nartanashala
-
బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల
నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో గతంలో ప్రారంభమైన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’. ఈ సినిమాలో అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు. ఈ చిత్రంలోని దాదాపు 17 నిముషాల సన్నివేశాలను శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఎన్బీకే థియేటర్లో ఈ నెల 24న తిలకించే అవకాశం కల్పిస్తున్నారు బాలకృష్ణ. ఈ చిత్రంలో బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నాం. మరో పౌరాణిక పాత్రలో బాలయ్యని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
బాలకృష్ణ, సౌందర్య నటించిన నర్తనశాల రిలీజ్
నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకత్వం వహించాలనుకున్న 'నర్తనశాల' సినిమా మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జునిడిగా బాలయ్య నటించగా, భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు. ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది. కేవలం ఈ సినిమాను 17 నిమిషాల పాటు చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించింది. దాంతో సినిమా షూటింగ్‌ను బాలకృష్ణ పక్కన పెట్టేశారు. అయితే అభిమానుల కోరిక మేరకు 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బుధవారం 12.30 గంటలకు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో అర్జునుడు, కృష్ణుడు, ధుర్యోధనుడిగా బాలయ్య త్రిపాత్రాభినయం చేయాలనుకున్నారు. అయితే అనుకోని విధంగా ఏప్రిల్ 17, 2004న ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వెళుతూ నటి సౌందర్య ప్రమాదానికి గురై చనిపోయింది. ఆ ప్రమాదంలోనే ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా సజీవ దహనమయ్యిన విషయం తెలిసిందే. దీంతో నర్తశాల మరుగున పడిపోయింది. తాజాగా ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఇన్నాళ్లకు ఓటీటీ ద్వారా చిత్రంలోని కొన్ని సన్నివేశాలను విడుదల చేయబోతున్నారు. చదవండి: ‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు! -
‘@నర్తనశాల’ మూవీ రివ్యూ
టైటిల్ : @నర్తనశాల జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : నాగశౌర్య, కశ్మీరా, యామినీ భాస్కర్, శివాజీ రాజా, అజయ్, జయప్రకాష్ రెడ్డి సంగీతం : మహతి స్వర సాగర్ దర్శకత్వం : శ్రీనివాస చక్రవర్తి నిర్మాత : ఉషా ముల్పూరి ఛలో సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత అమ్మమ్మగారిళ్లు, కణం లాంటి సినిమాలతో కాస్త తడబడ్డాడు. అయితే ఆ సినిమాల ప్రభావం నాగశౌర్య కెరీర్ మీద పెద్దగా కనిపించలేదు. అందుకే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘@నర్తనశాల’ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. నాగశౌర్య డిఫరెంట్ రోల్లో కనిపించిన @నర్తనశాల ఈ యంగ్ హీరో ఖాతాలో మరో సూపర్ హిట్‌గా నిలిచిందా..? కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి గే కామెడీతో ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ ; కళామందిర్ కల్యాణ్ (శివాజీ రాజా).. ఓ కూతుర్ని కని తన తండ్రి చేతిలో పెట్టాలని కలలు కంటుంటాడు. కల్యాణ్ తండ్రి చనిపోయిన తన భార్య మనవరాలిగా తిరిగి తన ఇంట్లోనే పుడుతుందన్న నమ్మకంతో ఉంటాడు. కానీ కల్యాణ్ భార్య(ప్రియ) మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఈ విషయం తెలిస్తే తండ్రి గుండె ఆగిపోతుందని అబ్బాయినే అమ్మాయిగా తండ్రిని నమ్మిస్తాడు కల్యాణ్. కొడుకును కూతురిలాగే పెంచి పెద్ద చేస్తుంటాడు. ఓ బుడబుక్కల వాడితో సరదాగా మా అమ్మాయికి ఎలాంటి మొగుడు వస్తాడో చెప్పాలని అడిగిన కల్యాణ్‌కు అనుకొని సమాధానం ఎదురవుతుంది. ఆ బుడబుక్కల వాడు అబ్బాయిని అమ్మాయిగా చూపించి మోసం చేస్తున్నావు.. నిజంగానే ఈ అబ్బాయికి తోడుగా అబ్బాయే వస్తాడు అని చెప్పి వెళ్లిపోతాడు. పెరిగి పెద్దవాడైన కల్యాణ్.. కొడుకు (నాగశౌర్య) అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఓ క్లబ్‌ను నిర్వహిస్తుంటాడు. ఆడపిల్లకు ఏ సమస్య వచ్చినా తానే ముందుండి పరిష్కరిస్తుంటాడు. అలా ఓ సమస్య నుంచి మానస (కశ్మీర)ను రక్షించి ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ కల్యాణ్ చేసిన ఓ తింగరి పని వల్ల నాగశౌర్య.. దందాలు చేసే జయప్రకాష్ రెడ్డి కూతురు సత్య(యామినీ భాస్కర్)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి నాగశౌర్య ఎలా బయటపడ్డాడు.? నాగశౌర్య కు గే లా నటించాల్సి అవసరం ఎందుకు వచ్చింది..? బుడబుక్కల వాడు చెప్పిందే నిజమైందా.? చివరకు నాగశౌర్య, మానసలు ఎలా ఒక్కటయ్యారు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఛలో సినిమాతో సూపర్ హిట్ సాధించిన నాగశౌర్య అదే కాన్ఫిడెన్స్ తో మరోసారి తన సొంత నిర్మాణ సంస్థలో @నర్తనశాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగానే కాక నిర్మాతగానూ బాధ్యతగా వ్యవహరించాడు. హీరోయిజంతో పాటు గే కామెడీ కూడా బాగానే పండించాడు. అయితే తన పూర్తి స్థాయిని ప్రూవ్ చేసుకునే సన్నివేశాలు దక్కలేదు. చాలా రోజుల తరువాత అజయ్‌కి ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. రఫ్ లుక్‌లో కనిపిస్తూనే కామెడీతోనూ ఆకట్టుకున్నాడు అజయ్. హీరోయిన్లుగా నటించిన కశ్మీర, యామినీ భాస్కర్లు నటన పరంగా పెద్దగా మెప్పించలేకపోయినా.. గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హీరో తండ్రిగా కనిపించిన సీనియర్ నటుడు శివాజీ రాజాను దర్శకుడు సరిగా వినియోగించుకోలేదు. జయప్రకాష్ రెడ్డి, సుధా, ప్రియా రొటీన్ పాత్రల్లో కనిపించారు. మరిన్ని రివ్యూల కోసం క్లిక్ చేయండి విశ్లేషణ ; ఛలో సినిమాతో సూపర్ ఫాంలో ఉన్న నాగశౌర్య మరోసారి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలు అందుకోవటంలో @నర్తనశాల టీం పూర్తిగా విఫలమైంది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగశౌర్య గే తరహా పాత్రలో నటించే సాహసం చేసినా ఆ ప్రయత్నం వృథా అయ్యింది. అవుట్ అండ్ కామెడీ ఆశించి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి నిరాశపరిచాడు. కథా పరంగా మంచి కామెడీ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు కథనాన్ని సాధాసీదాగా నడిపించాడు. ఫస్ట్‌హాఫ్‌లో హీరో హీరోయిన్ల లవ్ స్టోరి.. కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకున్నా ద్వితీయార్థం మరింత రొటీన్‌గా అనిపిస్తుంది. కథనం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగుతూ నిరాశపరుస్తుంది. ఛలో సినిమాకు భారీ హైప్ రావటంలో హెల్ప్ అయిన సంగీత దర్శకుడు మహతి ఈ సినిమాతో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ఒకటి రెండు పాటలు విజువల్‌గా ఆకట్టుకున్నా గుర్తుండిపోయే రేంజ్లో మాత్రం లేవు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; నిర్మాణ విలువలు రెండు పాటలు మైనస్ పాయింట్స్ ; కథా కథనాలు కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవటం స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
సొంత బ్యానర్లో మరో సినిమా
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఛలో తరువాత అమ్మమ్మగారిల్లు లాంటి ఫ్లాప్ వచ్చినా అది నాగశౌర్య కెరీర్ మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న నర్తనశాల సినిమాలోనటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా తరువాత భవ్య క్రియేషన్స్ బ్యానర్లో నారి నారి నడుమ మురారి సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఆ తరువాత చేయబోయే సినిమాకు కూడా ఓకె చెప్పాడట ఈ యంగ్ హీరో. అంతేకాదు ఈ సినిమాను నాగశౌర్య మరోసారి తన సొంతం నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నాడు. శేఖర్ కమ్ముల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తేజ ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈసినిమాకు గణ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
‘నా కొడుకు గే నా’
‘ఛలో’ లాంటి హిట్ తరువాత నాగశౌర్య తన సొంత బ్యానర్లో చేస్తోన్న సినిమా ‘నర్తనశాల’. లెజెండరీ చిత్రమైన ‘నర్తనశాల’ చిత్రం పేరు నిలబెట్టేలా తమ సినిమా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. ఇటీవలె షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం వినోద భరితంగా ఉంది. నాగశౌర్య నటన, కామెడీ డైలాగ్‌లు అన్నీ ఆకట్టుకుంటున్నాయి. టీజర్ ఎండింగ్లో ‘నా కొడుకు గే నా’ అంటూ శివాజీ రాజా చెప్పే డైలాగ్ బాగుంది. ఈ మూవీకి మహతి స్వర సాగర్ అందించగా.. కష్మీర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై శంకర్ మూల్పూరి, ఉషా మూల్పూరి నిర్మించగా.. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. -
నర్తనశాల పేరు నిలబెట్టేలా ఉంటుంది
‘‘మా ‘నర్తనశాల’ సినిమా షూటింగ్ పూర్తయింది. లెజెండరీ చిత్రమైన ‘నర్తనశాల’ చిత్రం పేరు నిలబెట్టేలా మా సినిమా ఉంటుంది. శ్రీనివాస్‌గారు చాలా బాగా తీశారు. ఫస్ట్ లుక్ ఎంత ఫ్రెష్‌గా ఉందో సినిమా కూడా అంతే ఫ్రెష్‌గా, అందర్నీ ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది’’ అని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య హీరోగా, కష్మీర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్లుగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ– ‘‘నర్తనశాల’ చిత్రం ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం నాగశౌర్య. ఆయన పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. మా నిర్మాతలు శంకర్, ఉషా, బుజ్జి గార్లకు సినిమా అంటే ప్యాషన్. అందుకే ఈ బ్యానర్లో ఏ చిత్రం వచ్చినా అది బ్లాక్‌బస్టర్ ఖాయం’’ అన్నారు. ‘‘ఛలో’ చిత్రాన్ని ఎంత ఘనవిజయం చేశారో ‘నర్తనశాల’ని కూడా అంతకు మించి హిట్ చేయాలి. ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు ఉషా మూల్పూరి. ‘‘నర్తనశాల’ అందరి చిత్రంగా మీ ముందుకు వస్తుంది. అందరూ ‘ఛలో’ కంటే మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు శంకర్‌ప్రసాద్ మూల్పూరి. కష్మీర పరదేశి, యామిని భాస్కర్, నటులు శివాజీ రాజా, కొరియోగ్రాఫర్ విజయ్, కెమెరామేన్ విజయ్ సి.కుమార్, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, పాటల రచయితలు ఓరుగంటి, శ్రీమణి పాల్గొన్నారు. -
‘‘నర్తనశాల’కు మచ్చరానివ్వం’
ఛలో సక్సెస్‌తో నిర్మాతగానూ విజయం అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య త్వరలో నర్తనశాల సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నాగశౌర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యామిని, కశ్మీరా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ ‘నర్తనశాల’ ఒక క్లాసిక్. అయినా ఆ టైటిల్ ను తీసుకునే ధైర్యం చేశాం. ఆ పేరుకున్న స్థాయి తగ్గకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాం. ఇక ముందు చేయబోయే సినిమాల్లోనూ మంచి ఎంటర్టైన్మెంట్ఉండేలా ప్లాన్ చేస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి, నిర్మాత ఉషా ముల్పూరిలతో పాటు నటుడు శివాజీ రాజా, చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
‘ఛలో’ హీరోతో ‘హలో’ హీరోయిన్..!
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించిన ఈ యువ కథానాయకుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్ నిర్ణయించారు. ఇటీవలే లాంచనంగా షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా మెహరీన్‌ను తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. తరువాత ఆమె స్థానంలో కిరాక్ పార్టీ ఫేం సిమ్రాన్ పరీన్జా పేరు వినిపించింది. తాజాగా మరో అందాల భామ పేరు తెర మీదకు వచ్చింది. అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో సినిమాతో పరిచయం అయిన కళ్యాణీ ప్రియదర్శన్ నర్తనశాల సినిమాలో హీరోయిన్గా నటించనుందట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంతవరకు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. -
నాగశౌర్యకు జోడీగా సిమ్రాన్..?
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించిన ఈ యువ కథానాయకుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా నిఖిల్ కిరాక్ పార్టీ ఫేం సిమ్రాన్ పరీన్జాను ఫైనల్ చేశారట. హిందీ సీరియల్స్‌తో పాపులర్ అయిన సిమ్రాన్.. కిరాక్ పార్టీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. నాగశౌర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన కణం త్వరలో రిలీజ్ అవుతుండగా మరిన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. -
క్లాప్ కొట్టినా చప్పుడు రాలేదు..!
‘చిరు’ ఖాతాలో ఏడు సినిమాలు మైనస్ చాలా ఏళ్ల పాటు నంబర్‌వన్‌గా వెలుగొందిన చిరంజీవి కెరీర్లో ఏడు ఆగిపోయిన సినిమాలు ఉన్నాయంటే కొంచెం షాకింగ్‌గానే అనిపిస్తుంది. కెరీర్ తొలినాళ్లలో ఆయన చేసిన మూడు సినిమాలు బాక్సుల్లోనే ఉండిపోయాయి. మెగాస్టార్‌గా విరాజిల్లుతున్న సమయంలో కూడా నాలుగు సినిమాలు అర్ధంతరంగా ఆగిపోవడం ఆశ్చర్యకరం. 1979లో యు.వి.బాబు దర్శకత్వంలో వచ్చిన ‘శాంతి నివాస్’లో చిరంజీవి విలన్‌గా యాక్ట్ చేశారు. సెన్సార్ కూడా పూర్తయిన ఈ సినిమా దాదాపు ల్యాబ్‌లోనే మగ్గిపోయింది. తర్వాత ప్రింట్ కూడా మాయమైపోయింది. ‘ఖైదీ’ విడుదల కాకముందు చిరంజీవి హీరోగా చేసిన ‘పెద్దపులి - చిన్నపులి’, ‘వడ్డీకాసుల వాడు’ చిత్రాల పరిస్థితి కూడా అంతే. బాక్సులకే పరిమితం. చిత్రమేమిటంటే - ఎప్పుడూ లేనిది శ్రీదేవి నిర్మాతగా 1987లో ‘వజ్రాల దొంగ’ అనే సినిమా మొదలెట్టారు. అందులో చిరంజీవి హీరో. ఎ. కోదండరామిరెడ్డి దర్శకుడు. చిరంజీవి, శ్రీదేవిపై ఒకే ఒక్క పాట తీశారు. ఆ తర్వాత మళ్లీ వజ్రాల దొంగ కనబడనే కనబడలేదు. ఒక మూమెంట్లో రామ్‌గోపాల్‌వర్మ అంటే యమా క్రేజ్. వర్మతో సినిమా చేయాలని అనుకోని హీరోనే లేడు. చిరంజీవి కూడా అలానే అనుకున్నారు. వీళ్లిద్దర్నీ అశ్వనీదత్ కలిపారు. చిరంజీవి, ఊర్మిళపై ఓ పాట, చాలా సీన్లు తీశారు. ఆ సినిమా పేరు ‘చీకటి’. ఎవరి అహం దెబ్బతిందో కానీ, ఆ సినిమా చీకట్లో కలిసిపోయింది. సింగీతం దర్శకత్వంలో మొదలైన ‘భూలోకవీరుడు’ చివరి వరకూ వీరత్వం చూపలేకపోయింది. చిరంజీవి, టబుపై ఓ పాట, కొన్ని సీన్లు తీశారంతే. 1999లో చిరంజీవికి ఓ హాలీవుడ్ చాన్సు వచ్చింది. ‘ది రిటర్న్స్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ పేరుతో మొదలుపెట్టిన సినిమా ఓ షెడ్యూల్‌తోనే ఆగిపోయింది. బాలయ్యకు మూడు బ్యాడ్ మెమరీస్ ఓ జానపదం... ఓ పౌరాణికం... ఓ త్రీడీ. బాలకృష్ణ కెరీర్లో అవి మైలురాళ్లుగా నిలిచిపోతాయనుకుంటే, శంకుస్థాపన రాళ్లలాగా మిగిలిపోయాయి. 1989 ప్రాంతంలో ‘శపథం’ అనే త్రీడీ సినిమా మొదలైనట్టే మొదలై ఆగిపోయింది. బాలకృష్ణ-కోడి రామకృష్ణ కాంబినేషన్లో మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్యలాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన భార్గవ్ ఆర్ట్స్ గోపాల్‌రెడ్డి 2001లో భారీ ఎత్తున ‘విజయ ప్రతాప్’ అనే జానపద సినిమా మొదలుపెట్టారు. పూజా భాత్రా, అంజలా జవేరి, రోజా కథానాయికలు. ఒక పాట, కొన్ని సీన్లు తీశారు. తర్వాత వైజాగ్‌లో ప్రాచీన నగరం సెట్ వేసి ఓ షెడ్యూలు చేశారు. ఆ తర్వాత హఠాత్తుగా సినిమా ఆగిపోయింది. బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లాగా మొదలుపెట్టిన ‘నర్తనశాల’ పరిస్థితీ అంతే. బాలకృష్ణ ఫస్ట్ టైమ్ డెరైక్షన్. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. ద్రౌపది పాత్ర చేస్తున్న సౌందర్య అకాల మృతి చెందడం, ఇతర కారణాల కారణంగా ‘నర్తనశాల’కు అక్కడితో శుభం కార్డు పడిపోయింది. మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలొచ్చాయి కానీ, ఆ కదలికే లేదు. ల్యాబ్‌లో ఉండిపోయిన కృష్ణ సినిమా ‘సూపర్‌స్టార్’ పేరుతో కృష్ణ ఓ సినిమా చేశారు. అయితే అది విడుదలకు నోచుకోలేదు. ఆదుర్తి సుబ్బారావు శిష్యుడు కాసుల గురుదేవప్రసాద్ ‘సూపర్‌స్టార్’ పేరుతో ఓ బాలల సినిమా చేశారు. అందులో హీరో కృష్ణతో ఓ గెస్ట్ కేరెక్టర్ చేయించారు. 1990 ఏప్రిల్‌లో షూటింగ్ మొదలు పెట్టారు. ‘శ్రుతిలయలు’ ఫేమ్ షణ్ముఖ శ్రీనివాస్ అందులో మెయిన్‌రోల్. విజయశాంతి కూడా ఓ సన్నివేశంలో అతిథిగా చేశారు. ఆడియో కూడా విడుదలైంది. అయితే సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ ప్రసాద్ ల్యాబ్‌లో నెగిటివ్ భద్రంగా ఉంది.