Mogilaiah
-
'బలగం' మొగిలయ్యకు అస్వస్థత.. సాయం కోసం ఎదురుచూపు
టాలీవుడ్లో సంచలన హిట్‌గా నిలిచిన చిత్రం 'బలగం'. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా చివరి సన్నివేశంలో భావోద్వేగభరిత పాటను ఆలపించిన జానపద కళాకారుడు మొగిలయ్యను అందరూ అభినందించారు.ప్రజలను కన్నీళ్లు పెట్టించిన ఈ పాటను బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు అద్భుతంగా పాడారు. అయితే, మొగిలయ్య మరోసారి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల నుంచి కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. దుగ్గొండికి చెందిన మొగిలయ్యకు 67 సంవత్సరాలు. ఆర్థిక ఇబ్బుందుల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని తెలిపిన మొగిలయ్య సతీమణి సాయం కోసం ఎదురుచూస్తుంది. తన భర్త ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కొమురమ్మ వేడుకుంది. -
ఎమ్మెల్యే సీటు ఇవ్వాలంటున్న బలగం మొగిలయ్య..
-
ఆర్థిక ఇబ్బందులు.. ‘బలగం’ మొగిలయ్యకు ‘దళితబంధు’
దుగ్గొండి (వరంగల్): ‘బలగం’సినిమా లో పాడిన పాటతో అందరి దృష్టినీ ఆకర్షించిన వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పస్తం మొగిలయ్య– కొంరమ్మ దంపతులకు దళితబంధు పథకం మంజూరైంది. మొగిలయ్య రెండు కిడ్నీలు ఫెయిలై డయాలసిస్‌పై ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయన కుటుంబాన్ని ఆదుకుని చేయూతనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి దళితబంధును మంజూరు చేయించారు. ఈ మేరకు మొగిలయ్యకు కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం దళితబంధు మంజూరు పత్రాలు అందించారు. జిల్లా యంత్రాంగం తరఫున ఎల్లప్పుడూ మొగిలి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. (గాజుల రామారంలో ఇళ్ల కూల్చివేతలు: ఈ పాపమెవరిది? పేదలే సమిధలు) -
చిరంజీవి గొప్ప మనసు.. ‘బలగం’ మొగిలయ్యకు సాయం!
సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టడంతో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద ఆయన సాయం చేస్తుంటాడు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న ‘బలగం’ మొగిలయ్యకు సాయం చేసి మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు. బలగం సినిమాలో..‘నా తోడుగా నా తోడు ఉండి’అనే పాటతో ఫేమస్ అయిన బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మొగిలయ్య దీనస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి మెగాస్టార్ ఆయనకు తిరిగి కంటి చూపు వచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈక్రమంలో బలగం దర్శకుడు వేణుకి ఫోన్ చేసి మొగిలయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చైనా తాను భరిస్తానని ఆయనకు కంటి చూపు వచ్చేలా చేద్దామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని వేణు మొగిలయ్య దృష్టికి తీసుకువెళ్లారట. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ మొగిలయ్య దంపతులను ఇంటర్వ్యూ చేయగా మెగాస్టార్ సాయం విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. మొగిలయ్య చికిత్సకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. Annayya #Chiranjeevi Personal call to @VenuYeldandi9 about Balagam Mogilaiah Eyes surgery@KChiruTweets said He will help financially for Mogailaiah Surgery#MegastarChiranjeevi pic.twitter.com/t2mwHTuyf1 — Chiranjeevi Army (@chiranjeeviarmy) April 17, 2023