
అఖిల(ఫైల్)
సాక్షి, వరంగల్: దుగ్గొండి మండలంలోని అడవిరంగాపురం గ్రామానికి చెందిన వివాహిత సూర అఖిల(20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అఖిల, అదే గ్రామానికి చెందిన అజయ్‌ని ప్రేమించింది. ఐదు నెలల క్రితం ఇంట్లోంచి వెళ్లి పోయి వివాహం చేసుకుంది. ఇటీవల అఖిల అనారోగ్యానికి గురైందని అజయ్ ఆమెను ఎంజీఎంలో చేర్పించాడు.
చికిత్స పొందుతున్న అఖిల మంగళవారం మృతి చెందింది. అయితే కూతురు అలా అకస్మాత్తుగా చనిపోవడంపై వివాహిత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అఖిలను అజయ్, అత్తామామలు వేధించి చంపి ఉంటారని ఆమె తండ్రి దయాసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు.
చదవండి: ఒకరితో పెళ్లి.. ఇద్దరితో వివాహేతర సంబంధం.. వీడిన హత్యకేసు మిస్టరీ
Comments
Please login to add a commentAdd a comment