
సాక్షి, దుగ్గొండి: వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి ఎంపీడీఓ గుంటి పల్లవికి సీఎంఓ నుంచి గురువారం ఫోన్ వచ్చింది. ఎంపీడీఓగా వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్న విధానాన్ని సీఎం కేసీఆర్ అభినందించినట్లు సీఎంఓ అధికారులు తెలిపారు. పర్యావరణ హితం కోసం వాడిపడేసిన కొబ్బరిబొండాల్లో మొక్కలు నాటిన విధానాన్ని సీఎం ప్రశంసించారు. ‘బొండాం భలే ఐడియా’శీర్షికన ఈనెల 4న సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ మేరకు సీఎంఓ నుంచి అభినందనలురావడం సంతోషంగా ఉందని పల్లవి చెప్పారు.
చదవండి: బొండాంతో భలే ఐడియా!
Comments
Please login to add a commentAdd a comment