సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో(టీటీడీ) తెలంగాణ సిఫారసు లేఖలు రద్దు చెయ్యడం చాలా బాధాకరమని అన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. టీటీడీలో తెలంగాణ భక్తులకు దర్శనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. టీటీడీ ఇప్పటికైనా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తీసుకొని దర్శనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై డిసెంబర్‌లో జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుదన్నారు..
కాగా శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదనే విషయాన్ని డయల్ యువర్ ఈఓలో శ్యామలా రావు స్వయంగా చెప్పిన విషయాన్ని అనిరుధ్ రెడ్డి ప్రస్తావించారు. శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారని తెలిపారు. అయితే ఆంద్రప్రదేశ్ నాయకులు మాత్రం తెలంగాణలో తమ వ్యాపారం స్వేచ్చగా చేసుకుంటున్నారని, మరి తాము ఆ వ్యాపారాలను ఎప్పుడూ అడ్డుకోలేదని తెలిపారు. .అన్నదమ్ములలా కలిసి ఉందామని విభజన సమయంలో పేర్కొన్నారని గుర్తుచేశారు.
‘తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు టీటీడీ రద్దు చేసింది. .తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సమన్యాయం , గౌరవం కల్పించాలి. తెలంగాణలో భద్రాచలం తోపాటు ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఏపీ ప్రజాప్రతినిధులకు ప్రాముఖ్యత ఇచ్చి గౌరవిస్తున్నాము.
తిరుమలలో కూడా తెలంగాణ సిఫారసు లేఖలు దర్శనాలు కేటాయించి గౌరవించాలి’
-ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
Comments
Please login to add a commentAdd a comment