- రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాంగ్రెస్ కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీలకు తిలోదకాలిస్తున్న తీరుపై చర్చించేందుకు తమ ఆధ్వర్యంలో ‘ఓ ప్రభుత్వమా!.. ప్రజల గోడు ఆలకించు’ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ పీసీసీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్, బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షత వహిస్తారని, ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, తెలకపల్లి రవి, కె.శ్రీనివాసరెడ్డిలతో పాటు శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొంటారని తెలిపింది.