Naga Shaurya Naratanasala First Look Launch
Sakshi News home page

Published Sat, Jul 21 2018 11:41 AM | Last Updated on Sat, Jul 21 2018 11:43 AM

Nnaga Shaurya Naratanasala First Look Launch - Sakshi

ఛలో సక్సెస్‌తో నిర్మాతగానూ విజయం అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య త్వరలో నర్తనశాల సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నాగశౌర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యామిని, కశ్మీరా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను అభిమానుల సమక్షంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌ ‘నర్తనశాల’ ఒక క్లాసిక్‌. అయినా ఆ టైటిల్ ను తీసుకునే ధైర్యం చేశాం. ఆ పేరుకున్న స్థాయి తగ్గకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాం. ఇక ముందు చేయబోయే సినిమాల్లోనూ మంచి ఎంటర్‌టైన్మెంట్‌ఉండేలా ప్లాన్‌ చేస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్‌ చక్రవర్తి, నిర్మాత ఉషా ముల్పూరిలతో పాటు నటుడు శివాజీ రాజా, చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement