Balagam Movie Won Best Feature Film in Los Angeles Cinematography Awards - Sakshi
Sakshi News home page

Balagam Movie: గ్లోబల్‌ స్టేజీపై బలగం సినిమాకు అవార్డులు.. వేణు ట్వీట్‌ వైరల్‌

Published Thu, Mar 30 2023 7:10 PM | Last Updated on Thu, Mar 30 2023 8:15 PM

Balagam Movie Won Best Feature Film in Los Angeles Cinematography Awards - Sakshi

ఆప్యాయతలకు, అనురాగాలకు రోజులు లేవు. రక్తసంబంధం కన్నా డబ్బుకే ఎక్కువగా విలువిస్తున్నారు. చిన్నచిన్న సమస్యలకే తోబుట్టువులను, మనకోసం పరితపించే బలగాన్ని దూరం చేసుకుంటున్నారు. కానీ అందరూ కలిసికట్టుగా ఉంటే వచ్చే బలమే బలగం అని నిరూపించాడు దర్శకుడు వేణు. పల్లెటూరు పచ్చదనాన్ని, మట్టి మనుషుల బోలాతనాన్ని, మానవ సంబంధాల పరిమళాన్ని రంగరించి తెరపై ఆవిష్కరించాడు. అందుకే బలగం సినిమా అందరినీ కట్టిపడేసింది. సినిమా చూసిన వారి మనసులను కదిలిచింది, కన్నీళ్లు తెప్పించింది. అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో అదరగొడుతున్న ఈ మూవీ అవార్డుల పంట పండిస్తోంది.

తాజాగా ఈ చిత్రం లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకుంది. బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం, బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులు ఎగరేసుకుపోయింది. ఈమేరకు లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ విభాగం సర్టిఫికెట్స్‌ కూడా జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను వేణు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 'నా బలగం చిత్రానికి మూడో అవార్డు.. బలగం గ్లోబల్‌ లెవల్‌లో కూడా మెరుస్తోంది' అని ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా ఉత్తమ ఫీచర్‌ ఫిలిం సినిమాటోగ్రఫీ అవార్డు అందుకున్న ఆచార్య వేణుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement