‘‘బలగం’ సినిమా తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నన్ను అరేయ్ అని పిలవటం లేదు. సరదాగా జోకులు వేసుకుని తిరిగే బ్యాచ్ సడెన్‌గా గౌరవం ఇస్తుంటే చాలా కొత్తగా, భయంగా ఉంది. దాన్ని జీర్ణించుకోవటానికి కాస్త సమయం పడుతుంది’’ అని డైరెక్టర్ వేణు ఎల్దండి అన్నారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది.
ఈ సందర్భంగా దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ– ‘‘నేను 20 ఏళ్లుగా నటిస్తున్నాను. రెండు వందల సినిమాలు చేసినా మంచి కమర్షియల్ సక్సెస్ రాలేదు. నన్ను నేను ప్రమోట్ చేసుకుందామని కథలు రాయడం మొదలుపెట్టాను. రొటీన్‌కు భిన్నంగా వెళ్లాలనిపించి ‘బలగం’ కథను తయారు చేసుకున్నాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు జరిగిన కొన్ని ఘటనలు, నా లైఫ్‌లో నేను చూసిన సంఘటనలతో ‘బలగం’ రాసుకున్నాను. చిరంజీవిగారు మా సినిమా గురించి మాట్లాడటం ఆనందంగా అనిపించింది. ఇకపై నన్ను డైరెక్టర్‌గా, యాక్టర్‌గానూ చూస్తారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment