'మా' దూకుడు.. వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే! | Movie Artists Association Banned 18 Youtube Channels For Trolling Artists | Sakshi
Sakshi News home page

Movie Artists Association: 'మా' కఠిన చర్యలు.. ట్రోలర్స్‌కు గట్టి షాక్‌!

Published Wed, Jul 24 2024 4:07 PM | Last Updated on Wed, Jul 24 2024 4:46 PM

Movie Artists Association Banned 18 Youtube Channels For Trolling Artists

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) చెప్పినట్లుగానే కఠిన చర్యలు చేపట్టింది. యూట్యూబ్ ఛానెల్స్‌ ద్వారా మూవీ ఆర్టిస్టులపై అసభ్యకరంగా ట్రోల్‌ చేస్తున్న వారికి గట్టి షాకిచ్చింది.  తాజాగా అలాంటి కంటెంట్ ప్రసారం చేస్తున్న 18 యూట్యూబ్‌ ఛానెళ్లను బ్లాక్‌ చేయించినట్లు మా అసోసియేషన్‌ ట్వీట్ చేసింది. అంతకుముందే అలాంటి వీడియోలను 48 గంటల్లోగా తొలగించకపోతే చర్యలు తప్పవని మా అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా నటీనటులు, వారి కుటుంబసభ్యులే లక్ష్యంగా  అసత్య వార్తలను పోస్ట్‌ చేస్తున్న 18 యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేయించినట్లు మా అసోసియేషన్ తెలిపింది. బ్రహ్మి ట్రోల్స్‌ 3.0, టీకే క్రియేషన్స్‌, డాక్టర్ ట్రోల్స్‌, ట్రోలింగ్‌ పోరడు, అప్‌డేట్‌ ట్రోల్స్‌, నేను మీ జాను, కామెడీ ట్రోలింగ్‌, మై ఛానెల్ మై రూల్స్ లాంటి ఛానెల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. కాగా.. అంతకుముందే మొదట ఐదు యూట్యూబ్‌ ఛానల్స్‌ను బ్లాక్‌ చేయించారు.

ఈ సందర్భంగా యూట్యూబర్‌లు, సోషల్ మీడియా ట్రోలర్లకు మరోసారి మా హెచ్చరికలు పంపింది. పరువు నష్టం కలిగించేలా ఉన్న ట్రోల్ వీడియోలపై సైబర్ క్రైమ్ కార్యాలయానికి నివేదిక అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇబ్బందులు రాకుండా ఉండాలంటే దయచేసి మీ ఛానెల్స్‌ నుంచి అలాంటి కంటెంట్‌ వెంటనే తొలగించాలని మరోసారి మా విజ్ఞప్తి చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement