
ఫిలిం ఛాంబర్‌పై ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి పై చర్యలు తీసుకునేందుకు మా అసోషియేషన్ రెడీ అవుతోంది. నిన్న(శనివారం) జరిగిన సంఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన మా అధ్యక్షుడు శివాజీ రాజా.. వివాదం చేస్తే కార్డ్ వస్తుందని భావించటం తప్పన్నారు.
‘ఇప్పటికే శ్రీరెడ్డిని మా అసోషియేషన్‌లోకి ఆహ్వానిస్తూ అప్లికేషన్ ఫాం ఇచ్చాం. కానీ ఆమె పూర్తి వివరాలు ఇవ్వలేదు. పైగా మా సభ్యులపై ఆరోపణలు చేస్తోంది. ఇది సరికాదు. శ్రీరెడ్డిపై లీగల్ చర్యలు తీసుకుంటాం. శ్రీరెడ్డి అప్లికేషన్‌ను తిరస్కరిస్తున్నాం. మా సభ్యులెవరు ఆమెతో కలిసి నటించరు. ఒక వేళ ఎవరైనా నటిస్తే వారిని కూడా సస్పెండ్ చేస్తా’మని మా సభ్యులు వెల్లడించారు. మా అసోషియేషన్‌కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా మద్ధతు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment