Duggondi
-
ఆర్థిక ఇబ్బందులు.. ‘బలగం’ మొగిలయ్యకు ‘దళితబంధు’
దుగ్గొండి (వరంగల్): ‘బలగం’సినిమా లో పాడిన పాటతో అందరి దృష్టినీ ఆకర్షించిన వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పస్తం మొగిలయ్య– కొంరమ్మ దంపతులకు దళితబంధు పథకం మంజూరైంది. మొగిలయ్య రెండు కిడ్నీలు ఫెయిలై డయాలసిస్‌పై ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయన కుటుంబాన్ని ఆదుకుని చేయూతనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి దళితబంధును మంజూరు చేయించారు. ఈ మేరకు మొగిలయ్యకు కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం దళితబంధు మంజూరు పత్రాలు అందించారు. జిల్లా యంత్రాంగం తరఫున ఎల్లప్పుడూ మొగిలి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. (గాజుల రామారంలో ఇళ్ల కూల్చివేతలు: ఈ పాపమెవరిది? పేదలే సమిధలు) -
అజయ్‌తో ప్రేమ.. ఐదు నెలల క్రితమే పెళ్లి.. సడెన్‌గా
సాక్షి, వరంగల్: దుగ్గొండి మండలంలోని అడవిరంగాపురం గ్రామానికి చెందిన వివాహిత సూర అఖిల(20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అఖిల, అదే గ్రామానికి చెందిన అజయ్‌ని ప్రేమించింది. ఐదు నెలల క్రితం ఇంట్లోంచి వెళ్లి పోయి వివాహం చేసుకుంది. ఇటీవల అఖిల అనారోగ్యానికి గురైందని అజయ్ ఆమెను ఎంజీఎంలో చేర్పించాడు. చికిత్స పొందుతున్న అఖిల మంగళవారం మృతి చెందింది. అయితే కూతురు అలా అకస్మాత్తుగా చనిపోవడంపై వివాహిత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అఖిలను అజయ్, అత్తామామలు వేధించి చంపి ఉంటారని ఆమె తండ్రి దయాసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. చదవండి: ఒకరితో పెళ్లి.. ఇద్దరితో వివాహేతర సంబంధం.. వీడిన హత్యకేసు మిస్టరీ -
శభాష్.. పల్లవి
సాక్షి, దుగ్గొండి: వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి ఎంపీడీఓ గుంటి పల్లవికి సీఎంఓ నుంచి గురువారం ఫోన్ వచ్చింది. ఎంపీడీఓగా వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్న విధానాన్ని సీఎం కేసీఆర్ అభినందించినట్లు సీఎంఓ అధికారులు తెలిపారు. పర్యావరణ హితం కోసం వాడిపడేసిన కొబ్బరిబొండాల్లో మొక్కలు నాటిన విధానాన్ని సీఎం ప్రశంసించారు. ‘బొండాం భలే ఐడియా’శీర్షికన ఈనెల 4న సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ మేరకు సీఎంఓ నుంచి అభినందనలురావడం సంతోషంగా ఉందని పల్లవి చెప్పారు. చదవండి: బొండాంతో భలే ఐడియా! -
కోరిక తీర్చలేదని చంపేశాడు
దుగ్గొండి(నర్సంపేట): పేదరికాన్ని అలుసుగా తీసుకున్నాడు..స్నేహం చేసి వివాహితను లోబరుచుకున్నాడు.. చివరికి కోరిక తీర్చడానికి నిరాకరించిందని కోపంతో ప్రియుడే అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు.. తొగర్రాయి గ్రామానికి చెందిన నల్ల అనితను హత్య చేసిన నిందితుడు పోలీసులకు గురువారం లొంగిపోయాడు. ఈ మేరకు కేసు వివరాలను దుగ్గొండి సర్కిల్ సీఐ బోనాల కిషన్ వెల్లడించారు. తొగర్రాయి గ్రామానికి చెందిన కారు అశోక్‌కు ఇదే గ్రామానికి చెందిన నల్ల అనితతో మూడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో గత నెల 25న గ్రామానికి చెందిన కొక్కరకొండ కుమారస్వామి మొక్కజొన్న పంటలో పనులు చేయడానికి అనిత కూలికి వెళ్లింది. ఉదయం 11.30 గంటలకు అశోక్ చేను వద్దకు వెళ్లి అనిత పిలిచాడు. అదే చేనులో శారీరకంగా అనుభవించాడు. అనంతరం ఆమె తెచ్చిన భోజనం తిన్నాడు. కొంత సేపటికి మళ్లీ కోరిక తీర్చాలని బలవంత పెట్టాడు. అయితే అనిత నిరాకరించింది. కొమ్మాలలో లక్ష్మీనర్సింçహాస్వామి కల్యాణం జరుగుతోంది.. అక్కడికి తనను తీసుకెళ్లి తలంబ్రాలు పోస్తే కోరిక తీరుస్తానని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. అనితపై అత్యాచారం చేశాడు. తల వెంట్రుకలు పట్టుకుని నేలకేసి బాదాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. చీకటి పడుతుండటంతో చేసేది లేక బాధితురాలి బావ కుమారుడు రాజుకు అనిత మూర్ఛపోయిందని ఫోన్ చేశాడు. రాజు మృతురాలి చిన్నకూతురును తీసుకుని చేను వద్దకు వచ్చాడు. అప్పటికే అశోక్ ఆటోను పిలిపించాడు. అనితను ఆటోలో ఎక్కించి పరారయ్యాడు. గత నెల 27 తెల్లవారుజామున అనిత మృతి చెందింది. అనంతరం అశోక్ గురువారం ఉదయం గిర్నిబావిలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న నల్ల బాబురావు వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పి పోలీసులకు సరెండర్ అయ్యాడు. దీంతో అశోక్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ బోనాల కిషన్ తెలిపారు. -
అత్యాచార బాధితురాలి మృతి
దుగ్గొండి(నర్సంపేట): వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయిలో లైంగికదాడితోపాటు హత్యాయత్నానికి గురై అపస్మారక స్థితికి చేరిన గురైన వివాహిత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. బాధితురాలి మృతితో తొగర్రాయిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, సీఐ బోనాల కిషన్ కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు నల్ల అనిత(34), నర్సయ్య కూలీ పనిచేస్తూ జీవ నం సాగిస్తున్నారు. ఈ నెల 25న ఆదివారం ఉదయం ఇదే గ్రామానికి చెందిన కొక్కరకొండ కుమారస్వామి–లలిత దంపతులు తమ మొక్కజొన్న చేనులో తలసంచులు తుంచి వేయడానికి అనితతోపాటు మరో ముగ్గురిని కూలీకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో అనితకు పరిచయస్తుడైన కారు అశోక్ మొక్కజొన్న చేను వద్దకు వచ్చి అనితను పిలవడంతో ఆమె చేను కింది భాగానికి వచ్చింది. అక్కడ ఏమైందో తెలియదుగాని మొక్కజొన్న చేనులోనే అనితపై అశోక్ లైంగికదాడికా పాల్పడ్డాడు. ఆపై పలుచోట్ల విచక్షణారహితంగా చితకబాదడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రాత్రి 7 గంటల సమయంలో అనితకు ఫిట్స్ వచ్చి మొక్కజొన్న చేను వద్ద పడిపోయిందని నమ్మించిన అశోక్ ఆమె బావ కుమారుడు నల్ల రాజుకు సమాచారం ఇచ్చాడు. నానాజీ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఆటోను రప్పించాడు. రాజు రాగానే ఇద్దరూ కలిసి అనితను ఆటోలో వేసి స్థానికంగా ఉన్న ఆర్ఎంపీకి చూపించగా వరంగల్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో 108లో కుటుంబ సభ్యులు అదేరోజు రాత్రి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. సంఘటన స్థలాన్ని నర్సంపేట ఏసీపీ సునీత పరిశీలించారు. అక్కడ అనిత ధరించిన చొక్కాతోపాటు మంగళసూత్రం దొరకడంతో స్వా«ధీ నం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని సీఐ బోనాల కిషన్, ఎస్సై ఊరడి భాస్కర్‌రెడ్డిని ఆదేశించారు. మృతురాలికి భర్త నర్సయ్య, కూతుళ్లు రిజ్వానా, జ్యోత్స్న ఉన్నారు. నిందితుడిపై నిర్భయ, హత్య కేసు.. నల్ల అనిత వద్ద ఉన్న చనువుతో ఇదే గ్రామానికి చెందిన కారు అశోక్ ఆమెపై లైంగికదాడికి పాల్పడి, విచక్షణరహితంగా పలు చోట్ల దాడి చేయడంతోనే తీవ్ర గాయాలపాలై చనిపోయినట్లు మృతురాలి బావ నల్ల సారయ్య చేసిన ఫిర్యాదు మేరకు అశోక్‌పై నిర్భయ కేసుతోపాటు హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ బోనాల కిషన్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, నింది తుడిని పట్టుకుని విచారణ చేస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడు అశోక్ సెల్‌ఫోన్‌కు ఆ రోజు ఏ ఏ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయనే విషయాలపై కాల్‌డేటాను పోలీసులు సేకరించినట్లు తెలిసింది. సమగ్ర విచారణ తర్వాత మిగతా నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రామంలో ఉద్రిక్తత.. అనిత మృతదేహం ఎంజీఎం మార్చురీ నుంచి గ్రామానికి చేరుకోగా మృతురాలి బంధువులు మృతదేహాన్ని హత్య చేసిన వ్యక్తి ఇంటి ముందు వేస్తామని భీష్మించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అరగంటపాటు ఆందోళన చేశారు. అనంతరం సీఐ కిషన్ సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై అనేక అనుమానాలు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న అనితపై అత్యాచారం, ఆపై హత్య చేయడంపై గ్రామస్తులు , బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనితపై ఇంతలా అఘాయిత్యం జరుగుతుంటే కూలీకి తీసుకెళ్లిన రైతులుగానీ, ఆమెతోపాటు వెళ్లిన తోటి కూలీలుగానీ ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సదరు వ్యక్తులంతా సంఘటన తర్వాత కనిపించకుండపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనిత ఒంటిపై పలుచోట్ల విచక్షణారహితంగా నలిపిన గాయాలు ఉండటం, పెదాలు వాచిపోయి ఉండటంతో అత్యాచారం ఘటన ఒక్కరు చేయడం సాధ్యం కాదని, మరికొందరు కూడా ఉండి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా నిరుపేద దళిత మహిళ మృతికి కారకులైన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
వరికోత మిషన్‌లో పడి వ్యక్తి మృతి
దుగ్గొండి(వరంగల్): వరికోత మిషన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా దుంగ్గొండి మండలం లక్ష్మీపురంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తాల్లపల్లి సాంబయ్య(38) వరికోత మిషన్ సమీపంలో నిల్చొని ఉన్న సమయంలో అతన్ని గుర్తించని మిషన్ డ్రైవర్ అతని పై నుంచి మిషన్‌ను పోనిచ్చాడు. దీంతో అందులో పడ్డ సాంబయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. -
‘కళ్యాణ లక్ష్మి’ కేసులో మహిళ అరెస్ట్
దుగ్గొండి : కళ్యాణలక్ష్మి పథకంలో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ సొమ్మును పొందిన మహిళను అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. మండలంలోని మైసంపల్లి గ్రామానికి చెం దిన గంగారపు సంధ్య కొనేళ్ల క్రితం వివాహం చేసుకుని ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి కళ్యాణలక్ష్మి పథకంలో రూ.51 వేలు లబ్ధిపొం దింది. దీంతో నర్సంపేట సాంఘిక సంక్షే మ అధికారి మంచికట్ల మనోహర్ ఫిర్యా దు మేరకు గంగారపు సంధ్యను అరెస్టు చేసి నర్సంపేట మున్సిఫ్ మెజిస్ట్రీట్ కోర్టు లో హాజరుపరిచినట్లు ఎస్సై చెప్పారు. -
నకిలీ పత్రాలతో బెయిల్ ష్యూరిటీలు
దుగ్గొండి : బెయిల్ జమానత్ల కోసం నకిలీ ఇంటి పన్ను రశీదులు సృష్టించి.. గ్రామపంచాయతీ ఆదాయానికి గండికొడుతున్న ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై ముజాహిద్ తెలిపారు. మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన హన్మకొండ బాబు, మందపల్లి గ్రామానికి చెందిన బత్తుల వెంకటేశ్వర్లు, చాపలబండ గ్రామానికి చెందిన ఆరె మల్లారెడ్డి, రాజ్యతండాకు చెందిన అజ్మీరా ధన్సింగ్, అడవిరంగాపురం గ్రామానికి చెందిన గుండా సారంగపాణితోపాటు వరంగల్‌కు చెందిన ఓ న్యాయవాది ముఠాగా ఏర్పడ్డారు. వరంగల్ ఎక్సైజ్ కోర్టులో గుడుంబా విక్రేత, స్మగ్లింగ్ కేసుల్లో ఇరుక్కున్న వారికి జమానతుదారులను తీసుకెళ్లడం వృత్తిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా నకిలీ రశీదులు, నకిలీ రబ్బర్ స్టాంప్‌లు సృష్టించి కారోబార్లు, పంచాయతీ కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ చేయసాగారు. ఆ రశీదులతో జమానతులు తయారు చేసి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులకు రోజుకు రూ.250 చొప్పున కూలీ చెల్లించి నిత్యం వరంగల్‌కు తీసుకెళుతున్నారు. ఇందుకుగాను నిందితుల వద్ద రూ. వెయ్యి నుంచి రెండు వేలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 22న సదరు నిందితులు ఇద్దరు వ్యక్తుల పేర్లతో నకిలీ ఇంటిపన్నులు రాసి, ఇంటి విలువ సర్టిఫికెట్ తీసుకోవడానికి మందపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీత వద్దకు వెళ్లారు. ఆ రశీదు నకిలీదని గుర్తించిన ఆమె సర్పంచ్ లింగాల రమేష్, కారోబార్ బాబురావుకు సమాచారమిచ్చారు. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా పైన పేర్కొన్న ఐదుగురు నిందితులతోపాటు వరంగల్‌కు చెందిన ఓ అడ్వకేట్ ప్రమేయం ఉందని తేలింది. దీంతో ఐదుగురిని అరెస్టు చేసి, నర్సంపేట కోర్టులో హాజరుపరిచామని ఎస్సై ముజాహిద్ తెలిపారు. అడ్వకేట్‌పై కొనసాగుతున్న విచారణ ఇదే కేసులో వరంగల్ ఎక్సైజ్ కోర్టు న్యాయవాది ఎన్. కమలాకర్‌పై విచారణ జరుగుతుందని ఎస్సై తెలిపారు. జమానతుల కోసం ముఠాకు ఎలా సహకరించారు.. కేసులో న్యాయవాది పాత్ర ఏమిటి అనే విషయాలపై విచారణ జరుగుతోందని, పూర్తి ఆధారాలు లభించగానే అరెస్ట్ చేస్తామని ఎస్సై వివరించారు.