
నటి శ్రీరెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు రెండు రోజుల క్రితం టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. న్యాయ నిపుణుల సలహా మేరకు కేసు నమోదు చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
పలు వార్తా చానళ్లు, యూట్యాబ్ చానళ్లతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా ప్రముఖులపై శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు అమ్మాయిలను తక్కువగా చూస్తున్నారని, అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయారు. పరభాషా నటీనటులను ప్రోత్సహిస్తున్నారని, తెలుగువారిని అక్కునచేర్చుకోవడం లేదని ఆమె ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment