస్తారని, ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, తెలకపల్లి రవి, కె.శ్రీనివాసరెడ్డిలతో పాటు శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొంటారని తెలిపింది. -
హార్ట్ ఫుల్ సిటీ
ఆర్ట్ గ్యాలరీ అంటే సంపన్నులు ఉండే బంజారాహిల్స్, మాదాపూర్ గుర్తుకొస్తాయి. ఏ కళాకారులు గీసినా చిత్రాలు ఇక్కడే ఎగ్జిబిట్ అవుతాయన్న ఆలోచన సిటీవాసుల్లో ఉంది. వీఐపీలే కాదు సామాన్యులు కూడా ఈ చిత్రాలను ఆరాధిస్తుండటంతో సిటీలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటవుతున్నాయి. మాదాపూర్, బంజారాహిల్స్‌కు వెళ్లే పని లేకుండానే ఆర్ట్ లవర్స్‌కు చూడచక్కనైన పెయింటింగ్స్ చూసి తరించే భాగ్యాన్ని కల్పిస్తున్నాయి. తన అంతరాలలో రూపుదిద్దుకున్న ఊహా చిత్రాన్ని కాన్వాస్‌పై అందమైన బొమ్మగా రూపుదిద్దడం ఒక్క చిత్రకారునికే సాధ్యం. ఆ చిత్రకారుల సృజనకు వేదిక అవుతున్నాయి ఆర్ట్ గ్యాలరీలు. పెయింటింగ్స్‌పై సిటీవాసుల్లో పెరుగుతున్న క్రేజీని, సామాన్యులకు కూడా ఈ కళలపై అవగాహన కలిగించేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లోనూ ఆర్ట గ్యాలరీలు ఏర్పాటవుతున్నాయి. ఏడాది క్రితం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ, ఇటీవల సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోనూ అద్వైత ఆర్ట్ గ్యాలరీ ప్రారంభమైంది. ఆ ప్రాంతాల్లో ఉన్న ఆర్ట్ లవర్స్‌ను గ్యాలరీ వరకు తీసుకొస్తున్నాయి. ఇవేకాకుండా ప్రతిభ కలిగిన పేదింటి కళాకారులకు కూడా తమ పెయింటింగ్స్ ప్రదర్శనకు ఉంచే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. యంగ్ ఆర్టిస్ట్‌ల కోసం వర్క్‌షాప్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. అనుభవజ్ఞులైన ఆర్టిస్ట్‌లతో ఆర్ట్ పాఠాలు బోధిస్తున్నాయి. మరికొందరు చిత్రకారులైతే ఏకంగా తమ ఇంటినే ఆర్ట్ గ్యాలరీగా మలచి పెయింటింగ్‌లను ఎగ్జిబిట్ చేస్తున్నారు. సందడే సందడి... నగరంలోని అన్ని ఆర్ట్ గ్యాలరీల వద్ద అభిమానుల సందడి నెలకొంటుంది. ఎప్పుడు ఎక్కడ చిత్రప్రదర్శన జరిగినా సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. శని, ఆదివారాల్లో పిల్లాపాపలతో కలిసి పేరెంట్స్ రావడం కనబడుతోంది. చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన చిత్రాలను చూసేందుకు బారులు తీరుతున్నారు. తమ మనసును కట్టిపడేసిన చిత్రరాజాలను డబ్బులు వెచ్చించి సొంతం చేసుకుంటున్నారు. వాటర్ కలర్, చార్కోల్ డ్రాయింగ్స్, పెన్ డ్రాయింగ్, ప్రింట్ మేకింగ్, కల్చర్, న్యూరల్స్, ఆయిల్ పెయింటింగ్స్‌కు మంచి డిమాండ్ ఉందని ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు అంటున్నారు. స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్ట్ ప్రేమికులు పెయింటింగ్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు. - వీఎస్ స్పందన బాగుంటుంది నేను రిటైర్డ్ హెడ్మాస్టర్ని. ఉత్తమ టీచింగ్ జాతీయ అవార్డును కూడా అందుకున్నా. ఆర్ట్ అంటే నాకు ప్రాణం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని పెయింటింగ్ రూపంలో తెలుపుతుంటా. మూడేళ్ల క్రితం బోరబండలోని నా ఇంట్లోనే ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించాను. ప్రతి ఏటా మూడు వరకు ఆర్ట్ షోలు చేస్తుంటా. సిటీవాసుల నుంచి స్పందన బాగానే ఉంది. నచ్చిన వారు పెయింటింగ్ కొనుగోలు చేస్తుంటారు. - యాసాల బాలయ్య, నిర్వాహకుడు, యాసాల ఆర్ట్ గ్యాలరీ కళకు లైఫ్ ఇవ్వాలి.. అసమాన ప్రతిభతో వివిధ అంశాలను ఎంచుకొని ఆర్టిస్ట్‌లు పెయింటింగ్స్ వేస్తుంటారు. ఇటువంటి పెయింటింగ్స్‌కు ప్రాణం పోస్తున్నాయి ఆర్ట్ గ్యాలరీలు. ఆర్ట్ లవర్స్‌కు అనుగుణంగా సిటీలో గ్యాలరీలు పెరగడం శుభపరిణామం. ఇవి యువ చిత్రకారులకు ప్రోత్సాహాన్ని అందించినప్పుడే.. కళకు లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. -బాలభక్తరాజు, ప్రముఖ చిత్రకారుడు అందరూ వస్తున్నారు ఏడాది క్రితం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించాం. ఇప్పటివరకు సుమారు 15 వరకు ఆర్ట్ షోలు నిర్వహించాం. సీనియర్లతో పాటు ప్రతిభ కలిగిన యువ చిత్రకారుల పెయింటింగ్స్ ప్రదర్శనకు అవకాశమిస్తున్నాం. పేద, మధ్య, సంపన్న తరగతులకు చెందిన వారందరూ పెయింటింగ్స్ చూసేందుకు క్యూ కడుతున్నారు. ఇది ఆర్ట్‌కు శుభపరిణామం. - విజయారావు, నిర్వాహకుడు, ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ -
రోగ నివారిణి గోధుమ గడ్డి రసం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మారిన జీవన శైలివల్ల ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎన్నో వ్యాధులబారిన పడుతున్నాం. నానాటికీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల మనలోని రోగనిరోధక శక్తి క్రమేపీ క్షీణిస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ప్రకృతి ప్రసాదించిన వివిధ రకాల వైద్య విధానాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గోధుమ గడ్డి రసంతో పలు రకాల వ్యాధులను నివారించవచ్చునని వాడకందారులు చెబుతున్నారు. ఈ గోధుమ గడ్డిలో 13 రకాల విటమిన్లు, 111 రకాల పోషకాలున్నాయని శాస్త్ర పరిశోధనలో తేలిందని ఈ ఔషధం తయారీదారుడు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా విటమిన్లు, ఎంజైమ్‌లు, అమినో ఆసిడ్లు, ప్రోటీన్లు ఉన్నాయి. గోధుమ గడ్డి రసాన్ని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా 100 గ్రాముల గోధుమ గడ్డిలో కిలో ఆకు కూరల సత్తువ ఇమిడి ఉంటుందని అనుభవజ్ఞులు చెపుతున్నారు. ప్రాముఖ్యత... గోధుమ గడ్డి మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరం. కొన్ని వేల ఏళ్ల నుంచి మానవుడు ఆరోగ్య సమస్యలకు నివారిణిగి ఉపయోగపడుతోంది. దీన్ని మహా భారతంలో సంజీవనిగా వర్ణించారు. ఈ గోధుమ గడ్డిలో ఆరోగ్య విలువల్ని గుర్తించింది అమెరికాకు చెందిన డాక్టర్ విగ్మొర్. ఐతే ఎల్బీ నగర్‌కు చెందిన డి.సిరియాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ రసాన్ని ప్రతి రోజు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద విక్ర యిస్తుంటారు. దీని ఖరీదు సుమారు 100 గ్రాములకు రూ.20. మంచి ఫలితాలను ఇస్తుందని వాడకందారులు చెబుతున్నారు. రసంతో కలిగే లాభాలు... కాన్సర్, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, బహిష్టు సమస్యల నివారణకు ఉపకరిస్తుంది. మధుమేహం, పైల్స్, గ్యాస్, కడుపులో పుండు తదితర సమస్యలకు పనిచేస్తుంది. రక్తంలో చెక్కర శాతం, కొలెస్ట్రాల్, మల బద్దకాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత, శ్వాస, చెమట సమస్యల నివారణ గోధుమ గడ్డి గుజ్జును పసుపు, పాలతో కలిపి ముఖానికి రాస్తే మచ్చలు, మొటిమలు, పగలటం, నల్లబడటాన్ని నివారించవచ్చు. గోధుమ గడ్డిలో పీచు ఉన్నందున జీర్ణం ఎక్కువ అవుతుంది. శరీరం బరువు పెరగటాన్ని తగ్గిస్తుంది శరీరంలో సహజమైన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. తయారీ విధానం... గోధుమలను 12 గంటలు నానబెట్టాలి. ట్రేలల్లో ఒక ఇంచు వరకు మట్టి పోసి విత్తనం వేయాలి. దానిపై సన్నటి మట్టిని చల్లి నీళ్లు చిలుకరించాలి. 4వ రోజుకు మొలకలు వస్తాయి. 8వ రోజు గడ్డి పెరిగాక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సిలో వేసి సరిపడ నీళ్లు పోసి రసం తీయాలి. ఆ రసాన్ని పాలిస్టర్ గుడ్డలో వంపి గట్టిగా పిండాలి. వచ్చిన రసాన్ని పరగడుపున తాగితే మంచి ఫలితాల్ని ఇస్తుంది. 20 నిమిషాల తర్వాత ఏమైనా తినవచ్చును. ఈ మందును ప్రజల్లోకి తీసుకెళ్లాలనుంది..ఈ మందును ప్రజల్లోకి తీసుకుపోవాలనుంది. ఆబిడ్స్‌లోని ఓ పాత పుస్తకాల షాపులో 5 ఏళ్ల క్రితం గోధుమ గడ్డి వల్ల వచ్చే ప్రయోజనాల గూర్చి చదివాను. ప్రయోగించి వాడాను. మంచి ఫలితాలను ఇచ్చింది. నేను ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. మజిల్స్ పెయిన్స్, మొకాళ్ల నొప్పులు రెండు రోజుల్లో తగ్గాయి. ముఖ్యంగా ఇది క్యాన్సర్ రోగులకు, పైల్స్, మధుమేహం ఉన్నవారికి బాగాపనిచేస్తుంది. -డి.సిరియాల్ రెడ్డి, గోధుమ గడ్డి రసం విక్రయదారుడు మంచి ఫలితాలను ఇస్తుంది గోధుమ గడ్డి రసం మంచి ఫలితాలను ఇస్తుంది. ముందుగా ఏదో చూద్దాంలే అని తాగాను. తర్వాత వరుసగా రెండు రోజులు తాగి చూశాను. నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. 3 నెలలుగా తాగుతున్నాను. నేను ఉల్లాసంగా ఉంటున్నాను. నేను తాగటంతో పాటు మా ఇంటికి కూడ తీసుకొని పోతున్నాను. నాకు షుగర్ కంట్రోల్లో ఉంది. -శ్రీహరి, చిక్కడపలి నాకు నరాల బలహీనత తగ్గింది.... నేను 1959 మొదటి బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ను. నరాల బలహీనతతో పూర్తిగా నడవలేక పోయేవాడిని. నారాయణగూడలో న్యూరో సర్జన్‌కు చూపించినా ప్రయోజనం కలగలేదు. ప్రస్తుతం 45 రోజు లుగా గోధుమగడ్డి రసాన్ని వాడడంతో నేను ఇప్పుడు మంచిగా నడువగల్గుతున్నాను. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. -డాక్టర్ దొరస్వామి రెడ్డి, బీడీఎస్, రిటైర్డ్ డెంటల్ సర్జన్