
జబర్దస్త్ వేణు అరెస్ట్
హైదరాబాద్ : తెలుగు టీవీ కామెడీ షో జబర్దస్త్ వేణును పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి ఓయూ పోలీసులు వేణును అదుపులోకి తీసుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఓ కులాన్ని కించపరిచారంటూ కేసు నమోదు చేశారు.
వేణుపై ఇటీవల ఓ కుల సంఘం నాయకులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రసారమైన 'జబర్దస్త్' కార్యక్రమంలో తమ వృత్తిని అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఫిల్మ్ నగర్లో కొందరు వ్యక్తులు వేణుపై దాడి చేశారు.