
సాక్షి, హైదరాబాద్ : ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేష్ విజయం సాధించారు. ప్రత్యర్థి శివాజీ రాజాపై ఆయన గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌పై రాజశేఖర్ గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజయం సాధించారు. జనరల్ సెక్రటరిగా రఘుబాబుపై జీవిత రాజశేఖర్ గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు, శివబాలాజీ విజయం సాధించారు. ట్రెజరర్‌గా కోట శంకర్రావుపై రాజీవ్ కనకాల గెలుపొందారు.
గెలుపొందిన ఈసీ మెంబర్స్ : 1). అలీ 2). రవిప్రకాష్ 3). తనికెళ్ల భరణి 4). సాయికుమార్ 5). ఉత్తేజ్ 6). పృథ్వి 7). జాకీ 8).సురేష్ కొండేటి 9). అనితా చౌదరి 10). అశోక్ కుమార్ 11). సమీర్ 12). ఏడిద శ్రీరామ్ 13).రాజా రవీంద్ర 14). తనీష్ 15). జయలక్ష్మి 16). కరాటి కళ్యాని 17). వేణుమాధవ్ 18). పసునూరి శ్రీనివాస్. ఆదివారం ‘మా’ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. మా అసోషియేషన్‌లో మొత్తం 745మంది సభ్యులు ఉండగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment