sivaji raja
-
భారీ ఎమోషన్స్‌తో 'ప్రేమలో' ట్రైలర్
చందు కోడూరి హీరోగా, చరిష్మా శ్రీఖర్ హీరోయిన్గా డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘ప్రేమలో’ అనే చిత్రాన్ని నిర్మించారు. చందు కోడూరి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ కోడూరి నిర్మించారు. జనవరి 26న విడుదల అవుతుంది. అయితే ఈరోజు ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ నటుడు శివాజీ రాజా విడుదల చేశారు. హీరో, దర్శకుడు చందు కోడూరి మాట్లాడుతూ.. ‘నాకు సినిమా ఇండస్ట్రీలో ఉండటమే ఆనందం. ఇంతవరకు సరైన గుర్తింపు లేకపోయినా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు ప్రేమలో అనే సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాను. హీరోగా, దర్శకుడిగా చేసిన ఈ మూవీ ట్రైలర్‌ను శివాజీ రాజా గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. హీరోయిన్ చరిష్మా శ్రీకర్ చక్కగా నటించారు. కెమెరామెన్ రామ్ పి నందిగం గారు చాలా నాచురల్‌గా ఈ సినిమాను తీశారు. ఎడిటర్ పవన్ కళ్యాణ్ మేజర్, రైటర్ పద్మభూషన్ వంటి చిత్రాలు చేశారు. నేను అడగ్గానే నా కోసం ఆయన ఒప్పుకున్నారు. ఆయనకు థాంక్స్. డైలాగ్ రైటర్ రవి ఐ మంచి మాటలు రాశారు. ఈ సినిమా కోసం సందీప్ మంచి సంగీతం ఇచ్చారు. బీజీఎం నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. నిర్మాతగా మా అన్నయ్య రాజేష్ ఈ సినిమా కోసం డబ్బు పెట్టడమే కాకుండా, ఓ మేనేజర్లా కష్టపడ్డారు. ఈ సినిమాలో భారీ తారాగణం, ఎలివేషన్స్, టెక్నీషియన్స్ లేకపోయినప్పటికీ భారీ ఎమోషన్స్ ఉన్నాయి. కథలో బలం ఉంది.. కాన్సెప్ట్‌లో దమ్ముంది. అందుకే ఈ సినిమాను చేశాను. భారీ ఎమోషన్స్ పండించాలంటే బడ్జెట్ ఉండాల్సిన పని లేదు. తెలుగులో ఇప్పటివరకు ఎవ్వరూ ట్రై చేయని కథను చేశాను. చిన్న పాయింట్‌ను న్యాచురల్‌గా తీశాను. కంటెంట్ ఉండే చిత్రాలను సినీ లవర్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. నేను లివ్ అండ్ లెట్ లివ్ (బతుకు బతికించు) అనే సిద్దాంతాన్ని నమ్ముతాను. ఈ చిత్రంతో ఎంతో మందికి ఉపాధిని కల్పించాను. ఈ చిత్రం పెద్ద హిట్ అయితే మున్ముందు ఇంకెంతో మందికి ఉపాధి కల్పిస్తాను. ఈ రోజు మనదరం ఇక్కడ కలిసామంటే దానికి కారణం సినిమా. మా సినిమాకు మీడియా సహకారం అందించాలి. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆధరించాలి. రామ మందిర ప్రారంభోత్సవం నాడు మా సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. జై శ్రీరామ్’ అని అన్నారు. నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు యాంకర్ లేరని చెప్పడం బాధగా అనిపించింది. టీ రాజేందర్.. ఆయనే హీరో, ఆయనే ఎడిటర్.. ఆయన దర్శకుడు.. కానీ ఆయన యాంకరింగ్ ఎప్పుడూ చేయలేదు. చందు యాంకరింగ్ కూడా చేశాడు. ఇదో కొత్త రికార్డ్. మా గురువు వి. మధు సూధన్ గారి అమ్మాయి వాణి ఫోన్ చేశారు. ఈ టీమ్‌కు హెల్ప్ చేయమని అడిగారు. మూడు రోజుల క్యారెక్టర్ చేశాను. చందు ప్యాషన్ చూసి.. నేను మూడురోజుల ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుందని. ఒకటిన్నర రోజులోనే కంప్లీట్ చేయమన్నాను. అతను పడ్డ కష్టానికి మంచి పేరు వస్తుంది. ఇలాంటి చిన్న చిత్రాలను ఆదరించండి’ అని అన్నారు. సంగీత దర్శకుడు సందీప్ మాట్లాడుతూ.. ‘చందు గారితో నాకు పదిహేనేళ్ల నుంచి బంధం ఉంది. మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ తరువాత ఓ ఫ్రెండ్ ద్వారా ఈ సినిమాతో కలిశాం. పాటలు బాగా వచ్చాయి. ఆర్ ఆర్ దగ్గరుండి ఎలా కావాలో.. ఏం కావాలో చేయించుకున్నారు. నా టీంకు థాంక్స్. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
గొల్లపూడి మృతికి ప్రముఖుల స్పందన
మా ఇద్దరిదీ గురుశిష్యుల బంధం ‘‘గొల్లపూడి మారుతీరావుగారిది, నాది గురుశిష్యుల బంధం. ఆయన కుమారుడి పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్‌కి ఇటీవల నేను వెళ్లాను. తర్వాత మళ్లీ నాకు ఆయన్ను కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. నేను 1979లో ‘ఐ లవ్ యూ’ అనే సినిమా చేశాను. ఆ చిత్రనిర్మాత భవన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతీరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతీరావుగారు చాలా పెద్ద రచయిత, పాత్రికేయుడిగానూ చేశారు. సాహిత్యపరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికులు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకోమని నన్ను పంపించారు. అప్పుడు మారుతీరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాసులు తీసుకున్నారు. ఆ విధంగా ఆయన నాకు గురువనే చెప్పాలి. ఎన్నో సాహిత్యపరమైన విషయాలు చెప్పేవారు. గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే ఆసక్తిగా వింటుండేవాడిని. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఒక రకమైన శాడిజమ్, కామెడీగా ఉండే క్యారెక్టర్‌కి గొల్లపూడిగారు బాగుంటారనగానే నాకూ కరెక్ట్ అనిపించింది. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు. ఆ విధంగా నా సహనటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి. ఆ తర్వాత నుంచి ‘ఆలయశిఖరం’, ‘అభిలాష’, ‘చాలెంజ్’... ఇలా ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. – నటుడు చిరంజీవి ‘హ్యాపీడేస్’ (2007) చిత్రానికి ముందు ఓ చిన్న సినిమా కోసం యాక్టర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా గొల్లపూడి మారుతీరావుగారితో పని చేశాను. గొల్లపూడిగారు నాకు ఇచి్చన సలహాలు, సూచనలు ఇప్పటికీ నాతో ఉన్నాయి. గొప్ప చిత్రాలతో ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి – నటుడు నిఖిల్ నన్ను హీరో అని పిలిచేవారు నేను సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన చిత్రం ‘కళ్లు’. నాకు నటుడిగా జన్మనిచ్చిన తండ్రి మారుతీ రావుగారు. ఆ సినిమా కథ ఆయనదే. ఆ సినిమా తర్వాత నటులుగా కూడా నేను, ఆయన చాలా సినిమాలు చేశాం. ఆయనకు ‘అరుణాచ లం’ అంటే ఇష్టం. విచిత్రంగా నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. ‘కళ్లు’ సినిమా అప్పటినుంచి ఇప్పటివరకూ నన్ను ‘హీరో’ అనే పిలిచేవారు. ‘కళ్లు’ అనేది నా జీవితంలో మంచి జ్ఞాపకం. ప్రముఖ కెమెరామేన్ ఎం.వి. రఘు ఈ సినిమాతో దర్శకుడయ్యారు. గొల్లపూడిగారికి చాలా ఇష్టమైన కథ ‘కళ్లు’. ఈ సినిమాకి ‘తెల్లారింది లెగండో..’ అనే మంచి పాట రాశారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు. ఆయన పెద్ద కొడుకు పేరు రాజా. నన్నూ కొడుకులా భావించి, ‘రాజా’ అనే పిలుస్తారు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు సంగీతదర్శకుడు. ఈ సినిమాకి మూడు నంది అవార్డులు వచ్చాయి. నిజానికి ఈ సినిమాని రజనీకాంత్ హీరోగా తమిళంలో మొదలుపెట్టారు. రెండు మూడు రీళ్లు తీశాక ఆపేశారు. ఆ తర్వాత తెలుగులో నన్ను హీరోగా పెట్టి తీశారు. నంది అవార్డు మాత్రమే కాదు.. అప్పుడు ఉన్న ప్రైవేట్ అవార్డులతో కలిపి నాకు పదిహేను పదహారు అవార్డులు వచ్చాయి. అలా ‘కళ్లు’ సినిమాకి చాలా విశేషాలున్నాయి. అంతటి మంచి సినిమాకి అవకాశం ఇచ్చారు. గొల్లపూడిగారు మంచి నటుడు, రచయిత. ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ‘కళ్లు’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐదేళ్ల క్రితం ఫంక్షన్ చేశాం. ఆ ఫంక్షన్లోనే చివరిసారి ఆయన్ను కలిశాను. ఆయన ఎక్కడ తిరుగుతుంటే అక్కడ సరస్వతి తిరుగుతున్నట్లు అనిపించేది. అంతటి మహానుభావుడిని కోల్పోయాం. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. – నటుడు శివాజీరాజా అది ఆయనకే సాధ్యం గొప్ప నటుడు, రచయిత అయిన గొల్లపూడి మారుతీరా వుగారు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రచయితగా నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన కథారచయితగా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా మూడు నంది అవార్డులు గెలుచుకున్నారు. అది ఎవరికీ సాధ్యం కాదు. అలాగే ఆయనకు ఒక పెక్యులియర్ స్టైల్ ఉంది. టైమింగ్ ఉంది. విచిత్రమైన మాడ్యులేషన్ ఉంది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చాలెంజ్.. ఇలా ఆయన ఎన్నో సినిమాల్లో చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అటువంటి గొప్ప రచయిత, నటుడు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం. సినీ రంగానికి ఇది తీరని లోటుగా భావిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. – రచయిత, నిర్మాత కోన వెంకట్ -
‘లీసా’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్
-
నాగబాబుకి ఓటు వేయకండి : శివాజీ రాజా
సాక్షి, హైదరాబాద్ : జనసేన పార్టీ తరఫున నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నాగబాబుపై నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా విరుచుకుపడ్డారు. నాగబాబు వల్ల ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ దిగజారిపోయిందని, అభివృద్ధిలో ‘మా’ ను రెండేళ్లు వెనక్కి నెట్టారని ఆయన ధ్వజమెత్తారు. మెగా ఫ్యామిలీని తిట్టినవాళ్లకు నాగబాబు రాత్రికి రాత్రే మద్దతు ఇచ్చారని, వాళ్లు ఎన్నికల్లో నెగ్గిన రెండు రోజులకే మెగా ఫ్యామిలీని తిట్టారన్నారు. 600మంది ఉన్న ‘మా’కు ఏమీ చేయనివాడు...నర్సాపురానికి ఏం చేస్తారంటూ శివాజీ రాజా సూటిగా ప్రశ్నించారు. మీరు ఏ పార్టీకి అయినా ఓటు వేసుకోండి...కానీ నాగబాబుకు మాత్రం ఓటు వేయొద్దు అని నర్సాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో శివాజీ రాజా ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘నేను ఇలా మాట్లాడటానికి సుమారు 15 రోజుల పాటు ఆలోచించాను. పవన్ కల్యాణ్ తన కష్టం ఏదో తాను పడుతున్నాడు. ఇండస్ట్రీలో అందరూ మెగా ఫ్యామిలీతో సినిమాలు చేశారు. కానీ నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. మెగా ఫ్యామిలీలో నాగబాబు ఒక్కడే తేడా. ఆయన భీమవరం నాది, నర్సాపురం నాది అంటున్నాడు..ఎలా అవుతుంది?. భీమవరంలో మురికివాడలు లేకుండా చేస్తావా?. నర్సాపురాన్ని బాగు చేస్తావా? నువ్వు వంటగదిలో నుంచి హాల్లోకి రావడానికే అరగంట పడుతుంది. అలాంటిది నువ్వు నర్సాపురం వెళ్లి సేవ చేస్తావా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. అలాగే ఈ ప్రపంచంలో తనకు చిరంజీవి తర్వాతే ఎవరైనా అని... తాను ఎప్పుడు చిరంజీవికి పెద్ద అభిమానినే అని శివాజీ రాజా తెలిపారు. -
‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి
‘‘మార్చిలో ‘మా’ ఎలక్షన్స్ జరపండి. ఏప్రిల్‌లో చార్జ్ తీసుకోండి అని బై లాలో ఉంది. ఇదే లాయర్‌కు చెప్పాను. ‘ఇన్నిరోజులు ఆగాలా? అప్పటి వరకు అతనే పదవి అనుభవిస్తాడా?’ అన్నారు. జనరల్ బాడీలో మాట్లాడుకోవాల్సిన విషయాన్ని ప్రెస్‌మీట్ పెట్టి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ప్రెస్మీట్లు పెట్టొద్దు. పని చేద్దాం. ‘మా’ను రోడ్డు మీదకు లాగకండి’’ అని శివాజీరాజా అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎలక్షన్స్‌లో నరేశ్ అధ్యక్షడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. కొత్త ప్యానెల్ ప్రమాణ స్వీకారానికి శివాజీ రాజా అడ్డుపడుతున్నారని ఓ ప్రెస్మీట్లో నరేశ్ అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శివాజీరాజా మాట్లాడుతూ – ‘‘22 ఏళ్లుగా ‘మా’లో నేను చేయని పదవి లేదు. ‘మా’ డబ్బులతో ఒక్క టీ తాగలేదు నేను. సడన్‌గా వచ్చి, ఫైల్లో ఏదో తప్పు ఉందంటారు. తప్పు చేసినట్లు ఉంటే శిక్ష అనుభవిస్తాను. గోల్డేజ్ హోమ్ అనే నా కలపై నీళ్లు చల్లారు. ఎవరూ లేని వ్యక్తి భీమవరం నుంచి ఇక్కడికి వచ్చి గోల్డేజ్హోమ్ పేరుతో బిల్డింగ్ కట్టిస్తే పేరు అంతా వీడికే వచ్చేస్తుంది అనుకున్నవారి కుట్రలో బలైపోయాను. మీరు కట్టండి. గ్రేట్ అని ఒప్పుకుంటా. ‘శివాజీ.. నువ్వు పడుతున్న కష్టం చూశాను. కేటీఆర్‌గారితో మాట్లాడి మీకు సైట్ ఇప్పిస్తా’నని 24గంటల్లో కేటీఆర్‌గారితో చిరంజీవిగారు మాట్లాడారు. ఎలక్షన్కోడ్ రావడం వల్ల అది ఆగిపోయింది. ఆ సైట్ వచ్చి ఉంటే నా కల సాకారం అయ్యేది. ప్రతి ఏడాది ‘మా’ డైరీ నేను వేస్తాను. కానీ ఈ ఏడాది నరేశ్‌గారు కమిటీ పెట్టాను. డైరీ నేను వేస్తాను అన్నారు. డైరీకి 14 లక్షల 20వేలు వచ్చిందని చెప్పారు. అకౌంట్లో 7లక్షలే పడ్డాయి. మిగతా డబ్బులు ఏమైపోయాయి? అకౌంట్స్ అప్పజెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది’’ అన్నారు. -
‘మా’ బరిలో ఉన్న అభ్యర్థులకు జీహెచ్ఎంసీ షాక్
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల బరిలో తలపడుతున్న నరేష్, శివాజీ రాజాలకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. నిబంధలకు విరుద్ధంగా ఫిలిం చాంబర్ పరిసరాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసినందుకు గాను ప్రధాన అభ్యుర్దులు శివాజీ రాజా, నరేష్లతో పాటు మరికొంత మందికి పెనాల్టీ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. పై అధికారులతో చర్చించిన తరువాత తదుపరి ఎలాంటి చర్యలు తీసుకొవాలన్న విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. శివాజీ రాజా, నరేష్ ప్యానల్లు తలపడుతున్న ఈ ఎలక్షన్ల పోలింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, నాగబాబు, ఆర్ నారాయణమూర్తి, రాజీవ్ కనకాల, జీవితా రాజశేఖర్ దంపతులు, హీరోయిన్ ప్రియమణి, యాంకర్లు ఝాన్సీ, సుమలతో పాటు 260 మంది వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభిస్తారు. 8 గంటలకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. -
ప్రారంభమైన ‘మా’ పోలింగ్
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా మారాయి. అధ్యక్ష పదవి కోసం నరేష్, శివాజీ రాజాలు పోటి పడుతున్నారు. ఈ రోజు (ఆదివారం) ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫిలిం ఛాంబర్లో పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మా లో సభ్యులుగా ఉన్న దాదాపు 800 మంది నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఛాంబర్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సారి ఎలక్షన్లు ఎన్నడూ లేనంత ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన ప్రత్యర్థులు శివాజీ రాజా, నరేష్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటంతో పోటి రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో శివాజీ రాజాకు మద్ధతు తెలిపిన మెగా ఫ్యామిలీ ఈ సారి నరేష్ ప్యానల్‌కు మద్ధతుగా నిలవటంతో ఫలితం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వెళ్లడించే అవకాశం ఉంది. -
సద్దుమణిగిన ‘ మా అసొషియేషన్’ వివాదం
-
సద్దుమణిగిన ‘మా’ వివాదం
గత కొద్ది రోజులుగా మా అసొషియేషన్‌లో వివాదాలు ఇండస్ట్రీని కుదిపేశాయి. శివాజీరాజా, నరేష్‌లు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన ఇండస్ట్రీ పెద్దలు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ విషయంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వజ ‘అన్ని సంస్థలలో ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇరు వర్గాలు ప్రెస్‌మీట్ పెట్టి తప్పు చేశారు. ఇక నుండి అన్నీ విషయాలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే చూసుకుంటుంద’న్నారు. ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన కలెక్టివ్ కమిటీలో ‘మా’లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేలిందని తెలిపారు. ఇక నుంచి మా అధ్యుక్షుడు శివాజీ రాజా, సెక్రటరీ నరేష్‌లు కలిసి పనిచేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో కలెక్టివ్ కమిటీనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందన్నారు. నరేష్ మాట్లాడుతూ.. ‘సంస్ధ లో డిఫరెంట్ ఓపినియన్స్ రావటం సహజం. కలెక్టివ్ కమిటీ ద్వారా అందరం కలుసుకొని మాట్లాడుకున్నాం. గతం గతః. రాబోయే రోజుల్లో జరిగే ఈవెంట్స్ కలిసి సక్సెస్ చేస్తాం. నేను, శివాజీ రాజా గారు సినీ పెద్దల సపోర్ట్ తో సిల్వర్ జూబ్లీ ఈవెంట్ లను సక్సెస్ చేయటానికి కృషి చేస్తాం’ అన్నారు. అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ.. చిన్న చిన్న మనస్పర్దలు వచ్చిన మాట వాస్తవమే.. కలెక్టివ్ కమిటీ ముందు అన్నీ వివరాలు ఉంచాము. ఎలాంటి అవకతవకలు లేవని తేలిందన్నారు. -
మా మద్య ఎలాంటి విభేదాలు లేవు
-
30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘కళ్లు’
గొల్లపూడి మారుతి రావు రాసిన కళ్లు నాటకం ఆధారంగా ఎం.వి.రఘు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కళ్లు’. 1988లో తెరకెక్కిన ఈ సినిమాలో శివాజీ రాజా ప్రధాన పాత్రలో నటించగా ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాదు ఈ సినిమాలో మరెన్నో విశేషాలు ఉన్నాయి. ఈ సినిమాలోని రంగుడు పాత్రకు మెగాస్టార్ చిరంజీవి గాత్రదానం చేశారు. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ ఈ సినిమాలో ‘తెల్లరిందే’ పాట కోసం గాయకుడిగా మారారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న కళ్లు సినిమా రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ.. ‘కళ్లు’ సినిమా 30 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలు కొంత మందికి అవార్డ్ లని ఇస్తాయి, కొంత మందికి గుర్తింపు ని ఇస్తాయి, మరికొంత మందికి పేరును తీసుకొస్తాయి కొన్ని చిత్రాలు మాత్రమే గుర్తిండి పోతాయి. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు అయినా చాలా అద్భుతంగా తీశారు ఎం.వి.రఘు గారు. భిక్షు గారు ద్వారా ఈ సినిమా కి డైరెక్టర్ గారికి అసిస్టెంట్ కావాలంటే నన్ను వైజాగ్ తీసుకెళ్లారు. అలా నేను కళ్లు సినిమా ద్వారా ఫస్ట్ టైం సినిమా షూటింగ్ చూశాను. నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లు గురించి మాట్లాడటమే, కానీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నేను నటించిన ‘కళ్లు’ సినిమా గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. వంశీ దర్శకత్వంలో కనకమహాలక్ష్మీ రికార్డింగ్ ట్రూప్ సినిమా అవకాశం చేజారిన బాధలో ఉన్న నాకు కళ్లు అవకాశం వరంలా దక్కింది. రఘు గారు ఈ సినిమాను చాలా నేచురల్ గా తెరకెక్కించారు. ఈ సినిమా నాకు రావడానికి కారణమైన ఇవివి గారికి రుణపడి ఉంటాను’అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ఏడిద శ్రీరామ్, అనితా చౌదరి, బెనర్జీ, భిక్షపతి, కళ్లు కిష్టారావు, సురేష్ కొండేటి పాల్గొన్నారు. -
‘వీడు అసాధ్యుడు’ షూటింగ్ ప్రారంభం
కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసెజ్ సినిమా అంటే ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి కోవకు చెందిన ఓ కొత్త సినిమా గురువారం ప్రారంభమైంది. ఫిలింనగర్లో మొదలైన సినిమాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా హాజరయ్యారు. ‘వీడు అసాధ్యుడు’ సినిమాతో మరో కొత్త హీరో టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ముహుర్తపు సన్నివేశానికి శివాజీ రాజా క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ‘ఒక కమర్షియల్ అంశానికి సోషల్ మెజేస్ జోడించి రూపొందిస్తోన్నాం. ఇందులో లవ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయి. హీరో అడ్వకేట్ గా నటించారు. హీరోయిన్ ఒక ఎన్నారై పాత్రలో నటిస్తోంది. వీరిద్దరికీ ఎలా పరిచయం అయింది. ఆ పరిచయం ఎలాంటి మలుపులకు దారి తీసిందనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందుకుంటోన్న చిత్రమ’ని దర్శకుడు పియస్ నారాయణ తెలిపారు. తాను హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని హీరో కృష్ణ సాయి కోరారు. ఈ సినిమాలో జహీదా శామ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని ఎమ్మెస్కే రాజు నిర్మించగా, శంభు ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. -
‘‘నర్తనశాల’కు మచ్చరానివ్వం’
ఛలో సక్సెస్‌తో నిర్మాతగానూ విజయం అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య త్వరలో నర్తనశాల సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నాగశౌర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యామిని, కశ్మీరా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ ‘నర్తనశాల’ ఒక క్లాసిక్. అయినా ఆ టైటిల్ ను తీసుకునే ధైర్యం చేశాం. ఆ పేరుకున్న స్థాయి తగ్గకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాం. ఇక ముందు చేయబోయే సినిమాల్లోనూ మంచి ఎంటర్టైన్మెంట్ఉండేలా ప్లాన్ చేస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి, నిర్మాత ఉషా ముల్పూరిలతో పాటు నటుడు శివాజీ రాజా, చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
శివాజీ రాజా తనయుడు హీరోగా..
నెగెటివ్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నటుడు శివాజీ రాజా. మధ్యలో హీరోగా ట్రై చేసినా.. మళ్లీ సహాయ పాత్రల్లోనే నటించారు. ప్రస్తుతం మా ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ పదవిలో యాక్టివ్‌గా ఉన్నారు. శివాజీ రాజా తనయుడు విజయ్ రాజాను హీరోగా పరిచయం చేయనున్నారు. ‘ఏదైనా జరగొచ్చు’ అంటూ డిఫరెంట్ టైటిల్‌తో రానున్న ఈ సినిమాను జూలై 11న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. -
శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేసినా మా
-
శ్రీరెడ్డికి అవకాశాలు మాత్రం ఇప్పించలేం..
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నటి శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేసినా.. అవకాశాలు మాత్రం ఇప్పించ లేదని సభ్యులు తెలిపారు. 'మా' సభ్యులు 900 మందితో శ్రీరెడ్డి నటించే స్వేచ్ఛ, అవకాశం ఆమెకు ఉందని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా పేర్కొన్నారు. ఇకనుంచి శ్రీరెడ్డి సినిమాలతో పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రముఖ రచయిత కోనవెంకట్, సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై మా బృందం స్పందించింది. కోన వెంకట్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రైటర్స్ అసోసియేషన్ ఉంది. వాళ్లు చూసుకుంటారు. సురేష్ బాబు చిన్న కుమారుడు హీరో కాదు. నిర్మాత, దర్శకుడు కూడా కాదని ఏం సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఇక్కడున్న వారంతా తెలుగువారేనని, ఇండస్ట్రీలో ఎంతో మంది తెలుగువాళ్లు అవకాశాలు దక్కించుకుని కెరీర్ కొనసాగిస్తున్నారని వివరించారు. శ్రీరెడ్డి వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ.. అప్పుడున్న సందర్భానికి గాను 'మా' కార్యవర్గం కొంత ఎమోషన్ అయ్యారని అన్నారు. ఆ సమయంలో ఆమెను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అది పద్ధతి కాదు అని శ్రీరెడ్డిని కూడా మనలో ఒకరిగా భావించి ముందుకెళ్లాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. దీంతో ఆమెపై బ్యాన్‌ను ఎత్తివేస్తూ తాజాగా నిర్ణయించాం. ఇలాంటి వివాదాలు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు, కాస్ట్ కౌచింగ్ లేకుండా చూసేందుకు కమిటీ అగైనెస్ట్ సెక్యువల్ హెరాస్మెంట్ (క్యాష్)ను ఏర్పాటు చేశాం. ఇందులో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో పాటు బయటి వాళ్లు కూడా ఉండేలా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ తనతో అసభ్యంగా చాటింగ్ చేసేవారంటూ మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను శ్రీరెడ్డి ఇటీవల పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కోన వెంకట్ ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టి అసలైన నిందితులను శిక్షించాలి. లీగల్ యాక్షన్ తీసుకోవాలి. చీప్ పబ్లిసిటీ కోసం సినిమా పరిశ్రమను, సినీ ప్రముఖులను వాడుకుంటున్నందుకు జాలేస్తోంది. తెలుగు నటీనటులకు నేనూ మద్దతిస్తాను. కానీ ఈ ఆరోపణలు మాత్రం సహించలేనంటూ’ కోన వెంకట్ ట్వీట్ ద్వారా స్పందించిన విషయం తెలిసిందే. -
వెనక్కి తగ్గిన ‘మా’.. శ్రీరెడ్డికి ఊరట
సాక్షి, హైదరాబాద్ : నటి శ్రీరెడ్డి విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వెనక్కి తగ్గింది. శ్రీరెడ్డిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మా బృందం తెలిపింది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్లో 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా తన బృందంతో కలిసి మీడియాతో మాట్లాడారు. సినీ ఇండస్ట్రీలో అవకాశాల పేరిట వేధింపులు జరుగుతున్నాయంటూ అర్ధనగ్న నిరసన తెలపడంతో శ్రీరెడ్డికి 'మా' సభ్యత్వం నిరాకరించడంతో ఆమెపై నిషేధం విధించారు. అనంతరం శ్రీరెడ్డి చేసిన పోరాటానికి మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో పాటు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి మెమోరాండం ఇచ్చిన విషయం తెలిసిందే. 'మా' అధ్యక్షుడు శివాజీరాజా మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు, మాటలు, చర్యలతో కేవలం 'మా' మాత్రమే కాదు, ఎంతో మంది ఆర్టిస్టులు మనస్తాపానికి లోనయ్యారు. అందుకే ఆమెపై బ్యాన్ నిర్ణయాన్ని తీసుకున్నాం. అయితే ఆమెపై విధించిన బ్యాన్‌ను ఎత్తివేయాలని, నిషేధంపై పున:పరిశీలించాలని 'మా' సభ్యులు కోరడంతో ఆమెపై నిషేధం ఎత్తివేస్తున్నాం. టాలీవుడ్లో కమిటీ అగైనెస్ట్ సెక్యువల్ హెరాస్మెంట్ (క్యాష్) కమిటీని ఏర్పాటు చేశాం. ఆమెను మేం ఆహ్వానిస్తున్నాం. ఎవ్వరితోనైనా ఆమె నటించొచ్చు. నిర్మాతలు, దర్శకులు ఆఫర్లు ఇస్తే ఆమె ఏ సినిమాలోనైనా నటించే స్వేచ్ఛ ఆమెకు ఉంది. శ్రీరెడ్డితో రెండు సినిమాలు చేస్తానని తేజ హామీ ఇచ్చారంటూ' వివరించారు. తమ్మారెడ్డి భరద్వాజ, సీనియర్ నటుడు నరేశ్, 'మా' కార్యవర్గ సభ్యులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
శ్రీరెడ్డి అప్లికేషన్‌ను తిరస్కరిస్తున్నాం
-
శ్రీరెడ్డికి మెంబర్షిప్ ఇవ్వం : ‘మా’
ఫిలిం ఛాంబర్‌పై ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి పై చర్యలు తీసుకునేందుకు మా అసోషియేషన్ రెడీ అవుతోంది. నిన్న(శనివారం) జరిగిన సంఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన మా అధ్యక్షుడు శివాజీ రాజా.. వివాదం చేస్తే కార్డ్ వస్తుందని భావించటం తప్పన్నారు. ‘ఇప్పటికే శ్రీరెడ్డిని మా అసోషియేషన్‌లోకి ఆహ్వానిస్తూ అప్లికేషన్ ఫాం ఇచ్చాం. కానీ ఆమె పూర్తి వివరాలు ఇవ్వలేదు. పైగా మా సభ్యులపై ఆరోపణలు చేస్తోంది. ఇది సరికాదు. శ్రీరెడ్డిపై లీగల్ చర్యలు తీసుకుంటాం. శ్రీరెడ్డి అప్లికేషన్‌ను తిరస్కరిస్తున్నాం. మా సభ్యులెవరు ఆమెతో కలిసి నటించరు. ఒక వేళ ఎవరైనా నటిస్తే వారిని కూడా సస్పెండ్ చేస్తా’మని మా సభ్యులు వెల్లడించారు. మా అసోషియేషన్‌కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా మద్ధతు తెలిపింది. -
ప్రత్యేక హోదాకు ‘మా’ మద్దతు: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ఢిల్లీ వేదికగా పోరాటం కొనసాగుతోంది. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇదివరకే పలు కార్యక్రమాలు రూపొందించిన ప్రత్యేక హోదా సాధన సమితి తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మద్దతు కోరింది. ఆదివారం మా అధ్యక్షుడు శివాజీ రాజా సహా కార్యవర్గాన్ని సీసీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నెలకొన్న పరిస్థితులను మా బృందానికి వివరించాం. ప్రత్యేక హోదా ఉద్యమానికి అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారని రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమ సెగ ఢిల్లీని తాకిందని, మలిదశ ఉద్యమం ఉప్పెనలా ఉంటుందని సీపీఐ స్పష్టం చేసింది. -
కన్నీళ్లు పెట్టిన శివాజీరాజా
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో మరణించిన హాస్యనటుడు గుండు హనుమంతరావుకు పలువురు తెలుగు సినిమా ప్రముఖులు నివాళి అర్పించారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మురళీమోహన్, శిరాజీరాజా, కాదంబరి కిరణ్ తదితరులు గుండు హనుమంతరావు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీరాజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు సన్నిహితుడైన గుండు హనుమంతరావు మరణం కలిచివేసిందన్నారు. ‘అమృతం ధారావాహిక మా ఇద్దరికి చాలా ప్రత్యేకం. చెన్నై నుంచి మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో హనుమంతరావు ఇవ్వని ప్రదర్శన లేదు. మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఆయన కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటుంద’ని శివాజీరాజా అన్నారు. మంచి వ్యక్తి: మోహన్‌బాబు గుండు హనుమంతరావు మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి అని సీనియర్ నటుడు మోహన్‌బాబు పేర్కొన్నారు.. ‘గుండు హనుమంతరావు ఆత్మకి శాంతి కలగాలి. మా నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మించిన చాలా సినిమాల్లో నటించాడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్ధుడు. అలాంటి వ్యక్తి నేడు మనల్ని భౌతికంగా విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని ఆ షిరిడి సాయినాథుడిని వేడుకొంటున్నాన’ని మోహన్‌బాబు అన్నారు. -
పాపారావుగారి వ్యాఖ్యలు బాధాకరం : శివాజీ రాజా
కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి ఇటీవల మోహన్ బాబుకు విశ్వ నట సార్వభౌమ బిరుదును ప్రధానం చేస్తూ సన్మానించిన సంగతి తెలిసిందే. కాకతీయ కళావైభవోత్సవాలు పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ సన్మానం చేయటాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కు చెందిన పాపారావు తప్పుపట్టారు. ఈ విషయంపై ఆర్టిస్టు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా స్పందించారు. ‘సినిమా, సమాజం ఎప్పుడూ వేరు వేరు కాదు. ప్రజలతో మమేకమైన కళ సినిమా.. సినిమా కళాకారులు తొలినాళ్ల నుండి ప్రజల పట్ల స్పందిస్తూ సహాయమందించడం తెలియని విషయం కాదు. అలాంటి గొప్ప సినిమా రంగానికి సంబంధించిన సినీ నిర్మాత డా॥టి. సుబ్బిరామిరెడ్డిగారు సినిమా నటీనటులని సన్మానించే భాగంలో తొలుతగా డా॥మోహన్‌బాబు గారిని సన్మానించారు. ఇంకా ఎన్నో చోట్ల ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి. ఈ సమయంలో శ్రీ పాపారావుగారు ‘సినిమా నటీనటులను సన్మానించకూడదు’ అని వ్యాఖ్యానిస్తూ హెచ్చరించడం బాధాకరం. ఒకవైపు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్రావుగారు తెలుగు భాషకి మరింత గౌరవాన్ని తెచ్చే విధంగా ‘ప్రపంచ తెలుగు మహా సభలు’ జరిపి తనదైన ఔన్నత్యాన్ని చాటి భాషకు ఎల్లలు లేవు. కళకు సరిహద్దులు, భాషా బేధం లేదు అన్న రీతిలో తెలుగు సినీ నటీనటులను ఆహ్వనించి ఎంతో గొప్పగా ఘనంగా సన్మానించారు. శ్రీ కె.టి.ఆర్ గారు కూడా ప్రతీ నటిని, నటున్ని పేరు పేరున పలకరిస్తూ తనదైన అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్‌గారు కూడా సినీ పరిశ్రమ పట్ల, నటీనటుల పట్ల తనదైన స్నేహభావాన్ని ప్రకటిస్తూ.. ఏ సహాయానికైనా వెనుకాడకుండా ఆదరిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలుగు సినిమా నటుడు శ్రీ గుండు హన్మంతరావు అనారోగ్య పరిస్థితులు తెలుసుకుని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 5లక్షల రూపాయలు అందించారు కె.టి.ఆర్ గారు. సినిమా నటీనటుల పట్ల తనదైన గౌరవాన్ని చాటుకున్న శ్రీ కె.సి.ఆర్ గారి పరిపాలనకి కృతజ్ఞతలు. ఇలాంటి సమయంలో శ్రీ పాపారావుగారు ‘సినిమా నటీనటులను సన్మానించకూడదు’ అని హెచ్చరించడం ఎంత వరకు సబబు అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం.. ఇలాంటి వ్యాఖ్యలను ప్రభుత్వం కూడా సమర్థించదని అనుకుంటున్నాం’. అంటూ పాపారావు వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
శివాజీ రాజాతో సరదాగా కాసేపు
-
'సినిమా వాళ్లు అద్దాల మేడల్లో ఉంటారు'
మా (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు మా అధ్యక్షుడు శివాజీ రాజా పలు నిర్ణయాలను ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన కళాకారులను ఆదుకునేందుకు మా అసోషియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. త్వరలో మా ఆధ్వర్యంలో నిర్మించనున్న వృద్ధాశ్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్ వీ కృష్ణరెడ్డిగారిని చైర్మన్ గా నియమించినట్టుగా ప్రకటించారు. లక్షలు సంపాదిస్తూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ మెంబర్ షిప్ తీసుకొనివారిపై కఠిన చర్యలుంటాయని తెలిపారు. అయితే పేద కళాకరుల విషయంలో మాత్రం మెంబర్ షిప్ తీసుకోక పోయినా పరవాలేదన్నారు. ఇటీవల మరణించిన ప్రొడక్షన్ మేనేజర్ చిరంజీవి కుటుంబానికి మా అసోషియేషన్ తరుపున 6 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. పేద కళాకారుల కోసం మా అధ్యక్షుడు శివాజీ రాజా 25 వేల రూపాయలను మా అసోషియేషన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మురళీమోహన్ మాట్లాడుతూ ' సినిమా వాళ్లు అద్దాల మేడల్లో ఉంటారు. అది ఒక్క రాయి వేస్తే పగిలిపోతుంది. మీడియా సినిమా వాళ్ల విషయంలో అత్యుత్సాహం చూపిస్తోంది. ఏ సంఘటన జరిగినా సినిమా వాళ్లు అంటే ఒకటికి పదిసార్తు చూపిస్తున్నారు. ఇది సరైంది కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్య ఒక వెబ్ సైట్ లో సినీ ప్రముఖుల గురించి అభ్యంతరకరంగా రాస్తున్నారు. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నా'మన్నారు. మా అసోషియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకను బాహుబలి వేడుక కన్నా ఘనంగా నిర్వహిద్దామన్నారు. ఈ వేడుకలో తెలుగు సినీ కళాకారులంతా పాల్గొంటారన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రన్న బీమా, కేసీఆర్ బీమా పేరుతో కళాకారులకు పాలసీలు ఇవ్వబోతున్నారని తెలిపారు. ఆ పాలసీల కోసం రూ. 15 నామినల్ ఫీజు కట్టాలని తెలిపారు. -
వర్మ మాటలు పట్టించుకోవద్దు: శివాజీరాజా
హైదరాబాద్: టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా మండిపడ్డారు. ఇండస్ట్రీకి వర్మ చేసిందేం లేదని, వర్మ చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. శివాజీరాజాను 'సాక్షి' ఫోన్లో సంప్రదించగా ఆయన మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ముందుకొచ్చి వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ కేసుకు ఒరిగేదేం లేదు. ఈ కేసులో నోటీసులు అందుకున్న సెలబ్రిటీలకు, విచారణ చేపట్టిన అధికారులకు మాత్రమే అన్ని విషయాలు తెలుసు. సిట్ విచారణ ద్వారా త్వరలోనే నిజనిజాలు వెల్లడవుతాయి. ఈ కేసుపై ఇండస్ట్రీ వారితో పాటు బయటివారు ఏం మాట్లాడినా అబద్దాలు నిజాలు కావు. నిర్దోషులుగా ఉన్న వ్యక్తులను దోషులుగా నిరూపించడం ఎవరికీ సాధ్యం కాదని' చెప్పారు. ఇండస్ట్రీకి చెందిన మరికొందరికి నోటీసులు అందే అవకాశం ఉందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఆ విషయం విచారణ కొనసాగిస్తున్న అకున్ సబర్వాల్ మాత్రమే చెప్పగలరని ఆయన బదులిచ్చారు. టాలీవుడ్ సెలబ్రిటీలను విచారిస్తున్నట్లుగానే డ్రగ్స్ కేసులో స్కూలు, కాలేజీ విద్యార్థులను విచారిస్తారా అని వర్మ ప్రశ్నించడంపై మా అధ్యక్షుడు శివాజీరాజా పై విధంగా స్పందించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌ను మీడియా అమరేంద్ర బాహుబలిలా చూపిస్తుందని, ఆయనతో రాజమౌళి బాహుబలి-3 తీస్తారేమోనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సామాన్యుడి ప్రతీ పనిలో సినిమా వాళ్లు కావాలి, అలాగే విమర్శించడానికి వాళ్లు వేసే నిందలను బరించడానికి కూడా సినిమావాళ్లే కావాలంటూ ప్రముఖ రచయిత సిరాశ్రీ ఇటీవల పోస్ట్ చేసిన కవితను దర్శకుడు వర్మ మళ్లీ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
కొందరికి నోటీసులు రావడం నిజమే : మా అధ్యక్షుడు
తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. 15 మందికి పైగా సినీ సెలబ్రిటీలకు నోటీసులు అందాయన్న వార్తతో ఇండస్ట్రీ ఎలర్ట్ అయ్యింది. అయితే నోటీసులు వచ్చిన వారితో పాటు కొంత మంది నోటీసులు రానివారి పేర్లు కూడా మీడియాలో వినిపిస్తుండటంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన మా అధ్యక్షుడు శివాజీ రాజా, ఇండస్ట్రీలో కొంతమందికి నోటీసులు రావటం వాస్తవమే, అయితే నోటీసులు రాని వారి పేర్లు కూడా మీడియాలో వినిపిస్తుండటం బాధాకరం అన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించడంలో తప్పులేదు, కానీ చేయని వారిని నిధించటం సరికాదు, నోటీసులు అందిన వారి పేర్లను వేసే విషయంలో మీడియా సంయమనం పాటించాలని కోరారు శివాజీ రాజా. -
మా అధ్యక్షుడిగా శివాజీరాజా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈసారి ప్రశాంతంగా జరిగాయి. గత కమిటీ ఎంపిక విషయంలో రెండేళ్ల క్రితం జరిగిన రసాభాస గుర్తుండే ఉంటుంది. ఈసారి నూతన కమిటీ ఎంపిక సానుకూల వాతావరణంలో జరిగింది. ‘మా’ అధ్యక్షుడిగా నటుడు శివాజీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎమ్.వి బెనర్జీ, కె.వేణుమాధవ్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎమ్.శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా ‘సీనియర్’ నరేశ్, సంయుక్త కార్యదర్శులుగా హేమ, ఎ.శ్రీరామ్ ఎన్నికైయ్యారు. కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ‘‘మా’ సభ్యులు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం. ‘మా’ 25 ఏళ్ల ఉత్సవాన్ని వైభవంగా జరపాలనుకుంటున్నాం. కళాకారుల శ్రేయస్సు కోసం వంద శాతం కృషి చేస్తాం’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ‘‘దాసరి నారాయణరావుగారి కృషితో ఈసారి ‘మా’ ఎన్నికలు పోటీ లేకుండా జరిగాయి’’ అని ‘సీనియర్’ నరేశ్ అన్నారు. ఈ కార్యవర్గం పదవీకాలం రెండేళ్లు కొసాగుతుంది. -
'మా' అధ్యక్షుడిగా శివాజీరాజా
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా శివాజీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన 'మా' ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కొత్త కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హీరో శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరేశ్ ఎన్నికయ్యారు. సినిమా పరిశ్రమ పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు కృషితో ఈసారి పోటీ లేకుండా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని నరేశ్ ఇంతకుముందు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొత్త కమిటీ అధ్యక్షుడిగా శివాజీరాజా పేరును 'మా' కమిటీ, ఈసీ మెంబర్లు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. దీనికి 'మా' సభ్యులు, సలహాదారులు అంగీకరించారు. శివాజీరాజా మాట్లాడుతూ ఎన్నికల్లో మేము 10శాతం హామీలిచ్చాం. కానీ కళాకారుల శ్రేయస్సు కోసం 100శాతం కృషి చేశామన్నారు. గత ఎన్నికల్లో 'మా' రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ పై జయసుధ పోటీకి దిగడంతో 'మా' ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. చివరకు రాజేంద్రప్రసాద్ ప్యానల్ విజయం సాధించింది. -
మా పేద కళాకారులకు పింఛన్
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’(మా) లోని పేద కళాకారులకు పింఛన్ ఇచ్చేందుకు, ‘మా’ సొంత భవనం ఏర్పాటుకు, పేద కళాకారులకు ఇళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ‘మా’ సభ్యులను సీఎం కేసీఆర్‌తో మాట్లాడిస్తా’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఇటీవల ‘మా’ అధ్యక్షులుగా శివాజీరాజా, జనరల్ సెక్రటరీగా నరేశ్‌లను ‘మా’ సభ్యులు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. శుక్రవారం తలసానిని కలిసి, అభినందనలు అందుకున్నా రు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరి నారాయణ రావుని శివాజీరాజా, నరేశ్, సురేష్ కొండేటిలు పరామర్శించారు. ‘మా’ అధ్యక్షుడిగా శివాజీరాజా, జనరల్ సెక్రటరీగా నరేశ్‌లను ముందు ప్రతిపాదించింది దాసరి నారాయణరావే. ఆయన దగ్గర ఈ ఇద్దరూ ఆశీస్సులు తీసుకున్నారు. -
వరద బాధితులకు ‘మా’ చేయూత
-
'ఈ దుస్థితి రావడం మా ఖర్మ'
-
'ఈ దుస్థితి రావడం మా ఖర్మ'
తాను జీవితంలో ఎప్పుడూ అబద్ధాలు ఆడబోనని, ముక్కుసూటిగానే వెళ్తానని, ఎవరి బెదిరింపులకూ లొంగేది లేదని రాజేంద్రప్రసాద్ ప్యానల్లో ఉన్న నటుడు శివాజీ రాజా చెప్పారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయనతో పాటు ఉత్తేజ్ కూడా రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ నుంచి తప్పుకొన్నారని, అందువల్ల ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థులు లేక రాజేంద్రప్రసాద్ తల పట్టుకున్నారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శివాజీరాజా మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ''నేను మురళీమోహన్ దగ్గర 14 సంవత్సరాలు, మోహన్ బాబు దగ్గర 2 ఏళ్లు సెక్రటరీగా చేశాను. మోహన్ బాబు దగ్గర చేసినప్పుడు కోటికి పైగా వసూళ్లు రావాల్సినప్పుడు పగలు, రాత్రి ఎంతో కష్టపడ్డాను. ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అయినా నాకు తృప్తి లేదు. ఈసారి తామంతా తప్పుకొని, కొత్తవాళ్లకు ఇద్దామని మురళీమోహన్ గారే చెప్పారు. అలాంటిది ఇప్పుడు మాకు ఈ స్థితి రావడం మా ఖర్మ. రాజేంద్రప్రసాద్ విషయానికొస్తే.. ఆయన అందరూ బాగుండాలని కోరుకుంటారు. ప్రెసిడెంటుగా పోటీకి ఎవరూ రాకపోవడంతో మేమే వెళ్లి ఆయనను పోటీ చేయాలని అడిగాం. దేవుడిదగ్గర ఓ గుడిలో లైన్లో ఉన్నప్పుడు.. ఆయన దగ్గర ఈ ప్రస్తావన వస్తే అప్పుడు ఆయనకు సూచించాను. ఏదో చేద్దామన్న తపన తప్ప.. మాకెవరికీ ఏమీ లేదు. రాజేంద్ర ఏదో చేద్దామని మంచితనంగా ముందుకొచ్చాడు.. అందుకే ఆయనకు మేమంతా మద్దతుగానే ఉన్నాం.'' -
అరు కథల్ని నడిపించే ఏడో కథ
రవిబాబు, అర్చన, వినోద్‌కుమార్, భానుశ్రీమెహ్రా, శివాజీరాజా ప్రధాన పాత్రధారులుగా, ప్రభాకరన్ దర్శకత్వంలో ఆర్.పద్మజ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా, బి.గోపాల్ క్లాప్ ఇచ్చారు. భీమినేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహిం చారు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. ‘‘భిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులోని ఆరు కథలను ఏడో కథ ముందుకు నడిపిస్తుంది. చక్కని థ్రిల్లర్. పాటలు ఉండవు. శుక్రవారం నుంచి షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు తెలిపారు. అభినయానికి ఆస్కారమున్న పాత్ర పోషిస్తున్నానని అర్చన చెప్పారు. ఓ టిపికల్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి దర్శకుడే నిజమైన హీరో అని ఉత్తేజ్ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: పార్వతీచంద్, కెమెరా: ఉదయభాస్కర్ జాస్తి, సంగీతం: తారక రామారావు. -
శివాజీ రాజా కూతురు పెళ్లి వేడుక
-
రివాల్వర్ కోసం...
విశాఖ ఏజన్సీ ప్రాంతంలో అందరికీ ఇష్టుడైన కానిస్టేబుల్ పాపారావు. మంచితనంతో ఎస్.ఐగా ప్రమోషన్ కూడా సాధించాడు. అయితే.. అనుకోకుండా తన సర్వీస్ రివాల్వర్ మిస్ అయ్యింది. తిరిగి దాన్ని దక్కించుకోవడానికి తను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘పోలీస్ పాపారావు’. శివాజీరాజా హీరో. నిర్దేష్ నెర్స్ దర్శకుడు. సునీత శ్రీనివాసరావు బొమ్మి నిర్మాత. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ-‘‘ఇప్పుడొస్తున్న చిత్రాలకు భిన్నమైన సినిమా ఇది. ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుంది. అంతర్లీనంగా సందేశమూ ఉంటుంది. అమాయకత్వం, అంకితభావం, ప్రేమ.. ఇత్యాది అంశాల మేళవింపైన పాత్రను శివాజీరాజా పోషించారు. అరకులోని అందమైన ప్రాంతాల్లో తెరకెక్కించాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తారకరామారావు పడాల, కెమెరా: చంద్రశేఖర్, పాటలు: రాజు తప్పెట. -
సినిమా ఫీల్డ్ అనేది మాయ: శివాజీరాజా
హైదరాబాద్: సినిమా ఫీల్డ్ అనేది మాయ అని నటుడు శివాజీరాజా అన్నారు. సినిమా పరిశ్రమలో అన్ని ఉన్నాయనుకుంటారని, కానీ ఏమీ ఉండవని వెల్లడించారు. సినిమా నటులకు డిప్రెషన్ సహజమని పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలవుతాయని, ఈ సమయంలో కొంత మందికి ఆనందం.. మరికొంత మందికి నిరాశ కలుగుతాయని చెప్పారు. ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి నివాళి అర్పించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకుని ఉదయ్ కిరణ్ 100 శాతం తప్పు చేశాడని శివాజీరాజా అన్నారు. కెరీరెలో ఎంతో సాధించిన అతడు ఇలా చేయడం తనకు చాలా బాధ కలిగించిందని పేర్కొన్నారు. యువతకు సందేశాలిచ్చిన సినిమాల్లో నటించిన అతడు ప్రాణాలు తీసుకోవడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. దయచేసి ఎవరూ ఇలా చేయొద్దని కోరారు. మన కష్టాలు, సుఖాలు పంచుకునే మంచి స్నేహితులను సంపాదించుకుంటే ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడాల్సిన రాదన్నారు. -
మనోగళం: వచ్చే జన్మలో ఆవిడలా పుట్టాలి!
ఎదుటివాళ్లు మీ గురించి తప్పుగా అనుకునేది? నా పని నేను చేసుకుపోతాను తప్ప ఎవరి జోలికీ పోను. పైగా ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేస్తాను. దాంతో కొందరు నాకు పొగరనుకుంటారు. అది నిజం కాదు. నాతో స్నేహం చేసిన వాళ్లను అడిగితే తెలుస్తుంది, నేనేంటో. ఒక్కసారి నాతో స్నేహం చేస్తే, నన్ను వదిలిపెట్టలేరు. ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది! నచ్చేది నిజాయితీ, పాజిటివ్ థింకింగ్. నచ్చనిది... మన ముందు మంచిగా మాట్లాడి, అటు వెళ్లగానే చెడుగా మాట్లాడే గుణం. అలాంటి వాళ్లను అస్సలు భరించలేను. మీలో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది ముక్కుసూటితనం. నచ్చనిది షార్ట్ టెంపర్. మీ ఊతపదం? ఆయ్, ఏమ్మా, అయ్యబాబోయ్... మద్రాస్ వెళ్లినా, హైదరాబాద్ వచ్చి సెటిలైనా... ఇవి నన్ను వదలడం లేదు. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? నా భార్య అరుణ. చాలా సౌమ్యంగా ఉంటుంది. నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అంటూ ఆరాలు తీయదు. తన బాధ్యతలు తను సెలైంట్‌గా నెరవేరుస్తుంది. ఇలాక్కూడా ఉండవచ్చా అనిపిస్తుంది నాకు. చాలా ఇన్స్పైర్ అవుతుంటాను తనని చూసి. అత్యంత సంతోషపడిన సందర్భం? నా మొదటి సినిమా ‘కళ్లు’ ప్రివ్యూ చూడటం నా జీవితంలోనే గొప్ప సందర్భం. నన్ను నేను తెరమీద చూసుకున్నప్పుడు పడిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. మీ హృదయం గాయపడిన సందర్భం? ఎందుకో తెలీదు కానీ... నా అనుకున్న వాళ్లు ఒకరితో ఎప్పుడు మాట్లాడినా సంభాషణ డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది నా మనసును గాయపరుస్తూ ఉంటుంది. ఆకలి విలువ తెలిసిన క్షణం? కెరీర్ ప్రారంభంలో మద్రాస్‌లో ఉన్నప్పుడు ఆకలంటే ఏంటో తెలిసింది. అలాగని మరీ ఎక్కువ కష్టమేమీ పడలేదు. ఓసారి వారం పాటు వర్షం పడుతూనే ఉంది. మెస్ చాలా దూరం. వెళ్దామంటే జేబులో డబ్బుల్లేవు. రెండు మూడు రోజులు చాలా అవస్థ పడ్డాను. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? తెలిసి నేనెవరినీ బాధపెట్టలేదు. కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందనుకోను. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? పొద్దున్నే ఐదున్నరకు లేస్తాను. వాకింగుకి వెళ్దామని ట్రాక్ సూట్, షూస్ వేసుకుని రెడీ అయిపోతాను. తలుపు తీసి బయటకొస్తాను. పేపర్ కోసం చూస్తాను. అప్పటికింకా రాదు. ఏడున్నర వరకూ రాదని కూడా తెలుసు. అయినా పేపర్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంటాను. పేపర్ వచ్చాక చదువుతాను. మళ్లీ లోనికి వెళ్లి ట్రాక్‌సూట్, షూస్ తీసేసి పడుకుంటాను. అంత గొప్పగా ఉంటుంది నా వ్యాయామం! మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం ఏమిటి? ప్రేమతో చేతులు కట్టేయడమంటారే... ఆ పరిస్థితి చాలా భయంగా ఉంటుంది. అటు నో అనలేం. ఇటు తేలిగ్గా ఎస్ అనీ అనలేం. అలాంటి ప్రేమకి తప్ప దేనికీ భయపడను. ఎలాంటి సమయాల్లో అబద్ధాలాడతారు? సాధారణంగా అబద్ధాలు చెప్పను, ఎవరినీ బాధపెట్టను. కానీ నా ఫ్రెండ్స్‌ని ఏడిపించడానికి ప్రాక్టికల్ జోక్స్ బాగా వేస్తాను. అవే నా అబద్ధాలు! మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి? ‘ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న’ అన్న మదర్ థెరిసా మాటలే నేను నమ్మే సిద్ధాంతం. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? వంద దేశాలు తిరగాలన్నది నా కల. ఓ అరవై తిరిగేశాను. ఇంకా నలభై ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయాలి. ఎలాంటి వాటికి ఖర్చు చేస్తారు? ఉపయోగం లేని వాటికి! అవసరం లేకపోయినా కంటికి నచ్చినదాన్ని కొనేస్తాను. అలా కొన్నవాటితో ఇంట్లోనే ఓ చిన్న మ్యూజియం పెట్టాను. (నవ్వుతూ) అందుకే నేనెక్కడికైనా వెళ్తుంటే మా ఆవిడ అంటుంది... దయచేసి శంఖాలు, ఫొటోఫ్రేముల్లాంటి అనవసర వస్తువులు కొనుక్కురాకండి అని. దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక అలాంటి శక్తి వస్తే... తెలుగువారంతా ఒక్కటిగా ఉండేలా చేస్తాను! ఎలాంటి ముగింపును కోరుకుంటారు? ఎవరికీ ఒక్క పైసా కూడా బాకీ ఉండకూడదు. ఎవరూ నన్ను తిట్టుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లోనే నేను పోవాలి. మరో విషయం... (నవ్వుతూ) నాకో ఇద్దరు శత్రువులు ఉన్నారు. నాతోపాటు వాళ్లను కూడా తీసుకునే పోవాలి. అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? మంచి మనిషిగా! (నవ్వుతూ) అది అసాధ్యమని తెలుసనుకోండి. అయినా అదే నా కోరిక! మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? మదర్ థెరిసా పుట్టిన ఊరిలో, మదర్ థెరిసాలాగే పుట్టాలి. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ బతికిందా దేవత. అంతకన్నా గొప్ప జన్మ ఏదైనా ఉంటుందా! - సమీర నేలపూడి