
ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలంగాణ యాసభాషలతో సాగుతుంది. మంగళవారం బలగం ప్రీరిలీజ్ ఈవెంట్ సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
'నేను అనేవాడిని ఈ స్టేజీలో ఉన్నానంటే అందుకు వేణు అన్ననే కారణం. నేను, నా కుటుంబ సభ్యులు ఈరోజు మూడు పూటలా తింటున్నామంటే అందుకు ఆయనే కారణం. నాకు జబర్దస్త్‌లో ఛాన్స్ ఇచ్చి నన్ను ఆదుకుంది వేణన్న! జీవితాంతం తనకు రుణపడి ఉంటాను. ఇప్పటిదాకా వేణు అన్న అందరికీ ఓ కమెడియన్‌గానే తెలుసు. అలాంటి వ్యక్తి దగ్గర మంచి టాలెంట్ ఉందని గుర్తించి ఆయనకు సినిమా తీసే ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజుకు థ్యాంక్స్. సినిమా చూశాక మన తోబుట్టువులను ఒక్కసారి చూడాలి, వారితో మాట్లాడాలి అనిపిస్తుంది. తల్లిదండ్రులు బతికున్నప్పుడే వారిని బాగా చూసుకోవాలని మీకు అనిపించక మానదు. ఫ్యామిలీతో వెళ్లి చూడండి, సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది' అని చెప్పుకొచ్చాడు సుధీర్.
చదవండి: ఫ్యామిలీకి దూరంగా సూర్య దంపతులు?
Comments
Please login to add a commentAdd a comment