టాలీవుడ్‌లో సంచలన హిట్‌గా నిలిచిన చిత్రం 'బలగం'. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా చివరి సన్నివేశంలో భావోద్వేగభరిత పాటను ఆలపించిన జానపద కళాకారుడు మొగిలయ్యను అందరూ అభినందించారు.
ప్రజలను కన్నీళ్లు పెట్టించిన ఈ పాటను బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు అద్భుతంగా పాడారు. అయితే, మొగిలయ్య మరోసారి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల నుంచి కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు.
దుగ్గొండికి చెందిన మొగిలయ్యకు 67 సంవత్సరాలు. ఆర్థిక ఇబ్బుందుల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని తెలిపిన మొగిలయ్య సతీమణి సాయం కోసం ఎదురుచూస్తుంది. తన భర్త ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కొమురమ్మ వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment