breaking news
Paruchuri Venkateswara Rao (screenwriter)
-
పరుచూరికి చిరంజీవి పరామర్శ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి మృతికి మెగస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి తన ప్రగాఢ సానభూతిని తెలియజేశారు. పరచూరి తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు. (ప్రముఖ రచయిత ఇంట విషాదం) 'మా' సంతాపం విజయలక్ష్మీ మృతికి పలువురు సినీ ప్రముఖుల సంతాపం తెలియజేశారు. వెంకటేశ్వరరావుకి మూవీ ఆర్టిస్టుల సంఘం తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. విజయలక్ష్మి మరణం పరుచూరి కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయితలుగా పరుచూరి బ్రదర్స్ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. -
ప్రముఖ రచయిత ఇంట విషాదం..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీ వియోగం కలిగింది. ఆయన భార్య విజయలక్ష్మి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 74 ఏళ్లు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: పరుచూరి వెంకటేశ్వరరావు (సినీరచయిత), తుషార్కపూర్ (నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. మీ పుట్టిన రోజులో రెండు ఒకట్లు, రెండు రెండ్లు ఉండటం వల్ల నాయకత్వ లక్షణాలతోపాటు మంచి ఆలోచన, సమయస్ఫూర్తి ఉంటాయి. అందువల్ల ఈ సంవత్సరం మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. పెద్దల ప్రోత్సాహం వల్ల మనోబలం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. అంతకు ముందు నుంచి ఉన్న వాటిని మరింత అభివృద్ధి పరుస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎం.బి.ఎ; ఎల్.ఎల్.బి; సి.ఎ. చదవాలనుకునే విద్యార్థులకు ఇది మంచి కాలం. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. అయితే పనులు పూర్తి చేయాలన్న పట్టుదలతో అవిశ్రాంతంగా పని చేయడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల కొంతమందితో మనస్పర్థలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. పెద్దవారితోనూ, పై స్థాయివారితోనూ మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శని, ఆదివారాలు. సూచనలు: దక్షిణా మూర్తికి లేదా శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకో వడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధుల ను ఆదరించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. - డా. మహమ్మద్ దావూద్ , జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు