
దుగ్గొండి (వరంగల్): ‘బలగం’సినిమా లో పాడిన పాటతో అందరి దృష్టినీ ఆకర్షించిన వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పస్తం మొగిలయ్య– కొంరమ్మ దంపతులకు దళితబంధు పథకం మంజూరైంది. మొగిలయ్య రెండు కిడ్నీలు ఫెయిలై డయాలసిస్‌పై ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయన కుటుంబాన్ని ఆదుకుని చేయూతనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి దళితబంధును మంజూరు చేయించారు.
ఈ మేరకు మొగిలయ్యకు కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం దళితబంధు మంజూరు పత్రాలు అందించారు. జిల్లా యంత్రాంగం తరఫున ఎల్లప్పుడూ మొగిలి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
(గాజుల రామారంలో ఇళ్ల కూల్చివేతలు: ఈ పాపమెవరిది? పేదలే సమిధలు)
Comments
Please login to add a commentAdd a comment