Telugu Film Industry Stars Sudden Meeting at Annapurna Studios | అన్నపూర్ణ స్టూడియోస్‌కు పవన్‌..! - Sakshi
Sakshi News home page

Published Sat, Apr 21 2018 11:50 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Tollywood Meeting At Annapurna Studios - Sakshi

గత కొద్ది రోజులు తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సినీపెద్దలు అన్ని రంగాల వారితో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మా అధ్యక్షులు శివాజీ రాజా.. నిర్మాతలు సురేష్‌ బాబు, అల్లు అరవింద్‌, కేయస్‌ రామారావు, దానయ్య,ఘట‍్టమనేని ఆదిశేషగిరిరావు, ఠాగూర్ మధు, అశోక్‌ కుమార్‌,  సీ కల్యాణ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన యన్‌వి ప్రసాద్‌, నరేష్‌, వంశీ పైడిపల్లి, హరీష్‌ శంకర్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, జెమినీ కిరణ్, కాశీ విశ్వనాథ్‌, హలు అన్నపూర్ణ 7 ఎకరాల స్టూడియోకు చేరుకున్నారు. 

పవన్‌ కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుండటంతో అభిమానులు కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఈ రోజు సాయంత్రం 4గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా సినిమా రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు వంటి అంశాలపై సినీరంగ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, కార్మిక శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement