Jabardasth Venu
-
గ్లోబల్ స్టేజీపై సత్తా చాటిన బలగం.. ఏకంగా రెండు అవార్డులు
ఆప్యాయతలకు, అనురాగాలకు రోజులు లేవు. రక్తసంబంధం కన్నా డబ్బుకే ఎక్కువగా విలువిస్తున్నారు. చిన్నచిన్న సమస్యలకే తోబుట్టువులను, మనకోసం పరితపించే బలగాన్ని దూరం చేసుకుంటున్నారు. కానీ అందరూ కలిసికట్టుగా ఉంటే వచ్చే బలమే బలగం అని నిరూపించాడు దర్శకుడు వేణు. పల్లెటూరు పచ్చదనాన్ని, మట్టి మనుషుల బోలాతనాన్ని, మానవ సంబంధాల పరిమళాన్ని రంగరించి తెరపై ఆవిష్కరించాడు. అందుకే బలగం సినిమా అందరినీ కట్టిపడేసింది. సినిమా చూసిన వారి మనసులను కదిలిచింది, కన్నీళ్లు తెప్పించింది. అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో అదరగొడుతున్న ఈ మూవీ అవార్డుల పంట పండిస్తోంది. తాజాగా ఈ చిత్రం లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ ఫీచర్ ఫిలిం సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులు ఎగరేసుకుపోయింది. ఈమేరకు లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ విభాగం సర్టిఫికెట్స్ కూడా జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను వేణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'నా బలగం చిత్రానికి మూడో అవార్డు.. బలగం గ్లోబల్ లెవల్లో కూడా మెరుస్తోంది' అని ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఉత్తమ ఫీచర్ ఫిలిం సినిమాటోగ్రఫీ అవార్డు అందుకున్న ఆచార్య వేణుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. Naa BALAGAM ki 3rd award.. Balagam shines on the global stage! 🤩❤️ Congratulations to our director @VenuYeldandi9 and our cinematographer @dopvenu for winning the prestigious Los Angeles Cinematography Awards. 👏🏻👏🏻 Running successfully in theatres near you🙌@priyadarshi_i pic.twitter.com/qPCVBiNT8d — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 30, 2023 -
Balagam Success Meet: కరీంనగర్ లో 'బలగం' మూవీ విజయోత్సవ వేడుక ( ఫొటోలు)
-
బలగం తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అలా పిలవట్లేదు: వేణు
‘‘బలగం’ సినిమా తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నన్ను అరేయ్ అని పిలవటం లేదు. సరదాగా జోకులు వేసుకుని తిరిగే బ్యాచ్ సడెన్‌గా గౌరవం ఇస్తుంటే చాలా కొత్తగా, భయంగా ఉంది. దాన్ని జీర్ణించుకోవటానికి కాస్త సమయం పడుతుంది’’ అని డైరెక్టర్ వేణు ఎల్దండి అన్నారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ– ‘‘నేను 20 ఏళ్లుగా నటిస్తున్నాను. రెండు వందల సినిమాలు చేసినా మంచి కమర్షియల్ సక్సెస్ రాలేదు. నన్ను నేను ప్రమోట్ చేసుకుందామని కథలు రాయడం మొదలుపెట్టాను. రొటీన్‌కు భిన్నంగా వెళ్లాలనిపించి ‘బలగం’ కథను తయారు చేసుకున్నాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు జరిగిన కొన్ని ఘటనలు, నా లైఫ్‌లో నేను చూసిన సంఘటనలతో ‘బలగం’ రాసుకున్నాను. చిరంజీవిగారు మా సినిమా గురించి మాట్లాడటం ఆనందంగా అనిపించింది. ఇకపై నన్ను డైరెక్టర్‌గా, యాక్టర్‌గానూ చూస్తారు’’ అన్నారు. -
కమెడియన్ దగ్గర టచప్ బాయ్‌గా పని చేశా, అవకాశాల కోసం..
కమెడియన్‌గా అందరికీ పరిచయమైన వేణు బలగంతో దర్శకుడిగా అవతారమెత్తాడు. తాను కమెడియన్ కావడంతో ఏదో హాస్య కథా చిత్రం చేస్తాడనుకున్నారంతా! కానీ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ను ఏడిపించేశాడు. మొదటి సినిమాతోనే దర్శకుడిగా వందకు వంద మార్కులు కొట్టేశాడు. ఈ విజయం అతడికి ఒక్కరోజులో రాలేదు. ఎన్నో ఏళ్లు కష్టాలతో సావాసం చేసి ఇన్నాళ్లకు సక్సెస్ రుచి చూశాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. '1999లో ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. ఎన్నో ఇబ్బందులు పడ్డ తర్వాత ఓ చిన్న సినిమాకు ఓ షెడ్యూల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఓ రచయిత దగ్గర ఆరు నెలలు పని చేశాను. చిత్రం శ్రీను అన్న దగ్గర టచప్ బాయ్‌గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత దాదాపు 200 సినిమాలు చేశాను. కానీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. నా తర్వాత వచ్చినవాళ్లందరూ ముందుకు పోతున్నారు, కానీ నాకు మాత్రం అంత గుర్తింపు రావడం లేదని ఫీలయ్యాను. ఇకపోతే నేను బలగం కథ రాసుకుని నిర్మాతల కోసం తిరుగుతున్నాను. ఆ సమయంలో నా స్నేహితుడు ప్రదీప్ చిలుకూరికి కథ చెప్పాను. ఆయన కూడా ఓ డైరెక్టర్. కథ విని.. ఇంత మంచి స్టోరీ దగ్గర పెట్టుకుని నిర్మాతల కోసం తిరుగుతున్నావా? అన్నాడు. ఆ మర్నాడే శివరామ్ దగ్గరకు వెళ్లడం, ఆయన ఓకే చెప్పడం.. దీన్ని దిల్ రాజు దగ్గరకు తీసుకెళ్లడం, సినిమా రిలీజవడం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమాను అందరూ ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు వేణు. కాగా గతంలోనూ తను పడ్డ కష్టాలు చెప్తూ ఎమోషనలయ్యాడీ నటుడు. అవకాశాల కోసం అంట్లు తోమడమే కాక బాత్రూమ్లు కూడా కడిగానని చెప్పాడు. ఇన్నాళ్లకు అతడికి మంచి బ్రేక్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. -
నేను ఈ స్టేజ్‌కు వచ్చానంటే ఆయనే కారణం: సుడిగాలి సుధీర్
ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలంగాణ యాసభాషలతో సాగుతుంది. మంగళవారం బలగం ప్రీరిలీజ్ ఈవెంట్ సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'నేను అనేవాడిని ఈ స్టేజీలో ఉన్నానంటే అందుకు వేణు అన్ననే కారణం. నేను, నా కుటుంబ సభ్యులు ఈరోజు మూడు పూటలా తింటున్నామంటే అందుకు ఆయనే కారణం. నాకు జబర్దస్త్‌లో ఛాన్స్ ఇచ్చి నన్ను ఆదుకుంది వేణన్న! జీవితాంతం తనకు రుణపడి ఉంటాను. ఇప్పటిదాకా వేణు అన్న అందరికీ ఓ కమెడియన్‌గానే తెలుసు. అలాంటి వ్యక్తి దగ్గర మంచి టాలెంట్ ఉందని గుర్తించి ఆయనకు సినిమా తీసే ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజుకు థ్యాంక్స్. సినిమా చూశాక మన తోబుట్టువులను ఒక్కసారి చూడాలి, వారితో మాట్లాడాలి అనిపిస్తుంది. తల్లిదండ్రులు బతికున్నప్పుడే వారిని బాగా చూసుకోవాలని మీకు అనిపించక మానదు. ఫ్యామిలీతో వెళ్లి చూడండి, సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది' అని చెప్పుకొచ్చాడు సుధీర్. చదవండి: ఫ్యామిలీకి దూరంగా సూర్య దంపతులు? -
తాగి వాహనాలు నడుపొద్దు:వేణు
-
జబర్దస్త్ వేణు అరెస్ట్
హైదరాబాద్ : తెలుగు టీవీ కామెడీ షో జబర్దస్త్ వేణును పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి ఓయూ పోలీసులు వేణును అదుపులోకి తీసుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఓ కులాన్ని కించపరిచారంటూ కేసు నమోదు చేశారు. వేణుపై ఇటీవల ఓ కుల సంఘం నాయకులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రసారమైన 'జబర్దస్త్' కార్యక్రమంలో తమ వృత్తిని అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఫిల్మ్ నగర్లో కొందరు వ్యక్తులు వేణుపై దాడి చేశారు. -
'నవ్విస్తున్న మమ్మల్ని కొట్టడం అమానుషం'.
-
జబర్దస్త్ వేణుపై దాడిని ఖండించిన 'మా'
హైదరాబాద్ : కమెడియన్ వేణుపై జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఖండించింది. సినిమా అవకాశం ఉందంటూ పిలిచి దాడి చేయడం దారుణమని 'మా' కార్యదర్శి రాఘవ అన్నారు. వేణుపై దాడిని నిరసిస్తూ... జబర్దస్త్ టీం సభ్యులు సోమవారం ఫిల్మ్ చాంబర్లో .. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సమయంలో తమకు అండగా నిలువాలని 'మా' సభ్యులను కోరారు. ఏ విపత్తు వచ్చినా కమెడియన్స్‌గా తాము ముందుంటున్నాం, అలాంటిది తమపై దాడి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. -
'నవ్విస్తున్న మమ్మల్ని కొట్టడం అమానుషం'
-
'నవ్విస్తున్న మమ్మల్ని కొట్టడం అమానుషం'
హైదరాబాద్ : కమెడియన్ వేణుపై దాడిని నిరసిస్తూ జబర్దస్త్ టీమ్‌తో పాటు టీవీ, సినీ ఆర్టిస్టులు సోమవారం నిరసన తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వరకూ ర్యాలీ చేపట్టారు. తమపై జరిగిన దాడిని నిరసిస్తూ జబర్దస్త్ టీమ్‌తో పాటు టీవీ, సినీ ఆర్టిస్ట్‌లు...ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం ఈ ఘటనపై ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నటుడు నాగబాబు మాట్లాడుతూ రెండేళ్లుగా నవ్వులు పండిస్తున్న నటులను కొట్టడం అమానుషమన్నారు. ఏ విపత్తు వచ్చినా కమెడియన్స్‌గా తమ వంతు సాయంగా ముందుంటున్నామని, అలాంటిది తమపై దాడి చేయటం దారుణమని ధన్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈటీవీలో ప్రసారమౌతున్న 'జబర్దస్త్' షో ఫేం వేణుపై గౌడ కులస్తులు నిన్న ఉదయం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్‌లోని అయ్యప్ప ఆలయానికి వచ్చిన వేణును చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కామెడీ కోసమే ఆ స్క్రిప్ట్ తయారు చేశానని, ఒక కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అతను చెప్తుండగానే వారు దాడి చేశారు. జబర్దస్త్ టీమ్, ఈటీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో రెండు గంటలపాటు ఫిలించాంబర్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. వేణును ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కూడా గౌడ విద్యార్థులు అడ్డుపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేణు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గౌడ విద్యార్థి సంఘం నేతలపై ఐపీసీ 341, 323 కింద కేసులు నమోదు చే శారు. వేణు కూడా తమపై దాడి చేశాడంటూ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుపై ఐపీసీ 323, 509కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాదానికి కారణమైన కామెడి స్కిట్ ఇదే..!
-
హాస్యనటుడు జబర్దస్త్ వేణుపై దాడి!