
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి మృతికి మెగస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి తన ప్రగాఢ సానభూతిని తెలియజేశారు. పరచూరి తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు. (ప్రముఖ రచయిత ఇంట విషాదం)
'మా' సంతాపం
విజయలక్ష్మీ మృతికి పలువురు సినీ ప్రముఖుల సంతాపం తెలియజేశారు. వెంకటేశ్వరరావుకి మూవీ ఆర్టిస్టుల సంఘం తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. విజయలక్ష్మి మరణం పరుచూరి కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయితలుగా పరుచూరి బ్రదర్స్ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.